Tourist areas
-
ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!
గోవా విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు వెలుస్తున్నాయి. టాక్సీ మాఫియా, అధిక ధరలే ఇందుకు కారణమని కొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. గోవాకు రాకపోకలు సాగిస్తున్న పర్యాటకులకు సంబంధించి పారిశ్రామికవేత్త రామానుజ ముఖర్జీ ఎక్స్‌లో డేటాను షేర్ చేశారు. 2019లో గోవా సందర్శకుల సంఖ్య 85 లక్షల నుంచి 2023లో 15 లక్షలకు తగ్గుముఖం పట్టినట్లు డేటాలో వెల్లడించారు.ముఖర్జీ షేర్ చేసిన డేటాపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మధుర్ స్పందించారు. ‘గోవాలోని బెనౌలిమ్ బీచ్ వద్ద జర్మనీ నుంచి వచ్చిన నా స్నేహితుడిని పికప్ చేసుకోవడానికి వెళ్లాను. వెంటనే దాదాపు పది మందికి పైగా టాక్సీ డ్రైవర్లు నన్ను చుట్టుముట్టారు. విదేశీ పర్యాటకులు స్థానిక టాక్సీలోనే వెళ్లాలని డిమాండ్ చేశారు. తర్వాత నా స్నేహితుడు 37 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.1,800 చెల్లించాల్సి వచ్చింది. గోవాలో టాక్సీ మాఫియా పెరుగుతోంది. గోవా అభివృద్ధికి ఈ మాఫియా ఆటంకంగా నిలుస్తోంది’ అని అన్నారు.Goa’s taxi mafia is responsible for it. 100%I went to pick up a friend (from Germany) from Benaulim Beach and I was accompanied by another friend (a local Goan). A taxi guy (in Benaulim) saw us, he stopped us and in no time there were 10+ taxi drivers ready to beat us up. The… https://t.co/V43IsQXBm9— Madhur (@ThePlacardGuy) November 5, 2024ఇదీ చదవండి: ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్వరుణ్ రావు అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ పోస్ట్‌కు స్పందిస్తూ టాక్సీ, ఆటో మాఫియా గోవాలో పర్యాటకం వృద్ధిని అడ్డుకుంటున్నాయని చెప్పారు. ‘ట్యాక్సీ డ్రైవర్లు స్థానిక ప్రభుత్వానికి ప్రధాన ఓటు బ్యాంకు. కాబట్టి వారి ప్రవర్తన వల్ల వృద్ధి కుంటుపడుతున్నా, పర్యాటకులు ఇబ్బంది పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్య తీసుకునే ధైర్యం చేయరు’ అని అన్నారు. -
ఒడిషాలోని బీచ్‌ల గురించి తెలిస్తే.. ఇపుడే ‘ఛలో’ అంటారు
బీచ్‌లు అనగానే మనకు సాధారణంగా గోవా, వైజాగ్ లాంటి ప్రదేశాలు ప్రధానంగా గుర్తుకు వస్తాయి. కానీ భారతదేశానికి తూర్పున ఉన్న రాష్ట్రం, 480 కి.మీ పొడవైన అందమైన తీర ప్రాంతం ఉన్న ఒడిషా కూడా అందమైన బీచ్‌లకు ప్రకృతి రమణీయ దృశ్యాలకు నిలయం. అందమైన తీరప్రాంతం, పురాతన దేవాలయాలు, గిరిజన సంస్కృతి ,వన్యప్రాణుల అభయా రణ్యాలున్నాయి ఇక్కడ. ఓడిషాలోని 7 అందమైన బీచ్‌ల గురించి తెలుసుకుందాం.<Odisha beaches are underrated. pic.twitter.com/ac50CVe6xC— Indian Tech & Infra (@IndianTechGuide) May 21, 2024 1. పూరి బీచ్ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ బీచ్‌లలో ఒకటి పూరీ బీచ్. బీచ్ ప్రేమికులు ,ఆధ్యాత్మిక అన్వేషకులు ఒడిషాలో దీన్ని టాప్ బీచ్‌గా భావిస్తారు. సముద్ర తీరం, గోల్డెన్ ఇసుక ఇక్కడి ప్రత్యేకం. అంతేకాదు అద్భుతమైన సూర్యోదయాలు ,సూర్యాస్తమయ దృశ్యాలను అస్సలు మిస్ కాకూడదు. సమీపంలోని జగన్నాథ ఆలయం మరో పెద్ద ఆకర్షణ.And early morning vibe is damn good in Odisha ⛱️ .❤️❤️#odisha#beaches #indiasbestkeptsecret #JaiJagannatha #Konark pic.twitter.com/HgnTriP7hZ— Adarsh Jyoti (@AdarshJyoti1) May 21, 20242. అస్తరంగ బీచ్పూరీ నగరానికి దగ్గరగా ఉన్న మరో బీచ్, అస్తరంగ బీచ్. ప్రశాంత వాతావరణం, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. చుట్టూ పెద్దగా ఫిషింగ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఈ బీచ్ పక్షులను వీక్షించడానికి బాగా ఇష్టపడే ప్రదేశం.పర్యాటకులు అక్కడ వివిధ రకాల వలస పక్షుల జాతులను చూడ్డానికి వస్తారు.3 ఉన్నట్టుండి మాయమయ్యే చాందీపూర్ బీచ్ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న చాందీపూర్ బీచ్ దేశంలోనే అరుదైన బీచ్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించింది. బాలాసోర్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ బీచ్ చూడటానికి ఇతర బీచ్‌ల మాదిరే. కానీ నమ్మడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఈ బీచ్ అకస్మాత్తుగా మాయమైపోతుందిట. ఈ బీచ్‌లో భారీ అలలు ఆటుపోట్లకు గురైనప్పుడు సముద్రపు నీరు సుమారు 5 కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోతుంది. దీంతో అది అక్కడికి వచ్చేవారిని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తుతుంది. మనం చూస్తున్నంత సేపు కనిపించిన సముద్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా కనపడకుండా పోతుండటం విశేషం. మోనాజైట్ , టైటానియం అధికంగా ఉండే నల్ల ఇసుక, సరుగుడు చెట్లతో నిండి ఉంటుంది. ముఖ్యంగా పిక్నిక్లు పక్షులను చూడటం ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.4. గోపాల్పూర్ బీచ్ఒడిశాలోని దక్షిణ భాగంలో ఉన్న గోపాల్పూర్ బీచ్. ప్రశాంతత, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. తెల్లటి ఇసుక, కొబ్బరి చెట్లతో గోపాల్పూర్ బీచ్ ఒడిషాలో సందర్శించడానికి ఉత్తమమైన బీచ్‌లలో ఒకటి. ఇక్కడ ఈత కొట్టవచ్చు, చేపలు పట్టవచ్చు.అందుకే ఇది చాలా పాపులర్ అయింది. ఇక్కడ నౌకాశ్రయం కూడా ఉంది.5. రాంచండీ బీచ్, కోణార్క్కోణార్క్ పట్టణానికి దగ్గరగా ఉన్న రాంచండి బీచ్ . UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తింపు పొందిన కోణార్క్ సూర్య దేవాలయానికి ఆనుకొని ఉన్నందున బీచ్ అందాలతోపాటు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈబీచ్ వద్ద ఈత, సన్‌బాత్, బోటింగ్ ఫిషింగ్ లాంటివి ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు.6. బలిఘై బీచ్, పూరిపూరీ నగరానికి దగ్గరగా ఉన్న బలిఘై బీచ్ స్పష్టమైన నీలి జలాలకు ప్రసిద్ధి. చుట్టూ పచ్చని అడవులు, బంగాళాఖాతం యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది. ఒంటె , గుర్రపు స్వారీలతోపాటు, బీచ్‌లో తాజా సీఫుడ్ , ప్రాంతీయ వంటకాలను విక్రయించే అనేక చిన్న ఫుడ్ సెంటర్లలో ఆస్వాదించవచ్చు.7. తలసరి బీచ్తలసరి పేరు రెండు ఒడియా పదాలైన తల ( పామ్ లేదా తాటి)సరి(వరుస) నుండి వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న తాటి చెట్లు ఎక్కువ ఉండటం వల్లే ఈ పేరు వచ్చిందని చెబుతారు. తాలా అనే పదానికి లయ అని కూడా అర్థం, ఇది తీరానికి వ్యతిరేకంగా వచ్చే సముద్రపు అలలలో ప్రతిబింబిస్తుందని భావిస్తారు.సువర్ణరేఖ నది తలసరి బీచ్ ఆకర్షణను రెట్టింపుచేస్తుంది. దీనితోటు ఇసుక దిబ్బలు, ఎర్ర పీతలు ఆరో ఆకర్షణ. ఈ బీచ్‌కు సమీపంలో ఉన్న బిచిత్రపూర్లోని ఫిషింగ్ పల్లెలు, మడ చెట్లు టూరిస్టులను ఆకర్షిస్తాయి. -
గుల్మార్గ్లో హిమపాతం
గుల్మార్గ్: జమ్మూకశ్మీర్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ను హిమపాతం ముంచెత్తింది. అఫర్వాత్ కొండ ఉన్న ఖిలాన్ మార్గ్ వద్ద సంభవించిన ఈ హిమపాతంలో మంచులో కూరుకుపోయి ఒక రష్యన్ పర్వతారోహకుడు ప్రాణాలు కోల్పోయాడు. హిమపాతాలకు నెలవైన నిషేధిత ఆర్మీ రిడ్జ్ ప్రాంతంలో స్థానిక గైడ్‌తో కలిసి కొందరు రష్యన్లు పర్వతారోహణకు వెళ్లినపుడు ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. హిమపాతం జరిగిన వెంటనే పర్యాటక విభాగం గస్తీ, ఆర్మీ, పోలీసులు సహాయక, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి మంచులో కూరుకుపోయిన ఏడుగురిని రక్షించారు. వీరిని ఆస్పత్రిలో చేరి్పంచారు. మృతుడిని మాస్కోవాసి హాంటెన్గా గుర్తించారు. -
పర్యాటకం.. సరికొత్త సౌరభం
