under water
-
ఇదేం జైలు రా సామీ..! ఏకంగా నీటి నడిబొడ్డున..
నీటి నడిబొడ్డునున్న ఈ కట్టడం ఒక చెరసాల. ఇది ఇస్టోనియాలోని వసలెమా పారిష్ పట్టణ సమీపంలోని రుమ్ము గ్రామంలో ఉంది. ఒకప్పుడు ఇక్కడ పాలరాతి గనులు, సున్నపురాతి గనులు ఉండేవి. సోవియట్ హయాంలో ఇక్కడ రుమ్ము, ముర్రు చెరసాలల్లో బందీలుగా ఉండే ఖైదీలతో ఈ గనుల్లో పనులు చేయించుకునేవారు. గని నుంచి వెలికి తీసిన సున్నపురాతిని శుద్ధి చేయడానికి చాలా నీటిని వాడేవాళ్లు. ఈ నీరు గనిని లోతుగా తవ్విన ప్రాంతంలోకి చేరి నిల్వ ఉండటం మొదలైంది. క్రమంగా ఈ నీరు ఖాళీ అయిపోయిన గని ప్రాంతమంతా నిండిపోయి, మడుగులా మారింది. చెరసాల చుట్టూ గనులు తవ్వడంతో ఇప్పుడు రుమ్ము చెరసాల భవనం నీటి మధ్యలో ఇలా మిగిలింది. ముర్రు చెరసాలను 2001లో రుమ్ము చెరసాలలో విలీనం చేశారు. తర్వాత ఈ చెరసాల 2012లో శాశ్వతంగా మూతబడింది. దీనిని చూడటానికి అప్పుడప్పుడు ఆసక్తిగల పరిశోధకులు, విద్యార్థులు ఇక్కడకు వస్తుంటారు.(చదవండి: బెట్టీ ద ఫ్యాషన్ క్వీన్) -
అక్కడే ఆరంభం.. రేపు మరో అద్భుతం ఆవిష్కృతం!
ఢిల్లీ: దేశంలోనే తొలిసారి నీటి అడుగున మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ చారిత్రక ఘట్టానికి కోల్‌కతా(పశ్చిమ బెంగాల్) మెట్రో వేదిక కానుంది. బుధవారం పశ్చిమబెంగాల్లోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గం మెట్రో సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మరి దీని ప్రత్యేకలు ఓసారి చూద్దాం.. ఈస్ట్‌వెస్ట్ మెట్రో కారిడార్‌లో.. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ స్టేషన్ల మధ్య ఈ రివర్ అండర్ గ్రౌండ్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మూడు స్టేషన్లు ఉన్నాయి. హౌరా మైదాన్, హౌరా స్టేషన్ కాంప్లెక్స్, బీబీడీ బాగ్ (మహాకరణ్). హూగ్లీ నదీ కింద భాగంలో కోల్‌కతా నుంచి నదీకి అవతలివైపు హౌరా మధ్య సుమారు 4.8 కిలోమీటర్ల దూరంతో ఈ అండర్‌గ్రౌండ్ ప్రయాణం సాగనుంది. నీటి ఉపరితలం నుంచి 32 మీటర్ల లోతున మెట్రో టన్నెల్ ఏర్పాటు చేయగా.. ప్రయాణానికి 45 సెకన్ల టైం పట్టనుంది. ఈ ఫీట్‌ను మోడ్రన్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా కోల్‌కతా మెట్రో అధికారులు అభివర్ణిస్తున్నారు. ఏడు నెలలపాటు ట్రయల్ రన్స్ జరిపారు. ఇప్పుడు రెగ్యులర్ ప్రయాణాలకు అనుమతికి రెడీ చేశారు. ఈస్ట్‌వెస్ట్ మెట్రో కారిడార్‌కు ఫిబ్రవరి 2009లో పునాది పడింది. అండర్ వాటర్ మార్గం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ప్రకృతి విపత్తుల్ని సైతం తట్టుకునేలా ఈ కారిడార్‌ను బ్రిటన్‌కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో నిర్మించారు. తాజా అండర్ గ్రౌండ్ ప్రాజెక్టుతో.. రోజూ ఈ మార్గంలో ఏడు లక్షల మంది ప్రయాణిస్తారని కోల్‌కతా మెట్రో రైల్ సీపీఆర్వో అంచనా వేస్తున్నారు ప్రధాని మోదీ మార్చి 6న మెట్రో సర్వీసులను ప్రారంభించగా.. మరుసటి రోజునుంచి ప్రయాణికులను అనుమతిస్తారు ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లకు పైనే పట్టింది. టన్నెల్ నిర్మాణాల వల్ల సమీప ప్రాంతాల్లోని నివాసాలు దెబ్బ తినగా.. అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యాయి. చివరకు.. స్థానికులను ఒప్పించి, పరిహారం చెల్లించి నిర్మాణం పూర్తి చేసింది మెట్రో రైల్ కోల్‌కతా. హౌరా మెట్రో స్టేషన్.. నీటి ఉపరితలానికి 16 మీటర్ల దిగువన మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. తద్వారా భారతదేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్‌గా రికార్డుల్లోకి ఎక్కనుంది. దేశంలో తొలిసారి 1984 అక్టోబర్ 24వ తేదీన కోల్‌కతాలోనే మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి. సుమారు 3.4 కిలోమీటర్ల దూరంలో ఐదు స్టేషన్లతో తొలి మెట్రో పరుగులు తీసింది నాడు. అదే నగరంలో ఇప్పుడు అద్భుతం ఆవిష్కృతం కానుంది. కోల్‌కతా ఈస్ట్‌వెస్ట్ మెట్రో మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా.. దీంట్లో 10.8 కి.మీ.లు భూగర్భంలో ఉంటుంది. ఇందులో కొంతభాగం హుగ్లీ నది కింద సొరంగంలో ఉండగా.. మిగిలినదంతా భూ ఉపరితలంపైనే. సొరంగం లోపల అడ్డుకొలత 5.55 మీటర్లు కాగా, బాహ్య అడ్డుకొలత 6.1 మీటర్లు. లండన్ప్యారిస్ కారిడార్‌లోని యూరోస్టార్ సర్వీసు మాదిరిగా రూపొందించిన సొరంగమార్గం ఇది. ఈ తరహా మెట్రో రూట్ ద్వారా.. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించినట్లు అవుతుందని మెట్రో అధికారులు అంటున్నారు. India's first underwater metro rail service - Howrah Maidan to Esplanade Metro Station will be inaugurated by PM Modi in Kolkata tomorrow. This will be the Deepest Metro Station and Metro line in India. pic.twitter.com/jRooRVvLMg — Rishi Bagree (@rishibagree) March 5, 2024 -
ఔరా అనిపించిన అండర్ వాటర్ డ్యాన్సర్
మన దేశ ఫస్ట్ అండర్‌వాటర్ డ్యాన్సర్ జయదీప్ గోహిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మైకేల్ జాక్సన్ ఫేమస్ ‘మూన్‌వాక్’ స్టెప్పులు నీటి గర్భంలో వేసి తన పెర్ఫార్మెన్స్తో నెటిజనులు ‘ఔరా’ అనుకునేలా చేశాడు. ‘ది ఇన్వెంటర్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో 3.6 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ‘వీఎఫ్ఎక్స్’ ఉపయోగించి సృష్టించిన వీడియో ఇది అని కొందరు యూజర్లు మొదట భ్రమ పడి, ఆ తరువాత నిజం తెలుసుకొని అబ్బురపడ్డారు. -
వాట్ ఏ టెక్నాలజీ.. ఈజీగా ఈత కొట్టేయొచ్చు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే తొలి అండర్‌వాటర్ కెమెరా ఇది. ఈత కొట్టేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్లు ప్రమాదాలకు గురైతే, ఈ కెమెరా వెంటనే గుర్తిస్తుంది. ఇందులోని డ్రౌనింగ్ డిటెక్షన్ సిస్టమ్ మునిగిపోతున్న వారిని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. ఇళ్లలోను, హోటల్స్‌లోను ఉండే స్విమింగ్‌పూల్స్‌లో ఉపయోగించడానికి ఇది పూర్తిగా అనువుగా ఉంటుంది. అమెరికన్ గృహోపకరణాలు, స్విమింగ్‌పూల్ రక్షణ పరికరాల తయారీ సంస్థ ‘కోరల్’ ఈ అండర్‌వాటర్ సెక్యూరిటీ కెమెరాను ‘మైలో’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ‘మైలో’ కెమెరా నిరంతరం స్విమింగ్‌పూల్‌ను కనిపెడుతూనే ఉంటుంది. ఈతకొడుతూ ఎవరైనా మునిగిపోతున్నట్లు గుర్తిస్తే, దీని యాప్ ద్వారా అనుసంధానమైన కుటుంబ సభ్యులు, సంబంధీకుల స్మార్ట్ఫోన్లకు తక్షణమే సమాచారం పంపుతుంది. దీని ధర 1499.15 డాలర్లు (సుమారు రూ.1.25 లక్షలు). (చదవండి: ఇలా కూడా నిద్రపోవచ్చా!..వర్క్‌ప్లేస్‌లో కూడా..) -
మాల్దీవ్స్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా! నిద్ర రాదేమో అంటూ..
