vijayawada durga temple
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష స్వీకరణ (ఫొటోలు)
-
విజయవాడ: దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం జరిగింది. భవానీ భక్తులను దేవాదాయ శాఖ దారుణంగా మోసం చేసింది. ఆగమ శాస్త్రానికి తూట్లు పొడిచిన దుర్గ గుడి అధికారులు.. భక్తులకు ఇతర ఆలయాల్లో ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇతర ఆలయాల ప్రసాదాలు దుర్గమ్మ ప్రసాదంగా పంపిణీ చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధం. దుర్గగుడికి పెదకాకాని, మోపిదేవి, పెనుగంచిప్రోలు ఆలయాల నుంచి తెచ్చిన 37 వేల లడ్డూలు భవానీ భక్తులతో పాటు దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు.ఇతర ఆలయాల నుంచి లడ్డూ ప్రసాదం తెచ్చి దుర్గమ్మ ప్రసాదంగా పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయశాఖ, దుర్గగుడి అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. బెజవాడ దుర్గమ్మ లడ్డూ ప్రసాదం భవానీ భక్తులకు అత్యంత పవిత్రం, ప్రీతికరం. అయితే, లడ్డు ప్రసాదం కొరత రాకుండా ఉండేందుకేనంటూ చేసిన అపచారాన్ని దుర్గగుడి అధికారులు సమర్థించుకుంటున్నారు. సామాన్య భక్తులతో పాటు భవానీ భక్తుల మనోభావాలను దేవాదాయ శాఖ అధికారులు దారుణంగా దెబ్బతీశారు. -
ఇంద్రకీలాద్రి పై మూడో రోజుకు చేరిన దసరా మహోత్సవాలు
-
విజయవాడ దుర్గగుడిలో నిఘా వైఫల్యం
సాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో నిఘా వైఫల్యం వెలుగుచూసింది. అమ్మవారి అంతరాలయ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై అధికారులు స్పందించారు. రెండురోజుల క్రితం అంతరాలయాన్ని భక్తురాలు వీడియో తీసింది.తాను తీసిన విజువల్స్ సోషల్ మీడియాలో పెట్టడంతో భద్రతాపై అనుమానాలు వ్యక్తమవుతున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆలయ అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ పరువుకు భంగం కలిగించేవారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు.. ఘటనపై పోలీస్ శాఖకి ఫిర్యాదు చేశారు. -
దసరా మహోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం ఆలయాల ధర్మకర్తల మండలి ప్రతినిధులు మంగళవారం కలిశారు. త్వరలో జరిగే దసరా మహోత్సవాలకు సీఎంని ఆహ్వానించారు. ఈ నెల 15 నుంచి 23 వరకు దుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు, ఈ నెల 15 నుంచి 24 వరకు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు జరగనున్నాయి. సీఎం జగన్‌కి ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వాన పత్రికలను అందించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. చదవండి: బస్సు యాత్రల్లో జరిగిన మంచిని చెప్పండి: సీఎం జగన్ -
భక్తులకు అలర్ట్.. ఈ నెల 25న దుర్గగుడి మూసివేత
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఈ నెల 25వ తేదీన సూర్య గ్రహణం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంతోపాటు అన్ని ఉపాలయాలను మూసివేస్తామని ఆలయ వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. 25వ తేదీ ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహా నివేదన, పూజా కార్యక్రమాల అనంతరం దుర్గమ్మ దర్శనం నిలిపివేయడంతోపాటు ఆలయ ద్వారాలను మూసివేస్తామని వివరించారు. చదవండి: అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు తిరిగి 26 ఉదయం ఆరు గంటలకు దుర్గగుడి తెరుస్తామని, అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం మహా నివేదన సమర్పిస్తామని తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.10 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. ఈ నెల 26వ తేదీన తెల్లవారుజాముతోపాటు ఉదయం జరిగే అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు. -
చంద్రబాబుకు ఇన్ని రోజులు తెలివితేటలు లేవా..