డోన్: పర్యాటక ఖిల్లాగా విరాజిల్లుతున్న నంద్యాల జిల్లాలో మరో రెండు పర్యాటక ప్రాంతాలు చేరబోతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెలూం గుహలు జిల్లాలో ఉండటం విశేషం. వీటికి ఏమాత్రం తీసిపోని విధంగా మరో రెండు గుహలు యాత్రికుల సందర్శనకు సిద్ధమవుతున్నాయి. ప్రకృతి ఒడిలో సహజసిద్ధంగా ఏర్పడిన బిల్లసర్గం గుహలు, వాల్మీకి గుహల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పర్యాటకులకు దూరంగా ఉన్న ఈ గుహలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చొరవతో పర్యాటక కేంద్రాలుగా మారుతున్నాయి. డోన్ నియోజవకర్గం బేతంచెర్ల మండల కేంద్రానికి 3.5 కి.మీ దూరంలో కనుమకింద కొట్టాల గ్రామానికి సమీపంలో ఉన్న బిల్లసర్గం గుహలు 20 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. అలాగే ప్యాపిలి మండల కేంద్రం నుంచి 20 కి.మీ దూరంలో హుస్సేనాపురం, నల్లమేకల పల్లి మీదుగా బోయ వాండ్లపల్లికి వెళ్లే మార్గంలో 30 ఎకరాల విస్తీర్ణంలో వాల్మీకి గుహలు ఉన్నాయి. పూర్వాశ్రమంలో వాల్మీకి మహర్షి ఈ గుహల్లో తపస్సు చేశారని, అందుకే ఈ గుహలకు వాల్మీకి గుహలుగా ప్రసిద్ధి చెందాయి. బిల్లసర్గం గుహలు, వాల్మీకి గుహలను పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6. కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. జిల్లాలో ఇప్పటికే శ్రీశైలం, మహానంది, యాగంటి, అహోబిలం క్షేత్రాలతో పాటు, రాక్ గార్డెన్, బెలుం కేవ్స్, నల్లమల ఎకో పార్క్‌లు ఉండటంతో నిత్యం పర్యాటకుల రద్దీ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మరో రెండు గుహలు పర్యాటకులకు అందుబాటులోకి వస్తుండటంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూతల స్వర్గంగా.. రాష్ట్రంలోని బొర్రా, బెలుం గుహలకు దీటుగా బిల్లసర్గం, వాల్మీకి గుహలను టూరిజం శాఖ అధికారులు వేగంగా తీర్చిదిద్దుతున్నారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి, మట్టి ఆకృతులకు మరింత అందంగా కనిపించేలా లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 25 ఎకరాల విస్తీర్ణంలో వాల్మీకి గుహలు, 15 ఎకరాల విస్తీర్ణంలో బిల్లసర్గం గుహలను అభివృద్ధి చేస్తున్నారు. గుహల సమీపానికి వాహనాలు వెళ్లేలా రహదారులను నిర్మించారు. గుహ లోపల యాత్రికులు నడిచేందుకు వీలుగా బండపరుపు, మెట్లు వేశారు. గుహల బయట చిన్నారులు ఆడుకునేందుకు ఆట స్థలాలు, పార్కులు, విడిది కేంద్రాలు శరవేగంగా నిర్మిస్తున్నారు. రెస్టారెంట్లను కూడా నెలకొల్పుతున్నారు. వారం క్రితం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన బిల్లసర్గం గుహలను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు. జనవరి నెలాఖారుకు ప్రారంభించేలా పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గుహ ఆవరణలో యాత్రికులకు సదుపాయాలు కల్పించాలని సూచించారు. పర్యాటక కేంద్రంగా డోన్ రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గంగా నిలుస్తున్న డోన్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డోన్ నియోజకవర్గాన్ని విద్య, వైద్య, పారిశ్రామిక, ఉపాధి, నీటిపారుదల రంగాలతో పాటు టూరిజం అభివృద్ధికి కూడా నిధులు సమృద్ధిగా విడుదల చేస్తున్నారు. ఓ వైపు విద్యా హబ్‌గా మారిన డోన్ పర్యాటక కేంద్రంగా విరాజిల్లనుంది. ఇప్పటికే డోన్ సమీపంలో నగర వనం ఏర్పాటు చేయడంతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. మరో వైపు వెంగళాంపల్లి, వెంకటాపురం చెరువును మినీ ట్యాంక్ బండ్, బోటు షికారు, రెస్టారెంట్లు ఏర్పాటు చేసేందుకు మరో రూ.6 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. -
వంద పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
రాజవొమ్మంగి (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవుల్లో ప్రాచుర్యం పొందిన వంద పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అటవీశాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ మధుసూదనరెడ్డి తెలిపారు. జిల్లాలోని అరకు, మారేడుమిల్లి, రంపచోడవరం, గుడిసె, చింతపల్లి తదితర ప్రాంతాలను ఆయన బుధవారం సందర్శించారు. స్థానిక అటవీక్షేత్ర కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. పర్యాటకులు బస చేసేందుకు సౌకర్యవంతమైన కాటేజీలు, ట్రెక్కింగ్‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆదివాసీల సేవలు ఉపయోగించుకుని వారికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. పర్యాటక ప్రదేశాలను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు. పెద్ద పులుల స్థావరంగా నల్లమల: శ్రీశైలం ప్రాజెక్టు పరిసరాల్లో నల్లమల అడవులు పెద్ద పులుల స్థావరంగా మారిందని చెప్పారు. గతంలో ఇక్కడ 45 పులులు మాత్రమే ఉండగా, ఇప్పుడు వీటి సంఖ్య 75కు పెరిగిందన్నారు. పాపికొండల ఏరియాలో గతంలో రెండు పులులు ఉండగా, ప్రస్తుతం మరో రెండు పులులు చేరాయన్నారు. మారేడుమిల్లి, రంపచోడవరం తదితర అటవీ ప్రాంతాల్లో చిరుతల సంచారం బాగా పెరిగిందని చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణకు అటవీ చట్టాలను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. స్క్వాడ్ డీఎఫ్‌వో త్రిమూర్తులరెడ్డి, స్థానిక ఫారెస్ట్ రేంజర్ అబ్బాయిదొర పాల్గొన్నారు. -
బాసర నుంచి భద్రాచలానికి లాంచీ!
మంథని: గోదావరి పరీవాహక తీర ప్రాంత కేంద్రాలను పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం (ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా)లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నిత్యం నిండుకుండలా ఉంటోంది. అంతేకాకుండా తీరం వెంట పచ్చని అడవులు, ఆధ్యాత్మిక కేంద్రాలు కొలువై ఉన్నాయి. ఇవి యాత్రికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలోని బాసర నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వరకు గోదావరి నదిపై పర్యాటకం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా లాంచీలు నడిపే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. బాసర నుంచి భద్రాచలం వరకు.. గోదావరి తీరం వెంట నిర్మల్ జిల్లా బాసరలో సరస్వతి అమ్మవారు, జగిత్యాల జిల్లాలో ధర్మపురి, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్లలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు, మంథని తీరంలో గౌతమేశ్వర, రామాలయం, మంచిర్యాల జిల్లాలో వేలాల మల్లన్న, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దక్షిణకాశీగా పేరుగాంచిన కాళేశ్వర ముక్తీశ్వరస్వామి, భద్రాద్రి రామాలయంతోపాటు అనేక శివాలయాలు, ఇతర దేవతల పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. జలమార్గంలో ప్రయాణిస్తూ వీటన్నిటినీ దర్శించుకోవడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తారని అధికారులు అంటున్నారు. తీరం వెంట అడవి అందాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలో సుందిళ్ల బ్యారేజీలు చేపట్టారు. ఈ బ్యారేజీలు, పంపుహౌస్‌ల సందర్శనకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడి బ్యారేజీల వద్ద పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించింది. అలాగే గోదావరి తీరం వెంట ఉన్న అడవులు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇవి యాత్రికులను ఆకట్టుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి ఆదాయం గోదావరి తీరం వెంట పర్యాటకం అభివృద్ధి చేయడం ద్వారా పుణ్యక్షేత్రాలకు భక్తుల సందర్శన పెరగనుంది. యాత్రికుల రాకవల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. కాళేశ్వరం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర వంతెనతోపాటు బ్యారేజీ, ఇతర వంతెనలు, కేంద్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా రాకపోకలు సైతం పెరిగి.. పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గోదావరిలో స్టీమర్లు, లాంచీలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని కూడగట్టవచ్చని భావిస్తోంది. ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు గోదావరి తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న మంథని వాసులు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఆహ్లాదం పంచాలనే ఆలోచనతో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మంథని వద్ద గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఇటీవలే ఆయన ప్రకటన కూడా చేశారు. దీనికోసం ఆయన సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రిని త్వరలో కలసి వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. సీఎంను కలుస్తాం.. గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని త్వరలోనే సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలుస్తాం. యాత్రికుల సందర్శనతో ఈ ప్రాంతాలు కచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది. - కొండేల మారుతి విద్యార్థి యువత వ్యవస్థాపకుడు, మంథని ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు గోదావరి నది తీరంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు, సందర్శనకు వచ్చే యాత్రికులకు ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇతర దేశాల్లో నివాసం ఉండే మంథని వాసులు ఇక్కడికి వస్తే.. సేదతీరేందుకోసం కోనసీమను తలపించేలా తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది. చిన్న పిల్లల కోసం పార్కులు, ఇతర సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. - పుట్ట మధు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ -
New Rules In Goa: గోవాలో ఈ పనులు చేస్తే భారీగా జరిమానా
పనాజీ: గోవా వెళ్లి స్నేహితులతో పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. గోవాలో పర్యటకాన్ని మరింత బలోపేతం చేసే దిశగా, టూరిస్టు ప్రాంతాలు పరిశుభ్రంగా, సురక్షితంగా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. ఆయా నిబంధనలను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు అక్టోబర్ 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఓ వ్యక్తి, కంపెనీ, సంఘం, సంస్థ ఏదైనా నిబంధనలు ఉల్లఘిస్తే రూ.5000 జరిమానా విధిస్తాం. ఆ ఫైన్ రూ.50,000 వరకు సైతం ఉండవచ్చు. ఐపీసీలోని సెక్షన్ 188 ప్రకారం చర్యలు ఉంటాయి.’ అని గవర్నమెంట్ ఆర్డర్లో పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం బీచ్‌లోని బహిరంగ ప్రదేశాల్లో వంట చేయటం, డ్రైవింగ్ వంటివి నిషేదం. బీచ్‌లో చెత్త పారవేయటం, మద్యం బాటిళ్లను పగలగొడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. కొద్ద నిబంధనలు ఇలా.. ► ఇకపై బీచ్‌లో డ్రైవింగ్ చేయకూడదు. బహిరంగ ప్రదేశంలో వంట వండటం నిషేదం. ► బీచ్‌లో చెత్త వేయటం, తాగి పడేసే బాటిళ్లను పగలగొట్టటం నేరం. ► టూరిస్టులతో పాటు వారికి సేవలందిస్తున్న వివిధ సంస్థలు, వ్యాపారస్తులకు సైతం కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ► వాటర్ స్పోర్ట్స్ కేవలం గుర్తింపు పొందిన ప్రాంతాల్లోనే నిర్వహించాలి. ► టికెట్ల జారీ గుర్తింపు పొందిన కౌంటర్ల వద్దే నిర్వహించాలి. బహిరంగంగా టికెట్లు జారీ చేయకూడదు. ► తోపుడి బండిపై వ్యాపారం చేసే వారు పర్యటకులకు అడ్డుపడితే జరిమానా పడుతుంది. ► ఎవరైనా టూరిస్టులను డబ్బులు అడగడం, అల్లర్లు సృష్టించటం చేస్తే చర్యలు తప్పవు. ► నిబంధనలను అతిక్రమించిన వారికి రూ.5వేల నుంచి రూ.50వేల వరకు జరిమానా విధించనున్నారు. ఇదీ చదవండి: పీఎంగా రిషి సునాక్ తొలిసారి బిగ్ యూ-టర్న్.. ఆ నిర్ణయంలో మార్పు -
రాష్ట్రంలో పంజాబ్ పాత్రికేయుల బృందం పర్యటన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలను పరిశీలించేందుకు పంజాబ్‌కు చెందిన పాత్రికేయుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్నట్టు ఏపీటీడీసీ ఎండీ కె.కన్నబాబు తెలిపారు. ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంలో భాగంగా గత నెల 31 న రాష్ట్రానికి వచ్చిన ఈ బృందం ఈ నెల 6వ తేదీ వరకు వివిధ ప్రాంతాలను సందర్శిస్తుందని చెప్పారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) జలంధర్ శాఖ ఆధ్వర్యంలో వచ్చిన ఈ బృందం తొలుత విశాఖలోని పర్యాటక ప్రదేశాలను, డిండిని సందర్శించిందన్నారు. శనివారం విజయవాడ బెర్మ్ పార్కులో ఈ బృందానికి రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్టుల గురించి వివరించినట్టు చెప్పారు. రాష్ట్ర సంస్కృతి, కళలు, వారసత్వ సంపదను పంజాబ్‌లో ప్రచారం చేసేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందని కన్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఉన్న 974 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం, నిత్యం ప్రవహించే నదులు, సుందరమైన బ్యాక్ వాటర్స్, కొండలు, అడవులు, పురాతన దేవాలయాలు, బౌద్ధ క్షేత్రాలు వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు మన సంస్కృతి, వారసత్వాలను చాటిచెబుతాయన్నారు. పీఐబీ జలంధర్ నోడల్ అధికారి రాజేష్ బాలి మాట్లాడుతూ..ఏపీలోని పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, అలవాట్లు మంచి విజ్ఞానాన్ని అందించాయని చెప్పారు. -
ఎన్నెన్నో అందాలు.. వాటి వెనుక అంతులేని విషాదాలు
అనంతగిరి(అరకులోయ): మన్యంలోని ప్రకృతి రమణీయత పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక్కడి సహజసిద్ధ అందాలను ఆస్వాదించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తుంటారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జలపాతాలు పొంగిపొర్లుతూ.. కొత్త సోయగాలను సంతరించుకుంటున్నాయి. ఆకాశం నుంచి నేలను తాకుతున్న మబ్బులతో కొత్తందాలు ఆవిష్కృతమవు తున్నాయి. చదవండి: అమ్మ బాబోయ్ పులస.. అంత రేటా? ఈ నేపథ్యంలో మన్యంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న జలపాతాల వద్దకు అధిక సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటున్నారు. కొంత మంది సరదాకు ఈతకు దిగి, మరికొంతమంది ప్రమాదవశాత్తూ జారిపడి, మరికొంత మంది సెల్ఫీలు, ఫొటోలు అంటూ అజాగ్రత్త వ్యవహరిస్తూ.. మృత్యువాతపడుతున్నారు. కన్నవాళ్లకు అంతులేని విషాదాన్ని మిగులుస్తున్నారు. ఆకట్టుకునే జలపాతాల వెనుక అంతులేని విషాదగాథలెన్నో ఉన్నాయి. సరియా జలపాతం(అనంతగిరి) సరియా జలపాతం 2015లో బహ్య ప్రపంచానికి పరిచయం అయింది. ఈ జలపాతం వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇందులో 15 మందికి పైగా యువతే ఉన్నారు. కొంతమంది అజాగ్రత్త కారణంగా.. మరికొంతమంది ఈత రాక ప్రాణాలు పొగొట్టుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సరియా జలపాతం ఉరకలేస్తూ.. ప్రవహిస్తోంది. ఇక్కడకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోని స్థానికుల సూచనలు, పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను చదివి అవగాహన పెంపొదించుకోవాలి. అప్పుడే ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించవచ్చు. డుడుమ (ఆంధ్రా–ఒడిశా సరిహద్దు) ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతమైన డుడుమ జలపాతం సుమారు 2,600 అడుగుల ఎత్తుల్లోంచి పరవళ్లు తొక్కుతోంది. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు ఆరుగురు పర్యాటకులు ప్రమాదవశాత్తూ జారిపడి మృత్యువాత పడ్డారు. హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసినా.. పర్యాటకులు పెడచెవిన పెడుతున్నారు. పొల్లూరు(మోతుగూడెం) పొల్లూరు జలపాతం సినిమా షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రాస్. అల్లరి నరేష్ నటించిన దొంగలబండి, అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా షూటింగ్‌లు ఇక్కడే జరిగాయి. చూసేందుకు జలపాతం అందంగా కనిపిస్తుంది. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు 30 మందికిపైగా మృత్యువాతపడ్డారు. ప్రమాదవశాత్తూ కొంత మంది, ఈతకు దిగి మరికొంత మంది మరణించారు. గాదిగుమ్మి(కొయ్యూరు) చూసేందుకు గాదిగుమ్మి జలపాతం అందంగా కనిపిస్తుంది. అందులో దిగితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు 40 మందిపైగా పర్యాటకులు మృతి చెందారు. దూరం నుంచే జలపాతం అందాలను వీక్షిస్తే ప్రమాదాలు జరగావు. యువతా.. జాగ్రత్త జలపాతాలను తిలకించే క్రమంలో యువత ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వాళ్లే దూకుడుగా వ్యవహరించి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసుల హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టి.. ఈత సరదాలు.. సెలీ్ఫలు అంటూ అక్కడ పరిస్థితులపై అవగాహన లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కుటుంబానికి కన్నీరు మిగులుస్తున్నారు. కుటుంబం తమపై పెట్టుకున్న ఆశలను తుంచేసి.. తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. వర్షాలకు రాళ్లు నాచుపట్టి ప్రమాదకరంగా ఉంటాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో జలపాతాలకు దూరంగా ఉండడమే మంచిదని అధికారులు, స్థానికులు సూచిస్తున్నారు. చాపరాయి(డుంబ్రిగుడ) చాపరాయికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. అరకు–పాడేరు ప్రధాన రహదారి అనుకుని ఉండడంతో పాటు అటువైపుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు, పర్యాటకులు చాపరాయి అందాలను తిలకిస్తుంటారు. చాపరాయి వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు సుమారు 25 మందిపైగా మృత్యువాత పడ్డారు. ఈతకు దిగి ప్రమాదవశాత్తూ సొరంగంలోకి వెళ్లడంతో మృత్యువాత పడేవారు. అధికారులు చొరవ.. టెండర్‌దారుల సహకారంతో సొరంగం రాయిని బ్లాస్టింగ్ చేయడంలో ప్రమాదాలు తప్పాయి. అయినప్పటికీ అప్రమత్తత అవసరం. గుడ్డిగుమ్మి(హుకుంపేట) హుకుంపేట మండలంలోని తీగలవలస పంచాయతీ జెండాకొండ మార్గమధ్యలో ఉన్న గుడ్డిగుమ్మి జలపాతం బహ్యప్రపంచానికి పరిచయమై ఏడాదే అయింది. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మత్యువాతపడ్డారు. సరదాగా ఈతకు దిగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వీళ్లంతా హుకుంపేట మండలానికి చెందిన వాళ్లే. దాలమ్మతల్లి(సీలేరు) సీలేరు దాలమ్మతల్లి జలపాతం 100 అడుగులు ఎత్తుల్లోంచి జాలువారుతుంది. గుడి బయట నుంచి జలపాతం తిలకిస్తే ప్రమాదాలు జరగవు. జలపాతం పక్కనున్న కొండపై సెలీ్ఫలు, ఫొటోలు దిగేందుకు వెళ్లి 20పైగా మృత్యువాతపడ్డారు. ఏటా ఇద్దరు, ముగ్గురు ఇక్కడ ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ►పర్యాటకులు ఎట్టి పరిస్థితిలోనూ జలపాతం కొండలపై ఎక్కడం చేయకూడదు. ఎందుకంటే ఆ బండరాళ్లపై నిరంతరం నీళ్లు ప్రవహిస్తూ ఉండటం వల్ల అవి నాచుపట్టి ఉంటాయి. వాటిపై ఎక్కితే జారిపడి పోయే ప్రమాదం ఉంది. ►సెల్ఫీల కోసం జలపాతం లోపల ఉన్నా ఎత్తైన బండలను ఎక్కకూడదు. ►నీళ్లు అధికంగా ప్రవహిస్తున్న ప్రదేశంలో స్నానాలు చేయకూడదు. ►జలపాతాలకు వెళ్తున్న సమయంలో ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలి. ►ఈత వస్తే తప్ప జలపాతంలో దిగడానికి సహసించద్దు. ►వర్షాలు అధికంగా పడుతున్న సమయంలో జలపాతాల వద్దకు వెళ్లకపోవడమే మేలు. ►జలపాతాలకు ఒక్కరుగా కాకుండా గుంపులుగానే వెళ్లాలి. అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం జలపాతాల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. యువత జలపాతాల వద్దకు వెళుతూ దూకుడుగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. హెచ్చరికలు ఉన్నా పట్టించుకోవడం లేదు. దూరంగా జలపాతాల అందాలు వీక్షించడమే మేలు. – కరక రాము, ఎస్ఐ, అనంతగిరి -
వేసవి ప్రయాణానికి రెడీ
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పర్యాటకులు చల్లటి ప్రదేశాలకు ప్రయాణం కడుతున్నారు. వరుసగా రెండు వేసవి సీజన్లలో కరోనా కారణంగా ప్రయాణం చేయలేని పరిస్థితులు.. ఈ విడత లేకపోవడం కూడా పర్యాటక రంగంలో సందడిని పెంచింది. గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి సేదతీరేందుకు పట్టణ వాసులు మొగ్గు చూపిస్తున్నారు. పర్వత, కొండ ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు ఈ విడత డిమాండ్ అనూహ్యంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. హోటళ్లు, ఫ్లయిట్ బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు ఈ వేసవిలో ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. ఇందులోనూ ఎక్కువ మంది విహార యాత్రలకే మొగ్గు చూపిస్తున్నట్టు ఓయో సర్వేలో తెలిసింది. 64 శాతం మంది వేసవిలో సెలవులు పెట్టేసి నచ్చిన ప్రదేశానికి వెళ్లొద్దామని అనుకుంటుంటే.. 94 శాతం మంది దేశీయంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. ఉత్తరాదిలో వీటికి డిమాండ్.. ఆన్లైన్లో వివిధ పోర్టళ్లపై బుకింగ్ తీరును పరిశీలిస్తే.. ఉత్తరాదిలో రిషికేష్, హరిద్వార్, సిమ్లా, ముస్సోరీ, డెహ్రాడూన్ ప్రాంతాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈ ప్రాంతాల్లోని హోటల్స్, రిసార్ట్‌ల్లో దాదాపు గదులన్నీ బుకింగ్ అయిపోయాయి. రూమ్ టారిఫ్‌లు కరోనాకు ముందుతో పోలిస్తే 10–15 శాతం అధికంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా రిషికేష్, హరిద్వార్‌లోని అన్ని ఇంటర్నేషనల్ బ్రాండెడ్ హోటళ్లలో మే నుంచి జూన్ చివరికి నాటికి బుకింగ్‌లు పూర్తిగా అయిపోయాయి. ఈ ఏడాది పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లకు డిమాండ్ కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నట్టు, సగటు రూమ్ చార్జీలు 10 శాతం పెరిగినట్టు ఎస్సైర్ హాస్పిటాలిటీ గ్రూపు సీఈవో అఖిల్ అరోరా తెలిపారు. ఎస్సైర్ గ్రూపునకు బిమ్టల్, జిమ్‌కార్బెట్ ప్రాంతాల్లో హోటళ్లు ఉన్నాయి. కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నా ప్రయాణాలకు డిమాండ్ తగ్గలేదని అరోరా చెప్పారు. పుంజుకున్న బుకింగ్‌లు.. వేసవి కోసం కశ్మీర్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, అరుణాచల్, మణిపూర్, త్రిపుర ప్రాంతాలు ఆకర్షణీయంగా (అధిక డిమాండ్) మారిపోయాయి. దేశం బయట దుబాయి, మాల్దీవులు, థాయిలాండ్, యూఎస్‌కు డిమాండ్ నెలకొంది. ‘‘మే, జూన్ నెలలకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లు పెద్ద ఎత్తున పెరిగాయి. ప్రజలు ఎక్కువ రోజుల పాటు విడిది కోసం వెళ్లాలని చూస్తున్నారు’’అని ఈజ్‌మైట్రిప్ ప్రెసిడెంట్ హిమంక్ త్రిపాఠి తెలిపారు. ఫ్లయిట్ బుకింగ్‌లు కరోనా ముందు నాటికి చేరినట్టు మేక్మైట్రిప్ సీఈవో రాజేష్ మాగోవ్ వెల్లడించారు. సులభ వాయిదాల్లో రుణాలు లభించడం డిమాండ్‌కు తోడ్పడుతున్నట్టు ఆయన చెప్పారు. రికవరీ బలంగా.. 2022 ఏప్రిల్ నెలలో సగటు రోజువారీ ఫ్లయిట్ డిపార్చర్లు 2,726గా ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో రోజువారీ 2,000తో పోలిస్తే మంచి వృద్ధి కనిపిస్తోంది. మార్చి నెలలో రోజువారీ డిపార్చర్లు 2,588తో పోల్చి చూసినా ఏప్రిల్‌లో 5 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. విమానాల్లో ప్రయాణికుల భర్తీ కూడా గతేడాది ఇదే నెలతో పోలిస్తే 2022 ఏప్రిల్‌లో 36 శాతం అధికంగా ఉంది. గత నెలలో ఒక ఫ్లయిట్లో సగటు ప్రయాణికుల సంఖ్య 128గా ఉంది. కరోనాకు ముందు సగటు ప్రయాణికులు 135 కంటే కొంచెం తక్కువగా ఉంది. దేశీయంగా ప్రయాణికుల రద్దీ ఏప్రిల్‌లో వార్షికంగా చూస్తే 83 శాతం పెరిగి 10.5 మిలియన్లుగా ఉంది. కరోనాకు ముందున్న 11 మిలియన్ల కంటే ఇది స్వల్పంగానే తక్కువ. పెంటప్ డిమాండ్ ఈ ఏడాది పర్యాటక ప్రాంతాలు, విహార యాత్రా స్థలాలకు డిమాండ్ గణనీయంగా ఉండడానికి.. గత రెండు వేసవి సీజన్లలో ప్రయాణం చేయలేని వారు ఈ ఏడాది ప్రాధాన్యం ఇస్తుండడం వల్లేనని అనుకోవాలి. గుడ్ ఫ్రైడే, విసు వీక్ సందర్భంగా 8 లక్షల బుకింగ్‌లు నమోదయ్యాయని.. 2022లో ఇదే అత్యధికమని ఓయో చీఫ్ సర్వీస్ ఆఫీసర్ షీరంగ్ గాడ్బోల్ తెలిపారు. రానున్న కొన్ని నెలల్లో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు చెప్పారు. -
ఆదిత్య ఠాక్రే సంకల్పం: ఉద్యాన వనంలో ‘ట్రీ–హౌస్’.. ప్రత్యేకతలివే..
దాదర్ (ముంబై): బాంద్రాలోని బ్యాండ్‌స్టండ్ ప్రాంతంలో బీఎంసీకి చెందిన ఉద్యాన వనంలో ‘ట్రీ–హౌస్’ రూపుదిద్దుకుంటోంది. పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే సంకల్పంతో ముంబైలో మొదటిసారిగా చేపడుతున్న ఈ ట్రీ–హౌజ్ పర్యాటకులను ఆకట్టుకోనుంది. అందుకు అవసరమైన కోటి రూపాయలు జిల్లా ప్లానింగ్ కమిటీ నిధుల నుంచి సమకూరుస్తున్నారు. పనులు పూర్తయి ట్రీ–హౌస్ వినియోగంలోకి వస్తే స్థానికుతోపాటు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కాలక్షేపం కోసం పెద్ద సంఖ్యలో ఇక్కడికి ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. ముంబైని స్వచ్ఛంగా, సౌందర్యంగా తీర్చిదిద్దడంతోపాటు పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలని ఆదిత్య ఠాక్రే సంకల్పించారు. అందులో భాగంగా ముంబైలో అక్కడక్కడ పర్యాటక, ఉద్యానవనాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా పశ్చిమ బాంద్రాలోని బ్యాండ్‌స్టండ్ సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన ట్రీ–హౌస్ పనులు జోరుగా సాగుతున్నాయని బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ కిరణ్ దిఘావ్కర్ అన్నారు. ఇలాంటి ట్రీ–హౌస్ ముంబైలో ఇదే తొలిసారి అని, పర్యాటకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేకతలివే.. ►ట్రీ–హౌస్‌ను పూర్తిగా కలపతో నిర్మిస్తున్నారు. ఇందులోకి నేలపై నుంచి వెళ్లేందుకు నిచ్చెన అందుబాటులో ఉంటుంది. అంతేగాకుండా పక్కనే ఉన్న మరో చెట్టు పైనుంచి కూడా ట్రీ–హౌస్‌లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ►ఎదురుగా సముద్రం, సుమారు 500 చదరపు మీటర్ల స్ధలంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పిల్లలు, పర్యాటకులు, ముంబైకర్లు సందర్శించి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ►ఫొటోలు దిగేందుకు సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ►పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పర్యాటకులకు అడవిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. -
నేటి నుంచి పర్యాటక ప్రాంతాల్లోకి అనుమతి
సాక్షి, అమరావతి: కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాల్లోకి గురువారం నుంచి పర్యాటకులను అనుమతించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. రూ.164 కోట్లతో విశాఖ రుషికొండలోని హరిత హోటల్‌ను పర్యాటక శాఖ బ్లూబే హోటల్‌గా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలోని పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తామన్నారు. కోవిడ్ కష్ట కాలంలో ఆదాయం తగ్గినా పర్యాటక శాఖలోని ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించలేదన్నారు. విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన విదేశీ ఓడను లో ఫ్లోటింగ్ రెస్టారెంట్ (షిప్ రెస్టారెంట్) ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చాయని, వీలైనంత తొందరగా షిప్ కొనుగోలుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్సార్ కడప జిల్లా గండికోటను హార్సిలీహిల్స్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణం రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కరోనా కారణంగా ఆ పనులు ఆలస్యమయ్యాయన్నారు. విశాఖ, తిరుపతిలో ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఒబెరాయ్ హోటల్ యాజమాన్యం ముందుకొచ్చిందన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లకు ఆహార పదార్థాలు సరఫరా చేయడం ద్వారా 38 హోటళ్ల ద్వారా గతేడాది రూ.58.05 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.28 కోట్ల మేర ఆదాయం ఆర్జించామన్నారు. ప్రైవేటు బోటు యజమానులతో శుక్రవారం విజయవాడలోని బెరమ్ పార్కులో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. వారికి రూ.5 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఈ ఏడాది సెప్టెంబర్‌లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో రాష్ట్రం నుంచి పాల్గొనే బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, హాకీ క్రీడాకారిణి రజినికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో అంతర్జాతీయ స్థాయి స్టేడియాలను నిర్మించాలని నిర్ణయించామన్నారు. -
అందాల అరకు
-
పర్యటకాంధ్ర
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ స్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పర్యాటకం, పురావస్తు (ఆర్కియాలజీ), యువజన వ్యవహారాల శాఖలపై ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్షించారు. ‘భారత్‌లో అడుగుపెట్టే ప్రతి విదేశీ పర్యాటకుడు రాజస్థాన్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడ పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండడమే దీనికి కారణం’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఏపీలో కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన ప్రాంతాల వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలో 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి అంతర్జాతీయంగా పేరున్న సంస్థల సహకారంతో అభివృద్ధి చేయాలి. సెవెన్ స్టార్ తరహా సదుపాయాలున్న హోటళ్లు అవసరం. ఆతిథ్యం, పర్యాటక రంగాల్లో పేరు ప్రఖ్యాతలున్న సంస్థలు హోటళ్లను ఏర్పాటు చేసేలా ఉత్తమ సదుపాయాలు కల్పించాలి. దీనివల్ల రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రచారం లభిస్తుంది. పర్యాటక ప్రాంతాలను గుర్తించిన తర్వాత మార్కెటింగ్‌పై కూడా దృష్టి సారించాలి’ అని సీఎం సూచించారు. గండికోటలో గాజు వంతెన..! రాష్టŠట్రంలో కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, పోలవరం, సూర్యలంక, హార్సిలీ హిల్స్, ఓర్వకల్లు, గండికోట తదితర ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దవచ్చని అధికారులు ప్రతిపాదించారు. దీనిపై పూర్తిస్థాయి వివరాలతో సమాచారం సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. గండికోట అడ్వెంచర్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, నదికి అడ్డంగా గాజు వంతెన నిర్మించే యోచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. పర్యాటక ప్రాంతాలుగా జలాశయాలు... పర్యాటకులను ఆకర్షించేందుకు పోలవరం, పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలం, సోమశిల, కండలేరు తదితర రిజర్వాయర్లు, డ్యాంలతోపాటు అరకు, లంబసింగి, పాడేరు, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విశాఖలో మరో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు రక్షణశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పలు చోట్ల హోటళ్లు, రిసార్టులను నిర్వహిస్తున్నా నిధుల కొరతతో నిర్వహణ లోపాలు ఎదురవుతున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వెంటనే మరమ్మతులు చేపట్టి నిర్వహణ మెరుగుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హస్తకళలను ప్రోత్సహించాలి... రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపునిస్తున్న హస్తకళలు అంతరించిపోకుండా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అరుదైన నైపుణ్యం కలిగిన ఏటికొప్పాక, కొండపల్లి, కలంకారీ కళాకారులును ఆదుకునే దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వీటిపై ఆధారపడి జీవించే కుటుంబాలకు సాయం చేసేలా మార్గదర్శకాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆర్కియాలజీ కార్పొరేషన్‌కు గ్రీన్ సిగ్నల్... రాష్ట్రంలో చారిత్రక స్థలాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ కోసం ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొండపల్లికి రోడ్డు, లైట్ల సదుపాయం, బాపు మ్యూజియంలో అభివృద్ది కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. శిల్పారామాలను అభివృద్ధి చేయడంతో పాటు పచ్చదనం పెంచాలన్నారు. శిల్పారామాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఒక విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఐదెకరాల్లో సాంస్కృతిక అకాడమీలు... రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కల్చరల్ అకాడమీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. కనీసం 5 ఎకరాల్లో ఈ అకాడమీల నిర్మాణ పనులు చేపట్టి రెండేళ్లలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంగీతం, నాట్యం సహా ఇతర కళల్లో శిక్షణ, బోధన, ప్రదర్శనలకు కల్చరల్ అకాడమీలు వేదిక కావాలని ఆకాంక్షించారు. మన కళలు, సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఇవి వేదికలు కావాలన్నారు. సంగీత, నృత్య కళాశాలలో బోధించే పార్ట్‌టైం, ఫుల్‌టైం సిబ్బంది జీతాలు పెంచాలని సీఎం ఆదేశించారు. జిల్లాకో క్రీడా సముదాయం... ‘ప్రతి జిల్లాలో క్రీడా సముదాయాలు ఉండాలి. ప్రతి స్కూల్లో కూడా క్రీడల కోసం మైదానం అవసరం. ఇప్పటివరకు ఎన్ని స్కూళ్లలో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి? ఇంకా ఎన్నిచోట్ల ఏర్పాటు చేయాలి?’ అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆటస్థలాల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వ్యాయామ శిక్షకులు తగినంత మంది ఉన్నారా? అనే విషయాన్ని కూడా నివేదికలో పొందుపరచాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడా స్టేడియంలు... విశాఖపట్నం, రాజమండ్రి / కాకినాడ, అమరావతి, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా స్టేడియంల నిర్మాణాలపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో చర్చించారు. అంతర్జాతీయ సదుపాయాలతో స్టేడియంల నిర్మాణానికి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నిర్మాణాల్లో నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించడం, వారికి అండగా నిలవటంపై ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచన గతంలో ఎప్పుడూ చేయలేదని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ కార్యక్రమాన్ని చేపట్టిందని సీఎం చెప్పారు. భద్రతపై సంతృప్తి చెందితేనే బోట్లకు అనుమతి.. పర్యాటకులు, ప్రయాణికులకు సరైన భద్రతా ఏర్పాట్లు చేశారని సంతృప్తి చెందిన తర్వాతే నదిలో బోట్లు తిరిగేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నదీ తీరాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుపై సీఎం ఆరా తీశారు. వీటిపై ఏర్పాటైన కమిటీ నివేదిక రాగానే సిఫార్సులపై చర్చిద్దామని చెప్పారు. సమావేశంలో పర్యాటక, పురావస్తు, యువజన వ్యవహారాలశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శిల్పారామాలను అభివృద్ధి చేస్తాం: మంత్రి శ్రీనివాసరావు మండల, నియోజకవర్గ స్థాయిలో స్టేడియంలు అభివృద్ధి చేయడంపై సమావేశంలో చర్చించినట్లు సమీక్ష అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సాంస్కృతిక వికాస కేంద్రాలు ఏర్పాటు చేసి కళాకారులకు అండగా ఉంటామన్నారు. ఇడుపులపాయలో శిల్పారామం ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న శిల్పారామాలను కోటి రూపాయలతో మరమ్మతులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. శిల్పారామాలు.. – ఇడుపులపాయలో కొత్తగా ఏర్పాటు.. – మిగతా ప్రాంతాల్లో శిల్పారామాల మరమ్మతులకు నిధులు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేవి –కళింగపట్నం –విశాఖపట్నం –కాకినాడ –రాజమండ్రి –పోలవరం –సూర్యలంక –హార్సిలీ హిల్స్ –ఓర్వకల్లు –గండికోట –పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలం, సోమశిల, కండలేరు జలశయాలను టూరిజం ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయం – అరకు, లంబసింగి, పాడేరు, మారేడుమిల్లిలో టూరిజం పెంచేందుకు చర్యలు గండికోట – అడ్వెంచర్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు – నదికి అడ్డంగా గాజు వంతెన నిర్మాణం -
బాదన్‌కుర్తి.. బుద్ధుడి ధాత్రి!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మహాజనపదం అస్మక రాజ్యం.. ఆ రాజ్యంలో గోదావరి రెండుగా చీలిన ప్రాంతంలో ఉన్న ఓ జనావాసం.. అది తెలంగాణలోనే ఉంది. అక్కడికి చేరువలో నది మధ్యలో చిన్న దీవి.. ఆ దీవిలో ఉందీ ఓ అద్భుతమైన బౌద్ధ స్థూపం.. ఇటీవలే జరిపిన తవ్వకాల్లో ఈ స్థూపం బయల్పడింది. ఇది తెలంగాణలో బయటపడ్డ అతి పురాతన స్తూపంగా చరిత్రకారులు భావిస్తున్నారు. బావరి గ్రామానికి సమీపంలో.. క్రీ.పూ.1 నుంచి 3 శతాబ్దాల మధ్య కాలానికి చెందినదిగా అంచనా వేస్తున్నారు. విశేషమేంటంటే బుద్ధుడిని స్వయంగా కలసి ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు నడుం బిగించిన బావరి అనే వ్యక్తి నివసించిన ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ స్తూపం ఉంది. అంటే బుద్ధుడు సజీవంగా ఉన్నప్పుడు ఆయన బోధనలను ప్రచారం చేసిన వారి తాలూకు వ్యక్తులే వీటిని నిర్మించారని తెలుస్తోంది. గోదావరి నది మధ్యలో చిన్న దీవిలో ఉన్న ఈ స్తూపంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఇతర బౌద్ధ నిర్మాణాలను వెలుగులోకి తెస్తే ఇది పెద్ద పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతుందని చెబుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో గోదావరి నది మధ్యలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు చరిత్రకారుల దృష్టిని ఆకర్షిస్తోంది. బౌద్ధ సాహిత్యంలో ప్రస్తావన.. బౌద్ధులు అత్యంత పవిత్రంగా భావించే సుత్త నిపత గ్రంథంలో ఈ ప్రాంత ప్రస్తావన ఉంది. ఇప్పటివరకు బయటి ప్రపంచానికి దీని గురించి తెలియకపోవటంతో బౌద్ధ పర్యాటకులు ఇక్కడికి రావట్లేదు. నిర్మాణాలు వెలుగు చూసి, వాటి ప్రాధాన్యంపై ప్రచారం చేస్తే దేశవిదేశీ బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సుత్త నిపత గ్రంథంలోని పారాయణ వగ్గ చాప్టర్లో తెలంగాణ ప్రాంతం ప్రస్తావన ఉందని గతంలోనే నిపుణులు గుర్తించారు. ‘అస్మక రాజ్యంలో గోదావరి నది రెండుగా చీలిన ప్రాంతంలోని ఆవాసానికి చెందిన వారు బుద్ధుడిని దర్శనం చేసుకుని ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు నడుం బిగించారు’అని అందులో లిఖితపూర్వకంగా ఉంది. అస్మక పరిధిలో తెలంగాణ ఉండటంతో ఇక్కడ గోదావరి రెండుగా చీలిన ప్రాంతంలో జనావాసం ఎక్కడుందా అని నిపుణులు శోధించి.. అది ఖానాపూర్ మండలంలోని బాదన్‌కుర్తి గ్రామంగా గుర్తించారు. ఆ గ్రామం నది చీలికలో ఉంటుంది. అక్కడ ప్రాథమికంగా తవ్వకాలు జరిపి బౌద్ధ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. కానీ వాటిపై ఓ దేవాలయం సహా వేరే నిర్మాణాలు రావటంతో ఏమీ చేయలేకపోయారు. తాజాగా దానికి చేరువలో అతి పురాతన బుద్ధ స్తూపంతోపాటు ఇతర నిర్మాణాలను గుర్తించారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆదేశంతో బుద్ధవనం అధికారి శ్యాంసుందర్, పుణేలోని డెక్కన్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీకాంత్, ఔత్సాహిక చరిత్రకారులు జితేంద్రబాబు, శ్రీరామోజు హరగోపాల్ తదితరులు ఇటీవల పర్యటించి వాటిని గుర్తించారు. ►బాదన్‌కుర్తి గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో బావాపూర్ సమీపంలో గోదావరి మధ్యలో రెండు చిన్న దీవులున్నాయి. వాటిల్లో దాదాపు 57 ఎకరాల మేర విస్తరించి ఉన్న ఒక దీవిని పరిశీలించగా ఇవి వెలుగు చూశాయి. ►దాదాపు 17 అడుగుల ఎత్తున మట్టి దిబ్బను పరిశీలించగా అది బౌద్ధ స్తూపమని తేలింది. ►3 అంచెలుగా ఈ స్తూపం నిర్మితమైంది. ►ఇందులో దిగువ ఉన్న చివరి అంచె రాతి కట్టడంగా ఉండగా, పై 2 అంచెలు పెద్ద ఇటుకలతో నిర్మితమై ఉన్నాయి. చివరి వరుస వ్యాసం 40 చదరపు అడుగులు ఉంది. ►దీనికి చేరువలో 20 అడుగుల వ్యాసంతో మరో రెండు స్తూపాలున్నాయి. ఇలా ఒకేచోట 3 స్తూపాలుండటం, పెద్ద స్తూపం మూడు అంచెలుగా ఉండటం అరుదని నిపుణులంటున్నారు. గుప్త నిధుల కోసం కొందరు ఆ మూడు స్తూపాల మధ్య తవ్వటంతో అవి కొంతమేర దెబ్బతిన్నాయి. ఎంతగానోఆకట్టుకుంటుంది చాలా పురాతనమైన స్తూపాలుండటం, బుద్ధుడి బోధనలు స్వయంగా విని బౌద్ధాన్ని ప్రచారం చేసిన బావరి నివసించిన ప్రాంతం కావటం, గోదావరి నది మధ్యలో ఉండటంతో ఇది పర్యాటకంగా బాగా అభవృద్ధి చెందే ప్రాంతం. అందుకే అక్కడ వెంటనే తవ్వకాలు జరిపి నిర్మాణాలను వెలుగులోకి తేవాలని హెరిటేజ్ తెలంగాణ శాఖను కోరాం. సమీపంలోనే కడెం రిజర్వాయర్, దట్టమైన అడవి, గోదావరి నది.. పర్యాటక ప్రాంతంగా ఎలా తీర్చిదిద్దాలన్న విషయంలో ప్రతిపాదనలు రూపొందిస్తాం –మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రత్యేకాధికారి -
పర్యాటక మార్గాల్లో విరామ కేంద్రాలు
భువనేశ్వర్ ఒరిస్సా : రాష్ట్ర పర్యాటక రంగం బహుముఖ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రాల మార్గంలో పలు చోట్ల విరామ కేంద్రాల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో ఆయన ఈ విరామ కేంద్రాల్ని ప్రారంభించారు. పర్యాటక కేంద్రాల్ని అనుసంధాపరిచే జాతీయ, రాష్ట్ర రహదారుల పరిసరాల్లో వేర్వేరు ప్రాంతాల్లో 50 విరామ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 34 కేంద్రాల నిర్మాణం పూర్తి చేసి మంగళవారం ప్రారంభించారు. 