Anand Mahindra Twitter Video: చాలామంది సెలబ్రిటీలు బాగా ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు వెళ్లిన కథనాలు గతంలో చాలా కథనాల్లో తెలుసుకుని ఉంటారు. అండర్ వాటర్ హౌస్‌లో స్టే చేయడం వంటి గొప్ప అనుభూతులు అక్కడ అనుభవించవచ్చని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే తాజాగా మాల్దీవులకు సంబంధించిన ఆనంద్ మహీంద్రా ఒక ట్వీట్ చేసారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ హోటల్ సూట్‌ను కలిగి ఉన్న ది మురాకా అనే హోటల్ వీడియోను పోస్ట్ చేశారు. అక్కడ ఒక రాత్రి కూడా గడపలేనని, రాత్రంతా గ్లాస్ పగుళ్ళకు వెతుకుతానని ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆరువేలకు పైగా లైకులు వచ్చాయి, చాలామంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. చాలామంది ఎంజాయ్ చేయడానికి ఇలాంటి ప్రదేశాలకు వెళ్లడం సహజం, కానీ ఆనంద్ మహింద్ర మాత్రం భయపడుతున్నట్లు ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. వీడియోలో మీరు గమనించినట్లతే వాటర్ లోపల ఒక రూమ్ ఉండటం, దాని చుట్టూ.. పైన చేపలు ఈత కొట్టడం వంటివి చూడవచ్చు. ఇది చూడటానికి బాగానే అనిపించినా.. ఎవరికైనా తప్పకుండా భయం పుడుతుంది. ఇదీ చదవండి: ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్ ఇక్కడ కనిపించే సూట్ 180 డిగ్రీల విశాల దృశ్యాలను చూపిస్తుంది. కావున మీరు ఆ గది లోపల నుంచి బయట తిరిగే జలచరాలను వీక్షించవచ్చు. ఇందులో కావలసిన సకల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఒక రాత్రి ఉండటానికి సుమారు రూ. 41 లక్షలు ఖర్చవుతుందని చెబుతారు. The Muraka was the Maldives’ and the world's, very first underwater hotel suite. I was sent this post with a suggestion that a stay here would ensure the most relaxed weekend rest. To be honest, I don’t think I would get a wink of sleep…I would stay awake looking for cracks in… pic.twitter.com/CkqUPNlPJs — anand mahindra (@anandmahindra) August 12, 2023 -
సస్పెన్స్ థ్రిల్లర్‌లా టైటాన్ రెస్క్యూ ఆపరేషన్
బోస్టన్: ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ ఓడ సందర్శన కోసం వెళ్లి గల్లంతయిన జలాంతర్గామి ‘టైటాన్’ జాడ ఇంకా తెలియరాలేదు. టైటాన్‌లోని ఐదుగురు సందర్శకుల పరిస్థితి ఏమిటన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వారి ఆచూకీ గుర్తించేందుకు అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి తమ కార్యాచరణను ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, సముద్ర అంతర్భాగం నుంచి శబ్దాలు వెలువడుతున్నట్లు కెనడా సైనిక నిఘా విమానం కనిపెట్టడం ఆశలు రేకెత్తిస్తోంది. టైటాన్ గల్లంతయినట్లు భావిస్తున్న ప్రాంతం నుంచి ప్రతి 30 నిమిషాలకోసారి బిగ్గరగా శబ్దాలు వెలువడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ శబ్దాలు టైటాన్‌కు సంబంధించినవేనా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టైటాన్లో కొంత ప్రాణవాయువు ఇంకా మిగిలే ఉందని, సందర్శకుల ప్రాణాలకు ఇప్పటికిప్పుడు అపాయం వాటిల్లకపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. గురువారం ఉదయానికల్లా ఆక్సిజన్ మాయం! టైటాన్ ఆచూకీ కోసం జాన్ కాబోట్, స్కాండీ విన్‌ల్యాండ్, అట్లాంటక్ మెర్లిన్ అనే మూడు పడవలను అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దించారు. టైటాన్ జలాంతర్గామి ప్రస్తుతం సముద్ర ఉపరితలం నుంచి 12,500 అడుగుల(3,800 మీటర్లు) లోతున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది సామాన్యమైన లోతు కాదు. అక్కడిదాకా సురక్షితంగా చేరుకోవడం కష్టమైన పని అని చెబుతున్నారు. అండర్‌వాటర్ రోబోను పంపించినట్లు తెలుస్తోంది. సహాయక చర్యల కోసం అమెరికా సైన్యానికి చెందిన మూడు సి–17 రవాణా విమానాలను పంపించినట్లు యూఎస్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ అధికార ప్రతినిధి చెప్పారు. ఒక పెట్రోలింగ్ విమానం, రెండు ఓడలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని కెనడా సైన్యం ప్రకటించింది. గురువారం ఉదయానికల్లా టైటాన్లో మొత్తం ఆక్సిజన్ ఖర్చయిపోతుంది. అప్పటిలోగా దాని జాడ తెలియకపోతే అందులోని సందర్శకులు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఈ జలాంతర్గామి టైటానిక్ దిశగా తన ప్రయాణం ప్రారంభించింది. సరిగ్గా నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే అందులో ఉంది. టైటాన్లో రెండు రకాల కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి. నీటిలోకి వెళ్లిన 1.45 గంటల లోపే అవి పనిచేయడం ఆగిపోయింది. క్షేమంగా రావాలంటూ.. టైటాన్ గల్లంతు కావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఐదుగురు సందర్శకులు క్షేమంగా తిరిగిరావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వివిధ దేశాల అధినేతలు పేర్కొన్నారు. సందర్శకుల క్షేమాన్ని కోరుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టైటాన్లో ఓషియన్గేట్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమిష్ హర్డింగ్, పాకిస్తాన్‌కు చెందిన తండ్రీకొడుకులు షహజాదా, సులేమాన్ దావూద్, ఫ్రెంచ్ నావికాదళం మాజీ అధికారి పాల్–హెన్రీ నార్జియోలెట్ ఉన్నారు. వీరంతా 1912లో అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడ శిథిలాలను సందర్శించడానికి టైటాన్ జలాంతర్గామిలో వెళ్లారు. ఆదివారం రాత్రి కెనడా తీరానికి 700 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ సముద్రంలో టైటాన్ గల్లంతయ్యింది. ఇదీ చదవండి: సాహస వీరుడు.. మహాసాగరంలో ఇరుక్కుని.. -
ఉత్తరకొరియా మళ్లీ అణ్వస్త్ర డ్రోన్ పరీక్ష
సియోల్: అణుధార్మిక సునామీని సృష్టించగల అండర్‌వాటర్ డ్రోన్‌ను మరోసారి విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా తెలిపింది. ఈ కొత్త రకం డ్రోన్ హెయిల్–2ను శుక్రవారం తీర నగరం టంచోన్ వద్ద సుముద్ర జలాల్లో ప్రయోగించినట్లు వెల్లడించింది. నీటి అడుగున ఇది 71 గంటలకు పైగా ప్రయాణించి నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని తెలిపింది. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను హెయిల్–2 తుత్తునియలు చేయగలదని అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ పేర్కొంది. -
