Tuck Jagadish Movie
-
టక్ జగదీష్ టీం తో ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ
-
వీలుకాక రాజా రాణి, ఎఫ్ 2 సినిమాలు చేయలేకపోయా: నాని
‘‘ఓ నటుడిగా అన్ని రకాల సినిమాలు, పాత్రలు చేసినప్పుడే పరిపూర్ణమైన నటుడు అనే భావన కలుగుతుంది. ముఖ్యంగా నన్ను నేను పరీక్షించుకోవాలి.. చాలెంజింగ్ అనిపించే పాత్ర అయితేనే ఆ కథకి ఓకే చెప్పాలనిపిస్తుంది’’ అని నాని అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన చిత్రం ‘టక్ జగదీష్’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని చెప్పిన విశేషాలు... ►‘మజిలీ’ తర్వాత శివ నిర్వాణ ఫోన్ చేసి, ఓ కథ చెప్పాలన్నారు. అప్పటికే ‘మజిలీ’ సూపర్ హిట్ అయి ఉండటంతో మళ్లీ అలాంటి ప్రేమకథే చెబుతారేమో? ఆ జానర్ అయితే వద్దని చెబుదామనుకున్నాను. కానీ తను చెప్పిన ‘టక్ జగదీష్’ లైన్ విని కనెక్ట్ అయిపోయా. ఎమోషన్‌ను బాగా హ్యాండిల్ చేసే శివ ఫ్యామిలీ సినిమాలను ఇంకా బాగా చేస్తాడనిపించింది. పైగా ‘టక్ జగదీష్’ లాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ►నేను నటించిన ‘వి’ చిత్రం గత ఏడాది ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు ‘టక్ జగదీష్’ ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది. దీనివల్ల థియేటర్లో నన్ను నేను చూసుకోవడం కూడా మిస్ అవుతున్నాను. అయితే కోవిడ్ పరిస్థితులు సెట్ అయితే థియేటర్లోకి వచ్చేందుకు నా నెక్ట్స్ సినిమాలతో పాటు చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ అంటే మనల్ని ఎంగేజ్ చేయడం. అంతే కానీ కేవలం కామెడీనే కాదు. ‘నటుడు అంటే ఏంట్రా? వాళ్లు ఏడిస్తే మనం ఏడవాలి? వాళ్లు నవ్వితే మనం నవ్వాలి? అని నా చిన్నతనంలో విన్న మాటలు అలా నా మనసులో నాటుకుపోయాయి. ఇకపై ప్రతి సినిమాలో కొత్త నానీని చూస్తారు. మంచి మార్కెట్ ఉన్న హీరోగా ఉండాలా? మంచి నటుడిగా ఉండాలా? అనేదాన్ని బట్టి కథల ఎంపిక ఉంటుంది. ‘రాజా రాణి, ఎఫ్ 2’ వంటి పలు సినిమాల కథలు నా వద్దకొచ్చాయి.. హిట్ అవుతాయని తెలిసినా నాకు వీలు కాక చేయలేకపోయా. అలా నా వద్దకు వచ్చి చేయలేని హిట్ సినిమాలు చాలా ఉన్నాయి. ►కెరీర్ ప్రారంభంలో ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఆహా కళ్యాణం’ వంటి రీమేక్ సినిమాలు చేశాను. ప్రస్తుతం రీమేక్ చిత్రాలు చేయకూడదని ఫిక్స్ అయ్యాను. మనం కొత్త సినిమాలు చేద్దాం.. వాటిని ఇతర భాషల్లో రీమేక్ చేసేలా చేద్దాం. నేను నటించిన ఆరు సినిమాలు ప్రస్తుతం ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయి. మరో రెండేళ్లలో ప్యాన్ ఇండియా అనే మాట వినిపించదు. ఓటీటీ వల్ల ప్రపంచంలోని అన్ని భాషల చిత్రాలను సబ్ టైటిల్స్‌తో చూస్తున్నాం.. భవిష్యత్‌లో వాటి ఆదరణ పెరిగినప్పుడు ప్యాన్ ఇండియా అనే మాట వినిపించదు. ►ఓటీటీ అనేది సినిమాల ప్రదర్శనకు మరో వేదిక. కొత్త కథా చిత్రాలు వస్తున్నప్పుడు ఇండస్ట్రీ కూడా అప్‌గ్రేడ్ అవుతుంది. పోటీ పడి మంచి కథలతో మనం కూడా సినిమాలు తీస్తాం. ఓటీటీ వల్ల థియేటర్లు మూతపడతాయి అనుకోవడం తప్పు. ప్రపంచంలో థియేటర్‌కి రీప్లేస్మెంట్ మరొకటి లేదు. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని ఈ ఏడాది థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నాం. ‘అంటే సుందరానికి’ సినిమా ఇచ్చే సౌండ్ మామూలుగా ఉండదు. ‘సీటీమార్, తలైవి’ చిత్రాలను ధైర్యంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి ఆ సినిమాలు చూడటంతోపాటు ఇంట్లో కుటుంబంతో కలసి మా ‘టక్ జగదీష్’ని కూడా చూడాలి. చదవండి: Mrunal Thakur: విరాట్ కోహ్లిని పిచ్చిగా ప్రేమించాను: హీరోయిన్ -
‘టక్ జగదీష్’ మూవీ రివ్యూ
టైటిల్ : టక్ జగదీష్ నటీనటులు : నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్, నాజర్, జగపతి బాబు, రావు రమేశ్, నరేశ్ తదితరులు నిర్మాణ సంస్థ : షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది దర్శకత్వం : శివ నిర్వాణ సంగీతం : తమన్ నేపథ్య సంగీతం: గోపీసుందర్ విడుదల తేది : సెప్టెంబర్ 10,2021(అమెజాన్ ప్రైమ్ వీడియో) విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తుంపు తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్ నాని. తొలి సినిమా 'అష్టా చమ్మా' మొదలు గత ఏడాదిలో విడుదలైన ‘వి’వరకు ప్రతి సినిమాలోనూ కొత్తదనం, కొత్త తరహా పాత్రలు పోషిస్తూ, తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేచురల్ స్టార్ నటించిన తాజా చిత్రం ‘టక్ జగదీష్’. తరచూ ప్రేమ కథా చిత్రాలతో అలరించే నాని.. తొలిసారి తెలుగింటి కుటుంబ కథను ఎంచుకున్నాడు. నానికి ‘నిన్నుకోరి’ లాంటి సూపర్ హిట్ అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు వినాయకచవితి సందర్భంగా శుక్రవారం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. . టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ఈ ‘టక్ జగదీష్’ ఏ మేరకు అందుకున్నాడో రివ్యూలో చూద్దాం. టక్ జగదీష్ కథేంటంటే భూదేవిపురం గ్రామానికి చెందిన టక్ జగదీష్ అలియాస్ జగదీష్ నాయుడుకి కుటుంబం అంటే అమితమైన ప్రేమ. ముఖ్యంగా మేనకోడలు చంద్రమ్మ(ఐశ్వర్య రాజేష్)అంటే జగదీష్‌కి ప్రాణం. తన తండ్రి ఆదిశేషు హఠాన్మరణం చెందడంతో ఇంటి బాధ్యలతను అన్నయ్య బోసు (జగపతి బాబు)కి అప్పగించి పై చదువుల కోసం పట్నానికి వెళ్తాడు జగదీష్. అయితే తనకు తెలియకుండా వేరే వ్యక్తితో మేనకోడలు పెళ్లి చేస్తారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసకోని జగదీష్ గ్రామానికి వస్తాడు. ఈ లోగా తన కుటుంబంలో సమస్యలు వచ్చి అందరూ విడిపోతారు. గ్రామ ప్రజలు కూడా జగదీష్ కుటుంబంపై ద్వేషం పెంచుకుంటారు. అసలు తన కుటుంబాన్ని ఆ ఊరి ప్రజలు ఎందుకు ద్వేషిస్తున్నారు? అమితంగా ఇష్టపడే మేన కోడలు పెళ్లి జగదీష్‌కు తెలియకుండా ఎవరితో, ఎందుకు చేశారు? పదిమందికి ఆదర్శంగా ఉండే ఆదిశేషు కుటుంబంలో వచ్చిన సమస్య ఏంటి? దాన్ని జగదీష్ ఎలా పరిష్కరించాడు? ఇందులో రీతు వర్మ పాత్ర ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే? ఎప్పటి మాదిరే నాని తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. జగదీష్ నాయుడు అనే బరువైన పాత్రని అవలీలగా పోషించేశాడు. ముఖ్యంగా ఎమ్మార్వో జగదీష్ నాయుడిగా అదరగొట్టేశాడు. హీరో అన్నయ్య బోసు పాత్రలో జగపతి బాబు జీవించేశాడు. చాలా కాలం తర్వాత జగపతి బాబు అన్నయ్య పాత్రను పోషంచి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో తండ్రి ఆదిశేషు నాయుడిగా నాజర్ తనదైన నటనతో మెప్పించాడు. వీఆర్వో గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో రీతూవర్మ చక్కగా ఒదిగిపోయింది. హీరో మేనకోడలు చంద్ర పాత్రలో ఐశ్యర్య రాజేశ్ పర్వాలేదనిపించింది. అలాగే రావు రమేశ్, నరేశ్, మాలపార్వతి, రోహిని, దేవదర్శిని తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఎలా ఉందంటే.. గ్రామీణ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబం కథతో తెరకెక్కిన చిత్రమే ‘టక్ జగదీష్’. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు శివ నిర్వాణ. ఇప్పుడు టక్ జగదీష్‌తో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రుచి చూపించాడు. కుటుంబం, ఆస్తి తగాదాలు, ఊర్లో భూ గొడవలు కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే ఇలాంటి నేపథ్యం ఉన్న చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. టక్ జగదీష్‌లో కొత్తగా చూపించిదేమి లేదు. పైగా మేనకోడలు బాధ్యత, ఎమ్మార్వో ఉద్యోగం, హీరోకి ఓ ప్రేమ కథ.. అంటూ చాలా పెద్ద స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు. రెండున్నర గంటల్లో ఇంత పెద్ద కథను తెరపై చూపించడం కొంచెం కష్టమే. అయినప్పటికీ.. కథలోని ప్రతి పాత్రకు ఓ జస్టిఫికేష్ ఇస్తూ చాలా క్లారిటీగా చేప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఫ్యామిలీ ఒరియెంటెడ్ సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడనే చెప్పాలి. కానీ కమర్షియల్ కంటెంట్ లేకపోవడం సినిమాకు కాస్త మైనస్. ‘అయినోళ్లకంటే ఆస్తులు పొలాలు ఎక్కువకాదు..