Vyuham Movie
-
అవాస్తవాలు ప్రచారం చేస్తే ఊరుకోనన్న రామ్ గోపాల్ వర్మ
-
రాంగోపాల్ వర్మ ఇంటికి ప్రకాశం జిల్లా పోలీసులు
-
'వ్యూహం' సక్సెస్ మీట్.. చంద్రబాబుపై ఆర్జీవీ సెటైర్లు
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' థియేటర్లలోకి వచ్చేసింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్‌లో సక్సెస మీట్ ఏర్పాటు చేశారు. దర్శకుడు ఆర్జీవీ అయితే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్.. ఇలా ముగ్గురిపై సెటైర్లు వేశారు. అలానే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కూడా లోకేష్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: 'వ్యూహం' సినిమా రివ్యూ) 'ఆరోజు జగన్ గారు జైలు నుంచి వచ్చినట్టు నేడు లోకేష్ వ్యూహం నుంచి సినిమా రిలీజ్ అయినందుకు హ్యాపీగా ఉంది. చంద్రబాబు 53 రోజులు జైల్లో వున్నాడు మా వ్యూహం కూడా 53 రోజులు ఆపారు ఫైనల్‌గా వ్యూహం రిలీజ్ అయ్యింది. సినిమాలో బిహైండ్ సీన్స్‌ని ఆడియెన్స్ చూస్తున్నారు. అసలు కంటెంట్ అంతా 'శపథం'లో ఉంటుంది. 'వ్యూహం'.. 'శపథం' సినిమాకు ట్రైలర్ లాంటిది. పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్స్ జనాలకు కామెడీలా అనిపిస్తుంది. నా సినిమా అంకితం ఇచ్చేది చంద్రబాబు లోకేష్ పవన్ కల్యాణ్‌లకే. 'వ్యూహం' హిట్ అయింది. మరి ఇపుడు రఘురామకృష్ణం రాజు తన మాట మీద నుంచుంటాడో లేదో చూడాలి? మా వ్యూహానికి ప్రతి వ్యూహం లోకేష్' అని దర్శకుడు ఆర్జీవీ చెప్పుకొచ్చారు. నిర్మాత దాసరి కిరణ్ మాట్లాడుతూ.. 'లోకేష్ గత ఆరు నెలల నుంచి వేరే ఏ పని లేకుండా 'వ్యూహం' సినిమా ఆపడమే పనిగా పెట్టుకున్నారు. ఫైనల్‌గా సినిమా రిలీజ్ అయ్యింది. పెద్ద హిట్ అయ్యింది. లోకేష్ ఘోరంగా ఓడిపోయాడు' అని అన్నారు. (ఇదీ చదవండి: 'ఇంద్రబాబు' పాత్రకు మించి వర్మ 'వ్యూహం'లో ఏముంది..?) -
మార్చి 2న ‘వ్యూహం' రిలీజ్
-
మార్చి 2న 'వ్యూహం' రిలీజ్.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' విడుదలకు సిద్ధమైంది. మార్చి 2న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తొలుత ఫిబ్రవరి 25న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ సాంకేతిక సమస్యల కారణంగా మార్చి 1వ తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు ఓ రోజు ఆలస్యంగా అంటే మార్చి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోను.. హీరోయిన్ ఆండ్రియా షాకింగ్ కామెంట్స్) తాజాగా 'వ్యూహం' సినిమా విడుదలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. 'పట్టు వదలని విక్రమార్కుడిని' అని క్యాప్షన్‌తో పాటు సెన్సార్ సర్టిఫికెట్‌ని చేతిలో పట్టుకున్న ఫొటోని పోస్ట్ చేశారు. వాస్తవానికి రెండు నెలల క్రితమే 'వ్యూహం' రిలీజైపోవాలి. కానీ విడుదల నిలిపేయాని నారా లోకేష్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అడ్డంకులన్నీ క్లియర్ అయిపోవడంతో 'వ్యూహం' సినిమా థియేటర్లలోకి రానుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. దీనికి 'శపథం' అని సీక్వెల్ కూడా త్వరలో రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) పట్టు వదలని విక్రమార్కున్ని .. VYOOHAM in theatres MARCH 2nd 💪 pic.twitter.com/DoGK95a4PB — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 -
వ్యూహం, శపథం చిత్రాలు వాయిదా.. కారణం ఇదే
'వ్యూహం, శపథం' చిత్రాలు వాయిదా పడినట్లు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ప్రకటించారు. ఇప్పటికే 'వ్యూహం' సినిమా ఫిబ్రవరి 23న విడుదల అవుతుందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మార్చి 1న వ్యూహం.. మార్చి 8న శపథం విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సారి కారణం లోకేష్ కాదని వర్మ తెలిపారు. ఫిబ్రవరి 23న సుమారు 9 సినిమాలు విడుదల కానున్నడంతో 'వ్యూహం' సినిమాకు అనుకున్నన్ని థియేటర్లు దొరకడం కష్టం కావడంతో వాయిదా వేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రాల్లో అజ్మల్, మానస ముఖ్య పాత్రలు పోషించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్‌గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తొలి భాగం ఉంటుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన 'వ్యూహం' సినిమా లోకేష్ కారణంగా ఎన్నికల ముందు విడుదల అవుతుందని ఇప్పటికే వర్మ పలు వ్యాఖ్యలు చేశారు. 'వ్యూహం' సినిమా విషయంలో కోర్టు, సెన్సార్ చిక్కులతో అందరిలోనూ ఆసక్తి పెంచిన వర్మ.. తాజాగా సినిమా విడుదలను మరో వారం వాయిదా వేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలో వ్యూహం, శపథం చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో ఈ రెండు చిత్రాలపై మరింత ఆసక్తిని వర్మ పెంచారని చెప్పవచ్చు. మార్చి 1న 'వ్యూహం'.. మార్చి 8న 'శపథం' విడుదల కానున్నాయి. VYOOHAM film and SHAPADHAM film are being postponed to March 1st and March 8th but this time it is NOT BECAUSE OF LOKESH ..It is due to certain technicalities , wanting to do more promotion and also because we are getting better preferred theatres on those dates 💐💐💐 వ్యూహం… — Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2024 -