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు తన పుట్టినరోజు సందర్బంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ తనకు శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఇవ్వాలని దుర్గమ్మను కోరుకుంటున్నట్టు చెప్పారు. అంటే ఇన్ని రోజులు చంద్రబాబుకు తెలివితేటలు లేవా..? అన్ని ప్రశ్నించారు. ఆయనకు మంచి ఆలోచనలు, మంచి మనసు ఉంటే దుర్గమ్మ తప్పకుండా కరుణిస్తుంది. అన్ని వర్గాలను అవహేళనగా మాట్లాడటం చూస్తే ఆయన రాజకీయాల్లో ఉండటం అవసరమా అనిపిస్తోంది. వాస్తవాలను దాచి ప్రజలకు అబద్దాలు చెబుతున్నారు. ఆయనకు మతి భ్రమించింది. పోలవరంపై టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తోంది. పోలవరం ఆలస్యానికి చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలే కారణం. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి’’ అని అన్నారు. -
ప్రధాన దేవాలయాల్లో అమల్లోకి కోవిడ్ ఆంక్షలు
ద్వారకాతిరుమల/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన విజయవాడ దుర్గమ్మ ఆలయం, పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాల్లో మంగళవారం నుంచి కోవిడ్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇరు ఆలయాల్లోని దర్శనానికి వెళ్లే క్యూ కాంప్లెక్స్‌ల వద్ద దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ జరిపి, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేయించారు. మాస్క్ ధరించాలని ప్రతి ఒక్కరికీ సూచిస్తున్నారు. భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టారు. ఇరు ఆలయాల్లో గంటకు 1,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. చినవెంకన్న స్వామివారిని దర్శించిన భక్తులకు శేషాచల కొండపైన వకుళమాత అన్నదాన భవనం వద్ద ప్యాకెట్ల రూపంలో అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, తీర్థం, శఠారి, అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేశారు. ఇంద్రకీలాద్రిపై నిత్యం జరిగే ఆర్జిత సేవల్లో 50 శాతం టికెట్లను మాత్రమే విక్రయిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై నిత్య అన్నదాన ప్రసాద వితరణను అధికారులు నిలిపివేశారు. దీంతో మహా మండపం మూడో అంతస్తులోని క్యూ లైన్లు, రెండో అంతస్తులోని అన్న ప్రసాద వితరణ భవనం వెలవెలబోయింది. సెకండ్ వేవ్ వచ్చిన తరుణంలో అన్న ప్రసాద వితరణ నిలిపివేసినప్పటికీ ప్యాకెట్ల రూపంలో భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేసేవారు. ఈ దఫా అటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. అమ్మవారి లడ్డూ, పులిహోర ప్రసాదాలను కోవిడ్ నిబంధనల మేరకు విక్రయిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలున్న వారు దేవాలయ సందర్శనను వాయిదా వేసుకోవాలని దేవదాయ శాఖాధికారులు విజ్ఞప్తి చేశారు. -
దుర్గమ్మ దసరా హుండీ లెక్కింపు ప్రారంభం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ కనకదుర్గ అమ్మవారికి దసరా ఉత్సవాలలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపును సోమవారం మహా మండపం ఆరో అంతస్తులో చేపట్టారు. తొలిదఫా లెక్కింపులో రూ.2,87,83,153 నగదుతో పాటు 546 గ్రాముల బంగారం, 9.553 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. మంగళవారం (నేడు) కూడా హుండీ కానుకల లెక్కింపు కొనసాగుతుందని ఆమె తెలిపారు. కానుకల లెక్కింపును దేవస్థానం చైర్మన్ పైలా సోమినాయుడు, పాలక మండలి సభ్యులు పర్యవేక్షించగా, ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు. -
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ
సాక్షి, విజయవాడ: దసరా నవరాత్రుల సందర్భంగా బెజవాడ దుర్గమ్మకు టీటీడీ అర్చకులు సారె సమర్పించారు. టీటీడీ అధికారులు, అర్చకులకు దుర్గగుడి ఆలయ ఈవో భ్రమరాంబ,ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు,అధికారులు స్వాగతం పలికారు. దసరా ఉత్సవాల్లో టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మహిషాసురమర్దినీదేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను టీటీడీ బోర్డు మెంబర్లు దర్శించుకున్నారు. చదవండి: ‘కట్టుకథలు.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’ -
ఇంద్రకీలాద్రిపై వర్షం.. భక్తుల హర్షం
సాక్షి, అమరావతి: పాలకుడు మంచివాడైతే దైవం కరుణిస్తుందని, ప్రకృతి పులకిస్తుందని ఇంద్రకీలాద్రి సాక్షిగా మరోసారి రుజువైంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నప్పుడు అహ్లాదకర దృశ్యం ఆవిష్కృతమైంది. అంతవరకు మండే ఎండతో, ఉక్కపోతతో ఉన్న వాతావరణంతో అందరూ చమటలతో నిట్టూర్పులు విడవసాగారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రకీలాద్రి ఘాట్ ప్రారంభంలోని కామధేను అమ్మవారి ఆలయ సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా చిరుజల్లులు మొదలయ్యాయి. సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న సీఎం ఇంద్రకీలాద్రిపైకి చేరుకుని తన వాహనం నుంచి దిగగానే ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలై ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా మారిపోయింది. సీఎం ఆలయం లోపలికి వెళ్లి పూజలు ముగించుకుని తిరిగి బయటకు వచ్చే వరకు అంటే 3.45 గంటల వరకు వర్షం పడుతూనే ఉంది. సీఎం వైఎస్ జగన్ వాహనం ఇంద్రకీలాద్రి కిందకు దిగిన కాసేపటికి వర్షం ఆగిపోయింది. ఇంద్రకీలాద్రిపై తప్ప విజయవాడలో మరెక్కడా ఆ సమయంలో వర్షం పడకపోవడం విశేషం. ప్రజలకు మంచి చేయాలని పాలకుడు చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. దేవుని ఆశీస్సులు, ప్రకృతి కటాక్షం లభిస్తుందనడానికి ఇది శుభ సంకేతమని అర్చకులు, పండితులు, పలువురు భక్తులు వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులకు వెన్నుదన్ను ► ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.70 కోట్లు ప్రత్యేకంగా మంజూరు చేసిన విషయాన్ని భక్తులు గుర్తు చేసుకున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా నేరుగా ప్రభుత్వ నిధులను అమ్మవారి ఆలయానికి మంజూరు చేయలేదు. ► కృష్ణా పుష్కరాల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఏకంగా 40 ఆలయాలను కూల్చివేసిన విషయాన్ని కూడా భక్తులు ప్రస్తావించారు. అందుకు భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి హిందూ ఆలయాల అభివృద్ధికి కృషిచేయడం హైందవ ధర్మం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు. ► ఇంద్రకీలాద్రిపై అన్నదాన కాంప్లెక్స్, ప్రసాదాల పోటు, కేశ ఖండనశాల నిర్మాణంతోపాటు ఘాట్‌రోడ్డులో కొండరాళ్లు జారి పడకుండా రక్షణ చర్యలు చేపట్టేందుకు సీఎం మంజూరు చేసిన నిధులతో పనులు మొదలుపెట్టారు. -