రక్త సంబంధం విలువ తెలుసుకో’, ‘మగవాడు ఏడవకూడదు.. అమ్మాయిలను ఏడిపించకూడదు’ లాంటి డైలాగ్స్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక సాంకేతిక విషయాకొస్తే.. తమన్ పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా.. గోపీసుందర్ నేపథ్య సంగీతం అదిరిపోయింది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫి బాగుంది. పల్లెటూరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో రావడం ప్లస్ పాయింటనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఫ్యామిలీ డ్రామాలు వచ్చి చాలా కాలమైంది. పైగా ఓటీటీలో సినిమా అందుబాటులో ఉండడం.. ‘టక్ జగదీష్’కి కలిసొస్తుందనే చెప్పాలి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఎగ్జిబిటర్లు అలా అన్నప్పుడు బాధేసింది: నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజాగా నాని మీడియాతో ముచ్చటించారు. ♦ థియేటర్లో నన్ను నేను చూసుకోవడం కూడా మిస్ అవుతున్నాను. గత ఏడాది‘వీ’సినిమాతో వచ్చాను. ఈ సారి ‘టక్ జగదీష్’ చిత్రంతో వస్తున్నాను. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతే ఇలా రావాల్సి వచ్చింది. ఎప్పుడైతే అంతా సెట్ అవుతుందో థియేటర్లోకి వచ్చేందుకు రెడీగా చాలా సినిమాలు ఉన్నాయి. ♦ నేను ఏదో సినిమా డబ్బింగ్ పనుల్లో ఉన్నప్పుడు శివ ఫోన్ చేశారు. ఓ కథను చెప్పాలని అన్నారు. అప్పటికే మజిలీ సూపర్ హిట్ అయి ఉంది. మళ్లీ అలాంటి కథే చెబుతారేమో అనుకున్నాను. ఆ జానర్ అయితే వద్దని చెబుదామని అనుకున్నాను. ఇలా ఫోన్లో నో చెప్పడం ఎందుకు.. నేరుగా చెబుదామని అనుకున్నాను. అప్పటికీ కథ అంతా కూడా పూర్తి కాలేదు. కానీ ఓపెనింగ్ లైన్ చెప్పాడు. భూదేవీపురం, భూమి తగాదాలు అని చెప్పారు. ♦ నాజర్ లాంటి పెద్ద మనిషి వాయిస్ వినిపిస్తుంది.. అరేయ్ జగదీష్.. మగవాడు ఏడవకూడదు.. అమ్మాయిలను ఏడిపించకూడదు అని చెబుతాడు. అలా చెప్పడంతోనే కనెక్ట్ అయిపోయాను. ఇంత వరకు సంబంధం లేని జానర్‌ను టచ్ చేయబోతోన్నాడని తెలిసింది. శివ నిర్వాణ ఎమోషన్‌ను బాగా హ్యాండిల్ చేయగలరు. అలాంటి వారు ఫ్యామిలీ సినిమాలను ఇంకా బాగా చేయగలరు. ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. దానికి శివ నిర్వాణ దర్శకుడు అవ్వడం ఇంకా హ్యాపీ. ♦ ఈ సినిమా అనుకున్నప్పుడు టైటిల్ ‘టక్ జగదీష్ కాదు’. అది క్యారెక్టర్ పేరు. ఇందులో ప్రతీ ఒక్క పాత్రకు మంచి మంచి క్యారెక్టర్ పేర్లు ఇచ్చారు. శివ నిర్వాణలో నాకు అదే నచ్చుతుంది. ఆయన చూసిన, తెలిసిన ఫ్యామిలీ మెంబర్ల పేర్లు పెడతాడు. అందుకే అవి రియలిస్టిక్‌గా ఉంటాయి. అదే పెద్ద బలం. అలా నాకు జగదీష్ అని పెట్టారు. అయితే దానికి టక్ అని ముందు పెట్టారు. అతను టక్ ఎందుకు వేసుకుంటాడు అనేది ద్వితీయార్థంలో రివీల్ చేస్తారు. అది శివ ఎంతో అద్బుతంగా రాశారు. ఆ సీన్‌కు ఎంతో మంది కనెక్ట్ అవుతారు. ♦ ఫ్యామిలీ డ్రామాలో ఉన్న కాంప్లెక్సిటీని ముందు శివ నిర్వాణ చెప్పారు. నేను దాన్ని ట్విస్ట్‌గా అనుకోవడం లేదు. మర్డర్ మిస్టరీలో ఉండే ట్విస్టులు కావు. మనం ఓ వ్యక్తిని ఒకలా అనుకుంటాం. కానీ అతను అలాంటివాడు కాదని తెలుస్తుంది. దాన్ని కథలో అందంగా తీసుకొచ్చారు శివ నిర్వాణ. ♦ రీతూ వర్మ ఏమో లవ్ ఇంట్రెస్ట్. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉన్న సినిమాలో రీతూ వర్మ ఓ రిలాక్స్‌లా అనిపిస్తుంది. ఈ కథ, డ్రామాకు ఆయువు పట్టు ఐశ్వర్య రాజేష్ పాత్ర. చంద్రమ్మ పాత్రలో ఐశ్వర్య కనిపిస్తారు. చంద్రమ్మ కోసం టక్ ఎంత దూరం వెళ్తాడన్నదే కథ. ♦ ఫ్యామిలీలో ఉండే అన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. కానీ ఈసినిమాకు ముందుండే రెండు ఎమోషనల్ క్యారెక్టర్స్ అన్నదమ్ములు. బోసు, జగదీష్ మధ్య ఉండే సంఘర్షణను శివ నిర్వాణ ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేసేశారు. హీరో ఎంత తపన పడతాడో అనే యాంగిల్లోనే తెలుగు సినిమాలుంటాయి. కానీ హీరో నాన్న యాంగిల్లోంచి చూడరు. కానీ శివ నిర్వాణ సినిమాలో ప్రతీ క్యారెక్టర్లోకి వెళ్తారు. అందువల్లే ప్రతీ పాత్ర హైలెట్ అవుతుంది. ♦ నాని ఫాస్ట్‌గా సినిమాలు రెడీ చేస్తున్నాడు. ఫస్ట్ వేవ్‌లో ఒకటి, సెకండ్ వేవ్‌లో మరొకటి వచ్చాయి. మిగతా వాళ్ల సినిమాలు రెడీగా లేవు. అందుకు ఎగ్జిబిటర్లు అలా అన్నప్పుడు బాధేసింది. థియేటర్లు సెట్ అయితే.. నేను మూడు సినిమాలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాను. టక్ జగదీష్ వెళ్లిపోతోందని వారు బాధపడుతున్నారు. కానీ మీరు రెడీ అంటే.. రెండు మూడు సినిమాలు ఇచ్చేందుకు నేను కూడా రెడీగా ఉన్నాను. పరిస్థితులు బాగా లేకపోయినా కూడా ప్యాండమిక్ సమయంలోనూ ఎంతో కష్టపడ్డాం. ఇలాంటి సమయంలోనూ ఫ్యామిలీ అంతా ఇంట్లోనే కూర్చుని చూసే మంచి సినిమా ఇస్తున్నాను. ఇక ఈ ప్యాండిమక్ సమయంలో నా సినిమాల వల్ల ఎంతో మందికి పని దొరికింది. రేపు థియేటర్లు రెడీ అవ్వగానే శ్యాం సింఘరాయ్ కూడా ఉంది. ఇంతకంటే ఏం కావాలి. ఎలా చెప్పాలి. ♦ ఓటీటీ అనేది ఆడియెన్స్‌ను ఎడ్యుకేట్ చేస్తుంది. తద్వారా ఇండస్ట్రీ కూడా అప్‌గ్రేడ్ అవుతుంది. సినిమాలకు మరో ఫ్లాట్ ఫాంలా ఉంటుంది. అన్ని రకాలుగా మంచిదే. అయితే థియేటర్లు అనేది ఎప్పటికీ ఉంటుంది. థియేటర్లు మూతపడతాయి అని అనుకునేవాళ్లకు వాటి గొప్పదనం తెలియదన్నట్టే. థియేటర్లను కొట్టే ఆప్షన్ ప్రపంచంలో లేదు. ♦ ఇంటర్వెల్ కార్డ్ పడటం లేదని చాలా బాధపడ్డాను. అమెజాన్ వాళ్లు అలా వేయరు అని తెలుసు. అయితే ట్విట్టర్లో షేర్ చేస్తాను. ఆ ఫ్రేమ్ ఇంటర్వెల్ అని చెప్పేందుకు పోస్ట్ చేస్తాను. అమెజాన్ వారు ఇంటర్వెల్ ఇవ్వకపోయినా నేను ఇస్తాను. ♦ ఎంటర్టైన్మెంట్ అంటే మనల్ని ఎంగేజ్ చేయడం. అంతే కానీ కేవలం కామెడీనే కాదు. రెండున్నర గంటలు మీరు సినిమాను చూసి.. దాంట్లోనే ఇన్వాల్వ్ అయి బయటకు వచ్చారనుకోండి. అది ఎంటర్టైన్మెంట్. నటుడిగా అన్ని రకాల సినిమాలు, పాత్రలు చేయాలి. నటుడు అంటే ఏంట్రా.. వాళ్లు ఏడిస్తే మనం ఏడవాలి.. వాళ్లు నవ్వితే మనం నవ్వాలి అనే మాటలు చిన్నతనంలో విన్నాను. అది అలా నాటుకుపోయింది. ‘పిల్ల జమీందార్, భలే భలే మగాడివోయ్’ వంటి సినిమాల్లో ఎప్పుడూ మిస్ అవ్వలేదు. ♦ ‘అంటే సుందరానికీ’ అనే సినిమాలో సీటులో ఎవ్వరూ కూర్చుండలేరు. వస్తే అలాంటి సినిమాతో రావాలి. నవ్వించిన సినిమాలు, ఏడిపించిన సినిమాలున్నాయి. కంప్లీట్ యాక్టర్ అన్న ఫీలింగ్ వస్తుంది. అన్ని రకాల సినిమాలు చేయాలి.. నన్ను నేను పరీక్షించుకోవాలి. చాలెంజింగ్ ఉన్న పాత్ర ఇస్తేనే నాకు కథకు ఓకే చెప్పాలనిపిస్తుంది. శ్యాం సింఘరాయ్ అద్భుతంగా ఉండబోతోంది. ఇకపై కొత్త నానిని చూస్తారు. అంటే సుందరానికీ ఫస్ట్ లుక్ చూస్తేనే షాక్ అవుతారు. ♦ సూపర్ సక్సెస్ అవుతుందని తెలిసి కూడా వదిలేసిన సినిమాలున్నాయి. అందులో రాజా రాణి ఒకటి. నేను అట్లీని ఇంట్రడ్యూస్ చేయాల్సింది. కానీ అప్పుడు నేను పైసా, ఎటో వెళ్లిపోయింది మనసు చేస్తున్నాను. నాకోసం ఏడాది ఆగడం మంచిది కాదు అని నిర్మాతలకు చెప్పాను. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని, పెద్ద దర్శకుడు అవుతాడని కూడా చెప్పాను. అలానే అయింది. ఇక ఎఫ్ 2 కథ సైతం విన్న వెంటనే బ్లాక్ బస్టర్ అని చెప్పాను. నా కోసం అనిల్, దిల్ రాజు గారు నాతో అనుకున్నారు. కానీ అది నా స్పేస్ కాదని అనుకున్నాను. ♦ నాకు రీమేక్స్ సరిపోవు. రీమేక్స్ చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. కెరీర్ ప్రారంభంలో చేశాను. భీమిలి కబడ్డీ జట్టు, ఆహా కళ్యాణం చేశాను. ఇప్పటికీ భీమిలీ కబడ్డీ జట్టు సినిమాకు అభిమానులున్నారు. కానీ ఆహా కళ్యాణం అంతగా ఆడలేదు. రీమేక్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. నాలో ఉందని నాకే తెలియందని, మీకు కొత్తగా చూపించాలనే ఆలోచనలకు రీమేక్ సరిపోవు. మనం సినిమాలు చేద్దాం. మన సినిమాలను వాళ్లు రీమేక్ చేసేలా చేద్దాం. ఇప్పుడు నా ఆరు సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయి. ♦ టక్ జగదీష్ సినిమా తెలుగు ప్రేక్షకుల కథ. తెలుగు కుటుంబాలకు సంబంధించిన కథ. ఇది రీమేక్ అయ్యే చాన్స్ లేదు. ఇది తెలుగు సినిమా మాత్రమే. అమెజాన్‌లో ఈ సినిమాను సబ్ టైటిల్స్‌లో ఇతర భాషల వారు చూసి.. బాగుందని అంటే చాలు. ♦ సీటీమార్, తలైవి అద్భుతంగా విజయం సాధించాలి. అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుని థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడండి. అలాగే టక్ జగదీష్ చిత్రాన్ని కూడా చూడండి. -
