warns
-
మొబైల్ యూజర్లకు ట్రాయ్ హెచ్చరిక
సైబర్ క్రైమ్స్ ప్రస్తుతం భారతదేశంలో ఒక పెద్ద సమస్యగా మారిపోతోంది. ఎప్పటికప్పుడు స్కామర్లు కొత్త అవతారాలెత్తి ప్రజలను మోసం చేస్తున్నారు, డబ్బు దోచేస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో మొబైల్ యూజర్లకు చాలా జాగ్రత్తగా ఉండాలని 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) హెచ్చిరికలు జారీ చేసింది.స్కామర్లు బాధితులను మోసం చేయడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రిక్ కనెక్షన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సదుపాయాలను నిలిపేస్తామని బెదిరిస్తారు. బాధితుడు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని నేరగాళ్లు తప్పుగా పేర్కొంటారు. దీంతో కొందరు భయపడి నేరగాళ్లు చెప్పినట్లు వింటారు, భారీగా డబ్బు కోల్పోతారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.. షేర్ చేసిన ఒక వీడియోలో ఇలాంటి స్కామ్‌కు సంబంధించిన సంఘటనను చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క మొబైల్ యూజర్ తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని.. సంచార్ సాథీ పోర్టల్‌ని ఉపయోగించి ఏవైనా అనుమానాస్పద కాల్‌లను నివేదించాలని ట్రాయ్ కోరింది.భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ప్రభుత్వ డేటా ప్రకారం.. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిజిటల్ అరెస్ట్ స్కామ్ కారణంగా బాధితులు సుమారు రూ. 120.3 కోట్లు నష్టపోయినట్లు తెలిసింది. అక్టోబర్ 27న మన్ కీ బాత్ 115వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమాచారాన్ని అందించారు.నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) 2024 మొదటి త్రైమాసికంలో దాదాపు 7.4 లక్షల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు అందుకున్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: చెత్త సంపాదన రూ.2,364 కోట్లు: ప్రశంసించిన మోదీడిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు లేదా సైబర్ నేరగాళ్లు బాధితురాలకు ఫోన్ చేసి అక్రమ వస్తువులు లేదా నిషిద్ధ వస్తువులకు సంబంధించిన నేరంలో మీ ప్రమేయం ఉందని భయపెడతారు. టెక్నాలజీలను ఉపయోగించి వీడియో కాల్స్ ద్వారా నకిలీ కోర్టులను, న్యాయమూర్తులను ఏర్పటు చేస్తారు. అరెస్టు లేదా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండటానికి డబ్బు చెల్లించాలని.. భారీ మొత్తంలో మోసం చేస్తుంటారు. కాబట్టి ఇలా మోసం చేసేవారు మీకు ఎప్పుడైనా ఫోన్ చేసి బెదిరిస్తే.. తప్పకుండా సంబంధిత పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలి.अचानक से TRAI 📞 ने कि आपका नेटवर्क disconnect करने की बात 🧐🤔 सावधान रहे, ये एक scam है ! आपका अगला कदम ? रिपोर्ट करें चक्षु के साथ https://t.co/6oGJ6NSQal पर#SafeDigitalIndia pic.twitter.com/Zmkwj2Rjzg— DoT India (@DoT_India) November 9, 2024 -
ఇలా మోసం చేస్తున్నారు.. ఆర్బీఐ హెచ్చరిక!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ పేరును ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్న అసాంఘిక శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆర్బీఐ హెచ్చరించింది. సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగులుగా నటిస్తూ నకిలీ లెటర్ హెడ్స్, ఈమెయిల్ అడ్రెస్‌లను ఉపయోగించి లాటరీలు.. ఫండ్ ట్రాన్స్ఫర్, విదేశీ రెమిటెన్సులు, ప్రభుత్వ పథకాల పేరిట కొందరు మోసగిస్తున్నారని పేర్కొంది.కరెన్సీ ప్రాసెసింగ్ ఫీజులు, ట్రాన్స్ఫర్/రెమిటెన్స్/ప్రొసీజర్ చార్జీలంటూ వసూలు చేస్తున్నారని వివరించింది. ఆర్బీఐ/ప్రభుత్వ అధికారుల్లాగా నటిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులు, స్కీములతో నిధులు పొందేందుకు సెక్యూరిటీ డిపాజిట్లు కట్టాల్సి ఉంటుందని చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలను మోసగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. సాధారణంగా వీరు ఐవీఆర్ కాల్స్, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ ద్వారా బాధితులను సంప్రదిస్తున్నారు.ఆర్బీఐ అధికారులుగా పరిచయం చేసుకునే సదరు మోసగాళ్లు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసేస్తామని బెదిరిస్తూ, నిర్దిష్ట వ్యక్తిగత వివరాలు ఇచ్చేలా బాధితులను బలవంతపెడుతున్నారు. ఈ నేపథ్యంలో అపరిచితులకు అకౌంట్ లాగిన్ వివరాలు, ఓటీపీ లేదా కేవైసీ పత్రాలు మొదలైనవి ఇవ్వరాదని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. -
స్కూల్ హెచ్ఎంకు టీడీపీ నేతల బెదిరింపులు.. ఆడియో వైరల్
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిపైనే దాష్టీకానికి దిగారు. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం మేకలపల్లిలో స్కూల్ కమిటీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా వ్యవహరించలేదని హెచ్ఎం గోవిందప్పపై సోమందేపల్లి టీడీపీ మండల కన్వీనర్ సిద్ధలింగప్ప నోరు పారేసుకున్నారు. ప్రభుత్వం మాదే.. జాగ్రత్తగా ఉండాలంటూ టీచర్‌ను హెచ్చరించారు. టీడీపీ నేత సిద్ధలింగప్ప వార్నింగ్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా, మరోవైపు చిరుద్యోగులపై కూడా టీడీపీ నాయకులు ప్రతాపం చూపుతున్నారు. ఎమ్మెల్యే పీఏ ద్వారా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. లేపాక్షి మండలం కోడిపల్లికి చెందిన అనిల్, బాలక్రిష్ణ శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం విభాగంలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో ఎలాంటి రిమార్కూ లేదు. అయితే అధికార టీడీపీ నాయకులు ఆ ఉద్యోగులకు వైఎస్సార్సీపీ రంగు పులిమి వారి స్థానంలో తమకు కావల్సిన వారిని నియమించేందుకు పావులు కదిపారు.ఎమ్మెల్యే పీఏ ద్వారా ఆదేశాలు అందుకున్న శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం అధికారులు ఇక నుంచి విధులకు రావొద్దని కార్మికులకు తెలిపారు. 2004 నుంచి పనిచేస్తున్న తనను ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే ఏం చేయాలో దిక్కుతోచడం లేదని వాటర్‌మెన్ అనిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఉద్యోగంతోనే తాను భార్య, కుమారుడిని పోషించుకునేవాడినని, ఇప్పుడు జీవనం ఎలా సాగించాలో తెలియడం లేదని అన్నాడు.2010 నుంచి గొల్లపల్లి పంప్‌హౌస్ వద్ద ఫిట్టర్‌గా పనిచేస్తున్న తనను ఇక డ్యూటీకి రావొద్దని అధికారులు తెలపడంతో గుండె ఆగినంత పనైందని బాలక్రిష్ణ తెలిపాడు. తనకు భార్య, ఆరు నెలల కుమార్తె ఉందని, ఉద్యోగం పోతే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏమైనా సందేహాలుంటే ఎమ్మెల్యే పీఏను సంప్రదించాలని సలహా ఇచ్చారన్నారు. 2010 నుంచి గొల్లపల్లి పంప్‌హౌస్ వద్ద ఫిట్టర్‌గా పనిచేస్తున్న తనను ఇక డ్యూటీకి రావొద్దని అధికారులు తెలపడంతో గుండె ఆగినంత పనైందని బాలక్రిష్ణ తెలిపాడు. తనకు భార్య, ఆరు నెలల కుమార్తె ఉందని, ఉద్యోగం పోతే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏమైనా సందేహాలుంటే ఎమ్మెల్యే పీఏను సంప్రదించాలని సలహా ఇచ్చారన్నారు. -
మామిడి పండ్ల వినియోగంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక! కెమికల్ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించాలంటే..