వాళ్లు 'వ్యూహం' తప్పకుండా చూస్తారు: ఆర్జీవీ
పవర్ఫుల్ వ్యక్తుల బయోపిక్‌లు హిట్ కావడం సహజం. అందుకు యాత్ర, యాత్ర 2 చిత్రాలే నిదర్శనం. వైఎస్సార్, వైఎస్ జగన్‌ల పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక త్వరలోనే వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఆధారంగా ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం, శపథం చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రాల్లో అజ్మల్, మానస ముఖ్య పాత్రలు పోషించారు. వ్యూహం ఫిబ్రవరి 23న విడుదల అవుతుండగా, దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'శపథం' మార్చి 1న విడుదల కానుంది. ‘వ్యూహం’, ‘శపథం’ ల కథేంటి? వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్‌గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తొలి భాగం ఉంటుంది. ఈ క్రమంలో ఎవరెవరు ఏయే వ్యూహాలు రచించారు వంటి ప్రధాన ఘటనలు ఈ సినిమాలో ఉంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కాకుండా ఎవరు వ్యూహం రచించారు..? సీఎం అయ్యే క్రమంలో వైఎస్ జగన్ ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు..? ఈ పొలిటికల్ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేశారు..? చంద్రబాబు అండ్ కో చేసింది ఏమిటి..? ఇలా అనేక సందేహాలకు ఈ చిత్రాలలో చూపించనున్నారు. పార్ట్ -2 'శపథం'లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఏపీ రాజకీయాల్లో ఎలాంటి కుట్రలు మొదలయ్యాయి.. పవన్‌తో కలిసి చంద్రబాబు ప్లే చేసిన గేమ్స్ వంటి అంశాలతో పాటు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం వరకు శపథం ఉంటుంది. లోకేష్ ఎంత తెలివైనోడంటే: ఆర్జీవీ వ్యూహం చిత్రం ట్రైలర్‌తో టీడీపీ బ్యాచ్‌ను ఆర్జీవీ షేక్ చేశారు. దీంతో వ్యూహం సినిమాను ఆపాలని నారా లోకేష్ ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే. చివరకు సెన్సార్ బోర్డుతో పాటు కోర్డు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో వ్యూహం విడుదలకు లైన్ క్లియర్ అయింది. లోకేష్ సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడం వల్ల తనకు మరింత కలిసొచ్చిందని లోకేష్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు వర్మ. ఆ సమయంలా వర్మ ఇలా ఆన్నాడు 'డిసెంబర్లో సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ లోకేష్ తన బుర్ర వాడి ఈ సినిమాను సరిగ్గా ఎన్నికల ముందు రిలీజ్ అయ్యేలా చేశాడు. లోకేష్ ఎంత తెలివైనోడంటే, డిసెంబర్లోనే ఈ సినిమా రిలీజై ఉంటే ఈపాటికి కొందరు మరిచిపోయేవారు. కానీ లోకేష్ సరైన వ్యూహం పన్ని ఎలక్షన్ల టైమ్‌లో వ్యూహం రిలీజ్ అయ్యేలా చేశాడు. అది లోకేష్ తెలివి. అందుకే లోకేష్‌కు ముద్దు ఇచ్చాను.' అని ఆయన చెప్పాడు. చంద్రబాబు సెంటిమెంట్ నంబర్ 23తో వ్యూహాం లింక్ చంద్రబాబుకు, 23 నంబర్‌తో ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ రాజకీయాలపై ఏ మాత్రం టచ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ నంబర్ లింక్ గురించి తెలుసు. ఇప్పుడీ సెంటిమెంట్‌తో వ్యూహం విడుదలకు లింక్ ఉంది. ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమాను నారా లోకేష్ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అది కాస్తా మార్చి 23వ తేదీన విడుదలకు సిద్ధమైంది. వ్యూహం సినిమా ఈనెల 23న రిలీజ్ అవుతున్న సందర్భంగా, మరోసారి చంద్రబాబు చుట్టూ అల్లుకున్న '23 సెంటిమెంట్'ను నెటిజన్లు బయటకు తీశారు.. ఈ విషయంలో ఆర్జీవీ కూడా ఒక ట్వీటేశారు. గతంలో వైసీపీ నుంచి చంద్రబాబు లాక్కున్న 23 ఎమ్మెల్యేల నుంచి మొదలుపెట్టి, ఎన్నికల్లో బాబుకు 23 సీట్లు మాత్రమే వచ్చిన అంశం వరకు, చివరికి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు అరెస్ట్ అయిన తేదీని కూడా ఆయన ప్రస్తావిస్తూ.. ర్యాగింగ్‌కు దిగాడు ఆర్జీవీ. వాళ్లు వ్యూహం తప్పకుండా వ్యూహం చూస్తారు వ్యూహం సినిమాను టీడీపీ-జనసేన జనాలు ఎవ్వరికీ తెలియకుండా వాళ్ల బాత్రూమ్స్లలో చూసుకుంటారనేది తన ఉద్దేశం అంటూ చెప్పాడు. పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు మాత్రం ఆ అవసరం ఉండదన్నాడు. వాళ్లు హ్యాపీగా థియేటర్లకు వచ్చి చూడడం లేదా తమ ఇంట్లో లివింగ్ రూమ్‌లో అందరితో కలిసి చూస్తారని తెలిపాడు. -
Vyuham fever @ US : అమెరికాలో వైఎస్సార్సిపి సిద్ధం