నానిలోనాకు బాగా నచ్చిన విషయం అదే : రీతూ వర్మ
‘టక్ జగదీష్’కచ్చితంగా థియేటర్ సినిమానే. బిగ్ స్క్రీన్‌లో చూసిన ఎక్స్ పీరియన్స్ వేరేలా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు ఓటీటీ నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ కచ్చితంగా థియేటర్లో చూసిన ఫీలింగ్‌ను మాత్రం మిస్ అవుతాం’అన్నారు హీరోయిన్ రీతూ వర్మ. నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘టక్ జగదీష్’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా రీతూ వర్మ చెప్పిన విశేషాలు.. ► ఇప్పటి వరకు చేసిన పాత్రలు, సినిమాల్లో కెల్లా ఇది ప్రత్యేకం. పూర్తిగా కమర్షియల్ సినిమాలో నటించాను. ప్రభుత్వాధికారిగా గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో నటించాను. గవర్నమెంట్ ఆఫీసర్‌గా తన అధికారాన్ని చూపించే పాత్ర అది. పాత్రలో చాలా అమాయకత్వం కూడా ఉంటుంది. మనసులో ఏముంటే అదే మాట్లాడే అమ్మాయి. ట్రెడిషన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి.. తాను కరెక్ట్ అనుకునే దాని కోసం పోరాడే పాత్రలో నటించాను. ► ఇది కచ్చితంగా థియేటర్ సినిమానే. బిగ్ స్క్రీన్‌లో చూసిన ఎక్స్ పీరియన్స్ వేరేలా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ కచ్చితంగా థియేటర్లో చూసిన ఫీలింగ్‌ను మాత్రం మిస్ అవుతాం. ఇప్పుడు ఓటీటీ కూడా మంచి ఫాంలో ఉంది. లాక్డౌన్ సమయంలో ఓటీటీ మీద మనం ఆధారపడ్డాం. అదే మనకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీలో టక్ జగదీష్ సినిమా విడుదలవుతుండటంతో ఒకేసారి ఎంతో మంది చూసే అవకాశం ఉంది. ► సాధారణంగా సిటీ అమ్మాయిని. ఎప్పుడూ కూడా గ్రామాల్లోకి వెళ్లలేదు. ఉండలేదు. కానీ నేను మనుషులను ఎక్కువగా గమనిస్తుంటాను. ఎక్కడో చూసిన విషయాలు అలా గుర్తుండిపోతాయి. పైగా నేను దర్శకుడు చెప్పింది చేసే నటిని. ఈ పాత్ర కోసం శివ నిర్వాణ గారే ఇన్ పుట్స్ ఇచ్చేశారు. ఆ పాత్రకు సంబంధించిన క్యాస్టూమ్ ధరించగానే పాత్రలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. ► నానితో ఇది రెండో సారి నటించడం. మొదటగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించాను. కానీ అందులో నాది చిన్న పాత్ర. అంతగా ఇంటరాక్షన్ అవ్వలేదు. నేను కూడా అప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఈ సారి మాత్రం నానితో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. ఎంతో నేర్చుకున్నాను. సినిమా, జీవితం వంటి వాటి మీద నానికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. నాని మాట్లాడితే అలా వినాలనిపిస్తూనే ఉంటుంది. అయనెంతో సపోర్ట్ చేశారు. ► నాని సెల్ప్ మేడ్ స్టార్. ఆయన గ్రాఫ్ అలా పెరుగుతూనే వస్తోంది. ప్రతీ సినిమాతో ప్రేక్షకుడికి ఏదో ఒక కొత్త ఫీలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. నానిలో నచ్చిన విషయం అదే. ఎవడే సుబ్రహ్మణ్యంలో నాని, టక్ జగదీష్‌లో నానికి ఉన్న వ్యత్యాసం చెప్పేంత స్థాయి నాకు లేదు. నాని నటన అంటే ఇష్టం, ఆయన ఎంచుకునే కథలు ఇష్టం. మరోసారి ఆయనతో కలిసి నటించాలని ఉంది. ► టక్ జగదీష్ కమర్షియల్ సినిమా అయినా కూడా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఓవర్ యాక్షన్, డ్రామా సీన్లు ఉండవు. సటిల్ యాక్షన్ ఉంటుంది. ఇందులో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. ప్రతీ క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. యూనిక్‌గా ఉంటుంది. కచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ► శివ నిర్వాణ సినిమా అంటే ఎమోషన్స్ కచ్చితంగా ఉంటాయి. నిన్నుకోరి, మజిలి సినిమాలు చూసినప్పుడు శివ నిర్వాణ గారితో పని చేయాలని అనుకున్నాను. నాకు డ్రామా ఎమోషనల్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ► టక్ జగదీష్‌లో కామెడీ కూడా ఉంటుంది. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. నానికి, నాకు ఉన్న సీన్స్‌లోనూ చిరునవ్వును తీసుకొస్తుంది. టక్ జగదీష్ తరువాత ఇంకా మంచి ఆఫర్లు వస్తాయని ఆశిస్తున్నాను. ఈ మూవీతో ఓ వర్గం ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాను. నేను ఎక్కువగా అర్బన్ ఫిల్మ్స్, మల్టీ ప్లెక్స్ సినిమాలు చేశాను. కానీ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గరవుతాను. ►ఓ నటిగా నేను భిన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటాను. అయితే నా పాత్రకు ఏ మాత్రం ప్రాముఖ్యత ఉందని చూస్తాను.. నా పాత్ర కథకు బలమైందిగా ఉందా? లేదా? అని ఆలోచిస్తాను. అంతే కానీ నేను పలాన పాత్రలను చేయను అని ఏమీ లేదు. అన్ని రకాల పాత్రలను చేసేందుకు నేను సిద్దంగానే ఉన్నాను. ►వరుడు కావలెను అక్టోబర్‌లో రిలీజ్ కానుంది. ఆ తరువాత ద్విభాష చిత్రం ఒకే ఒక జీవితం, మరో తమిళ సినిమాకు సైన్ చేశాను. వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుగుతున్నాయి. నాకు డ్యాన్సులు చేయడం, పాటలు పాడటం, ఎంజాయ్ చేసే పాత్రలను పోషించడం అంటే ఇష్టం. కానీ నాకు ఎక్కువగా అలాంటి అవకాశాలు రాలేదు. కానీ వరుడు కావలెనులో వచ్చింది. ►ప్రస్తుతానికి అయితే నటన మీదే దృష్టి పెట్టాను. కానీ నాకు సినిమాలు తీయాలని ఉంది. ఓటీటీ కోసం చిన్న సినిమాలను తీయాలని అనుకుంటున్నాను. కో ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను. ►తినడం ఇష్టం. వంటలు వండటం కూడా ఇష్టం. కానీ అప్పుడప్పుడే వండుతాను. అమ్మ మాంసాహారి, నాన్న శాకాహారి. నేను రెస్టారెంట్లకు ఎక్కువగా వెళ్తాను.. వెరైటీ ఫుడ్లను టేస్ట్ చేస్తుంటాను. -
టక్ జగదీష్ : 'ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు'
‘‘టక్ జగదీష్’ టైటిల్ చూడగానే కథ చాలా సరదాగా ఉంటుందనుకుంటారు. కానీ ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో ఉండే భావోద్వేగాలన్నీ ఉన్నాయి. తప్పకుండా మా సినిమా ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది’’ అని చిత్రదర్శకుడు శివ నిర్వాణ అన్నారు. నాని, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘టక్ జగదీష్’. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదలవుతోంది. శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబం కథతో ఓ సినిమా చేయాలనేది నా కోరిక.. అది ‘టక్ జగదీష్’తో నెరవేరింది. ఈ సినిమా ఐడియాని నానీకి చెప్పినప్పుడు ‘చాలా బాగుంది, కథ రెడీ చెయ్.. చేద్దా’మన్నారు. ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే కథ ఇది. ఓటీటీ వల్ల విజిల్స్, క్లాప్స్ మూమెంట్స్‌ని మిస్ అవుతాం. అయితే ఒక మైనస్ ఉన్నప్పుడు మరికొన్ని ప్లస్‌లు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ థియేటర్స్‌కి రాలేరు.. అదే ఓటీటీలో కుటుంబమంతా కలసి ఇంట్లోనే చూసే అవకాశం ఉండటం హ్యాపీ. నా తర్వాతి చిత్రం విజయ్ దేవరకొండ హీరోగా ఉంటుంది’’ అన్నారు. చదవండి : ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన ముక్కు అవినాష్ ‘జోర్ సే’ అంటూ మాస్ స్టెప్పులతో అదరగొట్టిన మెగా మేనల్లుడు -
ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే!