వేసవి కాలం అంటే నోరూరించే మామిడి పండ్ల సీజన్. వీటిని ఇష్టపడని వారెవ్వరుంటారు. అయితే ఆ మామిడి పండ్లను కృత్రిమంగా పండించడంపై ఫుడ్ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వ్యాపారస్తులను, పండ్ల వ్యాపరులను ఆహార భద్రత ప్రమాణలు పాటించాని పేర్కొంది. చట్టవిరుద్ధంగా కాల్షియం కార్పైడ్ వంటి రసాయనాలను వినియోగించకూడదని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆరోగ్య అధికారులు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అసలు కృత్రిమంగా మామిడి పండ్లను పండించేందుకు ఏం ఉపయోగాస్తారు? కెమికల్ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించగలం తదితరాలు గురించి తెలుసుకుందాం.!కాల్షియం కార్బైడ్ అంటే..మామిడిపండ్లు తొందరగా పక్వానికి వచ్చేలా కాల్షియం కార్బైడ్ వంటి కెమికల్స్‌ని వినియోగిస్తారు. దీనిలో ఫాస్పరస్ జాడలు కలిగి ఉన్న ఎసిటిలీన్ వాయవుని విడుదల చేస్తుంది. అందువల్ల ఈ రసాయనాలతో పండించిన మామిడి పండ్లు ఆరోగ్యానికి హానికరం. ఇలా పండించిన పండ్లను తీసుకోవడం వల్ల తలనొప్పి, తరుచుగా దాహం, చికాకు, బలహీనత, మింగడంలో ఇబ్బంది. వాంతులు, చర్మపు పూతలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. అందువల్ల ఇలాంటి కెమికల్స్ వినియోగాన్ని నిషేధించింది. 2011 రెగ్యులేషన్ నిబంధనల ప్రకారం కృత్రిమంగా పండించేందుకు కాల్షియ కార్బైడ్ వినియోగించొద్దని తెలిపింది. ప్రత్యామ్నాయంగా ఇథిలిన్ వాయువును ఉపయోగించొచ్చని తెలిపింది. ఇథిలిన్ వాయువు కార్బైడ్ వాయువుకు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా పేర్కొంది. ఇది పండును సహజంగా పండేలా ప్రోత్సహిస్తుంది. ఇక్కడ ఇథిలిన్ వాయువుని గణనీయమైన పరిమాణంలోనే వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇది పంట రకం, పరిపక్వత ఆధారంగా ఎంత మేర వినయోగించాలనేది నిర్ణయించడం జరుగుతుంది. చాలా వరకు సుమారు 100 పీపీఎంల వరకు వినియోగించేలా అనుమతి ఇచ్చింది ఎఫ్ఎస్ఎస్ఏఐ. దీన్ని ఎలా గుర్తించాలంటే..ఇక్కడ మామిడి పండ్లు కాల్షియం కార్బైడ్‌తో మామిడి పండ్లను పండించారా? లేదా సహజమైన రీతీలో పండాయా అనేది ఎలా గుర్తించాలంటే..అందుకు నాలుగు సింపుల్ చిట్కాల ఉన్నాయి. అవి ఫాలో అయిపోండి. అవేంటంటే..ఆకృతిని పరిశీలించటం: మామిడిపండ్లు అసహజంగా ఏకరీతిగా కనిపించి చుట్టూ ఈగలు, కీటకాలు లేకుంటే వాటికి ఘాటైన రసాయనాలను కలిపారని అర్థం. వాటర్ పరీక్ష: కృత్రిమంగా పండిన మామిడి పండ్లు నీటిపై తేలుతుంది. కాబట్టి కొనుగోలు చేసిన తర్వాత మామిడికాయలను ఒక బకెట్ నీటిలో ఉంచండి. అవి సేంద్రియంగా పండించారా లేదా అన్నది తెలిసిపోతుంది. టేస్టీని బట్టి: కృత్రిమంగా పండిన మామిడిపండ్లు సేంద్రీయ వాటితో పోల్చితే తక్కువ జ్యూసీ, తక్కువ బరువుని కలిగి ఉంటాయి. అగ్గిపుల్ల టెస్ట్: ఈ పరీక్ష అత్యంత భద్రతతో నిర్వహించాల్సి ఉంటుంది. అగ్గిపుల్లను వెలిగించి మామిడి పండ్ల దగ్గరకు తీసుకువస్తే..మంటలు లేదా మెరుపులో కూడిన మంట వెదజల్లిన కాల్షియం కార్బైడ్ వినియోగించి మాగబెట్టారని అర్థం. (చదవండి: హిమ శిఖరాల్లో పెళ్లి సందడి!..వణికించే చలిలో ఫోజులిస్తున్న జంట!) -
సీఫుడ్ ఇష్టంగా తినేస్తున్నారా? శాస్త్రవేత్తల స్ట్రాంగ్ వార్నింగ్!
సీఫుడ్స్ అంటే ఇష్టపడనివాళ్లు ఉండరు. వాటితో చేసిన వివిధరకాల రెసిపీలు చాలా రుచికరంగా ఉంటాయి. అదీగాక రెస్టారెంట్లలలో కూడా ఈ సీఫుడ్ వంటకాల ఖరీదు ఎక్కువే. అయినా కూడా ప్రజలు చాలా ఇష్టంగా లాగించేస్తుంటారు. ఇవి తీసుకోవడం వల్ల ఓమెగా 3 వంటి విటమిన్లు, పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే ఇప్పుడున్న పారిశ్రామిక కాలుష్యం కారణంగా సీఫుడ్ ఆరోగ్యానికి అంత సేఫ్ కాదని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. పైగా ఇది తినకపోవడమే మేలంటూ విస్తుపోయే విషయాలు చెప్పుకొచ్చారు. ఇంతకీ అధ్యయనాల్లో ఏం వెల్లడయ్యిందంటే.. యూకేలోని డార్ట్మౌత్ కళాశాల నిపుణులు పాదరసం వంటి ఇతర కలుషిత రసాయనాల దృష్ట్యా ప్రజలు సీఫుడ్ వినియోగంపై మార్గదర్శకాలు తీసుకోవాలని తెలిపారు. సముద్రాల్లో చమురు ఓడల క్రాష్ అవ్వడం లేదా మునిగిపోవడం, పారిశ్రామి రసాయనాలు వదలడం వంటి కారణంగా సీఫుడ్ వినియోగం ఎంత వరకు సురక్షితం అనే దిశగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. దీని వల్ల లభించే విలమిన్లు, పోషకాలను పక్కనే పెడితే ప్రమాదకరమై పర్ పాలి ఫ్లోరో అల్కైల్స్ (పీఎఫ్ఏఎస్) వంటి విషపదార్థాల ప్రమాదానికి గురవ్వక తప్పదని హచ్చరిస్తున్నారు. వీటిని "ఫారెవర్ కెమికల్స్" అని కూడా పిలుస్తారు. అందువల్ల నిపుణులు సీఫుడ్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. నిజానికి సీఫుడ్ లీన్ ప్రొటీన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్ల మూలం. కానీ కాలుష్యం కారణంగా సముద్ర జీవుల్లో మోతాదుకి మించి విషపదార్థులతో నిక్షిప్తమై ఉన్నాయి. అందువల్ల ఇవి మానవుని ఆరోగ్యానికి ఎంతమాత్రం సురక్షితం కాదని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు, పిల్లలు వంటి వారికి ఈ సీఫుడ్ మరింత హానికరమని చెబుతోంది అధ్యయనం. నిపుణుల పరిశోధనలో సముద్ర జాతుల నమునాలో ఈ పీఎఫ్ఏఎస్కి సంబంధించిన 26 రకాల విషపూరిత రసాయనాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా కాడ్, హాడాక్, సాల్మన్, స్కాలోప్ వంటి చేపలు, పీతలు, రొయ్యల్లో ఇది ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ఆయా జీవుల్లో ఒక గ్రాము మాంసంలో దాదాపు 1.74 నుంచి 3.30 నానో గ్రాముల పీఎప్ఏఎస్ వంటి రసాయన సమ్మేళనాలు ఉన్నట్లు గుర్తించారు. కాల క్రమేణ పరిస్థితి ఇలా ఉంటే నెమ్మదిగా పర్యావరణ విచ్ఛిన్నమవుతుందని, అదిగాక ఈ పీఎఫ్ఏఎస్ పదార్థాలు పర్యావరణంలో వేల సంవత్సరాల అలానే ఉండిపోతాయని అందువల్ల ప్రజలకు, వన్యప్రాణుల మనుగడకు హానికరంగా మారుతుందని చెప్పారు. ఈ పీఎఫ్ఏఎస్ రసాయనాలు కారణంగా కేన్సర్, పిండ సంబంధిత సమస్యలు, అధిక కొలస్ట్రాల్, థైరాయిడ్, కాలేయం, పనరుత్పత్తి రుగ్మతలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. (చదవండి: 'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త!) -
జాగ్రత్త.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్!
ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (ఎఫ్‌పీఐ) విషయంలో అప్రమత్తంగా ఉండాలని క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎఫ్‌పీఐ మార్గం ద్వారా స్టాక్ మార్కెట్ యాక్సెస్‌ను సులభతరం చేస్తామంటూ మోసగిస్తున్న ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎఫ్‌పీఐలతో తమకు అనుబంధం ఉందని, ఎఫ్‌పీఐ లేదా సంస్థాగత ఖాతాల ద్వారా ట్రేడింగ్ అవకాశాలు కల్పిస్తామని కొన్ని మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్లను మభ్యపెడుతున్నాయని సెబీకి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ సెబీ ఈ హెచ్చరిక ప్రకటన విడుదల చేసింది. మోసగిస్తున్నారిలా.. స్టాక్ మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు, సెమినార్లు, మెంటర్షిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా మోసగాళ్లు బాధితులను ప్రలోభపెడుతున్నారని, ఇందుకోసం వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు లైవ్ బ్రాడ్క్యాస్ట్ను ఉపయోగిస్తున్నారని సెబీ పేర్కొంది. సెబీ నమోదిత ఎఫ్‌పీఐలకు చెందిన ఉద్యోగులు లేదా అనుబంధ సంస్థలుగా చెప్పుకొంటూ షేర్ల కొనుగోలు, ఐపీఓలకు సబ్స్క్రయిబ్ కోసం బాధితులతో యాప్‌లను డౌన్లోడ్ చేయిస్తున్నారని సెబీ తెలిపింది. ఇలాంటి మోసాలు చేయడానికి తప్పుడు పేర్లతో నమోదైన మొబైల్ నంబర్లను ఉపయోగిస్తాస్తున్నారని వెల్లడించింది. నిబంధనల ప్రకారం.. దేశంలో నివసిస్తున్న పౌరులకు ఎఫ్‌పీఐ పెట్టుబడి మార్గం అందుబాటులో ఉండదు. అయితే దీనికి కొన్ని పరిమిత మినహాయింపులు ఉంటాయి. -
పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. యాపిల్‌కు ఈయూ వార్నింగ్!
ప్రీమియం స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలు తయారుచేసే ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ను యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది. యాపిల్ యాప్‌స్టోర్‌లో చేస్తున్న మార్పులు యూరోపియన్ యూనియన్ తీసుకువచ్చే నిబంధనలకు అనుగుణంగా లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. యూరోపియన్ యూనియన్ తీసుకువస్తున్న డిజిటల్ మార్కెట్ల చట్టానికి (DMA) అనుగుణంగా యాపిల్.. సాఫ్ట్వేర్ డెవలపర్లు ప్రత్యామ్నాయ యాప్ స్టోర్ల ద్వారా యాపిల్ పరికరాలలో తమ అప్లికేషన్లను ఉంచడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్లలో యాప్‌స్టోర్ కాకుండా ప్రత్యామ్నాయ యాప్ స్టోర్లను అందించడానికి మార్చి ప్రారంభం నుంచి డెవలపర్లకు అవకాశం ఉంటుంది. యాపిల్ యాప్ స్టోర్‌లో ప్రస్తుతం డెవలపర్లు 30 శాతం వరకు కమీషన్ చెల్లించాల్సి ఉంది. ఈ సర్దుబాట్లు ఉన్నప్పటికీ యాపిల్ ఫీజు విధానం అన్యాయంగా ఉందని, ఇదిడిజిటల్ మార్కెట్ల చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని విమర్శకులు వాదిస్తున్నారు. యాపిల్ ప్రణాళికల గురించిన విచారణలకు ప్రతిస్పందిస్తూ ఈయూ ఇండస్ట్రీ చీఫ్ థియరీ బ్రెటన్.. ‘డిజిటల్ మార్కెట్లు సజావుగా.. బహిరంగంగా పోటీకి ఇంటర్నెట్ గేట్లను డిజిటల్ మార్కెట్ల చట్టం తెరుస్తుంది. మార్పు ఇప్పటికే జరుగుతోంది. మార్చి 7 నుంచి థర్డ్ పార్టీల అభిప్రాయంతో కంపెనీల ప్రతిపాదనలను అంచనా వేస్తాం" అని రాయిటర్స్‌తో అన్నారు. కంపెనీల ప్రతిపాదిత పరిష్కారాలు చట్టానికి అనుగుణంగా లేకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి యూరోపియన్ యూనియన్ వెనుకాడదని బ్రెటన్ ఉద్ఘాటించారు. యాపిల్ యాప్‌స్టోర్ చెల్లింపు వ్యవస్థను ఉపయోగించకుండా డెవలపర్లకు ఎంపిక ఉన్నప్పటికీ ఒక యూజర్ అకౌంట్‌కు సంవత్సరానికి 50 యూరో సెంట్ల "కోర్ టెక్నాలజీ రుసుము" మాత్రం తప్పనిసరి. అయితే కొత్త వ్యాపార నిబంధనలను ఎంచుకున్న డెవలపర్లకు మాత్రమే ఈ రుసుము వర్తిస్తుందని యాపిల్ స్పష్టం చేసింది. -
సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్
న్యూయార్క్: హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులను నిలిపివేయాలని అమెరికా సహా 12 మిత్రదేశాలు పిలుపునిచ్చాయి. లేనిపక్షంలో సైనిక చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాయి. ఇదే చివరిసారి మరోసారి హెచ్చరికలు ఊహించకూడదని పేర్కొంటూ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా హౌతీ ఉగ్రవాదులు ఎర్ర సముద్రంలో డిసెంబర్ 19 నుంచి ఇప్పటివరకు 23 దాడులకు పాల్పడ్డారు. "చట్టవిరుద్ధమైన దాడులను తక్షణమే ముగించాలి. నిర్బంధించిన ఓడలు, సిబ్బందిని తక్షణమే విడుదల చేయాలని పిలుపునిస్తున్నాం. హౌతీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారు. జలమార్గాలలో వాణిజ్య ప్రయాణాలపై బెదిరింపులకు పాల్పడితే తర్వాత జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది." అని అమెరికా మిత్రదేశాలు హెచ్చరించాయి. ఎర్రసముద్రంలో ఓడలపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో అంతర్జాతీయ సహనం దెబ్బతింటుందని అమెరికా మిత్రదేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ప్రకటనపై అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్ సంతకాలు చేశాయి. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదుల దాడితో యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ ఉగ్రవాదులను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. గాజాపై భీకర యుద్ధం చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో హమాస్ వైపు 22 వేలకు పైగా మంది మరణించారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ యెమెన్ ఆధారిత హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు సంబంధం ఉన్న ప్రతి నౌకపై దాడి చేస్తున్నారు. ఇదీ చదవండి: 73కు చేరిన ‘జపాన్’ మరణాల సంఖ్య -
ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరికలు
టెహ్రాన్: గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం అదుపు తప్పుతోందని ఇరాన్ హెచ్చరించింది. తక్షణమే ఆపకపోతే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్-నియంత్రిత గాజా భూభాగంలో ఇజ్రాయెల్ భూతల దాడులు చేస్తే ప్రతిస్పందించవలసి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ఇరాన్ మిషన్ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపింది. 'గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలి. పరిస్థితి అదుపు తప్పుతోంది. ఈ రకమైన యుద్ధం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. దీని అంతాన్ని ఐక్యరాజ్య సమితి, సెక్యూరిటీ కౌన్సిల్ బాధ్యత తీసుకునే స్థాయికి వెళుతోంది.' అని ఇరాన్ స్పష్టం చేసింది. గాజా భూభాగంలో ఇరాన్ మద్దతుగల హమాస్‌పై భూదాడి చేయడానికి ఇజ్రాయెల్ శనివారం సిద్ధమైంది. అధిక జనసాంద్రత కలిగిన ఈ భూభాగంలో పాలస్తీనియన్లను గాజా దక్షిణం వైపు పారిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. హమాస్‌ను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ దళాలు అడుగులు వేస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్‌ను దాని నాయకత్వాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం భూతల, వాయు, జల అన్ని మార్గాల్లో దాడులు చేయడానికి దళాలను సమన్వయం ఏర్పరిచింది. ఆకస్మిక దాడులతో విరుచుకుపడిన హమాస్‌ను నిర్మూలించడానికి భూతల దాడులను జరపనున్నట్లు తెలుస్తోంది. గాజాను రాజకీయంగా, సైనికంగా హమాస్ పాలించడానికి వీలు ఉండకూడదని ఇజ్రాయెల్ రక్షణ దళాల(ఐడీఎఫ్) ప్రతినిధి డానిల్ హాగరీ అన్నారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ హెచ్చరిలతో ఉత్తర గాజావాసులంతా ఇల్లూ వాకిలీ వీడి పొట్ట చేతపట్టుకుని వలసబాట పడుతున్నారు. వందలో, వేలో కాదు! అక్కడి 11 లక్షల మందిలో ఇప్పటికే 4 లక్షల మందికి పైగా వలస వెళ్లగా, ఇజ్రాయెల్ అతి త్వరలో పూర్తిస్థాయి భూతల దాడికి దిగనున్న నేపథ్యంలో మిగతావారూ అదే బాట పట్టారు. బెదిరింపులకు జడవద్దన్న హమాస్ పిలుపులను పట్టించుకుంటున్న దిక్కే లేదు. ఇదీ చదవండి: ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్.. భయానక పోరుకు ఇజ్రాయెల్ సిద్ధం -
ఇజ్రాయెల్ ‘హెచ్చరిక’ మరీ డేంజరస్
ఐక్యరాజ్య సమితి: పాలస్తీనాలోని ఉత్తర గాజాపై దాడుల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని 24 గంటల్లోగా వీడాలని అక్కడి పౌరులను ఇజ్రాయెల్ హెచ్చరించడాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా తప్పుబట్టింది. న్యూయార్క్‌లో మీడియా సమావేశంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ శనివారం మాట్లాడారు. ‘ పది లక్షల జనాభా ఉన్న ప్రాంతాన్ని కేవలం 24 గంటల వ్యవధిలో ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశించడం అత్యంత ప్రమాదకరం. అసలు ఇది అసంభవం. ఇలాంటి హెచ్చరికలు దారుణం. యుద్ధానికి కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయని గుర్తుంచుకోవాలి’ అని గుటెరస్ వ్యాఖ్యానించారు. దాదాపు 11 లక్షల జనాభా ఉన్న ఉత్తర గాజాపై దాడులు చేస్తామని, ఆలోపు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని ఖాళీచేసి దక్షిణ గాజా వైపుగా స్థానికులు తరలిపోవాలని ఇజ్రాయెల్ వైమానిక దళం హెచ్చరించడం తెల్సిందే. జనావాసాలు మాత్రమేకాదు ఉత్తర గాజాలోని పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, చికిత్స కేంద్రాలు, ఐరాస శిబిరాలకూ ఇదే అలి్టమేటమ్ వర్తిస్తుంది. అందరూ ఉత్తర గాజా వైపు వస్తే ఆరోగ్య సంక్షోభం తలెత్తడం ఖాయం. యుద్ధవాతావరణంలో ఇంతటి భారీ వలసలు క్షేమం కాదు. ఆరోగ్య కేంద్రాలపై జరిగిన 34 దాడి ఘటనల్లో 11 మంది ఆరోగ్యసిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోయారు. గాజాలో ఇంధనం, ఆహారం, తాగునీరు అవసరాలు తీర్చాల్సి ఉంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా వలసలు ఇజ్రాయెల్ దాడులతో 7వ తేదీæ నుంచి ఇప్పటిదాకా 4,23,000కుపైగా స్వస్థలాలను వదిలిపోయారని ఐరాస రిలీఫ్, రెఫ్యూజీ విభాగం తెలిపింది. వీరిలో 2,70,000కుపైగా ఐరాస శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గాజాలో ప్రస్తుతం 50,000 మంది గర్భిణులు ఉన్నారు. యుద్ధం నేపథ్యంలో వీరికి అత్యవసర ఆరోగ్య సేవలు కరువయ్యాయి. ఆస్పత్రులపైనా రాకెట్ దాడులు జరుగుతుండటంతో రాబోయే రోజుల్లో ఆరోగ్య పరిస్థితి మరింత అధ్వానంగా ఉండనుందని తెలుస్తోంది. -
‘మహాదేవ్’ కేసు: సెలబ్రిటీలకు కంగనా రనౌత్ హెచ్చరిక!
దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో బాలీవుడ్ ప్రముఖ నటులకు భాగస్వామ్యం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రణబీర్ కపూర్, హుమా ఖురేషి, హాస్యనటుడు కపిల్ శర్మతో సహా మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసుతో ముడిపడి ఉన్న బాలీవుడ్ ప్రముఖులందరిపైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నిఘా పెట్టింది. ఇదిలా ఉండగా నటి కంగనా రనౌత్ తనను కూడా మహాదేవ్ యాప్ ప్రమోటర్లు చాలాసార్లు సంప్రదించారని, కానీ తాను తిరస్కరించినట్లు తాజాగా పేర్కొన్నారు. "ఈ ఎండార్స్మెంట్ ఒక సంవత్సరం వ్యవధిలో దాదాపు ఆరు సార్లు నాకు వచ్చింది. ప్రతిసారీ అనేక రూ.కోట్లు ఆఫర్ చేశారు. కానీ నేను ప్రతిసారీ నో చెప్పాను. ఇది నయా భారత్, దీనికి అనుగుణంగా మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. లేకుంటే బలవంతంగానైనా మెరుగుపడాల్సి వస్తుంది" అని కంగనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈడీ స్కానర్‌లో ఉన్న ప్రముఖుల గురించిన కథనం స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ రాసుకొచ్చారు. బెట్టింగ్ కేసులో పేరు బయటకు వచ్చిన నటీనటుల్లో కొందరు మహాదేవ్ యాప్‌ను ప్రమోట్ చేయగా, మరికొందరు విదేశాలలో జరిగిన యాప్ ప్రమోటర్ వివాహంలో ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ ఫిబ్రవరిలో రస్ అల్-ఖైమాలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను తీసుకెళ్లేందుకు ప్రైవేట్ జెట్లను అద్దెకు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. -
సీఎం జగన్ సంక్షలో పవన్ కు వార్నింగ్
-
డేంజర్లో ఢిల్లీ.. కేజ్రీవాల్ కీలక ప్రకటన..