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అద్దం పట్టేలా తీసిన ఆర్జీవీ తీసిన వ్యూహం-శపథం సినిమాల సందర్భంగా అమెరికాలో సందడి నెలకొంది. వ్యూహం, శపథం సినిమాలను చూసిన అమెరికాలోని వైఎస్సార్సిపి నాయకులు, అభిమానులు రాంగోపాల్‌వర్మకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా "సిద్ధం" అని ప్రకటించిన ఎన్నారైలు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సిపి ఘన విజయం సాధించడమే మా "వ్యూహం" అని చాటి చెప్పారు. అమెరికాలోని పలు నగరాల్లో ప్రవాసాంధ్రులు వ్యూహం సినిమా సందర్భంగా సంబరాలు నిర్వహించారు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమాను అడ్డుకునేందుకు తెలుగుదేశం, జనసేన పార్టీలు చివరిదాకా ప్రయత్నించాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటివరకు ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను యథాతధంగా సినిమా రూపంలో తాను ప్రజల ముందుకు తెచ్చానని రాంగోపాల్‌వర్మ ప్రకటిస్తే.. ఆ విషయాలన్నీ బయటకు వస్తే.. తమకు ఇబ్బందులొస్తాయని టిడిపి, జనసేన నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీల నాయకులు కోర్టును ఆశ్రయించారు. (అమెరికాలో వ్యూహం-శపథం సంబరాలు : ఫోటోగ్యాలరీ) ఈ సినిమాకు రెండు నెలల క్రితమే సెన్సార్ పూర్తి కాగా.. విడుదలను ఆపాలని లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత వ్యూహం సినిమా సెన్సార్‌ను తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నిలిపివేయగా.. డివిజన్ బెంచ్‌లో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో వ్యూహం-శపథం చిత్రాలను సమీక్షించిన సెన్సార్ బోర్డు.. యూ సర్టిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 23న పార్ట్-1 సినిమాగా "వ్యూహం2 విడుదలవుతుంటే.. ఒక వారం గ్యాప్‌లోనే సీక్వెల్‌ను "శపథం" పేరుతో మార్చ్ 1న విడుదల చేస్తున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందించామే తప్ప.. ఎవరినీ కించపరిచేలా తీయలేదన్నారు ఆర్జీవీ. వ్యూహం, శపథం సినిమాలను ప్రతీ ఒక్కరు చూసుకుంటారనేదే తన ఉద్దేశమని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. “ఏ పార్టీ వాళ్లు కాకుండా తటస్థంగా ఉన్న వారికి ఆ అవసరం లేదు. మీరు పబ్లిక్‌గా అందరితో చూడొచ్చు. వ్యూహం ఫిబ్రవరి 23, శపథం మార్చి 1న వస్తుంది. మీకు ఇష్టం ఉంటే చూడండి. లేకపోతే మానేయండి” అని అన్నారు ఆర్జీవీ. వారం రోజుల్లో రెండు సినిమాలతో వస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయిన RGV తన సినిమాలు కొందరికి నచ్చుతాయి, కొందరికి కోపం వస్తాయి.. కానీ చూడడం మాత్రం అందరూ చూస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. అమెరికాలోని వేర్వేరు నగరాల్లో వ్యూహం, శపథం సినిమాలను వీక్షించిన వైఎస్సార్సిపి నాయకులు.. ఆర్జీవీ ప్రయత్నాన్ని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మరోసారి ఘనవిజయం సాధిస్తారని, వైనాట్ 175 అన్న నినాదాన్ని నిజం చేయడానికి తమ వంతుగా ప్రయత్నిస్తామన్నారు వైఎస్సార్సిపి నాయకులు. (అమెరికాలో వ్యూహం-శపథం సంబరాలు : ఫోటోగ్యాలరీ) -
UK : లండన్‌లో YSRCP సిద్ధం
లండన్‌లో కేక పుట్టించారు వైఎస్సార్సిపి అభిమానులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభ అత్యంత ఘనంగా జరగడం, జనసంద్రమై సముద్రాన్ని మరిపించడం లండన్‌లోని వైఎస్సార్సిపి అభిమానులను ఎంతో సంతోషపెట్టింది. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్సార్సిపి ఘన విజయం సాధిస్తుంది అనడానికి రాప్తాడు సభ ఒక్కటి చాలని అన్నారు ప్రవాసాంధ్రులు. ఇదే సమయంలో రాంగోపాల్ వర్మ తీసిన రెండు సినిమాలు వ్యూహం, అలాగే శపథం సినిమాలు ఘన విజయం సాధించాలంటూ ఆకాంక్ష వ్యక్తం చేశారు. లండన్‌లోని ఈస్ట్హామ్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో YSRCP అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి YSRCP యూకే కన్వీనర్ Dr ప్రదీప్ చింతా వర్చువల్‌గా మాట్లాడారు. 2024 ఏప్రిల్ నెలలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని, యూకేలో, అమెరికాలో ఉంటోన్న ప్రతీ ఏపీ వ్యక్తి, వైఎస్సార్ అభిమాని కొంత సమయం వెచ్చించి నిజాలను తమ వాళ్లకు తెలపాలని ప్రదీప్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేవరకు ప్రతీ ఒక్కరు విశ్రమించకుండా.. కష్టపడాలని డాక్టర్ ప్రదీప్ దిశానిర్దేశం చేశారు. ఇదే సందర్భంగా ఏపీ రాజకీయాల్లో నిజాలకు అద్దం పట్టేలా రాంగోపాల్‌వర్మ తీసిన వ్యూహం, అలాగే శపథం సినిమాల సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. వ్యూహం సినిమా ఘనవిజయాలు సాధించాలని దర్శకుడు రాంగోపాల్‌వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. YSRCP UK కమిటీ సభ్యులు కార్తీక్ భూమిరెడ్డి, ప్రతాప్ భీమిరెడ్డి, కిషోర్ మలిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన అమెరికాలోని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కడప రత్నాకర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఈనెల 23న వ్యూహం సినిమా విడుదలవుతోంది-రామ్ గోపాల్ వర్మ
-
RGV వ్యూహం చిత్రం విడుదలకు లైన్ క్లియర్
-
టీడీపీ తరఫున లోకేశ్ పిటిషన్ ఎలా వేశారు?
సాక్షి, హైదరాబాద్: ‘వ్యూహం చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) కమిటీ జారీ చేసిన యు సర్టిఫికెట్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సింగిల్ జడ్జి విచారణ జరిపి తీర్పు ఇచ్చారు. ఇక్కడకు అప్పీల్ వచ్చింది.. సమాచారం ఇవ్వడానికి ఇంకా సమయం కావాలని కోరడం ఆమోదయోగ్యం కాదు..’ అంటూ టీడీపీ న్యాయవాదులపై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షుడి(అచ్నెన్నాయుడు, ఏపీ) అనుమతి లేకుండా పిటిషన్ వేయడానికి రిట్ పిటిషనర్(లోకేశ్)కు ఏం అధికారం ఉందని ప్రశ్నించింది. ‘విచారణకు సిద్ధమై రావాలి కదా.. సబ్జెక్ట్‌పై వాస్తవాలు వెల్లడించండి. పార్టీ నిబంధనల ప్రకారం ఏపీ అధ్యక్షుడి అనుమతి ఎందుకు తీసుకోలేదు?’ అని మండిపడింది. శుక్రవారం వరకు సమయం కావాలని టీడీపీ న్యాయవాదులు అడగడాన్ని తప్పుబట్టింది. వ్యూహం చిత్రానికి సీబీఎఫ్సీ ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలంగాణ హైకోర్టులో వేర్వేరుగా అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. నిర్మాత తరఫున సీనియర్ న్యాయవాది వెంకటేశ్ వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసి, చిత్ర విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు పూర్తి కావడంతో ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. -
Vyuham: లోకేష్ న్యాయవాదులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: వ్యూహం సినిమా విడుదల విషయంలో నారా లోకేష్‌కు ఎదురుదెబ్బ తప్పదా?. తాజాగా ఆయన వేసిన పిటిషన్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇందుకు నిదర్శనం. వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. పూర్తి సమాచారం లేకుండా వాదనలా? అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ తరఫున పిటిషన్ వేసేందుకు లోకేశ్‌కు ఏం అర్హత ఉందంటూ కోర్టు ప్రశ్నించింది. ‘‘ఉపన్యాసాలు, ఉపోద్ఘాతాలు వద్దు.. సబ్జెక్ట్‌పై వాస్తవాలు చెప్పండి. ఇంకా సమయం కావాలని కోరడం.. కోర్టు సమయాన్ని వృథా చేయడమే అంటూ లోకేష్ న్యాయవాదులపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ‘వ్యూహం’పై వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' సినిమా డిసెంబర్ 29వ తేదీనే థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ సినిమాను విడుదల కాకుండా ఉండేందుకు నారా లోకేష్ కోర్టు మెట్లు ఎక్కారు. తెలంగాణ కోర్టు సూచనమేరకు వ్యూహం సినిమాకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు కాంగ్రెస్, జనసేన, టీడీపీ శ్రేణులు, నారా లోకేష్, గంటా శ్రీనివాస్, ఎల్లో మీడియా ఇలా ఎందరో వర్మ 'వ్యూహం' సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. మొదట సినిమాను అడ్డుకునేందుకు సెన్సార్ బోర్డుకు నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. అప్పుడు CBFC కూడా సినిమాను మళ్లీ రివ్యూ చేసి 'యూ' సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో వర్మ దెబ్బకు బయపడిపోయిన లోకేష్ కోర్టుకు వెళ్లాడు.. సినిమా వస్తే ఇంతకాలం బయటకు తెలియని ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలుస్తాయనే భయంతో ఆయన కోర్టు మెట్లు ఎక్కాడు. ఇదీ చదవండి: 'ఇంద్రబాబు' పాత్రకు మించి వర్మ 'వ్యూహం'లో ఏముంది..? -
'వ్యూహం' సినిమాపై తీర్పు రేపటికి వాయిదా
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' చిత్రంపై తెలంగాణ హైకోర్టులో విచారణ మంగళవారం మరోసారి జరిగింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం చెప్పింది. ఈ చిత్ర విడుదల అంశంపై తాజాగా హైకోర్టులో విచారణ జరుగుతోంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో చిత్ర యూనిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే సినిమా విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని చిత్ర యూనిట్ న్యాయస్థానాన్ని కోరింది.ఈ నేపథ్యంలో తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. (ఇదీ చదవండి: ఒక్కరోజే థియేటర్లలోకి 10 సినిమాలు.. అదొక్కటే కాస్త స్పెషల్) వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్తో పాటు పలు రికార్డ్స్‌ను ఇప్పటికే సెన్సార్ బోర్డు కోర్టుకు అందజేసింది. సెన్సార్ బోర్డ్ రికార్డ్స్‌ను పరిశీలించిన తరువాత విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. విడుదల విషయంలో జాప్యం జరిగితే భారీ నష్టం వస్తుందని 'వ్యూహం' నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ కోర్టును అభ్యర్థించారు. ఈ క్రమంలోనే విచారణ జరుగుతోంది. 'వ్యూహం' సినిమాని అడ్డుకునేందుకు తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత లోకేష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల అంశంలో జాప్యం ఎదురైంది. లోకేష్ పిటిషన్‌తో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి సినిమా విడుదలను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. (ఇదీ చదవండి: 'యాత్ర-2' నుంచి మరో సాంగ్ విడుదల) -