లాక్డౌన్లో షూటింగ్‌లు, థియేటర్లు వాయిదా పడటంతో ఇంటికే పరిమితమైన ప్రేక్షకులకు టైంపాస్ లేక ఇబ్బందులు పడ్డారు. ఓటీటీ వేదిక సినిమాలు చూస్తూ అలా గడిపేశారంతా. ఇక పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే మెల్లిమెల్లిగా థియేటర్లు, షూటింగ్‌లు తిరిగి పున: ప్రారంభమయ్యాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోగా మళ్లీ సినిమాల సందడి మొదలైంది. అయితే సెకండ్ వేవ్ తర్వాత తెరచుకున్న థియేటర్లో విడుదలైన సినిమాలేవి అంతగా అలరించలేకపోయాయి. ఇటీవల పెద్ద సినిమాల హీరోలు తమ షూటింగ్‌లను పూర్తి చేసుకోవడంతో ప్రస్తుతం అవి విడుదలకు సిద్దమయ్యాయి. దీంతో ఈ వారం వినాయక చవితికి ప్రేక్షకులకు బోలేడంత వినోదం పంచేందుకు థియేటర్లు, ఓటీటీల వేదిక భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు పలు చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఆ సినిమాలేవో ఓసారి చూద్దాం రండి.. థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు: థియేటర్లో ఈలల వేయించేందుకే వస్తున్న ‘సీటీమార్’ హీరో గోపిచంద్-తమన్నా ప్రధాన పాత్రలో సంపత్ నంది దర్శకత్వంతో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సిటీమార్’. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లో విడుదలయ్యేందుకు సిద్దమైంది. ఇప్పటికే వేసవి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. వినాయక చవితి సందర్భంగా సందడి చేసేందుకు రానుంది. ఇందులో గోపీచంద్ ఆంధ్రా ఫీమేల్ కబడ్డీ టీం కోచ్‌గా, తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీం కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమా, రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన బయోపిక్ ‘తలైవి’ దివగంత నటి జయలలిత జీవితం ఆధారంగా రూపొందింన ‘తలైవి’ చిత్రం కూడా సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం భాషల్లో థియేటర్లో విడుదల కానుంది. విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇందులో కంగనా జయలలితగా కనిపించనుండగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి, ఆయన భార్యగా మధుబాల అలరించనున్నారు. జయలలిత తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎలా ఎదిగారు? ఎంజీఆర్‌కు ఎలా దగ్గరయ్యారు? తమిళ రాజకీయాల్లో ప్రవేశించి ఏవిధంగా చక్రం తిప్పారన్న విషయాలను బిగ్‌స్రీన్‌పై చూడోచ్చు. చదవండి: ఇకపై కృతిశెట్టితో సినిమాలు చేయను : విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి-శృతీ హాసన్ ‘లాభం’ విజయ్ సేతుపతి-శృతి హాసన్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తమిళ చిత్రం ‘లాభం’. సెప్టెంబరు 9న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ చిత్రం అదే పేరుతో తెలుగులో కూడా విడుదల కానుంది. ఇందులో జగపతి బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి రైతులకు మద్ధుతుగా నిలబడతాడు. పి.అరుముగకుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఇమ్రాన్ సంగీతం అందించారు. జాతీయ రహదారి లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాల ఇతివృత్తంలో తెరెక్కించిన సినిమా ‘జాతీయ రహదారి’. ‘1940లో ఒక గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’, ‘లజ్జ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహిచిన దర్శకుడు నరసింహ నంది ఈ మూవీని రూపొందించాడు. మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 10న థియేటర్లో విడుదల కానుంది. ఓటీటీ వేదికగా అలరించున్న చిత్రాలు, సిరీస్‌లు: నాని ‘టక్ జగదీష్’ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్, కుటుంబ కథా చిత్రం టక్ జగదీష్. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌లు కథానాయికులు. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ సెప్టెంబర్ 10న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైం వీడియోస్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఇటీవల ఈ సినిమా విడుదల విషయంలో వివాదంలో నెలకొన్న సంగతి తెలిసిందే. థియేటర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం చివరకు ఓటీటీ బాట పట్టింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో జగపతి బాబు, నాజర్, నరేశ్, రావురమేశ్, రోహిణిలు కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. అవికా గోర్, రాహుల్ రామకృష్ణ ‘నెట్’ రాహుల్ రామకృష్ణ, అవికాగోర్‌లు లీడ్ రోల్ నటించిన చిత్రం ‘నెట్’. భార్గవ్ మాచర్ల దర్శకుడు. సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా సెప్టెంబరు 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో లక్ష్మణ్ అనే పాత్రలో రాహుల్ రామకృష్ణ కనిపించనుండగా... అవికాగోర్.. ప్రియ అనే అమ్మాయి పాత్ర షోషించింది. అశ్లీల చిత్రాలు వీక్షించే రాహుల్ చివరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సీక్రెట్ కెమెరాల ద్వారా ప్రియ ప్రైవేట్ లైఫ్‌ని వీక్షించిన రాహుల్ చిక్కుల్లో పడటానికి కారణమేమిటి? ప్రియ జీవితాన్ని సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరించింది ఎవరు? తెలియాలంటే ‘నెట్’ చూడాల్సిందే. చదవండి: 'సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు' ముంబై డైరీస్ 26/11 ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా మరో కొత్త సిరీస్ అలరించనుంది. ‘ముంబై డైరీస్ 26/11’ పేరుతో తెరకెక్కిన ఈ మెడికల్ థ్రిల్లర్ సెప్టెంబరు 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమింగ్ కానుంది. కొంకణ సేన్ శర్మ, మోహిత్ రైనా, శ్రేయా ధన్వంతరిలు కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను నిఖిల్ అడ్వాణీ, నిఖిల్ గోన్సల్వేస్‌లు తెరకెక్కించారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ల్లో సీరియల్ సిరీస్ ప్రసారం కానుంది. 26/11 ముంబయి దాడుల సమయంలో వైద్యులు, విలేకరులు, పోలీస్ ఫోర్స్ ఏవిధంగా పనిచేసిందనే నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరక్కించారు దర్శకుడు. విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ విజయ్ సేతుపతి మరో చిత్రం తుగ్లక్ దర్భార్ వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న టెలివిజన్‌లో ప్రసారం కానుంది. ఆయన లీడ్ రోల్లో తెరకెక్కిన తమిళ పొలిటికల్ మూవీ ‘తుగ్లక్ దర్బార్’. రాశీ ఖన్నా, మంజిమా మోహన్ కథానాయికలు. దిల్లీ ప్రసాద్ దీనదయాళన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సెప్టెంబరు 10న సన్ టీవీ నేరుగా ప్రసారం చేయనుంది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ► లూలా రిచ్ (సెప్టెంబర్ 10) ఆహా! ► ద బేకర్ అండ్ ద బ్యూటీ ( సెప్టెంబర్ 10) ► మహాగణేశా ( సెప్టెంబర్ 10) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ► అమెరికన్ క్రైమ్‌స్టోరీ (సెప్టెంబర్ 08) నెట్‌ఫ్లిక్స్ ► అన్‌టోల్డ్: బ్రేకింగ్ పాయింట్ (సెప్టెంబర్ 07) ► ఇన్ టు ది నైట్ (సెప్టెంబర్ 08) ► బ్లడ్ బ్రదర్స్ (సెప్టెంబర్ 09) ►మెటల్ షాప్ మాస్టర్స్ (సెప్టెంబర్ 10) ► లూసిఫర్ (సెప్టెంబర్ 10) ► కేట్ (సెప్టెంబర్ 10) జీ 5 ► డిక్కీ లూనా (సెప్టెంబర్ 10) ► క్యా మేరీ సోనమ్ గుప్తా బెవాఫా హై (సెప్టెంబర్ 10) వూట్(VOOT) ► క్యాండీ (సెప్టెంబర్ 08) -
Tuck Jagadish: ఆ పరిస్థితి లేదు.. అందుకే ఓటీటీకి వెళ్లాం