ఢిల్లీ: యమునా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. బుధవారం రికార్డ్ స్థాయిని దాటిందని అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో యమునా నది ఢిల్లీ ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద 207 మీటర్ల మేర ప్రవహించింది. అదే.. సాయంత్రం 4 గంటలకు వచ్చేసరిగా మరో 0.71 పెరిగి 207.71గా నమోదైందని సెంట్రల్ వాటర్ కమీషన్(సీడబ్ల్యూసీ) తెలిపింది. దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా ఖాలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏ మాత్రం వేచి చూడరాదని తెలిపారు. నది ప్రవాహాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని పరిమిత స్థాయిలో విడుదల చేయాలని కేంద్ర హూం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. Arvind Kejriwal's SOS To Centre As Yamuna Flows At All-Time High https://t.co/sUT5bOloRM pic.twitter.com/YNjWK8z8lp — NDTV News feed (@ndtvfeed) July 12, 2023 యమునా నది బుధవారం రికార్డ్ స్థాయిని దాటిందని అధికారులు తెలిపారు. 1978 నాటి 207.49 మీటర్లను దాటింది. దీంతో సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా ఖాలీ చేయాలని కోరారు. యమునా నది ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉన్న వేల మందిని ఇప్పటికే పునరావాస ప్రాంతాల్లోకి తరలించామని తెలిపారు. నదీ సమీప ప్రాంతాల్లో రాకపోకలపై అధికారులు నిషేధాజ్ఞాలు జారీ చేశారు. "Beds Stacked Vertically": Desperation Kicks In As Water Enters Delhi Houses@Priyanshi50 reports pic.twitter.com/0VxpYdjZMg — NDTV (@ndtv) July 12, 2023 'దేశ రాజధానికి వరద సూచన ప్రపంచ దేశాలకు సరైన మెసేజ్‌ను ఇవ్వదు. ఢిల్లీ ప్రజలను కలిసి కాపాడదాం. ఈ రోజు రాత్రికి యమున నది 207.72కు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ తెలిపింది.' త్వరలో ఢిల్లీలో జీ-20 సమావేశం జరగనున్న నేపథ్యంలో యుమునా వరదను త్వరగా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కేజ్రీవాల్ కోరారు. Central Water Commission predicts 207.72 meter water level in Yamuna tonite. Not good news for Delhi. There have been no rains in Delhi last 2 days, however, levels of Yamuna are rising due to abnormally high volumes of water being released by Haryana at Hathnikund barrage.… pic.twitter.com/3D0SI2eYUm — Arvind Kejriwal (@ArvindKejriwal) July 12, 2023 గత రెండు రోజులుగా ఢిల్లీలో వర్షం రాకపోయినా యమునా నది వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీకి పైన ఉన్న హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరఖండ్‌లో వర్షాల కారణంగా వరద యమునకు పోటెత్తుతోంది. ఢిల్లీ పైన ఉన్న హర్యానాలోని హత్నీకుండ్ డ్యామ్ నుంచి నీటిని అధికంగా విడుదల చేయడం వల్ల యుమున నది ప్రవాహం పెరుగుతోంది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన కేజ్రీవాల్.. ఆ డ్యామ్ నుంచి పరిమితంగా నీటిని విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. #WATCH | Water level of river Yamuna continues to rise in Delhi. Visuals from Old Railway Bridge. Today at 8 am, water level of the river was recorded at 207.25 metres at the Bridge, inching closer to the highest flood level - 207.49 metres. The river is flowing above the… pic.twitter.com/e46LLHdeVe — ANI (@ANI) July 12, 2023 యమునా నది కరకట్టలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం సరైన చర్యలను తీసుకుంటోందని ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిషి తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించామని వెల్లడించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం తప్పా క్షేత్ర స్థాయిలో చేసిందేమీ లేదని ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. Mathura, Uttarakhand | The water level of the Yamuna River is increasing due to rain. All the police stations along the banks of the river have been instructed to increase vigilance in the area. Coordination is also being established with other agencies so that if there is… pic.twitter.com/lHHAVVTn6f — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023 ఇదీ చదవండి: Yamuna Rivar: డేంజర్ మార్క్ దాటి మహోగ్రంగా ప్రవహిస్తున్న యమునా.. ఢిల్లీ హై అలర్ట్.. -
కోహ్లీని లైట్ తీసుకుంటే ఆసీస్ అవుట్..!
-
WHO: మరో మహమ్మారి పొంచి ఉంది, సిద్ధంగా ఉండండి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధిపతి టెడ్రోస్ అధనామ్ ఓ కీలక ప్రకటన చేశారు. కోవిడ్-19 కంటే ప్రాణాంతకమైన మరో మహమ్మారి పొంచి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కోవిడ్-19 ముగిసిందంటే ప్రపంచానికి ఆరోగ్య ముప్పు తొలగినట్టు కాదని టెడ్రోస్ చెప్పారు. 76వ ప్రపంచ ఆరోగ్య సభలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి ఆ మహమ్మారి వ్యాప్తి చెందుతూ.. తొలుత ప్రాణాంతకంగా మారిన తదనంతరం తన ఉనికిని వివిధ వేరియంట్లగా మార్చుకుంటూ మనం ఎదుర్కునే తీవ్రత గల ముప్పుగా పరిణిమించడం నెమ్మదించిందన్నారు. అయినప్పటికీ ఇది మనకు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా..సాధ్యమైనంత త్వరగా ప్రతిస్పందించేలా ప్రభావవంతమైన ప్రపంచ యంత్రాగాల అవసరాన్ని గురించి నొక్కి చెప్పిందన్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజీలు) కింద ఆరోగ్య సంబంధిత లక్ష్యాలు 2030ని మరింతగా అమలు చేయాల్సిన ప్రాముఖ్యతను ఈ కోవిడ్ 19 మహమ్మారి తెలియజెప్పిందన్నారు టెడ్రోస్. ఈ మహమ్మారి 2017 ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీని ప్రకటించిన ట్రిపుల్ బిలయన్ లక్ష్యాల పురోగతిని కూడా ప్రభావితం చేసిందన్నారు. ఒకరకంగా ఈ మహమ్మారి మనల్ని ఘోరంగా దెబ్బతీసి.. సస్టెనబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజీ)ని నిర్వీర్యం చేసినప్పటికీ ఇలాంటి మహమ్మారీలను ఎదుర్కొనే అవశ్యకత తోపాటు భవిష్యత్తులో వీటి పట్ల ఎలా సన్నద్ధంగా ఉండాలో మనకు ఒక పాఠం నేర్పిందన్నారు డబ్ల్యూహెచ్ చీఫ్ టెడ్రోస్. (చదవండి: అలాంటివి మేము అంగీకరించం.. చర్యలు తీసుకుంటాం! భారత్‌కి హామీ) -
ఈ పెట్టుబడి పథకాలతో జాగ్రత్త: ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక
న్యూఢిల్లీ: కచ్చితమైన రాబడులు ఇస్తామంటూ ముగ్గురు వ్యక్తులు ఆఫర్ చేస్తున్న పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేయ వద్దంటూ పెట్టుబడిదారులకు ఎన్ఎస్ఈ హెచ్చరిక జారీ చేసింది. వీణ, అంకితా మిశ్రా, విషాల్ అనే వ్యక్తులు ఈ తరహా పెట్టుబడి పథకాలను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ((2023-24లో రుణ వృద్ధి 10 శాతమే: నోమురా అంచనా) (ఇదీ చదవండి: బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?) వీరు ఎన్ఎస్ఈ వద్ద సభ్యులుగా లేదా అధికారిక వ్యక్తులుగా నమోదు చేసుకోలేదని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ ఖాతా వివరాలు (యూజర్ ఐడీ, పాస్వర్డ్) వీరితో పంచుకోవద్దని కోరింది. స్టాక్ మార్కెట్లో కచ్చితమైన రాబడులు అంటూ వీరు ఆఫర్ చేసే ఎలాంటి పథకం అయినా, ఉత్పత్తిలో, సంస్థలో ఇన్వెస్ట్ చేయవద్దని సూచించింది. ఒకవేళ పెట్టుబడులు పెడితే అది ఇన్వెస్టర్లు స్వీయ రిస్క్ తీసుకున్నట్టుగా పరిగణించాలని కోరింది. ఈ విషయంలో ఎన్ఎస్ఈకి ఎలాంటి బాధ్యత ఉండదని స్పష్టం చేసింది. (శ్యామ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్టాల్లో మరింత విస్తరణ) -
ఇంత జరిగినా అదే పాట! ట్రంపా.. మజాకా!
శృంగార తారకు డబ్బు చెల్లింపుల కేసు విషయమై మాన్హాటన్ కోర్టులో డొనాల్డ్ ట్రంప్ హాజరైన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్ క్రిమినల్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తొలి అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు. విచారణ తదనతరం ట్రంప్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా మళ్లీ అదే పాట పాడటం ప్రారంభించారు. ఈ మేరకు ట్రంప్ మాట్లాడుతూ.. అణ్వాయుధాల వినియోగంపై దేశాలన్ని బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నాయన్నారు. తన పరిపాలనలో ఇలా ఎప్పుడూ జరగలేదు, ఆ చర్చ కూడా రాలేదని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన పూర్తిగా మూడో ప్రపంచ అణు యుద్ధానికి దారి తీస్తుందని, అది ఎంతో దూరంలో లేదు నన్ను నమ్మండి అంటూ హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికా చాలా గందరగోళ స్థితిలో ఉందన్నారు. మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది, ద్రవ్యోల్బణం అదుపుతప్పింది, రష్యాతో చైనా జత కట్టింది.. అంటూ తనదైన శైలిలో బైడెన్ పాలనపై విరచుకుపడ్డారు. అలాగే చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా కలిసి భయంకరమైన విధ్వంసక కూటమిగా ఏర్పడ్డాయని, ఇలా తన నాయకత్వంలో జరగలేదని చెప్పారు. అలాగే మన కరెన్సీ ప్రపంచ ప్రమాణంగా ఇక మీదట ఉండకపోవచ్చని, 200 ఏళ్ల అమెరికా చరిత్రలో ఎదుర్కోని గొప్ప ఒటమి అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. అమెరికాని పాలించిన ఐదుగురు చెత్త అధ్యక్షుల గురించి ప్రస్తావిస్తే అందులో బైడెన్ పాలన అమెరికాను నాశనం చేసినంతగా మరెవరూ చేయలేదంటూ ఆరోపణలు చేశారు. కాగా, గతంలో ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కూడా ఇలానే వ్యాఖ్యలు చేశారు ట్రంప్. తాను అధ్యక్షుడిగా ఉంటే ఒక్కరోజులో యుద్ధాన్ని ఆపేసేవాడినంటూ అందర్నీ షాక్‌కి గురిచేసేలా వ్యాఖ్యలు చేశారు. చదవండి: సినిమాని తలపించే సీన్..ప్రియురాలి కోసం ఏకంగా 21 గంటలు..) -
ఐఫోన్ 14 కొనుగోలు చేశారా? తాజా వార్నింగ్ ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు సంస్థ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 14 మోడల్స్ (ఐఫోన్ 14 ప్రొ,ప్రో మ్యాక్స్) కొనుగోలు చేసిన వినియోగదారులకు మరికొంత కాలం వేచి ఉండాల్సి వస్తుందనే హెచ్చరికలను జారీచేసింది. కరోనా కారణంగా తమ వినియోగదారులకు ఐఫోన్ 14 డెలివరీ అనుకున్న దానికంటే ఆలస్యం కానుందని యాపిల్ తెలిపింది. ఇటీవల కోవిడ్ మళ్లీ విజృంభిస్తుండటం, ఆంక్షలతో ఉత్పత్తి ఆలస్యమవుతోందని వెల్లడించింది. చైనాలోని జెంగ్జౌలో కరోనా ఆంక్షలు అసెంబ్లింగ్ ప్లాంట్‌ను తాత్కాలింగా ప్రభావితం చేశాయని, ప్రస్తుతం చాలా తక్కువ సామర్థ్యంతో పనిచేస్తోందని వెల్లడించింది. అలాగే సప్లయ్ చెయిన్ కార్మికుల ఆరోగ్యం, భద్రకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఫలితంగా షిప్‌మెంట్స్ లేట్ అవుతున్నాయని తాజా ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఉందని తెలిపింది. (ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: రూ.40 వేల భారీ డిస్కౌంట్) చైనాలో రానున్న ఇయర్ ఎండ్ హాలిడే సీజన్‌కు ముందు చాలావరకు ఎలక్ట్రానిక్స్ తయారీదారులు బిజీగా ఉంటారు. కానీ ఇదే సమయంలో కరోనా ఆంక్షలు అక్కడి ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. సుమారు 2 లక్షలమంది ఉద్యోగులు పనిచేసే సెంట్రల్ చైనాలోని జెంగ్జౌ యాపిల్‌కు ఎంతో కీలకమైన ప్లాంట్‌లో తీవ్రమైన కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. చైనాలో కోవిడ్ నియంత్రణల కఠినతరంతో వచ్చే నెలలో ప్రపంచంలోని అతిపెద్ద ప్లాంట్‌లో ఐఫోన్ల ఉత్పత్తి 30శాతం క్షీణించనుందని రాయిటర్స్ గత నెలలో నివేదించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్‌ఫోర్స్ గత వారం జెంగ్జౌ ప్లాంట్‌లో సమస్యల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ షిప్మెంట్ల అంచనాను 80 మిలియన్ల నుండి 2-3 మిలియన్ యూనిట్లకు తగ్గించడం గమనార్హం. మరోవైపు అతిపెద్ద ఐఫోన్ తయారీదారు తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, కరోనా నియంత్రణలతో దెబ్బతిన్న జెంగ్జౌ ప్లాంట్‌లో పూర్తి ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. -
తప్పుడు ప్రకటనలిస్తే...ఎడ్టెక్ కంపెనీలకు స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: తప్పుదారి పట్టించే ప్రకటనలు తదితర అక్రమ వ్యాపార విధానాలను అవలంబిస్తున్న ఎడ్టెక్ కంపెనీలకు ప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. పరిశ్రమలో ప్రధాన సంస్థలు స్వీయ నియంత్రణలు పాటించని పక్షంలో కఠిన మార్గదర్శకాలను తీసుకురావలసి ఉంటుందని హెచ్చరించింది. ఎడ్టెక్ విభాగంలో నకిలీ రివ్యూలు పెరగడంతో వీటిని అరికట్టేందుకున్న అవకాశాలపై వినియోగ వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఒక సమావేశంలో చర్చించారు. ఇండియా ఎడ్టెక్ కన్సార్షియం(ఐఈసీ), తదితర పరిశ్రమ సంబంధ సంస్థలతో రోహిత్ కుమార్ చర్చలు నిర్వహించారు. దేశీ ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్(ఐఏఎంఏఐ) ఆధ్వర్యంలో ఐఈసీ నడుస్తోంది. ఈ సమావేశానికి ఐఈసీ సభ్యులతోపాటు ఐఏఎంఏఐ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ జాబితాలో అప్‌గ్రేడ్, అన్అకాడమీ, వేదాంతు, గ్రేట్ లెర్నింగ్, వైట్‌హ్యాట్ జూనియర్, సన్‌స్టోన్ తదితరాలున్నాయి. -
రాజకీయ ప్రత్యర్థులకు ఉరిశిక్ష ... వార్నింగ్ ఇచ్చిన యూఎన్