4 కేంద్రాల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించగా మిగిలిన కేంద్రాల్ని ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతరేతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో రాష్ట్ర రవాణా–నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ నృసింహ చరణ్ సాహు, పర్యాటక, సాంస్కృతిక, ఒడియా భాష అభివృద్ధి శాఖ మంత్రి అశోక్ చంద్ర పండా, నిర్మాణ శాఖ కార్యదర్శి నళినీ కాంత ప్రధాన్ పాల్గొన్నారు. పర్యాటకులకు దోహదం పర్యాటక మార్గాల్లో విరామ కేంద్రాలు పర్యాటకులకు ఎంతగానో దోహదపడతాయి. ప్రధానంగా మహిళలకు ఎంతగానో ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. తొలి విడతలో 34 పర్యాటక విరామ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రాల్లో మరుగుదొడ్లు, సురక్షిత తాగు నీరు, కెఫేటేరియా సదుపాయాలు కల్పించారు. ప్రయాణంలో పర్యాటకుల అవసరాల దృష్ట్యా ఈ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించడం విశేషంగా పేర్కొన్నారు. పర్యాటకులకు చక్కటి పర్యావరణంతో ఈ కేంద్రాలు స్వల్ప కాలిక విడిది కేంద్రాలుగా సేద తీర్చుతాయి. త్వరలో మరిన్ని సదుపాయాలు పర్యాటక విరామ కేంద్రాల్లో మరిన్ని సదుపాయాల్ని త్వరలో ప్రవేశ పెట్టనున్నట్లు రాష్ట్ర నిర్మాణ శాఖ కార్యదర్వి నళినీ కాంత ప్రధాన్ తెలిపారు. దీర్ఘకాల ప్రయాణంలో చోదకులు, పర్యాటకులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఉపశమనం కల్పించేందుకు పర్యాటక మార్గాల్లో విరామ కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ప్రాంగణాలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఆహార కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని తమ విభాగం ముఖ్యమంత్రికి ప్రతిపాదించినట్లు తెలిపారు. పాతబడిన పర్యవేక్షక బంగళాలు, బహిరంగ ప్రభుత్వ స్థలాల్ని సద్వినియోగపరుచు కోవడం ఈ ప్రణాళిక ప్రధాన ధ్యేయంగా ఆయన పేర్కొన్నారు. ఇటువంటి 50 కేంద్రాల నిర్మాణానికి పనులు చేపట్టారు. ఇప్పటివరకు 34 కేంద్రాల నిర్మాణం పూర్తయింది. వీటిని ముఖ్యమంత్రితో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు వగైరా ప్రజా ప్రతినిధులు మంగళవారం ప్రారంభించారు. మరి కొన్ని చోట్ల ఇటువంటి కేంద్రాల్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. అవసరమైన చోట్ల ప్రైవేట్ స్థలాల కొనుగోలుకు ఆయన ఆదేశించినట్లు నిర్మాణ శాఖ కార్యదర్శి తెలిపారు. హైవేలపై ట్రామా కేంద్రాలు జాతీయ (ఎన్‌హెచ్) రాష్ట్ర జాతీయ రహదారు(ఎస్‌హెచ్)ల పొడవునా తరచూ దుర్ఘటనలు సంభవిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో బాధితులకు తక్షణ ఆరోగ్య, చికిత్స సేవల్ని కల్పించేందుకు పర్యాటక విరామ కేంద్రాల పరిసరాల్లో ట్రామా కేంద్రాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని నిర్మాణ శాఖ కార్యదర్శి వివరించారు. ఈ ప్రాంగణాల్లో వాహనాల మరమ్మతు కేంద్రాలు, పిల్లల కోసం ఆట స్థలాలు, వై–ఫై సదుపాయం, మందుల దుకాణాలు కూడా ఏర్పాటు చేసేందుకు విభాగం యోచిస్తోందని తెలిపారు. పర్యాటక విరామ కేంద్రాల నిర్వహణ బాధ్యతల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిర్మాణ విభాగానికి కట్టబెట్టినట్లు ప్రకటించారు. గుణుపురం, కాశీపూర్‌లలో.. రాయగడ: రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా యాత్రికులు, పర్యాటకులకు వసతి సౌకర్యం కల్పించే భవనాలను ప్రభుత్వం నిర్మించి జాతీయ రహదారుల వద్ద పర్యాటకులు, పాదచారులు, విశ్రాంతి తీసుకునేందుకు సదుపాయం కల్పించింది. ఈ విశ్రాంతి భవనాల్లో భోజన సదుపాయం, సౌచాలయ సదుపాయం ఉంటుంది. వీటికి రుసుం చెల్లించవలసి ఉంటుంది. రాష్ట్రంలో ఇంతవరకు 50భవనాల నిర్మాణం చేపట్టగా అందులో 35భవనాలు పూర్తయ్యాయి. వాటిలో రాయగడ జిల్లాలోని కాశీపూర్, గుణుపురంలో ఒక్కో భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాశీపూర్ భవనం ప్రారంభోత్సవానికి కలెక్టర్ గుహపూనాంతపస్‌కుమార్, రాయగడ ఎంఎల్ఏ లాల్‌బిహారీ హిమరిక, బీజేడీ నాయకుడు మహాపాత్రో ఇతర సభ్యులు హాజరయ్యారు. అలాగే గుణుపురంలో భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుణుపురం ఎంఎల్ఏ త్రినాథ్గొమాంగో, రాజ్యసభ సభ్యుడు ఎన్.భాస్కరరావులు హాజరయ్యారు. -
భారీ వర్షాలు: పర్యాటక ప్రాంతాల మూసివేత
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎగువ ప్రాంతల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిగువన ఉన్న తమిళనాడు కావేరి నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రమాదస్థాయిలో వరద నీరు పోటెత్తుతోంది. కృష్ణరాయసాగర్ ఆనకట్ట నుంచి భారీగా వరద నీరు కిందకు వదలడంతో తమిళనాడులోని కావేరి పరివాహక ప్రాంతాల్లో ప్రమాదస్థితి నెలకొంది. ప్రధానంగా ధర్మపురి జిల్లాలోని హొగెనేకల్ జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. ఎక్కడా లేని విధంగా హొగెనేకల్‌కు నిమిషానికి పదివేల ఘనపుటడుగుల నీరు చేరుతోంది. దీంతో తమిళనాడులోని దిగువ ప్రాంతాలకు వరదనీరు వెళుతుండటంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. కావేరి పరివాహక ప్రాంతాల్లోని దాదాపు ఆరు జిల్లాల ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం హొగెనికల్ లోని పర్యాటక ప్రాంతాలన్నీ మూసివేసి పోలీసుల భద్రతను ఏర్పాటు చేసింది. ఎవరూ కావేరి పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరికలు, నిషేదాజ్ఞలు జారీ చేసింది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. -
పర్యాటకం ఇక ప్రియం
సాక్షి,బెంగళూరు: పర్యాటకం ఇక ప్రియం కానుంది. నిర్వహణ, మౌలిక సదుపాయల పెంపు తదితర కారణాలను చూపుతూ ఆయా పర్యాటక ప్రాంతాల ప్రవేశ రుసుము, బోర్డింగ్ చార్జీలు, బోటింగ్ తదితర వాటి ధరలను పెంచుతూ రాష్ట్ర అటవీశాఖ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుండగా స్వదేశీ పర్యాటకులకు, విదేశీ పర్యాటకులకు వేర్వేరుగా ధరలు నిర్ణయించారు. కొత్త ధరల ప్రకారం బండీపుర, బిళిగిరిరంగినబెట్టచనాగరహళె, దాండేలి తదితర అభయారణ్యాల ప్రవేశ రుసుమును స్వదేశీ పర్యాటకులకు రూ.550గా నిర్ణయించగా విదేశీ పర్యాటకులకు రూ.1,800గా నిర్ణయించారు. అదేవిధంగా నాగరహళె, అంతరసంతె అభయారణ్యాల్లో వైల్డ్‌లైఫ్ సఫారీ ధరలతో పాటు వైల్డ్సఫారీ సమయాన్ని కూడా అదనంగా రెండు గంటల పాటు పెం చుతూ అటవీశాఖ నిర్ణయించింది. ఇక పక్షిధామాల ప్రవేశ రుసుముతో పాటు పక్షిధామాల్లో బోటింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీల ధరలను కూడా పెంచారు. వీటితో పాటు నేషనల్పార్క్, అభయారణ్యాలు, పక్షిధామాలకు వచ్చే పర్యాటకుల వాహనాల పార్కింగ్ చార్జీలను కూడా పెంచారు. కాగా విద్యార్థులు, పిల్లలు, వికలాంగులను మాత్రం కొత్తగా అమలు చేయనున్న ధరల నుంచి మినహాయించారు. మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యం ‘అభయారణ్యలు, పక్షిధామాలకు దేశవిదేశాల నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆయా ప్రాంతాల్లో సౌకర్యాలు, నిర్వహణ వ్యయాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రుసుం పెంచాల్సి వచ్చింది. పర్యాటకులపై భారం పడకుండా స్వల్ప మొత్తంలోనే ధరలను నిర్ణయించాం’–హన్నట్టి శ్రీధర్, అటవీ సంరక్షణ ముఖ్య కార్యదర్శి -
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
నల్లగొండ : జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షింపజేసే విధంగా రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. శనివారం నల్లగొండ పట్టణం పానగల్‌లోని పచ్చల సోమేశ్వర ఆలయం, ఛాయా సోమేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఉదయ సముద్రం ప్రాంతాలను సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాలను ఆధునీకరించి, ఆ ప్రాంతాలను అభివృద్ధి పర్చాలన్నారు. దేవరకొండ, నాగార్జునసాగర్‌లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి కలెక్టరేట్ కార్యాలయంలో కార్యదర్శి బుర్రా వెంకటేశం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో విదేశాల నుంచి పర్యాటకులు అతి తక్కువ సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. నల్లగొండ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే విధంగా విస్తృత ప్రచారం, హోర్డింగ్‌లను ప్రధాన కూడళ్లలో, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో అమర్చాలని సూచించారు. ఛాయసోమేశ్వర ఆలయ విశిష్టత గురించి ఆలయంలో పడే ఛాయలపై పరిశోధనలకు యూనివర్సిటీ, ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక పర్యటన ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ..జిల్లాకు టేబుల్ టెన్నిస్ హాల్ ఏర్పాటుకు రూ.21 లక్షల నిధులు అంచనా ప్రతిపాదనలు సమర్పించారని, ఆ నిధులు మంజూరు చేస్తామని కార్యదర్శి తెలిపారు. ఈ సమావేశంలో పర్యాటక అధికారి ఎం.శివాజీ, దేవాదాయ శాఖ అధికారి ఎ.సులోచన, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పర్యాటకానికి జిల్లాకో ప్రణాళిక
► భారీగా పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయం ► ప్రత్యేక ప్రణాళికల రూపకల్పనకు కసరత్తు ప్రారంభం ► జిల్లాల యంత్రాంగంతో మంత్రి, కార్యదర్శి, అధికారుల భేటీలు ► తొలి రోజున నాలుగు జిల్లాల్లో సమావేశాలు ► వారం తర్వాత మరిన్ని జిల్లాల అధికారులతో భేటీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి, పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాలకు వేర్వేరు ప్రత్యేకతలు ఉన్న నేపథ్యంలో.. జిల్లాల వారీగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిం చనుంది. ప్రపంచవ్యాప్తంగా ముమ్మర ప్రచారం చేయడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లాల వారీగా పర్యాటక ప్రణాళికలు ఎలా ఉండాలనే దిశగా కసరత్తు ప్రారంభించింది. పర్యాటక, పురావస్తుశాఖల అధికారులు ఆయా జిల్లాలకు వెళ్లి కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా పర్యాటక మంత్రి చందూ లాల్, ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ క్రిస్టీనా, పురావస్తు శాఖ డెరైక్టర్ విశాలాక్షి, ఇతర అధికారులు సోమవారం తొలి విడత సమా వేశాలకు శ్రీకారం చుట్టారు. తొలిరోజున ఉదయం నుంచి రాత్రి వరకు యాదాద్రి, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల యంత్రాంగంతో జిల్లా కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించారు. యాదాద్రి దేవాలయం, చిట్టకోడూరు రిజర్వాయర్, ఖిలాషాపూర్ ప్రాంతాలలో పర్యటించారు కూడా. వారం తర్వాత రెండో విడతగా మరిన్ని జిల్లాల్లో పర్యటనలు చేయను న్నామని.. మొత్తం 31 జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తామని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఏం చేస్తారు..? ► పర్యాటకులను ఆకర్షించేలా తీసుకునే చర్యలకు లక్ష్యాలు నిర్ధారించారు. 