థియేటర్ కోసమే టక్‌జగదీష్ సినిమాను ప్లాన్ చేశాం. ఏప్రిల్‌లో విడుదల చేద్దామంటే కరోనా వచ్చింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంది. త్వరలోనే థర్డ్ వేవ్ అంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితిలో సినిమాను జనాలకు వరకు తీసుకొస్తామా? లేదా? ఇంకెప్పుడు చూపిస్తామని అందరం కలిసి ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం’అన్నారు నిర్మాత సాహు గారపాటి. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టక్ జగదీష్’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం.సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజాగా నిర్మాత సాహు గారపాటి మీడియాతో ముచ్చటించారు. ►మజిలీ తరువాత ఈ చిత్రం మొదలైంది. మజిలీ సినిమాలో భార్యాభర్తల మధ్య ఉండే ఎమోషన్స్ తీశాం. ఇంకాస్త పెద్ద స్కేల్లో ఎమోషన్స్ ఉండాలని అనుకున్నాం. శివ గారు టక్ జగదీష్ కథ చెప్పారు. ఈ కథకు మంచి యాక్టర్ కావాలని అనుకున్నాం.. అప్పుడు మాకు నాని గుర్తుకు వచ్చారు. మా బ్యానర్ ప్రారంభమైంది కూడా ఆయనతోనే. ఆయనకు టక్ జగదీష్ కథ చెప్పాం.. నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు. ఇప్పటి వరకు ఆయన పోషించని పాత్ర ఇది. ► ప్రతీ ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండాలని అనుకునేలా టక్ జగదీష్ ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్ మీదే ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలు తక్కువయ్యాయి. అందుకే మేం ఇలాంటి కథతో వచ్చాం. ప్రేక్షకులందరూ మంచి సినిమా చూశామని అనుకుంటారు. సినిమా నిడివి రెండు గంటల ఇరవై నిమిషాలు. ద్వితీయార్థం మొత్తం కూడా ఎమోషన్స్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ►ఇది ఫ్యామిలీ ఎమోషన్ సినిమా. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. కానీ అది చాలా తక్కువ. అక్కా తమ్ముడు, అమ్మ కొడుకు ఇలా అందరి మధ్య ఎమోషన్స్ ఉంటుంది. కంటెంట్ ఎక్కడా దారి తప్పకుండా ఉండేందుకు ఎంటర్టైన్మెంట్ అంతగా జొప్పించలేదు. కానీ కథకు తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ►ఇది భారీ బడ్జెట్ చిత్రం. ఈ లెక్కన అన్ని చోట్లా థియేటర్లు తెరిచి ఉండాలి. కానీ పరిస్థితులు అలా లేనందుకే ఓటీటీకి వెళ్లాం. ఎస్ఆర్ కళ్యాణ మండపం రిజల్ట్ వల్ల మా అభిప్రాయం మారలేదు. ఆగస్ట్‌లో మేం థియేటర్‌కు రావాలని అనుకున్నాం. కానీ పరిస్థితులు చక్కబడే అవకాశం ఉన్నట్టు మాకు కనిపించలేదు. అందుకే ఓటీటీ నిర్ణయాన్ని తీసుకున్నాం. ► హీరోలైనా, నిర్మాతలైనా ఎవ్వరైనా సరే.. సినిమాను జనాలకు చూపించాలనే అనుకుంటారు. ఇది జనాలకు పండుగ నాడు చూపించాల్సిన సినిమా. ►ప్రస్తుతం ఎక్కడా కూడా పరిస్థితులు చక్కబడలేదు. మన పక్క రాష్ట్రాల్లో కూడా ఇంకా అంతగా థియేటర్లు తెరవలేదు. విదేశాల్లోనూ పరిస్థితులు అలానే ఉన్నాయి. అందుకే ఎక్కువ మందికి ఈ సినిమాను రీచ్ అయ్యేలా చేసేందుకు ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది. ►రెండు మూడు నెలల్లో అన్ని పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం, ఆశ ఉంది. ఆ నమ్మకం ఉంటేనే బతకగలుగుతాం. మిగతా సినిమాలను కూడా రెడీ చేస్తున్నాం. ►అందరు హీరోలతో కలిసి పని చేయాలని అనుకుంటాం. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అని కాకుండా అందరితో చేయాలని అనుకుంటాం. అనిల్ రావిపూడి బాలయ్య ప్రాజెక్ట్‌ను దసరాకు ప్రకటిస్తాం. నాగ చైతన్యతో కూడా ఓ సినిమా ఉంది. విజయ్ దేవరకొండ బిజీగా ఉండటంతో సినిమా కుదరడం లేదు ఇంకా కొంచెం సమయం పడుతుంది. ►బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ చేయాల్సిందే. కానీ శివ, గోపీ సుందర్ మధ్య మంచి ర్యాపో ఉంది. మజిలీ, నిన్ను కోరి సినిమాలకు గోపీ సుందర్ సంగీతం అందించారు. కాబట్టి గోపీ సుందర్ నుంచి ఇంకా బాగా తీసుకోగలను అనే నమ్మకంతో శివ నిర్వాణ ఉన్నారు. అందుకే అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాలు చూడడానికి వేరే కొత్త మీడియమ్స్ వచ్చాయి. థియేటర్లు కూడా ఉంటాయి. మా ప్రయార్టీ ఎప్పుడూ కూడా థియేటర్లే. -
‘టక్ జగదీష్’ నుంచి నాని ఫస్ట్ సింగిల్
నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టక్ జగదీష్’. ఈ సినిమా సెప్టెంబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ సాంగ్ విడుదలైంది. ‘సల్లాటి కుండలో సల్ల సక్క మనసువాడు. నువ్వు గిల్లి గిచ్చి రెచ్చగొడితే వచ్చి దంచుతాడు’ అంటూ సాగే ఈ పాటను నాని కోసం స్పెషల్‌గా ట్యూన్ కట్టించాడట దర్శకుడు. చదవండి: అలా అయితే నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా.. నాని సంచలన వ్యాఖ్యలు ఈ పాట ద్వారా ‘టక్ జగదీష్’ గుణగణాల్ని వర్ణిస్తున్నాడు శివ నిర్వాణ. అంతేగాక ఈ పాటను శివ నిర్వాణ స్వయంగా రాసి పాడటం విశేషం. కాగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తండ్రి ఆశయాన్ని నెరవేర్చే తనయుడిగా నాని కనిపించనున్నాడు. ఇక ఆయన అన్నయ్య పాత్రలో విలక్షణ నటుడు జగపతిబాబు నటించాడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌లు కథానాయికులుగా నటిస్తున్నారు. -
అలా అయితే నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా.. నాని సంచలన వ్యాఖ్యలు
Nani Tuck Jagadish: ‘‘టక్ జగదీష్’లో కొత్త ట్విస్ట్‌లు, కొత్త విశేషాలు ఉంటాయని నేను చెప్పను. మనం ఎలాంటి సినిమాలను అయితే చూస్తూ పెరిగామో, ఇప్పుడు ఎలాంటి సినిమాలను మిస్ అవుతున్నామో అలాంటి సినిమా ‘టక్ జగదీష్’. మన ఇల్లులాంటి సినిమా. ఇందులో అన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి’’ అన్నారు నాని. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని, రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరో హీరోయిన్లుగా సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన చిత్రం ‘టక్ జగదీష్’. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఈ నెల 10న ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుకలో నాని మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ బుధవారం విడుదలైంది కానీ ఆల్రెడీ ఇంతకు ముందే కొంతమంది చూశారు. చూసినవారికి కళ్లలో నీళ్లు తిరిగాయి. కుటుంబ సంబంధ బాంధవ్యాలను శివ బాగా చూపిస్తారు. ‘టక్ జగదీష్’ ఆ విషయంలో నెక్ట్స్ లెవల్. సినిమాలను థియేటర్స్‌లో చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. సినిమాలను ఎంతగానో ప్రేమించే మేం కూడా మా సినిమాని ఓటీటీలో విడుదల చేస్తున్నామంటే అందుకు కారణం పరిస్థితులే. ప్రేక్షకులు మా ‘టక్ జగదీష్’ను ఆదరిస్తానే నమ్మకం ఉంది’’ అన్నారు. చదవండి : మరికాసేపట్లో ఈడీ విచారణకు హాజరుకానున్న ఛార్మీ ‘ఓటీటీ ప్లాట్ఫామ్లో ‘టక్ జగదీష్’ విడుదల కావడం పట్ల కొందరు అభ్యంతరం చెబుతున్నారు. వారికి మీ సమాధానం? అనే ప్రశ్నకు... ‘‘వాళ్లంటే నాకు చాలా గౌరవం. వాళ్లున్న పరిస్థితుల్లో వాళ్లు అలా రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు. వారి కష్టాన్ని, పరిస్థితులను నేను అర్థం చేసుకోగలను. కాకపోతే జగదీష్‌నాయుడు (‘టక్ జగదీష్’ లో నాని పాత్ర), నేనూ వాళ్ల ఫ్యామిలీయే. నన్ను బయటివాడిగా చూడటం బాధ అనిపించింది. నా సినిమాను ఆపేస్తామని కూడా అన్నారట. నిజంగా బయట క్లిష్టమైన పరిస్థితులు లేనప్పుడు నా సినిమా థియేటర్స్‌లో విడుదల కాకపోతే అప్పుడు ఎవరో నన్ను బ్యాన్ చేయాలనుకోవడం కాదు.. నన్ను నేనే బ్యాన్ చేసుకుంటాను’’ అన్నారు నాని. శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘థియేటర్లో మా సినిమా విడుదల కావడం లేదని తెలిసినప్పుడు కలిగిన బాధ నాకు, నానీకి మాత్రమే తెలుసు. థియేటర్లో విడుదల చేసి, ఏమైనా తేడా వస్తే మా (నాని, శివ నిర్వాణ) పారితోషికంలోంచి కట్ చేసుకోమని చెప్పాం కూడా. ఐదు నెలలు రిలీజ్ కోసం వెయిట్ చేశారు నిర్మాతలు. పరిస్థితులు ఇంకా మారడం లేదు. అందుకే ఓటీటీ రిలీజ్ నిర్ణయం తీసుకున్నారు’’ అన్నారు. నటులు ప్రవీణ్, తిరువీర్ పాల్గొన్నారు. చదవండి : టక్ జగదీష్ ట్రైలర్ వచ్చేసింది -
టక్ జగదీష్ ట్రైలర్ వచ్చేసింది
Tuck Jagadish Trailer: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం 'టక్ జగదీష్'. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. 'నిన్ను కోరి' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. భూదేవి కొడుకు గురించి ఒక కథ చెప్పాలి అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో నాయుడుగారి అబ్బాయి టక్ జగదీష్గా నాని తన లుక్‌తో, పర్ఫామెన్స్తో, ఎమోషనల్ సీన్స్‌తో అదరగొట్టాడు. 'అయినోళ్ల కంటే ఆస్తులు, పొలం ఎక్కువ కాదు, రక్త సంబంధం విలువేంటో తెలుసుకోరా..' అంటూ నానికి మంచి విషయాలు బోధిస్తున్నాడు అతడికి అన్నయ్య పాత్రలో నటించిన జగపతిబాబు. 'భూ కక్షలు లేని భూదేవిపురం చూడాలనేది మా నాన్న కోరిక, ఇప్పుడది నా బాధ్యత', 'నా కుటుంబం ఓడిపోతే నేను ఓడిపోయినట్లే' అంటున్నాడు నాని. కుటుంబం అంటే పిచ్చిగా ప్రేమించే హీరోకు ఎదురైన సమస్యలేంటి? అతడి తండ్రి చనిపోవడానికి కారణమేంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. -
అఫీషియల్ ప్రోమో: అమెజాన్‌లో 'టక్ జగదీష్'
Tuck Jagadish On Amazon Prime: 'నిన్ను కోరి' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత నాని- శివ నిర్వాణ కలయికలో తెరకెక్కిన చిత్రం టక్ జగదీష్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ గత కొంతకాలంగా వార్తలు ఊపందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే నిజమని క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. సెప్టెంబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో టక్ జగదీష్ ప్రసారం కాబోతుందంటూ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 'పండగకు మన ఫ్యామిలీతో..' అంటూ చిన్నపాటి ప్రోమోను సైతం హీరో నాని రిలీజ్ చేశాడు. ఇందులో నాని 'నాయుడుగారి అబ్బాయి టక్ జగదీష్ చెబుతున్నాడు.. మొదలెట్టండి' అంటూ ఫ్యాన్స్‌కు ఇప్పటినుంచే సంబరాలు మొదలెట్టమని సంకేతాలిస్తున్నాడు. ఈ సినిమా వినాయక చవితి రోజు ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని చూడొచ్చని కొందరు సంబరపడుతుంటే, థియేటర్ ఫీల్ మిస్ అవుతాం అని మరికొందరు ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. పండగ కి మన Family తో... మీ#TuckJagadish pic.twitter.com/sVVjSCsJlB — Nani (@NameisNani) August 27, 2021 -