Myanmar Junta Executions' Plan: మయన్మార్ జుంటా ప్రభుత్వం ఆంగ్ సాన్ సూకీ పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యుడు, ఒక ప్రజాస్వామ్య కార్యకర్తని ఉరితీస్తామని ప్రకటించింది. ఇద్దరూ తీవ్రవాదానికి పాల్పడ్డారని, అందువలన మరణశిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. అదీగాక 1991 తర్వాత దేశంలో తొలిసారిగా న్యాయపరమైన ఉరిశిక్ష విధించిబడుతుందని పేర్కొంది. ఈ మేరకు మాజీ ఎంపీ ఫియో జెయా థా, ప్రజాస్వామ్య కార్యకర్త కో జిమ్మీతో సహా నలుగురికి మరణశిక్ష విధించినట్లు జుంటా ప్రతినిధి జా మిన్ తున్ తెలిపారు. పైగా వారిని జైలు విధానాల ప్రకారం ఉరితీస్తామని వెల్లడించారు. ఐతే ఈ కేసును మయన్మార్ తరుపున యూఎన్ విచారణా యంత్రాంగానికి అధిపతి అయిన నికోలస్ కౌమ్జియాన్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం, విచారణలో దోషులుగా నిర్ధారించబడిన వ్యక్తుల ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయని తెలుస్తోందన్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఉరితీయడం అనేది యుద్ధ నేరం లేదా మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలతో సమానం అని ఆయన హెచ్చరించారు. గతేడాది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మయన్మార్ జుంటా ప్రభుత్వం అణిచివేతలో భాగంగా డజన్ల కొద్దీ తిరుగుబాటు వ్యతిరేక కార్యకర్తలకు మరణశిక్ష విధించింది. అయితే మయన్మార్ దశాబ్దాలుగా ఉరిని అమలు చేయలేదు. విచారణ న్యాయమైనదిగా పరిగణించబడాలంటే, సాధ్యమైనంత వరకు ఈ కేసుని బహిరంగంగా దర్యాప్తు చేయాలని యూఎన్ విచారణాధికారి కౌమ్జియాన్ అన్నారు. కానీ ఈ కేసులో పబ్లిక్ ప్రోసీడింగ్లు లేదా తీర్పులు బహిరంగంగా అందుబాటులో లేవు. ఇక్కడ ట్రిబ్యునల్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందా లేదా అనే సందేహాన్ని రేకెత్తించిందన్నారు. మయన్మార్ కోసమే ఈ యూఎన్ విచారణా యంత్రాంగం 2018లో యూఎన్ మానవ హక్కుల మండలిచే రూపొందించబడింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం, క్రిమినల్ ప్రొసీడింగ్‌లను సులభతరం చేసేలా డాక్యుమెంట్ చేయడం దీని పని. (చదవండి: ఉక్రెయిన్ చిన్నారుల కోసం.. నోబెల్ బహుమతిని వేలానికి పెట్టిన రష్యాన్ జర్నలిస్ట్) -
Sakshi Cartoon: ప్రపంచాన్ని కూడా ఖతం చేద్దామనుకుంటున్నారా సార్!
ఈ మూడేండ్లలో ప్రపంచాన్ని కూడా ఖతం చేద్దామనుకుంటున్నారా ఏంటీ సార్! -
తస్మాత్ జాగ్రత్త!
మాస్కో: తమను బెదిరించాలనుకునేవాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ శత్రుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. సర్మాత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను రష్యా విజయవంతంగా పరీక్షించిందని బుధవారం ఆయన ప్రకటించారు. ఈ క్షిపణులకు ఎదురులేదని చెప్పారు. ప్రస్తుతం రష్యా అమ్ములపొదిలో ఉన్న కింజల్, అవాంగార్డ్ క్షిపణులకు సర్మాత్ తోడవనుంది. గతనెల తొలిసారి రష్యా కింజల్ క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. సర్మాత్ విజయవంతంపై సైంటిస్టులను పుతిన్ అభినందించారు. ఉత్తరరష్యాలో వీటిని ప్రయోగించామని, విజయవంతంగా ఈ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. ప్రపంచంలోని సుదూర తీరాలు కూడా ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయని వెల్లడించింది. వీటిని నిఘా వ్యవస్థలు కనిపెట్టడం కూడా కష్టమని నిపుణులు తెలిపారు. 200 టన్నులుండే ఈ మిసైల్ భూమి మీద ఏ లక్ష్యాన్నైనా చేరగలదని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు. డోన్బాస్లో సాధారణ జనజీవనం నెలకొనేవరకు తమ ప్రయత్నాలు ఆపమని చెప్పారు. మరోవైపు తమ డిమాండ్ల ముసాయిదా ప్రతిపాదనను చర్చల్లో భాగంగా ఉక్రెయిన్‌కు అందించామని రష్యా అధికారులు తెలిపారు. ఇకపై చర్చలు కొనసాగలంటే ఉక్రెయిన్ స్పందించాల్సిఉందన్నారు. చర్చల జాప్యానికి ఉక్రెయినే కారణమని విమర్శించారు. మారియుపోల్‌పై ఫోకస్ కొద్దిమంది ఉక్రెయిన్ సేనలు ప్రతిఘటిస్తున్న మారియుపోల్‌పై రష్యా మరింత ఒత్తిడి పెంచింది. దీంతో పాటు డోన్బాస్లో పలు ప్రాంతాల్లో యుద్ధ తీవ్రతను పెంచింది. మారియుపోల్‌లో ఉక్రెయిన్ సైనికులు తలదాచుకున్న స్టీల్‌ప్లాంట్‌పై రష్యా తీవ్రమైన బాంబింగ్ జరిపినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. స్టీల్మిల్ను తదనంతరం నగరాన్ని స్వాధీనం చేసుకోవడంపైనే రష్యా దృష్టి పెట్టిందన్నారు. నగరం నుంచి పౌరుల తరలింపునకు ప్రాథమిక అంగీకారానికి వచ్చామని ఉక్రెయిన్ ఉప ప్రధాని చెప్పారు. అయితే దీనిపై రష్యా స్పందించలేదు. స్టీల్‌ప్లాంట్‌లో సైనికులు సరెండర్ అవ్వాలని మాత్రం మరోమారు అల్టిమేటం జారీచేసింది. ఈ నేపథ్యంలో నగరవాసులు వీలైనంత త్వరగా నగరం వీడాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. తమపై రష్యా అన్ని రకాలుగా పోరు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. తమను లొంగదీçసుకునేందుకు పౌర ఆవాసాలపై కూడా దాడులు చేస్తోందన్నారు. మారియుపోల్, డోన్బాస్ స్వాధీనానికి రష్యా వేలమందిని రంగంలోకి దించిందని పాశ్చాత్య దేశాలు తెలిపాయి. ఉక్రెయిన్‌కు సహాయాన్ని మరింత పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌కు నార్వే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పంపింది. హెవీ ఆర్టిలరీని పంపుతామని కెనెడా ప్రకటించింది. ► డోన్బాస్ రక్షణకు సైనికులను తరలించకుండా అడ్డుకునేందుకు ఉక్రెయిన్ నగరాలన్నింటిపై దాడులు ముమ్మరం చేసిందని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది. ► ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన చర్చలపై చర్చించేదుకు ఉక్రెయిన్, రష్యాల్లో పర్యటిస్తానంటూ ఆయా దేశాధినేతలకు ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ లేఖలు రాశారు. ► ఉక్రెయిన్‌కు మరో ప్యాకేజీ ప్రకటిస్తామని అమెరికా తెలిపింది. పలువురు ప్రపంచ నాయకులతో అధ్యక్షుడు బైడెన్ మాట్లాడారు. ► చెర్నోబిల్‌లో రష్యా సైనికులు ఇష్టారీతిన ప్రవర్తించడంతో అణులీకేజి ముప్పు పెరిగిందని ఉక్రెయిన్ ఆరోపించింది. రేడియేషన్ స్థాయిలను కొలిచే పరికరాలను రష్యా సైనికులు దొంగిలించారని తెలిపింది. ► ఉక్రెయిన్ సంక్షోభంతో 50 లక్షలకు పైగా శరణార్థులయ్యారని ఐరాస అంచనా వేసింది. ► రష్యా, బెలారస్ క్రీడాకారులను వింబుల్డన్‌లో నిషేధిస్తున్నట్లు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది. ► రష్యాకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేస్తున్నట్లు జపాన్ ప్రకటించింది. -
గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ యూజర్లకు అలర్ట్..! కేంద్రం హెచ్చరికలు..!
కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ పరిధిలోకి వచ్చే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ యూజర్లకు హెచ్చరికలను జారీ చేసింది. ఈ బ్రౌజర్స్‌లో లోపాలున్నట్లుగా గుర్తించింది. గూగుల్ క్రోమ్‌లో లోపాలు..! గూగుల్ క్రోమ్ 99.0.4844.74 వెర్షన్ కంటే ముందు బ్రౌజర్‌ను వాడుతున్నవారికి తీవ్ర ప్రమాదంలో ఉన్నట్లు సెర్ట్-ఇన్ హెచ్చరికలను జారీ చేసింది. దీంతో గూగుల్ క్రోమ్ బ్రౌజర్స్‌ను వాడే యూజర్ల డేటాను హ్యకర్లు సులువుగా అపరేట్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఆయా యూజర్ల సున్నితమైన సమాచారాన్ని సులువుగా యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తాయని సెర్ట్-ఇన్ హెచ్చరించింది. సెర్ట్-ఇన్ హెచ్చరికల ప్రకారం... బ్లింక్ లేఅవుట్, ఎక్స్టెన్షన్స్, సేఫ్ బ్రౌజింగ్, స్ప్లిట్‌స్క్రీన్, ఆంగిల్, న్యూ ట్యాబ్ పేజీ, బ్రౌజర్ UI, GPUలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో వంటి లోపాలున్నట్లు పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గూగుల్ క్రోమ్‌తో పాటు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో కూడా భద్రతా లోపాలున్నట్లు CERT-In నివేదించింది. యాంగిల్ ఇన్ హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో, కాస్ట్ యూఐ ఇన్ ఫ్రీ యూజ్, ఓమ్నిబాక్స్ ఫ్రీ యూజ్‌వంటి లోపాల కారణంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వాడే యూజర్ల డేటాను హ్యకర్లు సులువుగా పొందే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజర్లు వెంటనే తమ బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలని సెర్ట్ ఇన్ సూచించింది. కొద్ది రోజుల క్రితమే యాపిల్ ఉత్పత్తులపై కూడా కేంద్రం తీవ్ర హెచ్చరికలను జారీ చేసింది. చదవండి: పెను ప్రమాదంలో ఐఫోన్, యాపిల్ ఉత్పత్తులు..! హెచ్చరికలను జారీ చేసిన కేంద్రం..! -
అలా చేస్తే పెను ముప్పే..! తీవ్రంగా హెచ్చరించిన ఆపిల్..!
అమెరికా, ఇతర దేశాల్లో గూగుల్, ఆపిల్ వంటి టెక్ కంపెనీలు గూత్తాధిపత్యాన్ని తగ్గించేలా ఆయా దేశాలు పలు కఠిన చట్టాలను తెస్తున్నాయి. యూరోపియన్ దేశాలు(ఈయూ) దిగ్గజ టెక్ కంపెనీలపై తీవ్రంగా వ్యవహరిస్తున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలను నియంత్రించేందుకు ఇప్పటికే పలు చట్టాలను తీసుకువచ్చాయి. కాగా ఈ చట్టాలను ఆపిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చదవండి: ప్రపంచ దేశాల అప్పు ఎంతో తెలిస్తే షాకే...! అలా చేస్తే పెనుముప్పే...! టెక్ దిగ్గజ కంపెనీలను నియంత్రణలో భాగంగా ఈయూ దేశాలు ఆపిల్ ప్లే స్టోర్‌పై భారీ షరతులను పెట్టాయి.ప్లే స్టోర్ యాప్స్‌లో ఇతర సైడ్ లోడింగ్ యాప్స్(థర్డ్‌పార్టీ యాప్స్)కు వీలు కల్పిస్తూ ఈయూ చట్టం చేసింది. దీనిపై ఆపిల్ ఈయూ దేశాలను తీవ్రంగా వ్యతిరేకించింది. థర్డ్‌పార్టీ యాప్స్‌ను ప్లే స్టోర్‌లోకి ఆలో చేస్తే యూజర్లపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని ఆపిల్ హెచ్చరించింది. సైడ్ లోడింగ్ యాప్స్‌తో జరిగే నష్టాల నివేదికను బుధవారం రోజున ఆపిల్ విడుదల చేసింది. మాల్వేర్ దాడులతో యూజర్ల ప్రైవసీ, భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆపిల్ వెల్లడించింది. ప్లే స్టోర్‌పై ఈయూ విధించిన రూల్స్‌ను కాస్త సులభతరం చేయాలని ఆపిల్ విన్నవించింది. ప్రపంచవ్యాప్తంగా థర్డ్‌పార్టీ యాప్స్‌తో సుమారు 60 లక్షల యూజర్ల స్మార్ట్‌ఫోన్స్ సైబర్ దాడులకు ప్రభావితమయ్యాయని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్‌స్కై పేర్కొంది. ముందే హెచ్చరించిన టిమ్ కుక్..! గతంలో ఈయూ తెచ్చిన చట్టాలపై ఆపిల్ సీఈవో టిమ్ కుక్ పూర్తిగా వ్యతిరేకించాడు. సైడ్‌లోడింగ్ యాప్స్‌తో యూజర్ల భద్రతకు, ప్రైవసీ భంగం వాటిల్లుతుందనీ హెచ్చరించాడు. కాగా ఫోర్స్‌ఫుల్‌గా ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఇన్స్టాల్ చేయడంతో ఆపిల్ ఐవోఏస్ ప్లాట్‌ఫాం దెబ్బతీనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆపిల్ స్టోర్‌లోకి యాప్స్ ఏంట్రీ ఇవ్వాలంటే వాటిపై కచ్చితమైన రివ్యూ చేశాకే స్టోర్‌లో ఉంచుతామని వివరించాడు. చదవండి: తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన సజ్జన్ జిందాల్..! -
కంగనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన కోర్టు
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ప్రముఖ సినీ పాటల రచయిత, కవి జావేద్ అఖ్తర్ వేసిన డిఫమేషన్ కేసులో గైర్హాజరు కావడంపై ముంబయి మెట్రోపాలిటన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా హాజరు కాకుండా పదే పదే మినహాయింపు కోరుతుండడంపై అసహనం వ్యక్తంచేసిన కోర్టు తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ వారెస్ట్ జారీ చేస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు. అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ 20 కి వాయిదా వేసారు. చదవండి : Terrific Road Accidents: తీరని విషాదాలు జావేద్ అఖ్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పిటిషనర్ జావేద్ అఖ్తర్ హాజరుకాగా నటి కంగన రనౌత్ మాత్రం హాజరుకాలేదు. తన లాయర్ ద్వారా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. ఇదంతా చూస్తుంటే కావాలనే కాలయాపన చేస్తున్నట్టు కనిపిస్తోందని కోర్టు మండిపడింది. ఇకపై ఇదే తరహాలో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వ్యాఖ్యానించింది. వచ్చే విచారణకు తప్పకుండా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. లేదంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. దీనిపై అఖ్తర్ తరఫు న్యాయవాది జే భరద్వాజ్ కోర్టులో అభ్యంతరం తెలుపడంతో తాజా హెచ్చరిక చేసింది. కంగనా రనౌత్ తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ మాట్లాడుతూ, కంగనా సినిమా యాక్టింగ్, ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉండటంతో పా టు, కొన్ని లక్షణాల కారణంగా కోవిడ్ పరీక్ష చేయించుకోనున్నారని, ఒకవేళ పాజిటివ్ వస్తే మరింత మినహాయింపు అవసరం ఉంటుందని కోర్టుకు తెలపడం గమనార్హం కాగా నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కంగన తన పరువుకు నష్టం కల్గించే రీతిలో మాట్లాడారని జావేద్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు కంగనా. అయితే కంగనా పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.