ప్రొఫెసర్ సాహసం.. నీటి అడుగులో 100 రోజులు! అన్నీ అక్కడే..!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ కళాశాల ప్రొఫెసర్ ఓ పరిశోధన కోసం నీటి అడుగున నివసిస్తున్నారు. 55 చదరపు మీటర్ల నీటి ఆవాసం, ఉపరితలం నుండి దాదాపు 30 అడుగుల లోతున జీవిస్తున్నారు. మానవ శరీరం దీర్ఘ కాలంపాటు విపరీతమైన ఒత్తిడికి గురైతే ఎలా స్పందిస్తుందనే విషయంపై అధ్యయనంలో భాగంగా ఈ సాహసం చేస్తున్నారు. ఇది విజయవంతమైతే ఈయన సూపర్ హ్యూమన్‌గా అవతరించి అరుదైన ఘనత సాధించనున్నారు. వినూత్న పరిశోధన చేస్తున్న ఈ ప్రొఫెసర్ పేరు జోసెఫ్ డిటూరి. వయసు 55 ఏళ్లు. యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో బయోమెడికల్ ఇంజనీరింగ్ తరగతులను బోధిస్తున్నారు. ఇంతకుముందు 28 ఏళ్ల పాటు అమెరికా నౌకాదళంలో డైవర్‌గా పనిచేశారు. 2012లో కమాండర్‌గా పదవీ విరమణ చేశారు. అయితే గతంలో ఒకరు 73 రోజుల పాటు నీటి అడుగున జీవించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలుకొట్టి 100 రోజులు నీటిలోనే జీవించాలని జోసెఫ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రయోగం 30 రోజులకు పైగా పూర్తి చేసుకుంది. ప్రొఫెసర్ ఆరోగ్యాన్ని, ముఖ్యమైన అవయవాల పనితీరును వైద్యులు ఎప్పటికప్పడు నిశితంగా గమనిస్తున్నారు. అతని మానసిక పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే తరచూ వైద్య పరీక్షలు కూడా చేస్తూ ప్రొఫెసర్ ఆరోగ్యంపై డాక్యుమెంట్ రూపొందిస్తున్నారు. 'మిలిటరీలో తన తోటి సైనికులు చాలా మంది బాధాకరమైన మెదడు గాయాలకు గురయ్యారు. హైపర్బారిక్ ప్రెజర్ సెరిబ్రల్ రక్త ప్రవాహాన్ని పెంచుతుందని వారికి బాగా తెలుసు. మెదడు గాయాలకు చికిత్స చేయడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని భావిస్తున్నా. వారికి ఎలా సహాయం చేయాలో నేర్చుకోవాలనుకున్నా. సముద్రంలో కనుగొనబడని జీవులలో అనేక వ్యాధులకు చికిత్స దొరుకుతుందని అనుకుంటున్నా' అని ప్రొఫెసర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ ప్రయోగాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. ఇది విజయవంతం అయితే సరికొత్త విషయాలు తెలుస్తాయన్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు మాత్రం దీనిపై భిన్నంగా స్పందించారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇంత రిస్క్ చేయడం అవసరమా? అని కామెంట్ చేశారు. చదవండి: చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చిన అమెరికా..భారత్‌కే మద్దతు అని ప్రకటన -
ప్రకంపనలు రేపుతున్న ఉత్తర కొరియా ప్రకటన.. సునామీని పుట్టించే..
సునామీని పుట్టించే అణు సామర్థ్యమున్న అండర్ వాటర్ డ్రోన్ ‘హెయిల్’ను విజయవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా చేసిన ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. దీని సాయంతో భారీ సునామీలు పుట్టించి తీరంలో నౌకాశ్రయాలనూ, సముద్ర మధ్యంలో శత్రు నౌకలను నాశనం చేయగల సామర్థ్యం తమకు సమకూరిందని అది చెబుతోంది. అదే నిజమైతే రష్యా తర్వాత ఈ సామర్థ్యమున్న రెండో దేశమవుతుంది. ఇలాంటి డ్రోన్లను ప్రయోగిస్తే సముద్ర మట్టం అనూహ్యంగా పెరిగి పరిసర ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తుతుంది. దీనితో సముద్ర మధ్యంలో అయితే శత్రు నౌకలను నీట ముంచవచ్చు. అదే తీర ప్రాంతంలో ప్రయోగిస్తే సమీప నౌకాశ్రయాలతో పాటు నగరాలు, జనావాసాలు కూడా నామరూపాల్లేకుండా పోయే ప్రమాదముంది! కాకపోతే హెయిల్ను రష్యా అండర్ వాటర్ డ్రోన్ పొసెయ్డాన్తో ఏ మాత్రమూ పోల్చలేం. ఎందుకంటే అత్యాధునిక హంగులతో కూడిన పొసెయ్డాన్ను జలాంతర్గాముల నుంచీ ప్రయోగించవచ్చు. స్వయంచాలిత న్యూక్లియర్ ప్రొపెల్షన్ వ్యవస్థ సాయంతో ఎంతకాలమైనా ప్రయాణం చేయగల సత్తా దాని సొంతం. హెయిల్కు అంత సీన్ లేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్న దక్షిణ కొరియాను బెదిరించేందుకే ఇలాంటి ప్రకటన చేసి ఉండఉండవచ్చన్నది వారి విశ్లేషణ. అణు డ్రోన్‌ను పరీక్షించాం: ఉత్తర కొరియా భారీ రేడియో ధార్మిక సునామీని పుట్టించగల అణుసామర్థ్యంతో కూడిన అండర్ వాటర్ డ్రోన్ ‘హెయిల్’ను విజ యవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది! ఈ ఆందోళనకర పరిణామం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ‘‘ఈ డ్రోన్‌ను తీరం వద్ద మోహరించవచ్చు. నౌకలపై సముద్రం లోపలికి తీసుకెళ్లీ ప్రయోగించవచ్చు. నీటి లోపల ఇది సృష్టించే పేలుడు దెబ్బకు పుట్టుకొచ్చే రేడియో ధార్మిక సునామీ నౌకాశ్రయాలతో పాటు నడి సముద్రంలో శత్రు యుద్ధ నౌకలను కూడా తుత్తునియలు చేయగలదు’’అని ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ చెప్పుకొచ్చింది. ‘‘ఈ దిశగా మూడు రోజులుగా సాగుతున్న ప్రయోగాలను అధ్యక్షుడు కిమ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు’’అని తెలిపింది. టోర్పెడో వంటి పరికరం పక్కన కిమ్ నవ్వుతున్న ఫొటోను ఉత్తరకొరియా పత్రిక రొండొంగ్ సిన్మున్ ప్రచురించింది. ఆ పరికరమేమిటనేది వివరించలేదు. సముద్ర జలాలు ఉవ్వెత్తున లేచి పడుతున్న ఫొటోలను కూడా ముద్రించింది. ‘‘ఈ అలలు డ్రోన్ మోసుకెళ్లిన అణ్వాయుధం పేలుడు ఫలితం. మంగళవారం ప్రయోగించిన ఈ డ్రోన్ నీటి అడుగున 60 గంటల పాటు ప్రయాణించి, 150మీటర్ల లోతులో లక్ష్యాన్ని ఛేదించింది’’అని పేర్కొంది. 2012 నుంచి అభివృద్ధి చేస్తున్న ఈ డ్రోన్‌ను గత రెండేళ్లలో 50 సార్లకు పైగా పరీక్షించి చూసినట్లు తెలి పింది. అయితే ఉత్తర కొరియా ప్రకటనలో విశ్వసనీయ తపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హెయిల్ అంటే కొరియా భాషలో సునామీ. ఈ డ్రోన్ గురించి ఉత్తర కొరియా అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి! ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు మూల్యం తప్పదంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ పరీక్ష గురించిన ప్రకటన వెలువడింది! కొరియా సముద్ర జలాల్లో విమానవాహక నౌకలను మోహరిస్తామని అమెరికా ప్రకటించడం తెలిసిందే. పొసెయ్‌డాన్.. రష్యా డ్రోన్.. ► ఇది అణు సామర్థ్యమున్న సూపర్ టోర్పెడో. చరిత్రలో అతిపెద్ద టోర్పెడో కూడా ఇదే! నాటో దళాలు దీన్ని కాన్యాన్గా పిలిచే పొసెయ్డాన్ను టోర్పెడో, డ్రోన్ రెండింటి క్రాస్ బ్రీడ్‌గా చెప్పవచ్చు. తొలి జత పొసెయ్‌డాన్ టోర్పెడోలను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్టు గత జనవరిలో రష్యా స్వయంగా ప్రకటించింది. వీటిని బెల్ గొరోడ్ అణు జలాంతర్గామిలో మోహరిస్తామని పేర్కొంది. అయి తే పొసెయ్‌డాన్ తయారీ గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ 2018లోనే ప్రకటన చేశారు. ‘‘దీని రేంజ్ అపరిమితం. అంతేగాక సముద్రాల్లో అత్యంత అట్టడుగుల్లోకీ వెళ్లి దాడులు చేయ గల సత్తా దీని సొంతం. పైగా ప్రస్తుతమున్న అన్ని టోర్పెడోల కంటే కొన్ని రెట్లు ఎక్కువ వేగంతో, అదే సమయంలో ఏమా త్రం శబ్దం చేయకుండా దూసుకెళ్తుంది. తనంతతానుగా ప్రమాదాన్ని గుర్తించి ప్రయాణ మార్గాన్ని మార్చేసుకోగ లేదు. కనుక దీన్ని శత్రువు నాశనం చేయడం దాదాపుగా అసాధ్యం. సముద్రంలో దీన్ని ఎదుర్కోగల ఆయుధమే లేదు’’అని ధీమాగా పేర్కొన్నారు. రష్యాతో పాటు చైనా కూడా ఇలాంటివి తయారు చేసే పనిలో ఉందని అమెరికా అనుమానిస్తోంది. అయితే అమెరికా వద్ద ఇలాంటివి ఎప్పటినుంచో ఉన్నట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు! ► స్టేటస్–6 ఓషియానిక్ మల్టీపర్పస్ సిస్టంగా కూడా పిలిచే పొసెయ్‌డాన్ గురించి తెలిసింది చాలా తక్కువ. ► దాదాపు ఆరడుగుల వ్యాసార్థ్యం, 24 మీటర్ల పొడవు, 2 లక్షల పౌండ్ల బరువుండే దీన్ని అణు జలాంతర్గామి నుంచి ప్రయోగించవచ్చు. ► ఈ డ్రోన్లు ఎంత పెద్దవంటే అంతటి జలాంతర్గామిలో కేవలం ఆరంటే ఆరు మాత్రమే పడతాయట! ► ఇది అణు, సంప్రదాయ ఆయుధాలు రెండింటినీ మోసుకెళ్లగలదు. ► ఇందులో ఏకంగా ఓ అణు రియాక్టరే ఉంటుంది. దాని సాయంతో ఇది స్వయం చాలితంగా పని చేస్తుంది. ► పొసెయ్‌డాన్ శత్రు యుద్ధ నౌకలను, తీర ప్రాంతాల్లోని లక్ష్యాలను నాశనం చేస్తున్నట్టున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా రక్షణ శాఖ విడుదల చేసింది. ► అమెరికాలోని దాదాపు అన్ని తీర ప్రాంత నగరాలూ దీని పరిధిలోకి వస్తాయని రష్యా చెబుతోంది! ఏమిటీ అండర్ వాటర్ డ్రోన్? ► వీటిని ఒకరకంగా చిన్నపాటి మానవరహితజలాంతర్గాములుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సముద్ర గర్భంలో వరుస పేలుళ్ల ద్వారా అతి పెద్ద రాకాసి అలల్ని పుట్టించి పరిసర ప్రాంతాలను నీట ముంచేస్తాయి. ఇవి స్వయంచాలితాలు. యుద్ధనౌకలు, లేదా ఇతర ప్రాంతాల నుంచి కంప్యూటర్లు, సెన్సర్ల ద్వారా వీటిని నియంత్రిస్తుంటారు. ఇలాంటి అండర్‌వాటర్ డ్రోన్లు 1950ల నుంచే ఉనికిలో ఉన్నట్టు్ట్ట బార్డ్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ద డ్రోన్ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 250కి పైగా ఇలాంటి డ్రోన్లు వినియోగంలో ఉన్నట్టు అంచనా. మిలిటరీ డాట్‌కామ్ వివరాల మేరకు వీటిని జలాంతర్గాముల ద్వారా అమెరికా నేవీ 2015లో తొలిసారిగా మోహరించింది. ‘‘ఇది ప్రమాదకరమైన పనులెన్నింటినో అండర్‌వాటర్ డ్రోన్ గుట్టు గా చక్కబెట్టగలదు. ఒకవైపు వీటిని ప్రయోగించి శత్రు లక్ష్యాలను ఛేదించవచ్చు. శత్రువు దృష్టిని అటువైపు మళ్లించి ప్రధాన జలాంతర్గామి తన ప్రధాన లక్ష్యం మీద మరింత మెరుగ్గా దృష్టి సారించవచ్చు. అంటే రెట్టింపు ప్రయోజనమన్నమాట’’అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. -
సముద్రాన్నే నివాసంగా..నీటి అడుగున 100 రోజులు జీవించనున్న మనిషి
పురాణాల్లో వింటుంటాం సముద్రాల్లో నీటి అడుగున జీవించే మనుషుల గురించి. అంతేందుకు మహాభారతంలో దుర్యోధనడు నీటి అడుగున్న ధ్యానం చేయగల ధీరుడని విన్నాం. అవన్నీ వినడమే గానీ నిజంగా ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మాములుగా ఓడల్లో సముద్ర ప్రయాణాలు రోజుల తరబడి జరిగినప్పటికీ అది నీటిపైనే కానీ అడుగున కాదు. ఐతే నీటి అడుగున జీవించగలమా అక్కడ పరిస్థితులను మన శరీరీం తట్టుకోగలదా అనే దానిపై చాలా సందేహాలు శాస్తవేత్తలను మదిలో ప్రశ్నలుగా మిగిలాయి. ఈ నేపథ్యంలోనే ఎలాగైన వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఫ్లోరిడాకు చెందిన ప్రోఫెసర్ జో డిటూరి ఒక అసాధారణమైన ప్రయోగానికి నాంది పలికారు. బయో మెడికల్ ఇంజనీరింగ్ పీహెచ్డీ చేసిన డిటూరి అనేక వ్యాధులను నివారించగల మెడికల్ టెక్నాలజీపై కూడా పలు పరిశోధనలు చేశారు. ఈ మేరకు ఆయన సముద్రాన్ని మూడు నెలలపాటు తన నివాసంగా మార్చుకున్నాడు. అతను సముద్రంలోని 30 అడుగుల లోతుల్లో 100 రోజులు జీవించే ప్రయాగాన్ని నిర్వహించాడు. ఈ ప్రయోగానికి నెఫ్ట్యూన్ 100 అని పేరు పెట్టాడు. ఈ ప్రయోగం కోసం రిటైర్డ్ యూఎస్ నేవీ కమాండర్ ప్రోఫెసర్‌గా ఎంచుకున్నాడు. పనిలో పనిగా మనస్తత్వ వేత్త ఈ ప్రయోగాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. అంతరిక్ష పర్యాటనకు సమానమైన వాతావరణంలో ఉన్నప్పుడూ మనిషి మానసిక స్థితి, ప్రభావాలు ఎలా ఉంటాయనేద దానిపై వారు పర్యవేక్షిస్తారు. ఈ ప్రయోగం సక్స్స్ అయితే భూమిపై అనుభవించిన ఒత్తిడికి 1.6 రెట్ల ఒత్తిడిని అధిగమించి బతికిబట్టగట్ట గలిగితే ప్రపంచ రికార్డుగా నిలుస్తుంది. వాస్తవానికి మానవ శరీరం నీటి అడుగున ఇంత కాలం ఉండలేదని ప్రోఫెసర్ డిటూరి అన్నారు. కాబట్టి నా శరీరం ఏమౌవుతోందో అనేది అధ్యయనాలకు ముఖ్య భూమికగా ఉపయోగపడుతుంది. అలాగే నా శరీరాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశం పరిశోధనకు ఉపకరిస్తుంది. ఒకవేళ నీటి అడుగున ఒత్తిడిని ఎదుర్కొనగలిగితే తన ఆరోగ్యం మరింత మెరుగుపడే అవకాశాలు ఉంటయని చెబుతున్నారు. ఈ మేరకు డిటూరి ఈప్రయోగాన్ని మార్చి1న ప్రారంభించారు. ఐతే తాను సూపర్ హ్యుమన్‌గా బయటకు వస్తానో లేదో అనేది కాస్త సందేహంగానే ఉందన్నారు. View this post on Instagram A post shared by Joe Dituri (@drdeepsea) (చదవండి: ఇమ్రాన్ ఖాన్ ఇలా కోర్టుకి వెళ్లగానే..అలా ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ..) -
సముద్ర గర్భం గుండా ‘బుల్లెట్ ట్రైన్’.. దేశంలోనే తొలిసారి!