దుర్గమ్మ సేవలో ఏపీ సీఎం
సాక్షి, తిరుపతి, తిరుమల/అమరావతి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. అత్యంత ప్రాశస్త్యమైన మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. అంతకు ముందు ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన.. తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3గంటలకు ఆహ్లాదకర వాతావరణం మధ్య తన క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆలయం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పరివేష్టితం ధారణతో అమ్మవారికి సమర్పించే పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను తలపై పెట్టుకుని ఆలయంలోకి అడుగుపెట్టారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రాలతో అంతరాలయంలోకి ప్రవేశించి.. శ్రీసరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మ వారికి వాటిని సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో వేద పండితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆశీర్వచనం పలికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. 78 కిలోల బియ్యంతో శ్రీవారికి తులాభారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తిరుమల పర్యటనలో భాగంగా మంగళవారం కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం పట్టు వస్త్రాలు సమర్పించి, స్వామి వారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం సంప్రదాయ బద్ధంగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం వకుళామాతను, ఆలయ ప్రదక్షిణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన శ్రీవారికి తులాభారం సమర్పించారు. పలువురు భక్తులు తమ బరువుకు సమానంగా బెల్లం లేదా బియ్యం లేదా ఇతర ధాన్యాలతో తూకం వేసి స్వామి వారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయం ప్రకారం సీఎం వైఎస్ జగన్ తన బరువుకు సమానంగా 78 కిలోల బియ్యం తులాభారంలో సమర్పించారు. ఇక కన్నడ, హిందీలోనూ ఎస్వీబీసీ చానళ్లు దేశ విదేశాల్లో ఉన్న భక్తుల కోసం ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లను శ్రీవారి ఆలయం వెలుపల గొల్ల మండపం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే తెలుగు, తమిళంలో ఉన్న చానళ్ల ద్వారా టీటీడీ శ్రీ వేంకటేశ్వర వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెబుతోంది. అనంతరం రోజుకు 6 లక్షల లడ్డూల తయారీ సామర్థ్యంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన నూతన బూందీ పోటును సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. దీని నిర్మాణానికి ఇండియా సిమెంట్స్ అధినేత, ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీనివాసన్ రూ.12 కోట్లు విరాళం అందించారు. ఇదివరకటి పోటుకు కూడా అప్పట్లో ఈయన ఇంతే మొత్తం విరాళంగా ఇచ్చారు. 8,541 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆధునిక బూందీ పోటులో 40 థర్మిక్ ఫ్లూయిడ్ స్టౌలు.. గాలి, వెలుతురు బాగా వచ్చే సదుపాయం కల్పించారు. ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభిస్తున్న సీఎం జగన్ సహజ వ్యవసాయ పద్ధతులకు పెద్దపీట సహజ వ్యవసాయ పద్ధతులపై ముఖ్యమంత్రి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. అంతకు ముందు టీటీడీ ఈవో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేశారు. అనంతరం అన్నమయ్య భవనం అవరణంలో నిత్య పుష్ప కైంకర్య సేవలో తరించిన పుష్పాలతో తయారు చేసిన దేవతా కళా కృతులను ముఖ్యమంత్రి పరిశీలించి, వాటిని తయారు చేసిన మహిళలను అభినందించారు. తిరుమల, ఇంద్రకీలాద్రి కార్యక్రమాల్లో మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), పేర్ని వెంకట్రామయ్య, ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మార్గాని భరత్, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్లు, పలువురు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. సీఎం సంప్రదాయాలు పాటించే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా సాధారణంగా ఉంటూ సంప్రదాయాలకు విలువ ఇచ్చే వ్యక్తి అని మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామి వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తాను తిరుమలకు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. శ్రీవేంకటేశ్వర కన్నడ భక్తి చానల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం స్వామి వారి దయతోనే జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని సంప్రదాయ బద్ధంగా, చాలా బాగా నిర్వహించారని టీటీడీని అభినందించారు. సహజ వ్యవసాయ పద్ధతులపై ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకుంటున్న దృశ్యం -
Indrakeeladri: దుర్గమ్మను దర్శించిన గవర్నర్ దంపతులు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆలయ పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. (చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ) దర్శనం అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, దసరా మొదటి రోజున దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, కరోనాను ప్రపంచం నుంచి దూరం చేయాలని అమ్మవారిని కోరుకున్నానని గవర్నర్ తెలిపారు. చదవండి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయండి -
దుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ ఛైర్మన్ దంపతులు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. వారికి ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న వైవీ సుబ్బారెడ్డి దంపతులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ ఛైర్మన్, ఈవో అందజేశారు. -
దుర్గ గుడి దర్శన వేళల్లో మార్పులు..
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): కోవిడ్ నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తులు, ఆలయ సిబ్బంది భద్రత దృష్ట్యా దేవస్థాన అధికారులు, పాలక మండలి ప్రత్యేక నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. దేవస్థానంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు ఇకపై పరోక్ష పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు మాత్రమే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. పంచహారతులు, ఏకాంత సేవలకు భక్తులను అనుమతించరు. రాత్రి 7 గంటల తర్వాత ఘాట్ రోడ్డుతో పాటు మహా మండపం మెట్ల మార్గాన్ని మూసివేస్తారు. అమ్మవారికి సమర్పించే పూజ సామగ్రి , ఇతర వస్తువులను ఆలయ అర్చకులు తాకరాదని ఆదేశాలు జారీ చేశారు. జలుబు, జ్వరం ఇతర అనారోగ్య లక్షణాలు ఉన్న భక్తులను క్యూ లైన్లోకి అనుమతించరు. క్యూలైన్లోకి ప్రవేశించే ముందుగానే భక్తులకు శానిటైజర్ అందించడంతో పాటు థర్మల్ గన్స్‌తో శరీర ఉష్ణోగ్రత చెక్ చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆలయ సిబ్బంది ఎవరైనా మాస్క్ ధరించని పక్షంలో రూ.200 జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ద్వారకా తిరుమలలో కోవిడ్ నిబంధనలు కఠినతరం ద్వారకా తిరుమల: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో ఈ నెల 26 నుంచి కోవిడ్ నిబంధనలను మరింత కఠినతరంగా అమలు చేయనున్నట్లు ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయ వీఐపీ లాంజ్‌లో ఎస్ఐ డి.దుర్గామహేశ్వరరావుతో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇకపై అన్నప్రసాదాన్ని ప్యాకెట్ల రూపంలో తూర్పు రాజగోపుర ప్రాంతంలో, నిత్యాన్నదాన భవనం వద్ద భక్తులకు అందజేస్తామన్నారు. ఉచిత ప్రసాద పంపిణీని పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. దేవస్థానం ఉచిత బస్సులను నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆలయ కల్యాణ మండపాల్లో 100 మందితోనే వివాహాది శుభకార్యాలను జరుపుకోవాలని తెలిపారు. 10 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు ఆలయానికి రావొద్దని కోరారు. ఆలయ దర్శన వేళల్లో ఎటువంటి మార్పులు లేవని తెలిపారు. చదవండి: కరోనా విపత్తులో సీఎం జగన్ సేవలు భేష్ రాష్ట్రానికి చేరుకున్న 4 లక్షల కోవిషీల్డ్ డోసులు -
నేరుగా అమ్మ దర్శనానికే..!
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): అమ్మవారి దర్శనానికి ఆన్లైన్, కంప్యూటర్ టోకెన్ల విధానాన్ని దుర్గగుడి ఈవో భ్రమరాంబ శుక్రవారం రద్దు చేశారు. దుర్గగుడి ఈవోగా బాధ్యతలు చేపట్టిన భ్రమరాంబ గురువారం రాత్రి భక్తులకు టికెట్లు జారీ చేస్తున్న టోకెన్ల విధానాన్ని పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు ఉచిత దర్శనం కోసం నేరుగా క్యూలైన్లోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రూ.300, రూ.100 టికెట్లను క్యూలైన్ల వద్దే జారీ చేసే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం దేవస్థాన ఆవరణలో దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడుని ఈవో భ్రమరాంబ మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది, చైత్రమాస బ్రహ్మోత్సవాల వేడుకల నిర్వహణ, అభివృద్ధి పనుల గురించి చర్చించారు. చదవండి: ఆంధ్రజ్యోతి ప్రెస్‌కు ఐలా నోటీసులు చంద్రబాబు, నారా లోకేశ్‌పై డీజీపీకి ఫిర్యాదు -
వెండి సింహాల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, విజయవాడ: దుర్గ గుడిలో మూడు వెండి సింహాల ప్రతిమల అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన నిందితుడు సాయిబాబాతో పాటు బంగారం వ్యాపారి కమలేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. గత సంవత్సరం సెఫ్టెంబర్ 17న దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల వెండి రథంలోని నాలుగు వెండి సింహాల్లో మూడు సింహాలు మాయమైనట్లు ఫిర్యాదు అందిందని, కానీ జులైలో దొంగతనం జరిగినట్లు విచారణలో తేలిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి150 మందిని విచారించామని, ఈ కేసులో ప్రధాన నిందితుడు భీమవరం మండలం గొల్లవానిరేవు గ్రామానికి చెందిన సాయిబాబాగా నిర్థారించామని సీపీ పేర్కొన్నారు. గతంలో భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు పట్టణాలలోని ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితుడు సాయిబాబా.. 2012లో చివరిసారిగా పోలీసులకు పట్టుబడ్డాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఆలయాల్లో చోరీలు మొదలుపెట్టాడని సీపీ వెల్లడించారు. సాయితో పాటు బంగారం వ్యాపారి ముత్తా కమలేష్‌ను కూడా అరెస్టు చేశామని, చోరికి గురైన మొత్తం వెండితో పాటు మిగతా ఆలయాల్లో దొంగతనాలకు సంబంధించిన 6.4 కేజీల వెండిని రికవరి చేశామని సీపీ తెలిపారు. 59 వేల దేవాలయాలు జియో ట్యాగింగ్.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రత పెంచామని సిట్ డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. 59 వేల దేవాయాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు, 45 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అన్ని చర్యలు చేపట్టినప్పటికి కొంతమంది దురుద్దేశ్యంతో అసత్య ప్రచారం చేస్తున్నారని, వారి పై చర్యలు తీసుకుంటామని డీఐజీ వెల్లడించారు. -
దుర్గ గుడి ‘దొంగ’ దొరికాడు
సాక్షి, అమరావతి బ్యూరో: బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారి వెండి రథానికి చెందిన మూడు వెండి సింహాల ప్రతిమలను అపహరించిన దొంగను విజయవాడ వెస్ట్‌జోన్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఈ మిస్టరీకి తెరపడింది. గతేడాది సెప్టెంబరులో ప్రతిమలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు శాఖ మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన ఈ బృందాలు చివరకు ఇది తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడు జక్కంశెట్టి సాయిబాబా (52) పనేనని నిర్ధారణకు వచ్చాక.. అందుకు సంబంధించిన పక్కా సాంకేతిక ఆధారాలను సేకరించాయి. వాటి ఆధారంగా జక్కంశెట్టి సాయిబాబాను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ చోరీకి పాల్పడింది తానేనని అంగీకరించాడు. వాటిని తూర్పుగోదావరి జిల్లా తునిలోని ఓ బంగారం వ్యాపారికి విక్రయించినట్లు పోలీసులకు తెలిపాడు. గోప్యంగా విచారణ చోరీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీసు కమిషనర్.. వెస్ట్‌జోన్ ఏసీపీ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఆలయంలో పనిచేసే సిబ్బందిని విచారించారు. అలాగే, ఆ సమయంలో దేవాలయ అభివృద్ధి పనుల కోసం పనిచేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు, ఈ తరహా చోరీలకు పాల్పడే పాత నేరస్తులను పోలీసులు విచారించారు. చోరీ జరిగిన సమయంలో పాత నేరస్తులు ఎక్కడ ఉన్నారు? వారి కదలికలు, ఫోన్ కాల్‌డేటాతోపాటు టవర్ లోకేషన్ తదితర సాంకేతిక ఆధారాలను సేకరించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడు జక్కంశెట్టి సాయిబాబా చోరీ జరిగిన సమయంలో దుర్గగుడి సమీపంలో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వెంటనే ప్రత్యేక బృందాన్ని తూర్పు గోదావరి జిల్లాకు పంపి సాయిబాబాను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించి గోప్యంగా విచారిస్తున్నారు. విచారణలో తానే అపహరించినట్లు సాయిబాబా అంగీకరించాడని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ వెండి ప్రతిమలను తూర్పుగోదావరి జిల్లా తునిలోని ఓ బంగారం వ్యాపారికి విక్రయించాడని, వాటిని సదరు వ్యాపారి కరిగించినట్లు తెలిసిందని, ఆ వ్యాపారిని సైతం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సాయిబాబాపై ఇప్పటివరకు 100కు పైగా కేసులున్నాయని.. వీటిలో అత్యధిక కేసులు ఆలయాలకు సంబంధించినవేనని వివరించారు. దొంగ దొరికింది ఇలా.. ప్రత్యేక బృందంలోని ఓ ఎస్సై.. సాయిబాబా కార్యకలాపాలపై దృష్టిసారించటంతో కేసు చిక్కుముడి వీడింది. 2007, 2008 మధ్యలో జక్కంశెట్టి సాయిబాబా ఆలయాల్లో దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. ఇప్పటివరకు అతనిపై వంద కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి, నరసాపురం, పాలకోడేరు, నిడదవోలు ప్రాంతాల్లోని దేవాలయాల్లో చోరీలు చేశాడు. సాయిబాబా వ్యవహారశైలి తెలిసిన ఈ ఎస్సై అతనిపై నిఘా పెట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉంటున్న సాయిబాబా భార్య ఇంటికి వెళ్లి.. ‘మీకు ఇళ్ల పట్టా వచ్చింది.. మీ భర్త వివరాలు తెలియజేయండి’.. అంటూ ఎస్ఐ నమ్మబలికారు. దీంతో ఆమె తన భర్తకు ఫోన్‌చేయగా సాయిబాబు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలికి నిందితుడు వెండి సింహాల ప్రతిమల చోరీ కేసు కొలిక్కి రావడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. మరింత లోతుగా విచారించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా చోరీ తీరును తెలుసుకునే క్రమంలో నిందితుడు సాయిబాబాను ఘటనా స్థలానికి తీసుకెళ్లి ‘సీన్ రీ కన్స్ట్రక్షన్’ చేయనున్నారు. కొండపైకి ఎప్పుడు చేరాడు? ఏ సమయంలో చోరీకి పాల్పడ్డాడు? తర్వాత వాటిని తీసుకుని ఏ మార్గంలో బయటపడ్డాడు? ఎక్కడ వాటిని దాచాడు? ఎవరికి విక్రయించాడు? ఇతరులు ఎవరైనా సహకరించారా? అనే అంశాలపై నిందితుడిని విచారణ చేయనున్నామని ఆ అధికారి వివరించారు. -
దుర్గమ్మను దర్శించిన బండారు దత్తాత్రేయ
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. దర్శనం అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటం గవర్నర్‌కు ఆలయ ఈవో అందజేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించాలని దుర్గమ్మను కోరుకున్నానని తెలిపారు. వివేకానంద స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆయన సక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: ఏపీకి వ్యాక్సిన్ వచ్చేస్తోంది..) దత్తాత్రేయను కలిసిన డీజీపీ.. పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన బండారు దత్తాత్రేయను డీజీపీ గౌతమ్ సవాంగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. గేట్ వే హోటల్లో ఆయనకు పుష్ఫగుచ్ఛం అందించారు. అనంతరం డీజీపీని హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ సత్కరించారు.(చదవండి: అరుదైన బొగ్గు క్షేత్రం ఏపీఎండీసీ కైవసం) -
‘ఆ మద్యానికి నాకు సంబంధం లేదు’
సాక్షి, విజయవాడ : దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు చక్కా వెంకట నాగ వరలక్ష్మి కారులో మద్యం సీసాలు లభించడంతో జగ్గయ్యపేట పోలీసులు కేసు నమోదు చేసినట్లు పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. వరలక్ష్మికి చెందిన కారుకు దుర్గగుడి సభ్యురాలిగా నేమ్ బోర్డు ఉండటంతో నైతిక బాధ్యత వహించి ఆమె రాజీనామా చేశారని పేర్కొన్నారు. తన కారు డ్రైవరే ఈ ఘటనకు బాధ్యుడిని పేర్కొన్న వరలక్ష్మి పట్టుబడిన మద్యానికి తనకు సంబంధం లేదని అన్నారు. అయితే ఈ చర్యకు నైతిక బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేశారని పేర్కొన్నారు. దీనిపై చర్చించి వరలక్ష్మీ రాజీనామాను ఆమోదించినట్లు వెల్లడించారు. (‘ఆలయాలపై దాడులకు పాల్పడే వారిని వదలం’) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా, అమ్మవారి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు వ్యవహరించాల్సి ఉందని సూచించారు. ఈ కేసులో నిజానిజాలు తేలేంత వరకు దుర్గగుడి బాధ్యతలకు దూరంగా ఉంటానని వరలక్ష్మి తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. (‘దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. 9 రోజులే’) -
21న దుర్గమ్మ ఆలయం మూసివేత
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): వచ్చే ఆదివారం 21వ తేదీన సూర్యగ్రహణం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయాలతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేయనున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. ♦ 20వ తేదీ సాయంత్రం అమ్మవారికి పంచ హారతుల అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ♦ ఇక 21వ తేదీ ఉదయం 10–25 గంటలకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 1–54 గంటలకు విడుస్తుందని పేర్కొన్నారు. గ్రహణం వీడిన అనంతరం మధ్యాహ్నం 2–30 గంటలకు ఆలయాన్ని తెరిచి శుభ్రపరుస్తారు. అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయంత్రం పంచహారతుల అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ♦ ఈ నేపథ్యంలో 21వ తేదీ అన్ని దర్శనాలను రద్దు చేశారు. ♦ 22వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు దర్శనాలు యథావిధిగా ప్రారంభమవుతాయని తెలిపారు. -
దుర్గమ్మకు పట్టువస్ర్తాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్
సాక్షి, విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయనకు ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. టీటీడీ తరపున దుర్గమ్మకు పట్టు వస్ర్తాలు సమర్పించిన వైవీ సుబ్బారెడ్డి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. టీటీడీ తరపున దుర్గమ్మకు సారె ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని వైవీ తెలిపారు. రాష్ట్ర్రంలో అన్ని దేవాలయాల్లో ధూప,దీప నైవేద్యాలకు దేవాదాయ శాఖ నిధులు కేటాయించిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలకు దుర్గమ్మ ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. సుబ్బారెడ్డికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఈవో సురేష్‌బాబు,అర్చకులు స్వాగతం పలికారు. విజయవాడలో దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దుర్గమ్మ తెప్పోత్సవానికి రెండంచెల భద్రత దుర్గమ్మ తెప్పోత్సవం నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆదివారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. రెండంచెల భద్రత నడుమ దుర్గమ్మ తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ వస్తోందన్నారు. బోటు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాలని సంబంధింత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టిన తర్వాతే తెప్పోత్సవం నిర్వహించాలని వెల్లడించారు. ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ,పోలీస్, దేవాదాయ, పురపాలక, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం: సీపీ
సాక్షి, విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీమహాలక్ష్మి అమ్మవారిని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్(సీపీ) ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం భద్రతా కారణాల దృష్ట్యా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి పటిష్ట బందోబస్తుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. సీఎం దర్శనానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అంతేగాక భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి కోసం 3 క్యూలైన్లు పూర్తి స్థాయిలో యథావిధిగా కొనసాగుతాయని సీపీ తెలిపారు. ఈ రోజు శుక్రవారం కావటంతో ఉదయం 7 గంటల నుంచే రద్దీ పెరిగిందనీ, పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయని చెప్పారు. కాగా దేవస్థానంలో విధులు నిర్వహించే వారి వాహనాలకు సైతం కిందే పార్కింగ్ ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత దర్శనం ఉత్సవాలలో భాగంగా ఏడో రోజు అనగా 5వ తేదీ శనివారం అమ్మవారు శ్రీసరస్వతీ దేవిగా దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో తెల్లవారుజామున ఒంటి గంట నుంచే దర్శనాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నామని సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. అదేవిధంగా రేపు భక్తులకు సీతమ్మ వారి పాదాల వద్ద హోల్డింగ్ ఏరియాగా ఏర్పాటు చేసి, వారు వేచి చూసే అవకాశం కల్పించి తర్వాత క్యూలైన్లలో వదలనున్నట్లు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, మజ్జిగ అందిస్తున్నామని తెలిపారు. అంతేగాక అంతరాలయ దర్శనం ఉండబోదని ఈ మేరకు సీపీ స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా వారికి ఎటువంటి టిక్కెట్ రుసుము అవసరం లేకుండా, పూర్తి ఉచిత దర్శనం కల్పిస్తామని అన్నారు. -
'ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం'
సాక్షి, విజయవాడ: ఈనెల 29 నుంచి వచ్చే నెల 8 వరకు జరిగే ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో.. దుర్గమాత పది అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. రేపు నిర్వహించే స్వప్నాభిషేకం అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా భక్తులకు ప్రతీ రోజు ఉదయం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తారు. ఇంద్రకీలాద్రిపై జరిగే మొత్తం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు 7 కోట్లకు పైగా ఖర్చు కానుంది. దసరా ఉత్సవాలలో భక్తులకు అమ్మవారి దర్శనార్థం ఆర్జిత సేవలను నిలుపు చేసింది. అదేవిధంగా కుంకుమార్చనకు ప్రత్యేక సమయం, స్థలం కేటాయించారు. ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన 29వ తేదీ ఆదివారం కావడంతో అమ్మవారు శ్రీ స్వర్ణకవాచాలంకృత దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా రెండో రోజు(30న) శ్రీ బాలత్రిపురసుందరీ దేవిగా, మూడవ రోజు (అక్టోబర్ 1) శ్రీగాయత్రీ దేవిగా, 4వ రోజు శ్రీఅన్నపూర్ణాదేవిగా, 5వ రోజు శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా, 6వ రోజు శ్రీమహాలక్ష్మి దేవిగా, 7వ రోజు శ్రీసరస్వతీ దేవిగా, 8వ రోజు శ్రీదుర్గాదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అలానే నవరాత్రి రోజు అమ్మవారు శ్రీమహిషాసుర మర్ధినీ దేవిగా కనిపించనున్నారు. ఉత్సవాల ఆఖరి రోజున (అక్టోబర్ 8) అమ్మవారు శ్రీరాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వనున్నారు. అదేరోజు సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం జరగనుంది. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, యాత్రికులు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అందుకు అనుగుణంగానే భారీ సంఖ్యలో పోలీసులను మొహరించి పటిష్ట బందోబస్తుకు ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది విధుల్లో మొత్తం 5500 పోలీసులు, 1200 మంది దేవాదాయ శాఖ సిబ్బంది, 350 మంది సెక్యూరిటి సిబ్బంది, 900 మందికి పైగా వలంటీర్లు పాల్గొననున్నారు. ఆలయానికి సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం ద్విచక్ర వాహనాలు, కార్లు నిలిపేందుకు సమీపంలోని 12 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. -
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం
సాక్షి, ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 10 రోజుల పాటు జరిగే వేడుకలకు రాష్ట్ర నలుమూల నుంచి గాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తొలి రోజున ఉదయం 9 గంటలకు దర్శనంఉత్సవాలలో భాగంగా తొలి రోజైన 29వ తేదీ ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉత్సవాలలో తొలి రోజు ఆదివారం కావడంతో అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక కుంకుమార్చన, విశేష ఛండీయాగాలు ప్రారంభం అవుతాయి. ఆదివారం ఉత్సవాలలో తొలి రోజు కావడంతో రికార్డు స్థాయిలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులు వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్ల ద్వారా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. భవానీపురం వైపు నుంచి వచ్చే భక్తులు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ప్రారంభయ్యే క్యూలైన్లను టోల్‌గేటు వద్ద మొయిన్ క్యూలైన్లో కలుపుతారు. కొండపై భాగంలో క్యూలైన్లు దాదాపు పూర్తి కాగా, కొండ దిగువన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దుర్గాఘాట్, దర్గా, రథం సెంటర్లో క్యూలైన్లు పనులు పూర్తి కావాల్సి ఉంది. మరో వైపున ఉత్సవాలకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఆదివారం నాటికి పనులు పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఉత్సవాల నాటికి రెండు లక్షల లడ్డూలు సిద్ధం దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు ప్రసాదాలు అందేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కొండ దిగువన ఉన్న లడ్డూ తయారీ కేంద్రంలో రోజుకు లక్ష లడ్డూలను తయారు చేసే విధంగా సిబ్బందిని నియమించారు. ఆదివారం ఉత్సవాలు ప్రారంభం అయ్యే నాటికి రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేస్తామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మరో వైపున కొండపైన పాత వేద పాఠశాలలో పులిహోర ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన మేరకు పులిహోర తయారు చేస్తామని, ప్రతి రోజు 10 నుంచి 15 క్వింటాళ్లకు పైగా పులిహోర ప్రసాదం తయారు చేసే విధంగా సిబ్బంది అందుబాటులో ఉన్నారని అధికారులు వివరిస్తున్నారు. ప్రసాదాల విక్రయాల కోసం దేవస్థానం కనకదుర్గనగర్‌లో ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేశారు. అర్జున వీధిలో అన్నదానం.. దసరా ఉత్సవాలలో నిత్యం వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అర్జున వీధిలో దేవస్థానం నిర్మించిన షెడ్డులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. ఇక మూలా నక్షత్రం, విజయదశమి రోజున భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాద వితరణ చేస్తామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మెట్ల మార్గంలో హోమగుండం దసరా ఉత్సవాల పది రోజులు భక్తులు అమ్మవారి దీక్షను స్వీకరించడం జరుగుతుంది. భక్తులు అమ్మవారికి ఇరుముడులను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని మెట్ల మార్గం దిగువన దేవస్థానం హోమ గుండాన్ని ఏర్పాటు చేసింది. హోమ గుండం సమీపంలోనే ఇరుముడులను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది దసరా ఉత్సవాల చివరి రెండు రోజులలో సుమారు 2 లక్షలు పైగా భవానీలు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఈ దఫా కూడా ఇదే తరహాలో భవానీలు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఇన్చార్జి మంత్రితో పాటు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌లు పరిశీలించారు. తొలుత కెనాల్‌రోడ్డులో ఏర్పాటు చేసిన క్యూలైన్లు.. తర్వాత సీతమ్మ వారి పాదాల వద్ద కేశఖండన శాలను పరిశీలించారు. ఉత్సవ ఏర్పాట్ల గురించి దేవస్థాన ఈవో ఎంవీ సురేష్‌బాబు, దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాలకు 15 నుంచి 18 లక్షల మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, ఆ రద్దీని తట్టుకునేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. 5న సీఎం పట్టువస్త్రాల సమర్పణ.. కన్నబాబు మాట్లాడుతూ అక్టోబర్ 5వ తేదీన సీఎం జగన్మోహన్రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారన్నారు. ఉత్సవాల సందర్భంగా గతంలో ఎదురైన ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని మరింత సమర్థంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉత్సవాలలో దేవదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సేవలను వినియోగిస్తున్నామన్నారు. తుది దశకు పనులు.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వృద్ధులు, వికలాంగులకు అమ్మవారి దర్శనం త్వరతిగతిన పూర్త అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యటనలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డీసీసీ సీహెచ్, విజయరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చక్రపాణి తదితరులు ఉన్నారు. సాక్షి, అమరావతి: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసే భక్తులు, యాత్రికుల భద్రత దృష్ట్యా పటిష్ట చర్యలు చేపడుతున్నామని విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ.. వీఐపీల రాక కారణంగా వారు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 4,500 మంది అధికారులు, సిబ్బందిని మోహరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయవాడ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు..అంచనా 16 లక్షల మంది..ఈ ఏడాది జరిగే దసరా ఉత్సవాలకు సుమారు 16 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు సీపీ చెప్పారు. సాధారణ రోజుల్లో 50వేల నుంచి లక్ష మంది వరకు, మూలా నక్షత్రం రోజున 2.5లక్షల మంది వస్తారని.. ప్రారంభోత్సవం ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయన్నారు. తెప్పోత్సవం సందర్భంగా కూడా భక్తుల సంఖ్య అధికంగా ఉంటారని భావిస్తున్నామని.. దీంతో అదే స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 25 సెక్టార్లుగా విభజన.. ఈ ఏడాది బందోబస్తును 25 సెక్టార్లుగా విభజించి, కమిషనరేట్ పరిధిలోని 2వేల మంది సిబ్బందితోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చే మరో 2,500 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని సీపీ తెలిపారు. వీరితోపాటు 35 సాయుధ పోలీసు ప్లటూన్లను వినియోగిస్తున్నామన్నారు. ఎక్కువ మందిని ఆలయం, దుర్గా ఘాట్, పరిసర ప్రాంతాల్లో మోహరించామని.. మిగిలిన వారిని ట్రాఫిక్, కీలకమైన చోట్ల ఉంచుతామని చెప్పారు. మొత్తం మూడు విడతల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా నగరంలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఈసారి ఎక్కువ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. డ్రోన్లను వినియోగిస్తున్నామని.. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామని చెప్పారు. సీసీ కెమెరాలతో పాటు, మఫ్తీలో పోలీసు సిబ్బంది గమనిస్తుంటారని.. చోరీలు, వంటి వాటిని అరికట్టే లక్ష్యంతో వీరు పనిచేస్తారని తెలిపారు. çకంట్రోల్ రూమ్‌ల ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. ఒకటో పట్టణ స్టేషన్, నగర పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని.. 24 గంటల పాటు ఇక్కడ సిబ్బంది పరిశీలిస్తుంటారని పేర్కొన్నారు. వర్షాలు పడుతున్నందున విధుల్లో ఉన్న సిబ్బందికి రెయిన్ కోట్లు కూడా ఇస్తున్నామన్నారు. భవానీ సేవాదళ్ ఆసరా గత ఏడాది మాదిరిగానే ఈసారి భవానీ సేవాదళ్ సిబ్బంది ద్వారా వృద్ధులు, దివ్యాంగులకు సాయం అందిస్తారని చెప్పారు. మొత్తం 120 మంది విధుల్లో ఉంటారని.. ప్రతి షిఫ్ట్‌లో 40 మంది పనిచేస్తారన్నారు. భక్తుల సౌకర్యార్థం సమాచార కేంద్రాలు.. ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం నగరంలో ఏడు చోట్ల పోలీసు శాఖ ఆధ్వర్యంలో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆలయంలో రద్దీ ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోవచ్చని తెలిపారు. పరిస్థితిని బట్టి దర్శనానికి వెళ్లొచ్చని. వన్‌టౌన్, భవానీపురం, పోలీసు కంట్రోల్ రూమ్, పోలీసు కమిషనర్ కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్, కమాండ్ కంట్రోల్ కేంద్రం, పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్లో వీటిని ఏర్పాటు చేశామన్నారు. వీఐపీల దర్శనానికి ప్రత్యేక సమయాలు.. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వీఐపీలు కూడా రానున్నారన్నారు. దీని వల్ల సాధారణ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రముఖులకు నాలుగు సమయాల్లో ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. వీఐపీలు కచ్చితంగా ఆ సమయాలలోనే రావాల్సి ఉంటుందన్నారు. ఉదయం 7 నుంచి 8, 11 నుంచి 12, మధ్యాహ్నం 3 నుంచి 4, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు అనుమతించే ఆలోచన ఉందని చెప్పారు. పార్కింగ్‌కు ప్రత్యేక యాప్.. ఆలయానికి సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం సమీపంలో పలుచోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామని సీపీ చెప్పారు. దాదాపు 12 చోట్ల ద్విచక్ర వాహనాలు, కార్లు నిలిపేందుకు ఆస్కారం ఉదన్నారు. దీని కోసం ప్రత్యేకంగా పార్కింగ్ యాప్‌ను రూపొందించామని.. మొబైల్లోనే తమ సమీపంలోని పార్కింగ్ ప్రాంతాలను చూసుకునే అవకాశంతోపాటు అక్కడ ఎంత జాగా ఉందో కూడా తెలుసుకోవచ్చన్నారు.