2020, 2022, 2027.. ఇలా సంవత్సరాల వారీగా పర్యాటకుల సంఖ్యను లక్ష్యంగా పెట్టుకున్నారు. ► ‘అతిథి దేవోభవ’ పేరుతో ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది. ముఖ్యంగా పర్యాటకులను ఆహ్వానించే క్రమంలో ప్రజల్లో కూడా అవగాహన కల్పించనున్నారు. ఆటోవాలాలు, హోటల్ నిర్వాహకులు, ఉద్యోగులు.. ఇలా అంతా పర్యాటకులను నవ్వుతూ స్వాగతించేలా చైతన్యం తీసుకువస్తారు. ►ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రత్యేకత ఉంది. స్థానిక పరా్యాటక కేంద్రాలు, ప్రకృతి సిద్ధ వనరులు, ఆచార వ్యవహారాలు వంటి వాటి ఆధారంగా ప్రణాళికలు రూపొందిస్తారు. ►యాదాద్రి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతోపాటు భువనగిరి కోట తదితరాలను పర్యాటకులకు అనుకూలంగా మార్చాలని నిర్ణరుుంచారు. జాతీయ రహదారి నుంచి నేరుగా భువనగిరి కోటకు ప్రత్యేక రహదారి నిర్మాణంతోపాటు బారికేడ్లు ఏర్పాటు చేసి, అక్కడ అన్ని వసతులతో కూడిన స్నాక్ బార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ►ఘన చరిత్ర ఉన్న వరంగల్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం వరంగల్‌లో అంతర్జాతీయ పతంగుల ఉత్స వం నిర్వహించనుండగా... హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలను వచ్చే సంవత్సరం వరంగల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ►పాకాల, లక్నవరం, రామప్ప లాంటి జలాశయాల్లో లేక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. అలాగే పాతకాలం నాటి పూటకూళ్ల ఇళ్ల తరహాలో ఇంటి విడిదుల ఏర్పాటును ప్రోత్సహిస్తారు. -
రాష్ట్రంలో జిల్లాలు పదేనంట!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలెన్ని అంటే టక్కున 31 అని చెబుతాం.. కానీ తెలంగాణ టూరిజం శాఖ వారు మాత్రం ఇంకా 10 జిల్లాలనే అంటున్నారు. అంతేకాదు ఆ మేరకు వెబ్సైట్లో కూడా చూపిస్తున్నారు. సచివాలయంలో తెలంగాణ టూరిజం శాఖ వారు ఏర్పాటు చేసిన కియోస్క్‌లో రాష్ట్రంలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాలను పొందుపరిచారు. అంత వరకు బాగున్నప్పటికీ జిల్లాలను మాత్రం పది జిల్లాలుగా చూపడం విడ్డూరంగా ఉందంటూ సచివాలయానికి వచ్చిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. -
పర్యాటక ప్రాంతాల్లో పోకిమన్ నిషేధం
టోక్యో : కాల్పనిక ప్రపంచనానికి వాస్తవికతకు ముడిపెడుతూ ఆవిష్కరించిన పోకిమన్ గో గేమ్‌పై జపాన్‌లో ఆంక్షలు విధించారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఈ గేమ్ ఆడటాన్ని నిషేధిస్తూ ఆంక్షలు జారీచేశారు. ఈ గేమ్ ను రూపొందించిన సాప్ట్ వేర్ కంపెనీ నియాంటిక్ ల్యాబ్స్, ఇటీవలే జపాన్ లో ఈ గేమ్ ను లాంచ్ చేసింది. జపాన్ లో ఈ గేమ్ ను లాంచ్ చేయడంతో పోకిమన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వెంటనే వీరి ఆనందానికి కొంత అడ్డుకట్ట వేస్తూ, ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఈ గేమ్ ను ఆడవద్దని శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. జపాన్ లో రెండో అతి పవిత్రమైన స్థానంగా నిలుస్తున్న ఇజుమో-తైసా విగ్రహం పరిసర ప్రాంతంలో శుక్రవారం ఈ గేమ్ పై నిషేధం విధించారు. ఈ నిషేధం కేవలం గంభీరమైన అభయారణ్య ప్రాంతంలో సందర్శకులను రక్షించేందుకేనని అధికారులు ప్రకటించినట్టు ఈఎఫ్ఈ న్యూస్ రిపోర్టు చేసింది. ఏడాదికి ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఆరు మిలియన్ల మంది సందర్శకులు వస్తుంటారని, వారి సురక్షితం కోసమే ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. హిమేజీ కోట, జపాన్ లోని అత్యంత ప్రసిద్ధ ప్రాంతం ఫ్యూడల్ పోర్ట్రెస్ ప్రాంతం. ఈ పరిసర ప్రాంతంలో నడిచేటప్పుడు ప్రజలు ఈ గేమ్ ను ఆడకూడదని నిషేధం విధించారు. జపాన్ లో మరికొన్ని పర్యాటక ప్రాంతాల్లో కూడా ఈ గేమ్ పై హెచ్చరికలు జారీచేశారు. ఈ హెచ్చరికలకు కట్టుబడి ఉండి...ప్రజలు తమ తమ స్మార్ట్ ఫోన్లలో గేమ్ ను సురక్షితంగా ఆడుకోవాలని అధికారులు చెబుతున్నారు. అటు ఈ గేమ్ ప్రభావంపై స్పందించిన ఇండోనేషియా ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించగా, సౌదీమత పెద్దలు ఆటలు నిషేధిస్తూ ఫత్వాజారీ చేసిన సంగతి తెలిసిందే. -
ప్రపంచ టాప్-5 పర్యాటక ప్రాంతాల్లో తాజ్
న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్-5 పర్యాటక ఆకర్షణ కేంద్రాల్లో తాజ్‌మహల్ స్థానం దక్కించుకుంది. ‘ట్రిప్ అడ్వైజర్’ వెబ్సైట్ సర్వేలో తాజ్ ఐదో స్థానంలో నిలిచింది. తొలిస్థానం పెరూలోని ‘మాచు పిచ్చు’కు దక్కింది. -
సిటీ అంతా ఫుల్‌జోష్
-
పర్యాటక పరుగులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుంది. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు నవ్య శోభతో కళకళలాడనున్నాయి. విశాలమైన తీరప్రాం తం, సహజసిద్ధమైన ప్రకృతి అందాలతోపాటు ఆధ్యాత్మిక ప్రాంతాలకు ఆలవాలమైన శ్రీకాకుళం జిల్లాను పర్యాటక రంగంలో పరుగులు తీయించేందుకు కసరత్తు జరుగుతోంది. కొత్త ప్రతి పాదనలు రూపుదిద్దుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్యాటక రంగానికి రూ.4.50 కోట్లు విడుదల కావడంతో రెట్టిం చిన ఉత్సాహంతో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొత్త కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు ఆశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టుల పనులు ప్రారంభించగా రానున్న రోజుల్లో మరిన్ని పనులకు శ్రీకారం చుడతారని చెబుతున్నారు. పలు గ్రోత్ సెం టర్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖాన్ ఈనెల 26 నుంచి మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తుండటంతో ఆమెకు సమర్పించేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. గ్రోత్ సెంటర్ల వివరాలు * పొన్నాడ కొండ-బ్రిడ్జి ప్రాంతంలో రూ.2 కోట్ల అంచనాతో విశాఖలోని కైలాసగిరి తరహాలో మినీ కైలాసగిరి ఏర్పాటు కానుంది. * భావనపాడులో ఫిషింగ్ హార్బర్, మినీ పార్కు, స్పీడ్ బోట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. * గుళ్ల సీతారాంపురంలో 16వ శతాబ్దానికి చెందిన రామాలయంలో విద్యుత్ ధగధగలు, తోటలు, కల్యాణ మండప నిర్మాణానికి రూ.50 లక్షలతో పనులు ప్రారంభం కానున్నాయి. * సరుబుజ్జిలి మండలం దంతపురి ప్రాంతాన్ని బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం నుంచి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందన్న అంచనాతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. * జిల్లాకే తలమానికంగా ఉన్న అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రావివలస వంటి దైవ క్షేత్రాలతోపాటు శాలిహుండం, కళింగపట్నం, తేలి నీలాపురం, బారువ బీచ్ వంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మరిన్ని నిధు లు కావాలని ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. జరుగుతున్న పనులివే.. * శ్రీకాకులం ఆర్అండ్బీ అతిథిగృహం సమీపంలో ఉన్న డచ్హౌస్ను రూ.50 లక్షలతో మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. పనులు ఇప్పటికే ప్రారంభం కాగా మూడు నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. * అరసవల్లి రోడ్డులోని ఇందిరా విజ్ఞాన్ భవన్ సమీపంలో రూ.13 కోట్ల ఖర్చుతో బడ్జెట్ హోటల్ రానుంది. ఇప్పటికే రూ.6 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. * కళింగపట్నం బీచ్‌లో రూ.17 కోట్లతో బీచ్ రిసార్ట్స్‌తో పాటు శిల్పారామం కూడా ప్రారంభం కానున్నాయి. * అరసవల్లిలో రూ.16 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టగా శ్రీకూర్మంలో రూ.35 లక్షలతో, శ్రీముఖలింగంలో రూ.18 లక్షలతో, రావివలస మల్లిఖార్జునస్వామి ఆలయంలో రూ.1.12లక్షలతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాం తాల్లో గదులు, ఇతరత్రా వసతుల కల్పనకు తొలి దశలో రూ.50 లక్షలతో టెండర్లు పిలవనున్నారు. * మడ్డువలస జలాశయంలో బోట్ షికారుకు రూ.60 లక్షలతో టెం డర్లు పిలవనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు ఇప్పటికే తమ శాఖ కు రూ.4.57 కోట్లు జమ అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ బుద్ధిస్ట్ సర్క్యూట్ శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు బౌద్ధారామాలను అనుసంధానం చేస్తూ త్వరలో అంతర్జాతీయ బుద్ధిస్ట్ సర్క్యూట్’ను తీర్చిదిద్దనున్నారు. ఇది పూర్తిస్థాయిలో తయారైతే చైనా తదితర దేశాలకు చెందిన బౌద్ధ మతస్తులు తరచూ ఇక్కడకూ వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా ఆదాయం కూడా వస్తుందని అధికారులు చెబుతున్నారు. శాలిహుండం, నగరాలపేట, దంతపురి ప్రాం తాల్లో ఇప్పటికే ప్రముఖ బౌద్ధమతస్తుడు శాంతన్సేథ్ పర్యటించి ఓ ప్రణాళిక సిద్ధం చేశారని, త్వరలో దానిని కూడా విడుదల చేస్తామని చెబుతున్నారు.