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి సముద్ర గర్భ సొరంగం మార్గం అందుబాటులోకి రానుంది. ఈ టన్నెల్ నిర్మాణం ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సముద్ర గర్భంలో సొరంగం పనులకు నేషనల్ హైస్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) బిడ్లను ఆహ్వానిస్తోంది. హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా మొత్తం 21 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించనుండగా.. 7 కిలోమీటర్లు సముద్రగర్భంలో తవ్వాల్సి ఉంది. మహారాష్ట్రలోని బంద్రా-కుర్లా కాంప్లెక్స్ మధ్య సాధారణ సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా.. థానే జిల్లాలోని శిల్ఫాటా ప్రాంతంలో సముద్రంలో నిర్మించాల్సి ఉంది. గతంలో అండర్‌వాటర్ టన్నెల్ నిర్మాణం కోసం ఢిల్లీ-ముంబై మధ్య యమునా నది కింద తవ్వాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, అది సాధ్యపడలేదు. మరోవైపు.. బ్రహ్మపుత్ర నది కింద అన్ని వాహనాలు వెళ్లేందుకు వీలుగా సొరంగ మార్గం ఏర్పాటు కోసం రోడ్డు, రైల్వే మంత్రిత్వ శాఖలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. 2019లోనే హైస్పీడ్ ట్రైన్ టన్నెల్ నిర్మాణానికి ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ టెండర్లు ఆహ్వానించింది. ఆ తర్వాత గత నవంబర్లోనూ మరోసారి బిడ్లను ఆహ్వానించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో కదలిక వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 29 నాటికి బిడ్లు దాఖలు చేయాలని గడువు విధించారు అధికారులు. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య చేపడుతోన్నఈ రైలు కారిడార్ మొత్తం 508.17 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. అహ్మదాబాద్ నుంచి ముంబై కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్లో మొత్తం 8 స్టేషన్లు ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. ప్రాజెక్టును పూర్తిచేసి 2026లో తొలిదశ ట్రయల్స్‌ను నిర్వహించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆశాభావంతో ఉంది. ఇదీ చదవండి: Viral Video: మేడ్ ఇన్ ఇండియా వ్యవసాయం అంటే ఇదే.. రైతు తెలివికి సలాం! -
నీటి అడుగుభాగంలో టి20 ప్రపంచకప్.. ఏం జరిగింది?
టి20 ప్రపంచకప్ 2022 ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన ఐసీసీ మెన్స్ టి20 ప్రపంచకప్ దేశాలను చుట్టి వస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన పొట్టి ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ జంపా.. స్పోర్ట్స్ ప్రెజంటర్ ఎరిన్ హోలాండ్, ఆస్ట్రేలియన్ పారాలింపిక్స్ స్విమ్మర్ గ్రాంట్ పాటర్సన్లు ఒక స్పెషల్ ప్లేసుకు తీసుకెళ్లారు. ఆస్ట్రేలియాకు తలమానికంగా నిలిచే ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్ సిస్టమ్‌గా పిలచే గ్రేట్ బారియర్ రీఫ్‌కు టి20 ప్రపంచకప్‌ను పట్టుకెళ్లారు. గాలి కూడా దూరని ఒక గ్లాసులో టి20 ప్రపంచకప్‌ను ఉంచి గ్రేట్ బారియర్ రీఫ్ నీటి అడుగుభాగంలోకి తీసుకెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలను ఐసీసీ టి20 ప్రపంచకప్‌తో పాటు ఎరిన్ హోలాండ్ తమ ట్విటర్లో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. టి20 ప్రపంచకప్ టూర్లో భాగంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో ఎనిమిది రాష్ట్రాల్లో 21 నగరాలతో పాటు యూనియన్ టెర్రటరీస్లో సందర్శనకు రానుంది. ఆస్ట్రేలియాతో పాటు దాదాపు 12 దేశాల్లో టి20 ప్రపంచకప్ చుట్టి రానుంది. ఇక గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆసీస్‌కు ఇదే తొలి టి20 ప్రపంచకప్ టైటిల్ కాగా.. న్యూజిలాండ్ మరోసారి రన్నరప్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. గ్రూఫ్ 1లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్‌తో పాటు మరో రెండు క్వాలిఫై జట్లు ఉండగా.. గ్రూప్ 2లో టీమిండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాటు మరో రెండు క్వాలిఫయింగ్ జట్లు ఉండనున్నాయి. Took the @T20WorldCup trophy for swim with a couple of legends on the #GreatBarrierReef yesterday! The #T20WorldCup is just around the corner.. who’ve you got to take this beauty home..?🏆🏏🇦🇺 @CricketAus #cricket #worldcup #notabaddayintheoffice #adamzampa #grantscooterpatterson pic.twitter.com/gyk2m7frzF — Erin Holland (@erinvholland) July 19, 2022 Taking the plunge 🤿 With help from a few familiar faces, the ICC Men's #T20WorldCup Trophy undertook an underwater adventure at the Great Barrier Reef. pic.twitter.com/yLxazYZi30 — T20 World Cup (@T20WorldCup) July 19, 2022 చదవండి: Fans Troll Kasun Rajitha: ఎంత పని చేశావ్.. లంక జట్టులో మరో 'హసన్ అలీ' -
‘సీ’దదీరుతూ....అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్
సముద్రంపై నౌకలో పార్టీలు, పెళ్లిళ్లు మాత్రమే మనకు ఇప్పటివరకు తెలుసు. సముద్రంలోతుల్లోనూ పార్టీ చేసుకునే అద్భుత అవకాశాన్ని తీసుకొచ్చిందో డచ్ కంపెనీ. సముద్రం లోపల సబ్‌మెరైన్‌లో పార్టీ... ఊహించడానికే థ్రిల్లింగ్‌గా ఉంది కదా! సాధారణంగా జలాంతర్గాములను నేవీకోసమో, లేదంటే సముద్రపు లోతుల్లోని రహస్యాలను కనుగొనేందుకో ఉపయోగిస్తారు. కానీ వ్యక్తిగత, వాణిజ్య జలాంతర్గాముల తయారీలో దిగ్గజ సంస్థ అయిన నెదర్లాండ్స్‌కు చెందిన యూ–బోట్‌వర్క్స్ ఈ అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ (యూడబ్ల్యూఈపీ)ను తయారు చేసింది. మినీ క్రూయిజ్ షిప్ తరహాలో రూపొందించిన ఈ సబ్‌మెరైన్ 200 మీటర్ల లోతువరకు డైవ్ చేయగలదు. 120మంది ప్రయాణించగలిగే సబ్‌మెరైన్‌లో 64 సీట్ల సామర్థ్యమున్న రెస్టారెంట్, జిమ్, కాసినో, వెడ్డింగ్ హాల్ కూడా ఉన్నాయి. సముద్రంలోపలి అద్భుతాలను వీక్షించేందుకు వీలుగా దీనికి 14 విశాలమైన కిటికీలను ఏర్పాటు చేశారు. వాటి బయట సముద్రం స్పష్టంగా కనిపించేందుకు ప్రకాశవంతమైన దీపాలను అమర్చారు. ఇది సముద్రతీరంలో ఉన్నప్పుడు, ఉపరితలంపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు తీరపు అందాలను ఆస్వాదించేలా యూడబ్ల్యూఈపీపై సన్‌డెక్‌ను, దాని చుట్టూ రెయిలింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. బ్యాటరీతో నడిచే ఈ సబ్‌మెరైన్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 24గంటలపాటు ప్రయాణించొచ్చు. యూడబ్ల్యూఈపీ ఓ సంచలనమని, నీటి అడుగున వేడుకలకు ఇది దారి చూపుతుందని యూ–బోట్‌వర్క్స్ వ్యవస్థాపక సీఈవో బెర్ట్ హౌట్మాన్ తెలిపారు. ఇంకెందుకాలస్యం.. నెదర్లాండ్స్‌కు వెళదాం అనుకుంటున్నారా! ఆగండాగండి.. ఏదైనా టూరిజం కంపెనీ కొనుగోలు చేసి టూర్స్ ఆఫర్ చేసేవరకూ మనం ఎదురుచూడాల్సిందే. (చదవండి: రష్యా బలగాల దుర్మార్గం! కాల్పులు జరిపి సజీవంగా పాతిపెట్టి.) -
ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్ ప్రారంభం
మీకు ఈత కొట్టడం అంటే ఇష్టమా.. అయితే ఇప్పుడు మీరు ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ చేయండి. ఇందులో ఈత కొడితే మాత్రం మీకు పాతాళలోకానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఈ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడితే వేరే సరికొత్త లోకంలో అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది. ఈ స్విమ్మింగ్ పూల్ అడుగు భాగంలో గేమ్స్ ఆడుకోవడానికి, కూర్చొడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ‘డీప్ డైవ్ దుబాయ్’ పేరుతో ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌ను దుబాయ్ ప్రభుత్వం నిర్మించింది. అంతేగాకుండా ఈ పూల్ గిన్నిస్ రికార్డ్ సైతం సొంతం చేసుకుంది. 60 మీటర్ల లోతు నాడ్ అల్ షెబా ప్రాంతంలో నిర్మితమైన ఈ స్విమ్మింగ్‌పూల్‌ను దుబాయ్ యువరాజు హమ్దాన్ బిన్ మొహమ్మద్ బుధవారం ప్రారంభించారు. ఈ పూల్ కి సంబంధించిన వీడియోలను మొహమ్మద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘60 మీటర్ల లోతున్న (196 అడుగులు) ప్రపంచంలో కెల్లా అత్యంత లోతైన పూల్ ‘డీప్ డైవ్ దుబాయ్’ మీ కోసం ఎదురుచూస్తోందని’’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో లక్షల కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ పూల్‌లో ఇండోర్ స్కూబా డైవింగ్ సదుపాయంతో పాటు విద్య, వినోదం కోసం ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. An entire world awaits you at Deep Dive Dubai the world’s deepest pool, with a depth of 60 meters (196 feet) #Dubai pic.twitter.com/GCQwxlW18N — Hamdan bin Mohammed (@HamdanMohammed) July 7, 2021 ఈ ఇండోర్ పూల్ 1,500 చదరపు మీటర్ల పరిమాణంలో ఓయిస్టర్ ఆకారంలో ఉన్న నిర్మాణం లోపల ఉంది. ఈ పూల్‌ను ముఖ్యంగా డైవింగ్‌లో శిక్షణ తీసుకునే వారికోసం, నీటి లోతట్టు ప్రాంతాల్లో డైవింగ్ చేసే ఆసక్తి కలిగిన వాళ్ల కోసం ఏర్పాటు చేసినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీనిలో పాడుబడిన నగరం ఆకృతులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ పూల్‌లో ఉన్న అండర్ వాటర్ 56 కెమెరాలు డైవింగ్ చేస్తున్న వారిని నిరంతం పర్యవేక్షిస్తుంటాయి. ఇందులోని నీటిని 6 గంటలకు ఒకసారి శుద్ధి చేస్తారు. దీన్ని నింపడానికి 1.4 కోట్ల లీటర్ల నీటిని వినియోగించారు. ఈ నీటి కొలను అడుగున చదరంగం, టేబుల్ ఫుట్ బాల్ కూడా అడుకోవచ్చు. చాలా మంది ఈ పూల్ విషయంలో ఫాంటసీ సినిమాలో పూల్ ఎలా కనిపిస్తుందో అలా ఉంది అని చాలా మంది వ్యాఖ్యానించారు. -
వైరల్: నడిసంద్రంలో భారీ అగ్నిప్రమాదం..
వాషింగ్టన్/మెక్సికో: చుట్టూ ఎక్కడ చూసిన తీరం కనిపించనంత విశాలంగా విస్తరించిన సముద్రం. నట్ట నడిమిలో ఎగసిపడుతున్న మంటలు. చూడటానికి ఆ దృశ్యం ఎంత అందంగా ఉందో.. అంతే భయంకరంగా కూడా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నడిసముద్రంలో అండర్‌వాటర్ పైప్‌లైన్ లీక్ కావడంతో ఇలా మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ సంఘటన మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పానికి పశ్చిమాన సముద్రపు ఉపరితలంపై చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని రాష్ట్ర చమురు సంస్థ పెమెక్స్ తెలిపింది. నీటి అడుగున పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పెమెక్స్ వెల్లడించింది. నీటి నుంచి ఎగసిపడుతున్న ముదురు నారింజ వర్ణం మంటలు చూపరులను భయపెడుతున్నాయి. పెమిక్స్ కంపెనీకి అతి సమీపంలోని అండర్ వాటర్ పైప్‌లైన్ లీక్ కావడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పైప్‌లైన్ పెమిక్స్కు చెందిన అతి ముఖ్యమైన ‘కు మలూబ్ జాప్’ ఆయిల్ డెవలమెంట్ని పెమిక్స్ ప్లాట్‌ఫాంతో కలుపుతుంది. ఈ సందర్భంగా పెమిక్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఉదయం 5.15 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిలో ఎవరు గాయపడలేదు.. ఉత్పత్తి కూడా నిలిచిపోలేదు. సుమారు ఐదుగంటల పాటు కష్టపడి మంటలను ఆర్పేశాము. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నాం’’ అన్నారు. -
ఆర్ఆర్ఆర్: అస్సలు తగ్గని రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్
దర్శకుడిగా రాజమౌళి ఎంతటి పర్ఫెక్షనిస్టో ఆయన సినిమాల్లోని విజువల్స్ చెబుతాయి. టేకింగ్, మేకింగ్‌లో అస్సలు రాజీపడరు రాజమౌళి. అలాగే హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటనలో రాజీపడరు. ఇటీవల ‘రౌద్రం... రణం... రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమాలోని ఓ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ విషయంలో ఈ ఇద్దరూ ఏమాత్రం రాజీపడలేదట. రాజమౌళి విజన్‌కి తగ్గట్లే ఈ సీన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ అనిపించారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ థియేటర్స్‌లో ఆడియన్స్‌కు మరింత కిక్ ఇస్తాయన్నది ఇండస్ట్రీ టాక్. ఆల్రెడీ సినిమాలో తారక్కీ, పులికీ మధ్య ఓ ఫైట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్ తెరపైకి వచ్చింది. ఇక ‘ఆర్ఆర్ ఆర్’లో రామ్‌చరణ్ మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న ఈ సినిమా అక్టోబరు 13న విడుదల కానుంది. చదవండి: రోడ్డు నా ఆఫీస్, మండుటెండ నా ఏసీ: సిద్దార్థ్ -
అండర్‌వాటర్‌లో మ్యూజియం
జల్పం!జాసన్ డి టేలర్... అండర్‌వాటర్ మ్యూజియమ్ల సృష్టికర్తగా ప్రసిద్ధుడు. మెక్సీకో నుంచి మాల్దీవుల వరకు ఎన్నో అండర్ వాటర్ మ్యూజియమ్ లను సృష్టించాడు. ఈ బ్రిటీష్ శిల్పకారుడు తాజాగా ఫ్రాన్స్‌లోని లెర్నెస్ ద్వీపాలలో జలగర్భ మ్యూజియంను ఆవిష్కరించాడు. ఇందులో మొత్తం ఆరు భారీ విగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఆరు ఆడుగుల ఎత్తు, పది టన్నుల బరువు ఉంటుంది. వీటిని తయారు చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. ఇవేమీ ప్రముఖుల విగ్రహాలు కాదు. 9 సంవత్సరాల స్కూలు పిల్లాడి నుంచి ఎనభై సంవత్సరాల జాలరి శిల్పాల వరకు ఇందులో ఉన్నాయి. -
ఏడు నిమిషాలు నీటిలోనే!
ప్రస్తుతం హాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ‘అవతార్’ సిరీస్ ఒకటి. జేమ్స్ కేమరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘టైటానిక్’ ఫేమ్ కేట్ విన్స్లెట్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా అరుదైన రికార్డు సృష్టించారు కేట్. ‘అవతార్’ సీక్వెల్స్ కథాంశం ప్రకారం అండర్ వాటర్ (నీటి లోపల) కూడా చిత్రీకరణ జరిపారు. ఇందులో భాగంగా కేట్ విన్స్లెట్ నీటి లోపల 7 నిమిషాల 14 సెకన్లు ఉన్న ఓ సన్నివేశంలో నటించారు. దీనికోసం సుమారు నాలుగువారాల పాటు శిక్షణ తీసుకున్నారు. ఈ సన్నివేశం కోసం ఏడు నిమిషాలు పాటు ఊపిరి ఆపుకున్నారామె. సినిమా చిత్రీకరణల్లో ఇదో రికార్డ్ అని హాలీవుడ్ అంటోంది. గతంలో ‘మిషన్ ఇంపాజిబుల్’ కోసం టామ్ క్రూజ్ ఆరు నిమిషాల పాటు ఊపిరి ఆపుకుంటూ అండర్‌వాటర్ సీన్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు క్రూజ్ రికార్డ్‌ను కేట్ బద్దలు కొట్టేశారు. ‘ఈ రికార్డ్ బద్దలు కొట్టానని నాకు ఇటీవలే తెలిసింది’ అన్నారు కేట్ విన్స్లెట్. ‘అవతార్ 2’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. -
భారత్‌లో తొలి అండర్‌వాటర్ మెట్రో సిద్ధం..
కోల్‌కతా : హుగ్లీ నదిని దాటుతూ పరుగులు పెట్టే తొలి అండర్‌వాటర్ మెట్రో ఈస్ట్-వెస్ట్ ప్రాజెక్టును కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ త్వరలో పట్టాలెక్కించనుంది. 1984లో చేపట్టిన ప్రాజెక్టుకు విస్తరణగా ముందుకొచ్చిన భారత్‌లో తొలి అండర్ వాటర్ మెట్రో ఎన్నో అవాంతరాలు, వ్యయ అంచనాలను అధిగమిస్తూ మార్చి 2022 నాటికి అందుబాటులోకి రానుంది. భారత రైల్వే బోర్డు నుంచి చివరి వాయిదాగా రూ 20 కోట్లు మైట్రో రైల్ అథారిటీకి అందనుండగా విస్తరణలో భాగంగా చేపట్టిన అండర్‌వాటర్ మెట్రో పనులు తుది దశకు చేరుకున్నాయి. దాదాపు రూ 10,000 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 49 శాతం మేరకు జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ నిధులు సమకూర్చింది. న్యూలైన్‌లో రోజుకు 9 లక్షల మంది అంటే నగర జనాభాలో 20 శాతం మంది ప్రయాణిస్తారు. 520 మీటర్ల అండర్‌వాటర్ టన్నెల్‌ను ఈ రైలు కేవలం నిమిషం లోపే దాటుతుందని అధికారులు వెల్లడించారు. చదవండి : 8 కారిడార్లు.. 140.13 కి.మీ -
సముద్రం అడుగున తొలి హోటల్
న్యూఢిల్లీ : పచ్చని చెట్లను కడుపులో పొదుపుకొని కనువిందు చేసే పర్వత పక్తుల మధ్య నుంచి నీటిపై పడవలో ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఎవరికైనా ఇష్టమే. మరి నీటి అడుగున ఇంద్ర ధనుస్సులా సప్త వర్ణాల్లో మెరిసిపోయే పగడపు దీవుల అందాలను తిలకిస్తే, చుట్టూ తిరిగే పలు రంగుల రకాల చేపలతోపాటు షార్కులు, తిమింగళాలు, ఇతర జల చరాలను ఎలాంటి అభద్రతా భావం లేకుండా కనులారా చూస్తుంటే ఆ అనుభూతి ఇంకెంత అందంగా ఉంటుంది? అది ఎలా సాధ్యం అవుతుంది? అలాంటి ఔత్సాహికుల కోసమే ఆస్ట్రేలియాలో మొట్టమొదటి ‘అండర్ వాటర్ హోటల్’ను ఏర్పాటు చేశారు. క్వీన్స్‌లాండ్‌లో పది మిలియన్ డాలర్లు (దాదాపు 72 కోట్ల రూపాయలు) వెచ్చించి 14 నెలల్లో పూర్తి చేశారు. జల చరాలను ప్రత్యక్షంగా వీక్షించడం ద్వారా ‘కైమేట్ ఛేంజ్’ పట్ల ప్రజల్లో అవగాహనకు ఈ హోటల్ ఉపయోగపడుతుందన్న కారణంగా క్వీన్స్లాండ్ రాష్ట్ర ప్రభుత్వం 2.75 మిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయంగా అందించింది. ఏర్లీ బీచ్‌కు 39 నాటికల్స్ మైళ్ల దూరంలో సముద్రంలో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. దీని బరువు 260 టన్నులు. ఇందులో మొత్తం పది పడక గదులను నిర్మిస్తున్నారు. అందులో రెండు పడక గదులను డిసెంబర్ ఒకటవ తేదీ ఉంచి పర్యాటకుల కోసం ప్రారంభించారు. మిగతా గదులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. నీటి అడుగునే కాకుండా నీటిపై డెక్ మీద టెంటులాంటి పడకల్లో కూడా సేదతీరే అదనపు సౌకర్యం ఉంది. టారిఫ్‌ల గురించి హోటల్ యాజమాన్యం ఇంకా వెల్లడించలేదు. -
15 నెలలుగా నీళ్లలో ఉన్నా ఈ ఫోన్ పనిచేస్తోంది!
సెల్‌ఫోన్ నీళ్లలో పడితే ఏమౌవుతుంది. వెంటనే అది పనిచేయడం మానేస్తుంది. కానీ నీళ్లలో పడి 15 నెలల తర్వాత దొరికిన ఫోన్ పనిచేస్తుందంటే మీరు నమ్మగలరా? ఆశ్చర్యంగా అనిపిస్తోందా? కానీ ఇది నిజం. అమెరికా యూట్యూబర్ మైఖేల్ బెన్నెట్ ఈ విషయాన్ని బయపెట్టారు. ‘నుజెట్నొగిట్’ యూట్యూబ్ చానల్లో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. మైఖేల్ బెన్నెట్ తన స్నేహితులతో కలిసి దక్షిణ కరోలినాలోని ఎడిస్టో నదిలో వెతుకుతుండగా పౌచ్‌లో ఉంచిన ఐఫోన్ వారి కంటపడింది. దీన్ని ఇంటికి తీసుకొచ్చి పౌచ్లోంచి బయటకు తీసి చూశారు. ఫోన్ స్విచ్చాఫ్ అయిపోవడంతో ఇది పనిచేయడం లేదేమో అనుకున్నారు. చార్జింగ్ పెట్టి స్విచాన్ చేయగా అది పనిచేస్తున్నట్టు గుర్తించడంతో మైఖేల్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడితో ఆగిపోకుండా ఆ ఫోన్ పోగొట్టుకున్న మహిళ ఎరికా బెన్నెట్‌ను గుర్తించి ఆమెకు భద్రంగా అందజేశాడు. పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో ఎరికా బెన్నెట్ ఉద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి బతికున్నప్పుడు తనకు పంపిన అమూల్యమైన మెజేస్‌లు ఈ ఫోన్లో ఉన్నాయని ఆమె వెల్లడించారు. తండ్రి జ్ఞాపకాలు తిరిగి వచ్చినందుకు ఆమె కళ్ల నుంచి ఆనంద భాష్ఫాలు వచ్చాయి. సెప్టెంబర్ 26న షేర్ చేసిన ఈ వీడియోకు లక్షా 30 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘ఈ ఫోన్ చాలా గొప్పది. ఇందులో ఉన్న సందేశాలు అమూల్యం. తండ్రి జ్ఞాపకాలను పదిలంగా కూతురికి అందించిన ఈ ఫోన్‌కు వెల కట్టలేం’ అంటూ పలువురు కామెంట్లు పెట్టారు. మైఖేల్ బెన్నెట్‌కు యూట్యూబ్‌లో 7.4 లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. -
‘అతని తలరాతని విధి మలుపు తిప్పింది’
వాషింగ్టన్: మది దోచిన నెచ్చలికి తన మనసులో మాట చెప్పి.. ఆమె వెచ్చని కౌగిలిలో సేద దీరాలని భావించిన అతడిని మృత్యువు తన బిగి కౌగిలిలో శాశ్వతంగా బంధించింది. ప్రియుడి నోటి నుంచి ప్రేమిస్తున్నాను అనే మాట విని సంతోషంలో మునిగిపోయిన ఆ యువతి.. మరు నిమిషంలో చోటు చేసుకున్న ఈ అనూహ్య పరిణామానికి గుండె పగిలేలా రోదిస్తుంది. వివరాలు.. అమెరికా లూసియానాకు చెందిన స్టీవ్ వెబర్, కెనేషా అనే యువతిని గత కొద్ది కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం విహారయాత్ర నిమిత్తం వీరిద్దరు టాంజేనియా వెళ్లారు. అక్కడే స్టీవ్, కెనేషాకు ప్రపోజ్ చేయాలని భావించాడు. సాధారణంగా మోకాళ్ల మీద కూర్చుని.. ఉంగరం పట్టుకుని.. ‘విల్ యూ మ్యారీ’ అని అడగడం స్టీవ్‌కు ఇష్టం లేదు. దాంతో కాస్తా వెరైటీగా ప్రయత్నిద్దామని చెప్పి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. నీటి లోపల ప్రపోజ్ చేద్దామని అనుకుని.. సముద్రంలోకి దూకాడు స్టీవ్. ఆ తర్వాత బోటులో తాము ఉంటున్న క్యాబిన్ దగ్గరకు వెళ్లి ఉంగరాన్ని బయటకు తీసి, ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ అని ఉన్న లెటర్ని చూపిస్తూ కెనేషాకు ప్రపోజ్ చేశాడు. అటు కెనేషా కూడా సంతోషంతో స్టీవ్ ప్రతిపాదనకు అంగీకరించింది. ఇంకేముంది కథ సుఖాంతం అయ్యింది అనుకుంటుండగా.. అనుకోకుండా స్టీవ్ జీవితం తలకిందులయ్యింది. ప్రపోజ్ చేయడం కోసం నీటిలో మునిగిన స్టీవ్ మరిక బయటకు రాలేదు. అతడు నీటిలో మునిగి చనిపోయాడు. ఓ నిమిషం క్రితం వరకు సంతోషంగా సాగిన స్టీవ్ జీవితం.. అలా అనూహ్యంగా ముగిసి పోయింది. జీవితంలో అత్యంత మధురమైన జ్ఞాపకంగా మిగలాల్సిన రోజు కాస్త పీడకలగా మారిపోయింది. కెనేషా బాధ అయితే వర్ణనాతీతం. ‘విధి స్టీవ్ జీవితంతో ఆడుకుంది. సంతోషంగా సాగుతున్న తరుణంలో స్టీవ్ జీవితం కృరమైన మలుపు తిరిగింది. మా జీవితంలో ఉత్తమంగా నిలవాల్సిన రోజు.. చెత్తగా మిగిలిపోయింది. స్టీవ్ నీవు ఆ లోతుల నుంచి ఎన్నటికి బయటకు రాలేవు. కాబట్టి నా సమాధానాన్ని కూడా వినలేవు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. కొన్ని లక్షల సార్లు నీ ప్రతిపాదనకు అంగీకారం తెలుపుతున్నాను. ప్లీజ్ స్టీవ్ నా కోసం వచ్చేయ్’ అంటూ కెనేషా హృదయవిదారకంగా రోదిస్తుంది. తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ విషాదంత కథనం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. -
తొలి అండర్ వాటర్ మెట్రో...వీడియో
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో స్టేషన్ ప్రారంభించనున్నారు. కోల్‌కతాలో దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ గురువారం ప్రకటించారు. కోల్‌కతా హుగ్లీ నది కింద భారతీయ తొలి అండర్‌వాటర్ ట్రైన్ నడుస్తుందని పేర్కొన్న ఆయన ఈ మేరకు తన అధికారిక ట్విటర్లో ఇండియన్ రైల్వే విడుదల చేసిన ఒక వీడియోను పోస్టు చేశారు. అద్భుతమైన ఇంజనీరింగ్‌కు ఇదొక ఉదాహరణ. దేశంలో రైల్వే పురోగతికి చిహ్నం. ఈ సర్వీసుతో కోల్‌కతా ప్రజలు మరింత సౌకర్యవంతంగా ప్రయాణిస్తారు. ఇది దేశం గర్వపడే విషయం అని ఆయన ట్వీట్ చేశారు. ఈ సర్వీస్ కోల్‌కతా మెట్రో లైన్-2 అంటే ఈస్ట్-వెస్ట్ మెట్రో కిందకు వస్తుంది. 16 కి.మీ లైన్ వరకూ వేయనున్న ఈ ట్రాక్ పనులు రెండు దశలుగా జరుగుతాయి. సాల్ట్ లేక్ సెక్టార్ 5 స్టేషన్‌ను సాల్ట్ లేక్ స్టేడియం స్టేషన్‌తో కలుపుతూ 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొదటి దశ వుంటుంది. దీన్ని ఈ నెలాఖరు నాటికి ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఆ కొత్త మెట్రో మార్గం ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ మెట్రో సొరంగాల నిర్మాణం ఏప్రిల్ 2017లో చివరలో ప్రారంభం కాగా 30మీటర్ల లోతులో 520 మీటర్ల వరకూ రెండు సొరంగాలు తయారుచేశారు. జర్మనీ నుంచి రచ్నా, ప్రేర్నా అనే రెండు టాప్-ఆర్డర్ టన్నెల్ బోరింగ్ యంత్రాలను తెప్పించారు. అలాగే నీరు లీకేజీని నివారించడానికి నాలుగు రక్షణ కవర్లు కూడా ఉన్నాయి. भारत की पहली अंडर वॉटर ट्रेन शीघ्र ही कोलकाता में हुगली नदी के नीचे चलना आरंभ होगी। उत्कृष्ट इंजीनियरिंग का उदाहरण यह ट्रेन देश में निरंतर हो रही रेलवे की प्रगति का प्रतीक है। इसके बनने से कोलकाता निवासियों को सुविधा, और देश को गर्व का अनुभव होगा। pic.twitter.com/MDzj42s5XZ — Piyush Goyal (@PiyushGoyal) August 8, 2019 -
నీటిలో విమానం ఎందుకబ్బా..
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సముద్రగర్భ థీమ్ పార్క్‌ను బహ్రెయిన్ ప్రభుత్వం నిర్మిస్తోంది. అండర్ వాటర్ థీమ్ పార్క్‌కు ఈ విమానానికి ఏం సంబంధం అనేగా మీ ప్రశ్న.. ఈ థీమ్ పార్క్‌లో పగడపు దిబ్బలు వంటివాటితోపాటు అసలైన బోయింగ్ 747 విమానాన్ని కూడా పెట్టనున్నారు. ఇందుకోసం త్వరలో దీన్ని నీటిలో ముంచేయనున్నారు. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదట. కొన్ని ప్రైవేటు కంపెనీలతో కలిసి ఈ ప్రాజెక్టును బహ్రెయిన్ ప్రభుత్వమే చేపడుతోంది. మొత్తం లక్ష చదరపు మీటర్ల పరిధిలో ఏర్పాటు చేస్తున్నారు. సముద్రంలోని జీవజాతులకు ఇబ్బంది లేకుండా పర్యావరణ అనుకూల విధానాల్లో దీన్ని నిర్మిస్తున్నారట. మరికొన్ని నెలల్లో ఈ థీమ్ పార్క్ ప్రారంభమవనుంది. -
సైరా.. నీటి అడుగున పోరాటం
ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చారిత్రక కథగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ కావటంతో చాలా కష్టపడి ఎంతో రిస్క్ చేసి నటిస్తున్నాడు. అంతేకాదు ఈసినిమాలో ఓ అండ్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందని తెలుస్తోంది. త్వరలో ముంబైలో జరగబోయే షెడ్యూల్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన స్విమ్మింగ్ పూల్‌లో ఆ పోరాట సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు సుధీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నారు.