కొలికపూడి తలెక్కడ దాచుకున్నాడు: వర్మ
సాక్షి,హైదరాబాద్: తల నరుకుతా అన్నవాడు.. తల ఎక్కడ దాచుకున్నాడు? అని సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ ప్రశ్నించారు. తన తల నరికి తెస్తే కోటి రూపాయల బహుమతి ఇస్తానన్న కొలికపూడి శ్రీనివాసరావుపై రెండు రోజుల క్రితం ఆర్జీవీ ఆంధ్రప్రదేశ్ డీజీపికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కొలికిపూడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఏపీ సీఐడీ పోలీసులు కొలికిపూడిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని కొలికిపూడి ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లారు. కొలికపూడి ఇంట్లో లేకపోవడంతో అయన ఇంటి దగ్గరే పోలీసులు ఎదురు చూస్తున్నారు.కేసు గురించి కొలికపూడి భార్యకు సీఐడీ అధికారులు సమాచారం ఇచ్చారు. వ్యూహం సినిమా విషయంలో కొలికిపూడి వర్మపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇదీచదవండి..జగన్ పదునైన ప్రశ్నలు -
HYD: ఆర్జీవీ ఆఫీస్ వద్ద టీడీపీ కార్యకర్తల ఓవర్ యాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్‌లోని సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. వ్యూహం సినిమాపై పచ్చ నేతలు కడుపు మంట చూపించారు. వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. వ్యూహం సినిమా పోస్టర్లను తగలబెట్టారు. చివరికి పోలీసులు కల్పించుకొని టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. టీడీపీ కార్యకర్తల వీరంగంపై నిర్మాత దాసరి కిరణ్ మాట్లాడుతూ.. సినిమాను సినిమాగానే చూడాలని తెలిపారు. సినిమాను సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం భావ్యం కాదని తెలిపారు. వ్యూహం సినిమా రిలీజ్ చేయకుండా ఉండటానికి టీడీపీ పన్నాగాలు చేస్తుందన్నారు. టీడీపీ కార్యకర్తలు రౌడీయిజం చేయడం, దాడులు చేయడం సరికాదని అన్నారు. టీడీపీ కార్యకర్తల దాడులను ఖండిస్తున్నట్లు తెలిపారు. చదవండి: చంద్రబాబు కుర్చీలాట.. పావుగా పవన్ కల్యాణ్! -
ఆమె బర్రెలక్కగా ఫేమస్ అయితే.. పవన్ బర్రెలాగా మారిపోయాడు: ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వ్యూహం అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జీవితంలో 2009-2014 ఎన్నికల వరకు ఏం జరిగింది అనేది వ్యూహంలో చూపించబోతున్నారు. ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ‘జగ గర్జన’ పేరుతో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ తనదైన స్టైల్లో విమర్శలు కురిపించాడు. పవన్‌ను రంగులా రాజా అంటూ సంబోధిస్తూ సూపర్‌స్టార్ అయి ఉండి కూడా చంద్రబాబు చేతిలో బర్రెలాగా మారిపోయాడని ఎద్దేశా చేశాడు. ‘పవన్ కల్యాణ్ ముఖానికి రంగు వేసుకొని సూపర్ స్టార్‌గా ఎదిగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు నేను ఇది చేస్తా.. అది చేస్తా అని సినిమాల్లో డైలాగులు చెప్పినట్లు చెప్పి వెళ్తే బాగోదు. లేటెస్ట్గా చూస్తే తెలంగాణలో ఊరు, పేరు తెలియని బర్రెలు కాసే అమ్మాయి బర్రెలక్కగా పాపులర్ అయింది. (చదవండి: బెడిసికొట్టిన రీమేక్.. భారీ డిజాస్టర్ చిత్రాలివే!) పవన్ కల్యాణ్ సూపర్ స్టార్ అయి ఉండి బర్రెలెక్క అయిపోయాడు. బర్రెలక్కకి బర్రెలెక్కకి తేడా ఏంటంటే.. బర్రెలక్క ఒక కాపరి. ఇక్కడ ఈయన(పవన్) ఒక బర్రె. చంద్రబాబు, లోకేష్ ఏం చెబితే అది చేస్తున్నాడు. నేను జనసేన మనిషిని కాదు కానీ జనసేన అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అది మొత్తం పోయింది. లోకేష్ అనే అతను ఎవరు? చంద్రబాబు కొడుకు కాకపోతే మాములు కార్తకర్త దగ్గర బాయ్‌గా పని చేసే అర్హత కూడా లేదు’ అని ఆర్జీవీ అన్నారు. ప్రస్తుతం ఆర్జీవీ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
వ్యూహం.. ఒక వాస్తవం
సాక్షి, అమరావతి/ విజయవాడ స్పోర్ట్స్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నుంచి 2019 వరకు కుట్రలు– ఆలోచనల మధ్య జరిగిన రాజకీయమే ‘వ్యూహం’ చిత్రమని ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. రాజకీయాలను ప్రజలు చూసే కోణం నుంచే ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఈ చిత్రంలో ఎలాంటి కల్పితాలు లేవని, పాత్రల పేర్లు సైతం రాజకీయ నాయకుల వాస్తవ పేర్లతోనే తెరకెక్కించామని స్పష్టం చేశారు. విడుదలను ఆపేందుకు పన్నిన కుట్రలను సైతం ఛేదించుకుని ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ప్రకటించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వ్యూహం’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘జగ గర్జన’ పేరుతో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. వ్యూహం సినిమాలో షాట్ వన్ను ఎంపీ నందిగం సురేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ వెన్నుపోటుతోనే ఫేమస్ అయిన చంద్రబాబునాయుడు ఇప్పటికీ తన రాజకీయ సౌలభ్యం కోసం ఎన్టీఆర్ అభిమానులను వాడుకుంటున్నారని చెప్పారు. ఈ చిత్రం ద్వారా తన పరువు పోతుందని, విడుదల ఆపాలని లోకేశ్ కోర్టుకెళ్లడం పెద్ద జోక్ అన్నారు. తెల్లారి లేస్తే లోకేశ్ అందర్నీ పచ్చి బూతులు తిడుతూ అవమానించడం ఇతరుల పరువు తీయడం కాదా.. అని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ను రంగుల రాజాగా అభివర్ణించారు. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్కకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పవన్‌కల్యాణ్‌కు లేదని, ఆంధ్రాలో చంద్రబాబు, లోకేశ్‌లకు ప్రస్తుతం బర్రె ‘లెక్క’ పవన్‌కల్యాణ్ మారాడని ఎద్దేవా చేశారు. బట్టలూడదీస్తాం.. రోడ్డు మీద ఈడ్చి తంతాం.. కోస్తాం.. అంటూ పవన్‌కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ ప్రతిరోజూ మాట్లాడుతుంటారని, ఇలాంటి వ్యాఖ్యలు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ సైతం మాట్లాడరని ఆయన చెప్పారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత రాష్ట్రంలో జరిగిన కుట్ర రాజకీయాలను, కాంగ్రెస్‌తో చేతులు కలిపి చంద్రబాబు పన్నిన పన్నాగాలను, బాబు హయాంలో జరిగిన ప్రజాధనం దోపిడీని ఈ చిత్రంలో తెరకెక్కించారని తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరారు. నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ మంచి మనసున్న ప్రజానేత సీఎం జగన్ జీవిత చరిత్రను తెరకెక్కించడం తనకు దక్కిన అదృష్టమన్నారు. స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ మంచి ప్రజానాయకుల జీవిత చరిత్రను ప్రముఖ దర్శకుడు తెరకెక్కించడం మంచి పరిణామమన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెప్పారు. ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, శివకుమార్, అదీప్‌రాజు, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ గౌతంరెడ్డి ప్రసంగించారు. సంగీత దర్శకురాలు కీర్తన, పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, రాజకీయ, సినీరంగ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. -
Live: వ్యూహాం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
వ్యూహం... నేను నమ్మిన రియాలిటీ
‘‘నేను తీసినటువంటి విభిన్న రకాలైన సినిమాలు ఎవరూ తీయలేదు. రాజకీయ నాయకులు, పోలీసులు.. ఇలా ఎవరైనా కావొచ్చు. నాకు పవర్ఫుల్ వ్యక్తుల బయోపిక్‌లు తీయడం అంటే ఇష్టం’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. అజ్మల్, మానస ముఖ్య తారలుగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘వ్యూహం’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ‘వ్యూహం: 1’ ఈ నెల 29న విడుదల కానుంది. మలి భాగం ‘శపథం’ పేరుతో జనవరి 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘వ్యూహం: 1’ రెండో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. ‘వ్యూహం’ సినిమా రిలీజ్‌ను ఎవరూ ఆపలేరు అని నేను గతంలోనే చెప్పాను. ఇప్పుడు నేను, కిరణ్‌గారు కలిసి నిరూపించాం. క్లీన్ యూతో మాకు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా వచ్చింది? అనేది సీక్రెట్. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సమయం నుంచి 2023 వరకు ‘వ్యూహం’ సినిమా మొత్తం కథనం ఉంటుంది. వైఎస్ జగన్‌గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తొలి భాగం ఉంటుంది. ఈ క్రమంలో ఎవరెవరు ఏయే వ్యూహాలు రచించారు వంటి ప్రధాన ఘటనలు ఈ సినిమాలో ఉంటాయి. ‘వ్యూహం’ తొలి భాగంలో ఏవైనా సందేహాలు కలిగితే అవి రెండో భాగంలో నివృత్తి అవుతాయి. నిజ జీవితంలోని వ్యక్తులు, వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. కానీ నేను నమ్మిన రియాలిటీతోనే ‘వ్యూహం’ ఉంటుంది. సినిమా అంటేనే నాటకీయత. కాబట్టి ఈ సినిమాలో ఆ నాటకీయత కూడా ఉంటుంది. ప్రేక్షకులకు తెలియని విషయాలు కూడా ఈ సినిమాలో ఉంటాయి. ‘వ్యూహం’ సినిమాలో కామెడీ పాత్ర కూడా ఉంది. ఆ పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది. భవిష్యత్తులో ‘వ్యూహం’ తరహా సినిమాలను నేను తీస్తానా? అంటే చెప్పలేను. ఎందుకంటే నా మాటపై నేను నిలబడను’’ అని అన్నారు. ‘‘రామ్‌గోపాల్ వర్మగారితో నేను గతంలో ‘వంగవీటి’ సినిమా చేశాను. ఆ తర్వాత మళ్లీ సినిమా చేయాలనుకున్నప్పుడు ‘వ్యూహం’, ‘శపథం’ ్రపాజెక్ట్స్ మొదలయ్యాయి. ప్రతి వారం థియేటర్స్‌లోకి మూడు నాలుగు సినిమాలు రావడం సహజమే. అన్నింటికీ థియేటర్లు దొరుకుతాయి. మా ‘వ్యూహం’ సినిమాను ఎక్కువ థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత దాసరి కిరణ్. ఆంధ్రప్రదేశ్ సీయం వైఎస్ జగన్‌గారితో నాకు పరిచయం లేదు. అయితే జగన్‌గారంటే నాకు పాజిటివ్ అభిప్రాయాలు ఉన్నాయి. సీబీఎన్గారంటే కూడా నాకు ఇష్టమే. విలన్స్ అన్నా నాకిష్టమే. ‘నా వెనక ఉండే నీకు అర్థం కాదు తమ్ముడు (ఓ పాత్రధారి).. తన ఊపు చూస్తుంటే ఏదో కొత్త పార్టీ పెట్టేసేలా ఉన్నాడు (మరో పాత్రధారి). క్షవరం అయితే కానీ వివరం తెలియదు అని ఊరికే అనలేదు పెద్దలు (ఓ పాత్రధారి)’ అనే డైలాగ్స్ సినిమాలో ఉన్నాయంటే... చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇంట్లో పని చేసినవారిని సంప్రదించి, నేను నమ్మిన అంశాలతో ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ పెట్టాం. అసలు.. జనసేనలో పవన్‌కల్యాణ్ టీడీపీ కోవర్ట్‌గా పని చేస్తున్నాడని నా అభిప్రాయం. పవన్ పార్టీ పెట్టినప్పుడు అతన్ని అభిమానిస్తున్నట్లుగా మాట్లాడాను. కానీ అతనిలో స్థిరత్వం లేదు. ఇక తెలంగాణలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ప్రతిపక్ష పార్టీ లేదని నా అభిప్రాయం. ఎన్నికల్లో ఎవరెవరు నిలబడుతున్నారు? వారు ఏమేం హామీలు ఇస్తున్నారనే రాజకీయ పరిజ్ఞానం నాకు లేనప్పుడు ఎన్నికల్లో ఓటు వేయడం కరెక్ట్ కాదని, ఓ బాధ్యత గల పౌరుడిగా నేనిప్పటి వరకూ ఓటు వేయలేదు. – రామ్‌గోపాల్ వర్మ -
'వ్యూహం' రెండో ట్రైలర్ పీక్స్.. రసగుల్లా కంటే చంద్రబాబే ఇష్టం: వర్మ
టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'వ్యూహం'.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయో ఉన్నది ఉన్నట్లు చూపించేదే వ్యూహం సినిమా అని ఆర్జీవీ తెలిపారు. నవంబరు 10న విడుదల కావాల్సిన ఈ సినిమాపై నారా లోకేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో ఆ సమయంలో బ్రేక్ పడింది. తర్వాత సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి మళ్లీ సినిమాను పంపించడం ఆపై రామ్ గోపాల్ వర్మకు అనుకూలంగా సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడం వంటివి జరగడంతో.. డిసెంబర్ 29న వ్యూహం సినిమా విడుదలకు రెడీగా ఉంది. దీంతో వ్యూహం సినిమా నుంచి మరో ట్రైలర్‌ను ఆయన విడుదల చేశారు. మొదటి ట్రైలర్ మాదిరే రెండో ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది.ఈ క్రమంలో ఆయన తాజాగా మీడియా సమావేశం నిర్వహించి ఇలా వ్యాఖ్యానించారు. 'అరచేతిని అడ్డుపెట్టి ఎవరూ వ్యూహం సినిమాను ఆపలేరు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఫైనల్‌గా సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు ఎలాంటి మాయ చేసి క్లీన్ యు సర్టిఫికెట్ తెచ్చారని నన్ను అడగొద్దు. మళ్లీ చెబుతున్న ఏపీ సీఎం జగన్‌తో నాకు పరిచయం లేదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఏం జరిగింది..? అనేది ఈ వ్యూహం చిత్రంలో చూపించాము. ఇందులో అన్ని అంశాలను టచ్ చేసాము. గతంలో బయట వాళ్లు మైక్స్ దగ్గర ఏమీ చెప్పారో.. అది మాత్రమే ప్రజలకు తెలుసు కానీ వాళ్ల ఇంట్లో పర్సనల్‌గా చర్చించే విషయాలను కూడా ఇందులో చూపించాను. ఈ చిత్రంలో అన్ని క్యారెక్టర్లు ఫిక్షనల్ మాత్రమే.. నేను ఏమీ చూపించానో అనేది తెలియాలంటే సినిమా చూస్తే తెలుస్తుంది. సెన్సార్ సర్టిఫికెట్తో సినిమా పోస్టర్ డిజైన్ చేసిన చరిత్ర నాది. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేషన్ ఎలా వచ్చిందని చెబితే మమ్మల్ని జైలుకు పంపిస్తారు. దావూద్ ఇబ్రహీంతో ఫోన్ చేయించడం వల్ల వ్యూహం సినిమాకు సెన్సార్ చేశారు. వ్యూహం సినిమా ఒక పొలికల్ డ్రామా... వైఎస్సార్ చనిపోయిన దగ్గరి నుంచి జగన్ పాదయాత్ర వరకు వ్యూహం ఉంటుంది. రసగుల్లా కంటే కూడా చంద్రబాబు అంటేనే నాకు ఇష్టం.' అని ఆర్జీవీ అన్నారు. ఈ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా, జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
వ్యూహం సినిమా ట్రైలర్
-
ఈ శుక్రవారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్
మరో వీకెండ్ వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో 'సలార్' రిలీజ్ కానుంది. దీంతో ఈ వారాంతంలో చిన్నాచితకా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో మూవీ లవర్స్ కాన్సంట్రేషన్ అంతా ఓటీటీలపై పడుతుంది. దీనికి తగ్గట్లు ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లో 22 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో పలు మూవీస్ ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఇంతకీ అవేంటో చూసేద్దామా? (ఇదీ చదవండి: Bigg Boss 7: యావర్ ఏడ్చేశాడు.. ప్రశాంత్ ఏడిపించేశాడు!) ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ విషయానికొస్తే.. ఫలిమి, శేషన్ మైక్-ఇల్ ఫాతిమా లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు 'వ్యూహం' అనే వెబ్ సిరీస్ ఆసక్తి కలిగిస్తోంది. 'జపాన్', 'స్కార్క్' లాంటి మూవీస్.. ఆల్రెడీ ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో కాస్త చెప్పుకోదగ్గ మూవీస్. శుక్రవారం 22 మూవీస్ వస్తుండగా.. వీకెండ్ అంతా కలిపి 31 వరకు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనేది చూద్దాం. ఈ శుక్రవారం ఓటీటీ రిలీజ్ మూవీస్ (డిసెంబరు 15th) హాట్‌స్టార్ ఫలిమి - మలయాళ మూవీ ద ఫ్రీలాన్సర్ సీజన్ 2 - హిందీ సిరీస్ టిరా - ఇండోనేసియన్ సిరీస్ (డిసెంబరు 16) అమెజాన్ ప్రైమ్ వ్యూహం - తెలుగు సిరీస్ (స్ట్రీమింగ్) డెత్స్ గేమ్ - కొరియన్ సిరీస్ రీచర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ డెహటి లడ్కే - హిందీ సిరీస్ ఫస్ట్ యాక్ట్ - హిందీ సిరీస్ ఇమ్మెచ్యూర్ సీజన్ 3 - హిందీ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఆర్చర్: సీజన్ 14 - ఇంగ్లీష్ సిరీస్ వన్ పీస్ ఫిల్మ్ రెడ్ - జపనీస్ సినిమా క్యారోల్ & ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ - ఇంగ్లీష్ సిరీస్ చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ - ఇంగ్లీష్ సినిమా ఫేస్ టూ ఫేస్ విత్ ఈటీఏ: కన్వర్జేషన్స్ విత్ ఏ టెర్రరిస్ట్ - స్పానిష్ మూవీ ఫమిలియా - స్పానిష్ మూవీ ఐ లవ్ లిజీ - తగలాగ్ చిత్రం శేషన్ మైక్-ఇల్ ఫాతిమా - మలయాళ సినిమా యో! క్రిస్మస్ - ఇంగ్లీష్ సిరీస్ ద రోప్ కర్స్ 3 - మాండరిన్ మూవీ (డిసెంబరు 17) యాస్ ద క్రో ఫ్లైస్: సీజన్ 2 - టర్కిష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) యూ యూ హకూషో - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్) లయన్స్ గేట్ ప్లే డిటెక్టివ్ నైట్: ఇండిపెండెన్స్ - ఇంగ్లీష్ మూవీ ఆపిల్ ప్లస్ టీవీ ద ఫ్యామిలీ ప్లాన్ - ఇంగ్లీష్ సినిమా జియో సినిమా ఔట్ ఆఫ్ టైమ్ - హిందీ మూవీ ద బ్లాకెనింగ్ - ఇంగ్లీష్ చిత్రం (డిసెంబరు 16) ద సోవనీర్ - ఇంగ్లీష్ సినిమా (డిసెంబరు 17) బుక్ మై షో లైలాస్ బ్రదర్స్ - పర్షియన్ మూవీ వింటర్ టైడ్ - ఇంగ్లీష్ సినిమా జీ5 మిస్టర్ అండ్ మిసెస్ - హిందీ సిరీస్ కూసే మునిస్వామి వీరప్పన్ - తమిళ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 ఫైనల్ అతిథిగా ఆ స్టార్ హీరో? వెరీ ఇంట్రెస్టింగ్!) -
Vyuham: ఆర్జీవీ వ్యూహానికి తొలగిన అడ్డంకులు
రాం గోపాల్ వర్మ ‘వ్యూహం’ రిలీజ్‌కు అడ్డంకులు తొలిగాయి. సినిమాకు యూ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ విషయాన్ని ఆర్జీవీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్వయంగా పంచుకున్నారు. ఈ నెల 29వ తేదీన సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రకటించారాయన. ఇక సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించడంపై వర్మ తనదైన స్టైల్లో స్పందించారు. బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గాయ్స్ అంటూ ఎక్స్‌లో సందేశం ఉంచారాయన. BAD NEWS for BAD GUYS 💪 VYUHAM censor CERTIFICATE 🙌 DECEMBER 29 th in THEATRES 😌 pic.twitter.com/LBBKAt977s — Ram Gopal Varma (@RGVzoomin) December 13, 2023 వర్మ డైరెక్షన్లో అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘వ్యూహం’. ఈ సినిమాను అడ్డుకునేందుకు కొందరు విశ్వప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ సైతం రాశారు. ఆ సమయంలో ఆర్జీవీ తీవ్ర స్థాయిలోనే స్పందించారు. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్‌కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’’ అని ఛాలెంజ్‌ను స్వీకరించారాయన. ఇదీ చదవండి- ‘వ్యూహం’ ఏ పార్టీకి చెందింది కాదు.. కేవలం.. : ఆర్జీవీ -
'వ్యూహం' నిర్మాత బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఆర్జీవీ
డైరెక్టర్ ఆర్జీవీ పుట్టినరోజు వేడుకల్లో కనిపించాడు. అవును మీరు సరిగానే విన్నారు. సాధారణంగా ఇలాంటి వాటికి దూరంగా ఉండే రామ్‌గోపాల్ వర్మ.. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఆయన్ని తన డెన్‌కి ఆహ్వానించి నిలువెత్తు పూలమాలతో సత్కరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాకిచ్చిన బిగ్‌బాస్.. ఓట్లు పడినా ఈసారి వేటు గ్యారంటీ!) రామదూత క్రియేషన్స్ అధినేత నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కాంబోలో ప్రస్తుతం 'వ్యూహం', 'శపథం' సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో తొలి భాగమైన 'వ్యూహం' మూవీ త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనుంది. (ఇదీ చదవండి: చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా) Wishing a very very HAPPY BIRTHDAY to my VYOOHAM film producer @dkkzoomin 💐💐💐🔥🔥🔥 pic.twitter.com/QlpN8HAgY2 — Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2023