మూవీ థియేటర్స్ అసోసియేషన్‌పై టాలీవుడ్ నిర్మాతల ఫైర్
సినిమాల విడుదలపై థియేటర్స్ అసోసియేషన్, ఎగ్జిబిటర్స్ అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘టక్ జగదీశ్’ ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకోవడంతో మూవీ థియేటర్స్ అసోసియేషన్ సభ్యులు నిర్మాతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎగ్జిబిటర్ల వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్మాత దిల్ రాజు, ఠాగూర్ మధు సహా పలువురు అగ్ర నిర్మాతలతో కూడిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా థియేటర్స్ అసోసియేషన్, ఎగ్జిబిటర్స్ తీరుపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: ఆ వీడియోలోని వ్యక్తి నేను కాదు.. జో బైడెన్ మీద ఒట్టు!: వర్మ ఈ మేరకు నిర్మాతల గిల్డ్ స్పందిస్తూ.. సినిమా థియేటర్స్ అసోసియేషన్ వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొంది. సినిమాపై పూర్తి హక్కు, అధికారం నిర్మాతలకే ఉంటుందని, తమ సినిమా ఎక్కడ, ఎప్పుడు విడుదల చేసుకోవాలో వారి ఇష్టమని వెల్లడించింది. ఎగ్జిబిటర్లు... డిమాండ్ ఉన్న పెద్ద సినిమాలపైనే దృష్టి పెడుతున్నారని, చిన్న సినిమాలను విస్మరిస్తున్నారని నిర్మాతల గిల్డ్ ఆరోపించింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లందరూ కలిసి ఉంటేనే సినీ పరిశ్రమ మనుగడ సాధ్యమవుతుందని సూచించిన నిర్మాతల గిల్డ్... కలిసి కట్టుగా పనిచేసి తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధికి పాటుపడదామని ప్రకటనలో కోరింది. చదవండి: Karthikeya Engagement: ఘనంగా కార్తికేయ నిశ్చితార్థం -
‘నాని సినిమాల్లోనే హీరో.. నిజ జీవితంలో పిరికివాడు’
సాక్షి, హైదరాబాద్: నాని నటించిన టక్ జగదీష్ ప్రాజెక్ట్‌ను ఓటీటీల్లో విడుదల చేయడంపై ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీ చిత్రం ఓటీటీలో విడుదల చేయడంపై థియేటర్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్‌పై చర్చించేందుకు థియేటర్ల యజమానులు శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా థియేటర్ల యజమానులు మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల లవ్‌స్టోరీ సినిమా విడుదల అవుతున్న రోజే నాని టక్ జగదీష్ ఓటీటీలో రావడం వల్ల అందరం నష్టపోతామని అన్నారు. రేపు కూడా ఇలానే చేస్తే భవిషత్తులో నిర్మాతలకు తాము డబ్బులు కట్టమని అన్నారు. చదవండి: టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్‌పై నాని కామెంట్స్ పండుగల సమయంలో కొత్త సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని, థియేటర్లో లవ్ స్టోరీ విడుదలకు తెలంగాణ ఎగ్జిబిటర్లుమద్దతు పలికారు. టక్ జగదీశ్ నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు, హీరో నానికి భవిషత్తు మేము ఏంటో చూపిస్తామన్నారు, తిమ్మరుసు ఆడియో వేడుకలో హీరో మాట్లాడిన తీరును బట్టి చూస్తే ఓటీటీ వాళ్ళు రూ. 4 కోట్లు ఎక్కువ ఇచ్చి తీసుకున్నట్లు తెలుస్తుందన్నారు, ‘సినిమా లేకుండా మనం లేమని, సినిమా మన సంస్కృతిలో భాగం నాని అన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఓటీటీ లో సినిమా చేస్తున్నాడు. హీరో నాని సినిమాల్లోనే హీరో.. నిజ జీవితం లో పిరికివాడు’ అని పేర్కొన్నారు. చదవండి: ఆ సీన్ చూసి వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్, వీడియో వైరల్ ఇదిలా ఉండగా నాని టక్ జగదీష్, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాలతో టాలీవుడ్లో ఓటీటీ, థియేటర్ల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాలు వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వీటిలో నాని టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ కానుండగా.. లవ్ స్టోరీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. -
Nani Tuck Jagadish: థియేటర్ల యాజమానుల అసంతృప్తి
కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా.. సినిమా థియేటర్లపై భారీ ప్రభావాన్ని చూపించింది. కోవిడ్ సెకండ్‌వేవ్ కారణంగా మూతపడ్డ థియేట్లు గత నెల 23 నుంచి తెరుచుకున్నప్పటికి పెద్ద సినిమాలేవి ఇంకా విడుదల కాలేదు. ఇప్పటికే జూలై 30న విడుదలైన తిమ్మరసు చిత్రం మంచి విజయం సాధించగా, రీసెంట్గా విడుదలైన ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమా మంచి వసూళ్లు సాధించింది. కరోనా నిబంధనల మేరకు 50 శాతం ఆక్యూపెన్సీతో ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ కాగా, వినాయక చవితికి వంద శాతం ఆక్యుపెన్సీతో కళకళలాడనున్నాయి. ఈ క్రమంలో వచ్చే నెలలో విడుదల కాబోయే నాని టక్ జగదీష్, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాల కారణంగా టాలీవుడ్లో ఓటీటీ, థియేటర్ల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాలు వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వీటిలో నాని టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ కానుండగా.. లవ్ స్టోరీ థియేటర్లలో విడుదలవుతుంది. ఈ క్రమంలో నాని నటించిన టక్ జగదీష్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓటీటీల్లో విడుదల చేయడంపై ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీ చిత్రం ఓటీటీలో విడుదల చేయడంపై థియేటర్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్‌పై చర్చించేందుకు థియేటర్ల యజమానులు శుక్రవారం మధ్యాహ్నం భేటీకానున్నారు. (చదవండి: టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్‌పై నాని కామెంట్స్) ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి హిట్ చిత్రాల దర్శకుడైన శివ నిర్వాణకు ‘టక్ జగదీష్’ సినిమా.. హ్యాట్రిక్ చిత్రం. పవర్ ఫుల్ కథతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా చిత్ర టీజర్ కూడా తెలియజేసింది. రీతూ వర్మ, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లు. జగపతిబాబు, నాజర్ వంటి వారితో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్ అయ్యేలా ఈ చిత్రం రూపొందింది. టీజర్ విడుదల తర్వాత సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి. బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన సినిమా అయినప్పటికి.. నిర్మాతలు ఓటీటీ బాట పట్టారు. ఈ నిర్ణయం పట్ల థియేటర్ల యజమానులు అసంతృప్తిగా ఉన్నారు. (చదవండి: ఓటీటీలోకి టక్ జగదీష్! అప్పుడే అంత లాభమా?) -
టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్‌పై నాని కామెంట్స్
హీరో నాని తాజా చిత్రం టక్ జగదీష్. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్దమైంది. అయితే ఓటీటీలో తన సినిమాను రిలీజ్ చేయడంపై నాని మొదటి నుంచి అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టక్ జగదీష్ ఓటీటీ విడుదలపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు నాని మాట్లాడుతూ.. ‘నా సినిమాను థియేటర్లోనే విడుదల చేయలనుకున్నాను. ఎందుకంటే సినిమాను థియేటర్లోనే చూడటానికే నేను ఇష్టపడతా. కానీ నిర్మాతలు ఈ సినిమాకు ఎక్కువ ఖర్చు చేశారు. దీంతో ఈ మూవీ విడుదలపై మేకర్స్ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమయంలో థియేటర్లో టక్ జగదీష్ విడుదల కావడం వల్ల వారిపై భారం పడే అవకాశం ఉంది. అందువల్లే వారిని నేను ఇబ్బంది పెట్టకూడదనుకుంటున్నాను. నా నిర్ణయాన్ని వాళ్లకే వదిలేస్తున్న. అయితే టక్ జగదీష్ ఎక్కడ విడుదలైన అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా టక్ జగదీష్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో 37 కోట్ల రూపాయలకు మేకర్స్‌తో ఢీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే 8 కోట్ల రూపాలయకు శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకున్నట్లు వినికిడి. అంతేగాక హిందీ డబ్బింగ్ రైట్స్‌కు మరో రూ. 5 కోట్లు, ఆడియో రైట్స్‌ను దక్కించుకునేందుకు ఆదిత్య మ్యూజిక్ రూ. 2 కోట్లు చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా టక్ జగదీష్ రూ. 52 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. -
వినాయక చవితికి థియేటర్లో సందడి చేసే భారీ చిత్రాలివే!
కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై ఎంతగా పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది మార్చిలో విధించిన లాక్డౌన్ కారణంగా 9 నెలల పాటు సినీ పరిశ్రమతో పాటు థియేటర్లు మూత పడ్డాయి. ఆ తర్వాత పాక్షికంగా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ప్రజలు బిగ్స్క్రిన్పై సినిమా చూసేందుకు భయపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటికి ప్రతి పండగలసందర్భంగా విడుదలయ్యే సినిమాల సందడి లేకుండా పోయింది. దీంతో ఓటీటీలోనే సినిమాలు చూడ్సాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే థియేటర్లు మెల్లిగా తెరుచుకుంటున్నాయి. వరసగా సినిమాలు థియేటర్లో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది తర్వాత మళ్లీ పండగ కళ తెచ్చేందుకు పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి. నాని టక్ జగదీష్, నాగ చైతన్య లవ్ స్టోరీ, రానా విరాట పర్వం, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్, నాగశౌర్య వరుడు కావలెను, గోపిచంద్ సీటీమార్ వంటి సినిమాలు వినాయక చవితి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్‌లో ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ చిత్రం ఉన్న నేపథ్యంలో ఆ లోపే ఈ హీరోలు తమ సినిమాలను విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. కాగా ఇటీవల టక్ జగదీశ్, సీటీమార్, లవ్‌స్టోరీతో పాటు మరిన్ని చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ప్రేక్షకులు అయోమంలో పడ్డారు. ఈ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలన్ని కూడా థియేటర్లోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే జూలై 30న విడుదలైన తిమ్మరసు చిత్రం మంచి విజయం సాధించగా, రీసెంట్గా విడుదలైన ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమా మంచి వసూళ్లు సాధించింది. కరోనా నిబంధనల మేరకు 50 శాతం ఆక్యూపెన్సీతో ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ కాగా, వినాయక చవితికి వంద శాతం ఆక్యుపెన్సీతో కళకళలాడనున్నాయి. ఈ క్రమంలో వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ నెలలో పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. -
ఓటీటీలోకి టక్ జగదీష్! అప్పుడే అంత లాభమా?
Tuck Jagadish Movie: కరోనా వల్ల చిత్రపరిశ్రమకు పెద్ద దెబ్బే పడింది. ఎప్పుడు షూటింగ్స్ పూర్తవుతాయో, ఎప్పుడు సినిమాలు రిలీజవుతాయో తెలియని పరిస్థితి దాపురించింది. ఒకవేళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా జనాలు థియేటర్లకు వచ్చి చూస్తారా? అన్నది కూడా సందిగ్ధంగానే ఉంది. ఈ క్రమంలో ఎన్నో చిన్న, పెద్ద సినిమాలు ఓటీటీని ఆశ్రయించాయి. నష్టం అన్న మాట రాకుండా మంచి డీల్ కుదుర్చుకుని ఎంతో కొంత లాభాన్ని ఆర్జిస్తున్నాయి. ఈ క్రమంలో నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా కూడా ఓటీటీలోకి వస్తుందంటూ మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమధ్య చిత్రయూనిట్ దీనిపై స్పందిస్తూ అవి వట్టి పుకార్లుగా కొట్టిపారేసింది. టక్ జగదీష్ థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ టక్ జగదీష్ ఓటీటీ ప్రసారం కానుందంటూ రూమర్లు వస్తూనే ఉన్నాయి. నిర్మాతలు డిజిటల్ రిలీజ్‌కు మొగ్గు చూపుతున్నప్పటికీ నాని మాత్రం ఒప్పుకోవడం లేదట. అయితే అమెజాన్ ప్రైమ్ రూ.37 కోట్లు ఆఫర్ ఇవ్వడంతో మేకర్స్ ఓటీటీలో విడుదల చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. శాటిలైట్ హక్కులను 8 కోట్లకు స్టార్ మా సొంతం చేసుకున్నట్లు వినికిడి. హిందీ డబ్బింగ్ రైట్స్‌కు మరో రూ.5 కోట్లు, ఆడియో రైట్స్‌ను దక్కించుకునేందుకు ఆదిత్య మ్యూజిక్ రూ.2 కోట్లు చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా టక్ జగదీష్ రూ.52 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ డీల్స్ నిజమేనా? నాని ఓ మెట్టు దిగి ఓటీటీకి ఓకే చెప్పాడా? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే! షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. -
రూమర్స్‌కు కేరాఫ్‌గా నాని ‘టక్ జగదీష్’
కరోనా పుట్టిస్తున్న వేవ్స్‌తో, టాలీవుడ్ లో అందరికంటే ఎక్కువగా నేచురల్ స్టార్ నాని ఇబ్బంది పడుతున్నాడు. గతేడాది నాని నటించిన ‘వీ’ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యేలా చేసింది ఈ మాయదారి మహమ్మారి. ఆ ఎఫెక్ట్ తో టక్ జగదీష్ ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని లాస్ట్ ఇయర్ ఫ్యాన్స్ కు మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకుంటున్నాయి. ఈ దశలో జులై 30న ఇష్క్, తిమ్మరుసు లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇదే జోష్ లో టక్ జగదీష్ కూడా న్యూ రిలీజ్ డేట్ ప్రకటిస్తాడని జోరుగా ప్రచారం సాగింది. జులై 30నే టక్ జగదీష్ కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాడని టాక్ వినిపించింది. కాని యూనిట్ ఇంకా విడుదల తేదీని ఖరారు చేయలేదు. ఇప్పుడుఆగస్ట్ 13న ఈ మూవీని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు అవకాశాలను పరిశీలిస్తున్నారని ప్రచారం సాగుతోంది. మరో వైపు టక్ జగదీష్ కూడా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గత ఏడాది నాని నటించిన వీ చిత్రాన్ని కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ సంస్థ ఇప్పుడు టక్ జగదీష్ చిత్రాన్ని 40 కోట్లకు కొనుగోలు చేసిందట. టక్ జగదీష్ ఓటీటీ డీల్ కూడా టీటౌన్ ను షేక్ చేస్తోంది. అయితే యూనిట్ మాత్రం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటోంది. -
'టక్ జగదీష్' : ఆ వార్తలను నమ్మకండి
నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్. ఈ చితంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్లోలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక టక్ జగదీష్ చిత్రం జులై 30న విడుదల కాబోతున్నట్లు గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. మూవీ రిలీజ్‌కు సంబంధించి వస్తున్న వార్తలను నమ్మవద్దని పేర్కొంది. ‘టక్ జగదీష్’ రిలీజ్ పై వస్తున్న వార్తలను రూమర్స్గా కొట్టిపారేసింది. మా సినిమా థియేటర్స్‌లోనే విడుదలవుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తాం అంటూ చిత్ర బృందం ప్రకటించింది. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు. -
టక్ జగదీశ్: త్వరలోనే రిలీజ్ డేట్..
నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌లు హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీశ్. షూటింగ్‌ను పూర్తి చేసుకుని ఏప్రిల్‌లో విడుదలకు సిద్దమైన ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉండగా మేకర్స్ త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితి వస్తుండటంతో త్వరలోనే థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో వీలైనంత త్వరలోనే టక్ జగదీశ్ మూవీని విడుదలకు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ విడుదల ఎప్పడేప్పుడా అని అభిమాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుచేత థియేటర్లు తెరుచుకోగానే తొలి చిత్రంగా టక్ జగదీశ్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారుట. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్, టీజర్, పాటలకు విశేష స్పంది వచ్చిన సంగతి తెలిసిందే. షైన్ పిక్చర్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం నానికి అన్నయ్యగా విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. -
ఓటీటీలో టక్ జగదీష్? రూమర్లకు చెక్
‘‘టక్ జగదీష్’ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారంలో వాస్తవం లేదు. థియేటర్లలోనే రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం స్పష్టం చేసింది. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘టక్ జగదీష్’. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే వార్తలు వచ్చాయి. దీనిపై చిత్రబృందం స్పందిస్తూ– ‘‘టక్ జగదీష్’ ఓటీటీలో రిలీజ్ కానుందనే వార్తలు అవాస్తవం. ఇది పూర్తిగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక సినిమా విడుదల తేదీ చెబుతాం’’ అని పేర్కొంది. ఈ చిత్రా నికి: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). -
Natural Star Nani: ‘టక్ జగదీష్’ రూమర్లపై క్లారిటీ
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టక్ జగదీశ్’.ఫ్యామిలీ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశంలో లేకపోడంతో విడుదల తేదిని ప్రకటించలేదు. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని ఇటీవల పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై స్పష్టత ఇచ్చింది చిత్ర బృందం. . టక్ జగదీష్ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేయడం లేదని, వదంతులు నమ్మవద్దంటూ టాలీవుడ్ ప్రముఖ పీఆర్వో బీఏ రాజు టీమ్ తెలిపింది. ఈ మేరకు ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. Natural Star 🌟 @NameisNani 's #TuckJagadish will release in THEATERS only!! Don't believe any rumours. — BARaju's Team (@baraju_SuperHit) May 27, 2021 చదవండి: నాగార్జున సినిమాలో యాంకర్ రష్మీ లవ్ మ్యారేజే, కాదంటే చంపుతా: అరియానా -
ఆ కారణంతోనే బాలీవుడ్ సినిమా చేయలేకపోతున్నా: నాని
Natural Star Nani: హీరో నాని ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస సినిమాలతో టాలీవుడ్లో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం టాక్సీ వాల ఫెమ్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి , ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో టాలీవుడ్లో సత్తా చాటుతున్న నానికి బాలీవుడ్ కూడా మూవీ చేయాలని ఉందట. కానీ, ఒకే ఒక కారణం చేత ఆయన బాలీవుడ్‌కి వెళ్లలేకపోతున్నాడట. హిందీ భాష రాకపోవడమే బాలీవుడ్ ఎంట్రీకి అడ్డంకిగా మారిందట. ‘నేను హిందీ మాట్లాడగలను కానీ, బాలీవుడ్ సినిమా చేసేందుకు నాకొచ్చిన హిందీ సరిపోదు. హిందీ సినిమా చేయాలంటే కథ నాకు బాగా నచ్చి, ఆ పాత్ర కోసం కష్టపడి హిందీపై పట్టు సాధించాలని నాకు అనిపించాలి. నాని బాలీవుడ్‌కి కొత్త అనే ఫీలింగ్ ప్రేక్షకులకు రాకుడదు. అలాంటి ప్రాజెక్ట్ వస్తే కచ్చితంగా బాలీవుడ్ సినిమా చేస్తా’ అని తన మనసులోని మాటను బయటపెట్టాడు నాని. కాగా, నాని నటించిన ‘వి’ సినిమా హిందీలోకి కూడా డబ్ అవ్వబోతోంది. ఈ సినిమాకొచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నాని, తన బాలీవుడ్ ఎంట్రీపై ఆలోచిస్తాడేమో చూడాలి మరి. -
సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : సమ్మర్ సినిమాలన్ని వాయిదా
సినిమాలకు బెస్ట్ సీజన్ అంటే నాలుగు... సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి. ఉగాది, క్రిస్మస్లకు కూడా సినిమాలు వస్తుంటాయి. అయితే వసూళ్లకు మొదటి నాలుగు పండగలే ప్రధానం. 2020లో సంక్రాంతి సందడి బాగానే సాగింది. అయితే కరోనా దెబ్బకు సమ్మర్ సంబరం మిస్సయింది. దసరా, దీపావళికి కూడా సినిమా పండగ లేదు. సంవత్సరాంతంలో మెల్లిగా సినిమాల విడుదల ఆరంభమైంది. 2021లో సంక్రాంతి సందర్భంగా వెండితెరకు బోలెడన్ని బొమ్మలు వచ్చాయి. కానీ ఈసారి కూడా సమ్మర్ సంబరం పోయే పోచ్! కరోనా సెకండ్ వేవ్‌తో వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. గత సమ్మర్‌కి మార్చి చివర్లో థియేటర్లకు లాక్‌పడింది.. ఈ సమ్మర్ కూడా సందడి మిస్. వేసవి సెలవులంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కాసులు కురిపించే రోజులు. పరీక్షలను పూర్తి చేసుకున్న విద్యార్థులు, తమ పిల్లలతో సరదాగా సమయం గడిపేందుకు పెద్దలు ప్రధానంగా ఎంచుకునేది థియేటర్స్‌లో సినిమా చూడడం. అందుకే సంక్రాంతి తర్వాత నిర్మాతలు ఎక్కువగా ఇష్టపడే సీజన్ సమ్మరే. కానీ కరోనా కారణంగా గత ఏడాది సమ్మర్‌కి బాక్సాఫీసు కుదేలయింది. ఈ సమ్మర్‌కి అయినా సినిమాల సందడి ఉంటుందనుకుంటే సెకండ్ వేవ్ కారణంగా ఈసారీ నిరాశే. మార్చి మొదటివారం నుంచి ఏప్రిల్ 9 వరకు థియేటర్స్ వంద శాతం సీటింగ్‌తో నడిచాయి. ఈ సమయంలో ‘వైల్డ్ డాగ్, వకీల్‌సాబ్, రంగ్ దే, జాతిరత్నాలు’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు షెడ్యూల్ అయిన సినిమాల్లో ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ (ఏప్రిల్ 16), నాని ‘టక్ జగదీష్’ (ఏప్రిల్ 23), కంగనా రనౌత్ ‘తలైవి’ (ఏప్రిల్ 23), రానా ‘విరాటపర్వం’ (ఏప్రిల్ 30) ఇప్పటికే అధికారికంగా వాయిదా పడ్డాయి. అలాగే మే నెలలో విడుదలకు షెడ్యూల్ అయిన పెద్ద చిత్రాల్లో చిరంజీవి ‘ఆచార్య’ (మే 13) కూడా వాయిదా పడింది. ఇవే కాదు.. వెంకటేశ్ ‘నారప్ప’ (మే 14), బాలకృష్ణ ‘అఖండ’ (మే 28), రవితేజ ‘ఖిలాడి’ (మే 28) చిత్రాలు విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఇలా ఈ సమ్మర్ కూడా వెండితెరపై బొమ్మ పడకుండా ముగిసిపోయేలా ఉంది. వెండితెర వెలవెల చలన చిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది వేసవికి సినిమా పండగ లేకుండాపోయింది. 2020 మార్చి 13న విడుదలైన సినిమాలు ఓ మూడు నాలుగు రోజులు థియేటర్లలో ఉండి ఉంటాయేమో! ఆ తర్వాత కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల సినిమా థియేటర్లకు లాక్ పడింది. 13న ఓ పది చిన్న సినిమాల వరకూ విడుదలయ్యాయి. వాటిలో ‘బగ్గిడి గోపాల్, మద, అర్జున’ వంటి సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత సినిమాల విడుదలకు బ్రేక్ పడటంతో సమ్మర్ సంబరం మిస్సయింది. ఈసారి కూడా అదే జరిగింది. ఏప్రిల్ 2న నాగార్జున ‘వైల్డ్ డాగ్’, 9న పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ విడుదలయ్యాయి. ఆ తర్వాత విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ వేసవి కూడా వెండితెర వెలవెలపోవడం సినీప్రియులకు బాధాకరం. నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి.. సినిమాని నమ్ముకున్న అందరికీ బాధాకరమే. ఓటీటీలో సినీ హవా తీసిన సినిమా హార్డ్ డిస్క్లోనే ఉండిపోతే నిర్మాతల హార్ట్ హెవీ అయిపోతుంది. పెరిగే వడ్డీలు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ఈ పరిస్థితుల్లో కొందరు చిన్న నిర్మాతలకు ‘ఓటీటీ’ ప్లాట్‌ఫామ్ ఓ ఊరట అయింది. గతేడాది లాక్డౌన్లో నేరుగా ఓటీటీలో విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘అమృతారామం’. సరిగ్గా ఏడాది క్రితం ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదలైంది. అప్పటినుంచి చిన్న, మీడియమ్ బడ్జెట్ చిత్రాలు బోలెడన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదలయ్యాయి. వాటిలో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘భానుమతి రామకృష్ణ’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’, ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘కలర్ ఫొటో’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ వంటి చిత్రాలులొచ్చాయి. ఇలా ఆ సమ్మర్ నుంచి ఈ సమ్మర్ వరకూ ఓటీటీలో విడుదలై, ఇంటికే వచ్చిన సినిమాలెన్నో. పరిస్థితులు చూస్తుంటే ఇకముందు కూడా ఓటీటీ హవా కొనసాగేలా ఉంది. స్మాల్.. మీడియమ్‌లు కూడా... వేసవిలో పెద్ద సినిమాలే కాదు..పెద్ద సినిమాల మధ్యలో చిన్న, మీడియమ్ బడ్జెట్ సినిమాలు కూడా విడుదలవుతాయి. ఆ సినిమాలు కూడా ఈసారి వాయిదా పడ్డాయి. అవసరాల శ్రీనివాస్ ‘నూటొక్క జిల్లాల అందగాడు’, తేజా సజ్జా ‘ఇష్క్’, శ్రీకాంత్ ‘తెలంగాణ దేవుడు’, సంతోష్ శోభన్ ‘ఏక్ మినీ కథ’ వంటి ఆ జాబితాలో ఉన్నాయి. అయితే ఏప్రిల్ 30న రిలీజ్‌కు సిద్ధమైన అనసూయ ‘థ్యాంక్యూ బ్రదర్’ అనూహ్యంగా ఓటీటీ బాట పట్టింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో మే 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సోలోగా.. ధైర్యంగా... గతేడాది వేసవి, దసరా, దీపావళి పండగలు సినిమాల సందడి లేకుండా వెళ్లిపోయాయి. సంవత్సరాంతంలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు ఆరంభమయ్యాయి. పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలి. ఆ బాధ్యతను ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్ తీసుకుంది. సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారా? వసూళ్లు ఏమాత్రం ఉంటాయి? వంటి సందేహాల నడుమ లాక్డౌన్ తర్వాత విడుదలైన తొలి పెద్ద సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా వాస్తవానికి గత మేలో విడుదల కావాల్సింది. లాక్డౌన్ వల్ల వాయిదా పడి, డిసెంబర్ 25న థియేటర్లకు వచ్చింది. చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్ వంటి స్టార్స్ కూడా థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా ప్రేక్షకులను కోరారు. అప్పటినుంచి మెల్లిగా సినీ పరిశ్రమ తేరుకుని, సినిమాల విడుదలకు ముందుకొచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి మంచి వసూళ్లతో టాలీవుడ్ కోలుకున్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది.