wicket keeper
-
శ్రీలంక క్రికెటర్‌కు భారీ ఊరట.. మూడేళ్ల నిషేధం ఎత్తివేత!
శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్విల్లా( Niroshan Dickwella)కు భారీ ఊరట లభించినట్లు తెలుస్తోంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(WADA) అతడికి క్లీన్చిట్ దక్కినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డిక్‌విల్లాపై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని ఎత్తివేసినట్లు తెలుస్తోంది. శ్రీలంక ప్రీమియర్ లీగ్-2024 సందర్భంగా డిక్‌విల్లాపై డోపింగ్ ఆరోపణలు వచ్చాయి.ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన ఆట తీరును మెరుగుపరచుకునేందుకు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు శ్రీలంక యాంటీ డోపింగ్ ఏజెన్సీ(SLADA)కు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో నిరోషన్ డిక్విల్లాకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు ఏ ఫార్మాట్లోనూ క్రికెట్ ఆడకుండా మూడేళ్లపాటు నిషేధం పడింది.ఈ నేపథ్యంలో నిరోషన్ డిక్విల్లా వాడాను ఆశ్రయించగా.. అతడికి ఊరట లభించినట్లు డైలీ మిర్రర్ లంక పేర్కొంది. డిక్విల్లా నిషేధిత ప్రేరకాలు వాడలేదని.. అతడు తీసుకున్న పదార్థాలతో బ్యాటింగ్ ప్రదర్శన మెరుగుపడే అవకాశం లేదని లీగల్ టీమ్ ఆధారాలు సమర్పించినట్లు తెలిపింది. ఫలితంగా నిరోషన్ డిక్‌విల్లాపై నిషేధం ఎత్తివేయాల్సిందిగా వాడా ఆదేశించినట్లు పేర్కొంది.కాగా 31 ఏళ్ల నిరోషన్ డిక్విల్లా 2014లో శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ వికెట్ కీపర్ ఇప్పటి వరకు 54 టెస్టులు, 55 వన్డేలు, 28 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 2757, 1604, 480 పరుగులు సాధించాడు. అయితే, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడన్న కారణంగా నిషేధం ఎదుర్కోవడం అతడికి అలవాటే.కోవిడ్ సమయంలో 2021లో బయో బబుల్ నిబంధనలు అతిక్రమించినందుకు నిరోషన్ డిక్‌విల్లాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. అతడితో పాటు ధనుష్క గుణతిలక, కుశాల్ మెండిస్ కూడా ఇదే తప్పిదం కారణంగా నిషేధం ఎదుర్కొన్నారు. ఇక గతేడాది న్యూజిలాండ్‌తో టెస్టు సందర్భంగా నిరోషన్ డిక్విల్లా శ్రీలంక తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్‌కే అతడు పరిమితమయ్యాడు. -
క్రికెట్లో అత్యంత అరుదైన 'నో బాల్'
క్రికెట్లో బౌలర్ల తప్పిదాల కారణంగా నో బాల్స్ అవ్వడం తరుచూ చూస్తుంటాం. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఆసక్తికరంగా వికెట్‌కీపర్ తప్పిదం కారణంగా నో బాల్ ప్రకటించబడింది. బౌలర్ ఎలాంటి పొరపాటు చేయకుండానే అంపైర్ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు. A No Ball in the Vitality Blast because the wicketkeeper's gloves were in front of the stumps. 😲pic.twitter.com/bYvAtQ2pQv— Mufaddal Vohra (@mufaddal_vohra) September 5, 2024వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లో జరిగే వైటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులో సోమర్సెట్, నార్తంప్టన్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ బంతికి బౌలింగ్ టీమ్ స్టంపౌట్ కోసం అప్పీల్ చేసింది. ఫీల్డ్ అంపైర్ రీప్లేకు ఆదేశించాడు. ఇక్కడే వికెట్‌కీపర్ చేసిన ఓ పొరపాటు బయటపడింది.సదరు అప్పీల్ స్టంపౌట్‌గా తేలకపోగా నో బాల్ అయ్యింది. బౌలర్ తనవైపు (క్రీజ్ దాటకుండా) నుంచి ఎలాంటి పొరపాటు చేయనప్పటికీ.. వికెట్‌కీపర్ గ్లవ్స్ స్టంప్స్ కంటే ముందుండటంతో థర్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. వికెట్‌కీపర్ తప్పిదం కారణంగా బ్యాటర్‌కు ఆ మరుసటి బంతి ఫ్రీ హిట్‌గా లభించింది. సదరు బ్యాటర్ ఫ్రీ హిట్‌ను సద్వినియోగం చేసుకుని భారీ సిక్సర్‌గా మలిచాడు. క్రికెట్లో వికెట్‌కీపర్ పొరపాటు వల్ల ఇలా నో బాల్స్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.ఇదిలా ఉంటే, టీ20 బ్లాస్ట్ టోర్నీలో నిన్నటితో (సెప్టెంబర్ 6) క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లన్నీ ముగిసాయి. సర్రే, సోమర్సెట్, గ్లోసెస్టర్‌షైర్, ససెక్స్ జట్లు సెమీస్‌కు చేరాయి. సెప్టెంబర్ 14న జరిగే రెండు సెమీఫైనల్స్ మ్యాచ్‌ల్లో సర్రే, సోమర్సెట్.. గ్లోసెస్టర్‌షైర్, ససెక్స్ జట్లు పోటీపడతాయి. అనంతరం అదే రోజు ఫైనల్ కూడా జరుగుతుంది. -
కేఎల్ రాహుల్ వికెట్‌కీపింగ్ చేయడు: రాహుల్ ద్రవిడ్
త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌లో కేఎల్ రాహుల్ వికెట్‌కీపింగ్ చేస్తాడా లేదా అన్న విషయమై భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సిరీస్‌లో రాహుల్ వికెట్‌కీపింగ్ చేసేది లేదని ఖరాఖండిగా చెప్పాడు. రాహుల్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతాడని తెలిపాడు. ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని, ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అందులో భాగంగానే జట్టులో అదనంగా ఇద్దరు వికెట్కీపర్లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నాడు. ఇటీవలికాలంలో రాహుల్ ఫార్మాట్లకతీతంగా వికెట్‌కీపర్ బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటికీ ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో మాత్రం ప్రయోగాలు చేయలేమని అన్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున బ్యాటింగ్ పరంగానే రాహుల్‌పై అధిక భారం పడే అవకాశం ఉందని, అందుకే అతనిపై వికెట్‌కీపింగ్ భారాన్ని మోపే సాహసం చేయలేమని వివరణ ఇచ్చాడు. వికెట్‌కీపింగ్ బ్యాటర్ స్థానం కోసం కేఎస్ భరత్, దృవ్ జురెల్ మధ్య పోటీ నెలకొందని, ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తామని తెలిపాడు. ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో తుది జట్టులోకి ఎవరిని ఎంపిక చేయాలో అర్ధం కావట్లేదని అన్నాడు. కాగా, ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌ల కోసం భారత సెలక్టర్లు రాహుల్‌తో కలిపి ముగ్గురు వికెట్కీపర్లను ఎంపిక చేశారు. రాహుల్‌పై అధిక భారం పడకూడదనే ఉద్దేశంతోనే సెలెక్టర్లు కేఎస్ భరత్, దృవ్ జురెల్ స్టాండ్ బై కీపర్లుగా ఎంపిక చేశారు. కాగా, ఈ నెల 25 నుంచి హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇదివరకే హైదరాబాద్‌కు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నారు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల చేత తొలి రెండు టెస్ట్‌లకు దూరం కాగా.. ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల చేత సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. -
రాహుల్‌కు మొదటి అవకాశం
న్యూఢిల్లీ: వరల్డ్ కప్‌లో భారత వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కే తొలి ప్రాధాన్యత ఉంటుందని మాజీ వికెట్ కీపర్, మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయ పడ్డారు. ఇషాన్ కిషన్కంటే మిడిలార్డర్లో రాహుల్ ఎంతో విలువైన ఆటగాడని ఆయన అన్నారు. తన ప్రదర్శనతో దీనిని అతను రుజువు చేసుకున్నాడని, మరో చర్చకు ఆస్కారం లేద ని ప్రసాద్ చెప్పారు. రాహుల్‌కు గాయం కావడం లేదా సుదీర్ఘ టోర్నీ కాబట్టి కొన్ని మ్యాచ్‌లలో తప్పనిసరిగా విశ్రాంతినివ్వాల్సి వస్తేనే ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందని ఎమ్మెస్కే వివరించారు. -
చరిత్ర సృష్టించిన రహ్మానుల్లా గుర్భాజ్.. ధోనికి సైతం సాధ్యం కాని రికార్డు సొంతం
శ్రీలంకలోని హంబన్‌తోట వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్ 24) జరుగుతున్న రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్, వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్భాజ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో భారీ శతకంతో (151 బంతుల్లో 151; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించిన గుర్బాజ్.. పాకిస్తాన్‌పై వన్డేల్లో 150 పరుగుల మార్కు తాకిన తొలి వికెట్‌కీపర్/బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గుర్భాజ్‌కు ముందు పురుషుల వన్డే క్రికెట్లో ఏ వికెట్‌కీపర్ కూడా పాక్‌పై ఈ ఘనత సాధించ లేదు. 2005లో టీమిండియా మాజీ వికెట్‌కీపర్, మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వైజాగ్ వన్డేలో పాక్‌పై 148 పరుగులు (123 బంతుల్లో) చేశాడు. గుర్భాజ్‌కు ముందు పాక్‌పై వన్డేల్లో ఓ వికెట్‌కీపర్ సాధించిన అత్యధిక స్కోర్ ఇదే. ఈ రికార్డుతో పాటు గుర్భాజ్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్‌పై వన్డేల్లో సెంచరీ చేసిన తొలి ఆప్ఘన్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కాగా, గుర్భాజ్ భారీ శతకంతో వీరవిహారం చేయడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుర్భాజ్‌కు మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (101 బంతుల్లో 80; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకరించడంతో ఆఫ్ఘనిస్తాన్..పాక్‌పై అత్యధిక వన్డే స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో గుర్భాజ్, ఇబ్రహీమ్ జద్రాన్ (80) జోడీ తొలి వికెట్‌కు ఏకంగా 227 పరుగులు జోడించి పలు రికార్డులు సొంతం చేసుకుంది. పాక్‌పై 100 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ జోడీగా.. ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో రెండు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా.. 2010 తర్వాత పాక్‌పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (227) నమోదు చేసిన రెండో జోడీగా పలు రికార్డులు మూటగట్టుకుంది. -
ఎందరో సహకారంతో ఈ స్థాయికి చేరా: దినేష్ కార్తిక్
సాక్షి, చైన్నె: తన క్రికెట్ పయనంలో ఎందరో సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరినట్టు క్రికెటర్, స్టైలిష్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ తెలిపారు. పరిమ్యాచ్ స్పోర్ట్స్ అంబాసిడర్‌గా ఆయన నియమితులయ్యారు. శనివారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో దినేష్ కార్తిక్ స్ఫూర్తితో కొత్త స్పోర్ట్స్ వేర్ లైన్‌ను పరిమ్యాచ్ స్పోర్ట్స్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తన క్రికెట్ పయనం, పరిమ్యాచ్ స్పోర్ట్స్, ఐపీఎల్ అనుభవాలను గురించి దినేష్ కార్తిక్ మీడియాకు వివరించారు. పరిమ్యాచ్ స్పోర్ట్స్ అనేది అసమానమైన శైలి, అసాధారణమైన సౌలభ్యం, బలమైన విజేత స్ఫూర్తిని సూచించే బ్రాండ్‌గా వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్న తనం నుంచి ఎన్నో ఆశలు ఉండేవని, ఇవి ప్రస్తుతం సాకారం అవుతున్నట్టు వివరించారు. ఎందరో సహకారంతో తాను ఈ స్థాయికి చేరానని తెలిపారు. తన బ్యాట్, జెర్సీ, క్యాప్, ఇలా అన్నింటా ప్రత్యేకతను చాటుకోవాలన్న తపనతో ముందుకెళుతున్నట్టు చెప్పారు. నిబంధనలకు అనుగుణంగానే తాను ఈ వ్యవహారంలో నడుచుకుంటానని వ్యాఖ్యానించారు. -
వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్స్
-
చివరకు వికెట్ కీపర్ వెర్రిబాగులోడయ్యాడు!
క్రికెట్లో రనౌట్స్ ఒక్కోసారి నవ్వులు పూయిస్తాయి. అది వికెట్ కీపర్ లేదా బ్యాటర్ లేదా ఫీల్డర్ కావొచ్చు.. తాము చేసే చిన్న తప్పు జట్టుకు నష్టం తెచ్చినప్పటికి మనకు మాత్రం ఫన్ కలిగిస్తోంది. తాజాగా ఒక క్లబ్ క్రికెట్ సందర్భంగా వికెట్ కీపర్ తెలివితక్కువ పనితో నవ్వులపాలయ్యాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్‌లో స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ లాంగాఫ్ దిశగా ఆడి రెండు పరుగులు తీసేందుకు యత్నించాడు. సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కోసం పరిగెత్తాడు. కానీ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ నుంచి స్పందన రాకపోవడంతో అప్పటికే స్ట్రైక్ ఎండ్ నుంచి మిడిల్ పిచ్‌లోకి వచ్చేసిన బ్యాటర్ ఆగ్రహానికి లోనయ్యాడు. అప్పటికే బంతిని అందుకున్న వికెట్‌కీపర్‌కు ఈజీగా రనౌట్ చేసే చాన్స్ వచ్చింది. అలా చేయకుండా బ్యాటర్లు గొడవపడుతుండడాన్ని ఎంజాయ్ చేస్తూ అసలు విషయం మరిచిపోయాడు. తాను ఔట్ అయ్యాననుకొని స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ పెవిలియన్‌కు వెళ్తూ కీపర్ బెయిల్స్ పడగొట్టకపోవడం గమనించాడు. అయితే కీపర్ మాత్రం తాను బెయిల్స్ ఎగురగొట్టాననే భ్రమలో బౌలర్ దగ్గరకి వెళ్లి సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ బ్యాటర్ క్రీజులోకి చేరుకొని ఇంకా బెయిల్స్ పడగొట్టలేదు నేను ఔట్ కాదు అంటూ అంపైర్‌కు బ్యాట్ చూపించాడు. రూల్ ప్రకారం బెయిల్స్ కింద పడేస్తేనే రనౌట్ అయినట్లుగా పరిగణిస్తారు. దీంతో తనను ఔట్ చేయనందుకు సదరు బ్యాటర్ కీపర్‌కు థాంక్యూ చెప్పడం విశేషం. తన చర్యకు నాలుక్కరుచుకున్న కీపర్ ఏం చేయలేక బంతిని బౌలింగ్ ఎండ్‌కు విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/7mAlyHdHe9 — Out Of Context Cricket (@GemsOfCricket) May 23, 2023 చదవండి: 'కావాలని మాత్రం కాదు.. మనసులో ఏదో గట్టిగా పెట్టుకొనే!' -
వన్డే ప్రపంచకప్‌కు పంత్ దూరం.. వికెట్ కీపర్‌గా వారిద్దరిలో ఒకరేనా..!
గతేడాది జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మెల్లమెల్లగా కోలుకుంటున్న టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్ హెల్త్‌పై తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. పంత్ పూర్తిగా కోలుకునేందుకు మరో 9 నెలల సమయం (2024 జనవరి) పట్టొచ్చని తెలుస్తోంది. ఆ సమయానికైనా పంత్ కోలుకున్నాడంటే అది చాలా వేగవంతమైన రికవరీ అని వైద్యులు చెబుతున్నారు. ఈ మధ్యలో అతను సెప్టెంబర్ నెలలో జరిగే ఆసియా కప్, అక్టోబర్, నవంబర్లలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం కర్రల సాయంతో నడుస్తున్న పంత్.. ఏ సహాయం లేకుండా నడవాలంటేనే మరికొన్ని వారాలు పట్టొచ్చని తెలుస్తోంది. వరల్డ్‌కప్‌లో పంత్‌కు ఆల్టర్నేట్ ఎవరు..? వన్డే ప్రపంచకప్‌కు పంత్ అందుబాటులో ఉండడని దాదాపుగా తేలిపోయింది. మరి అతని ఆల్టర్నేట్ ఎవరన్నదే టీమిండియా అభిమానులను ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న. సెలెక్టర్ల పరిశీలనలో చాలా మంది పేర్లు ఉన్నప్పటికీ, ఎవరిని ఫైనల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ట్రాక్ రికార్డు, వరల్డ్‌కప్ సమయానికి ఆటగాళ్ల ఫామ్‌ను పరిగణలోకి తీసుకునే ఈ ఎంపిక జరుగుతుందని అంతా భావిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుత ఐపీఎల్లో (2023) వివిధ జట్ల వికెట్కీపర్ల ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. వన్డే వరల్డ్‌కప్‌కు ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ముందు వరుసలో ఉన్నారు. ఆతర్వాత కేఎల్ రాహుల్, శ్రీకర్ భరత్ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేఎల్ రాహుల్‌ను పూర్తి స్థాయి బ్యాటర్‌గానే వినియోగించుకోవాలని సెలెక్టర్లు భావిస్తే, ఈ జాబితా నుంచి అతని పేరు తొలగిపోవచ్చు. కొత్తగా రేసులోకి జితేశ్ శర్మ (పంజాబ్), ప్రభ్‌సిమ్రన్ (పంజాబ్), అభిషేక్ పోరెల్ (ఢిల్లీ), ఎన్ జగదీశన్ (కేకేఆర్) పేర్లు వచ్చాయి. గుజరాత్ ఓపెనర్, వెటరన్ ప్లేయర్ సాహా అవకాశాలను కూడా తీసిపాడేయటానికి వీలు లేదు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా వన్డే వరల్డ్‌కప్‌కు సాహా అయితేనే బెటర్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్లో దినేశ్ కార్తీక్ పూర్తిగా తేలిపోయాడు కాబట్టి, అతన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. వీరే కాక యువ వికెట్కీపర్లు సర్ఫరాజ్ ఖాన్ (ఢిల్లీ), ఉపేంద్ర యాదవ్ (సన్‌రైజర్స్), ధృవ్ జురెల్ (రాజస్థాన్), ఆనూజ్ రావత్ (ఆర్సీబీ), విష్షు వినోద్ (ముంబై) ఐపీఎల్లో తమ అదృష్టాలను పరీక్షించుకుంటున్నారు. మరి ఫైనల్‌గా సెలెక్టర్లు ఎవరిని ఫైనల్ చేస్తారో వేచి చూడాలి. -
కీపర్ తెలివితక్కువ పనికి మూల్యం చెల్లించుకున్న పాక్
ICC Womens T20 World Cup 2023- ENGW Vs PAKW: మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ వికెట్ కీపర్ సిద్రా నవాజ్ చేసిన తప్పునకు పెనాల్టీ కింద ఇంగ్లండ్‌కు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు అంపైర్లు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బ్యాటర్ బ్యాక్‌ఫుట్ షాట్ ఆడింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ కీపర్ సిద్రా నవాజ్‌కు త్రో విసిరింది. అయితే కీపర్ నవాజ్ తన చేతికున్న గ్లోవ్స్‌ను కింద పడేసి బంతిని అందుకుంది. ఆ తర్వాత బంతిని కింద పడేసిన గ్లోవ్స్‌కు కొట్టింది. ఇది గమనించిన అంపైర్లు కొంతసేపు చర్చించుకున్న తర్వాత కీపర్ నవాజ్ తప్పిదాన్ని గుర్తిస్తూ పాక్‌కు పెనాల్టీ విధిస్తూ ఇంగ్లండ్‌కు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ నిబంధనల ప్రకారం కీపర్ ఓవర్ పూర్తయిన తర్వాతే చేతికున్న గ్లోవ్స్ తొలగించొచ్చు.. లేదంటే బౌలర్ బంతి విడవకముందు సరిచేసుకోవచ్చు. కానీ ఒక్కసారి బంతి వేశాకా గ్లోవ్స్ తీసేసినా.. కింద పడేసిన గ్లోవ్స్‌పై బంతిని విసరడం నిబంధనలకు విరుద్ధం. ఈ తప్పిదం కింద జట్టుకు పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టు భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 40 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 81 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీ జోన్స్(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరి ఇన్నింగ్స్‌ల ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో ఫాతిమా సానా రెండు, ఇక్భాల్, నిదా ధార్, హసన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 99 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 114 పరుగుల తేడాతో పాక్‌పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 24న జరగనున్న రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్.. సౌతాఫ్రికాతో ఆడనుంది. మరోవైపు ఫిబ్రవరి 23న(గురువారం) జరగనున్న తొలి సెమీఫైనల్లో టీమిండియా వుమెన్స్, ఆస్ట్రేలియా అమితుమీ తేల్చుకోనున్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: పాక్ కెప్టెన్‌పై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు కోహ్లి ప్రపంచ రికార్డు.. లిస్టులో ఎవరున్నారో తెలియదు కానీ: గంభీర్ -
నువ్వేమి చేశావు నేరం.. శాంసన్‌ను ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్ విచారం
ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల (అక్టోబర్) 16 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును కొద్ది సేపటి కిందట ప్రకటించారు. ఈ జట్టులో ఎలాంటి సంచలన ఎంపికలకు తావివ్వని సెలెక్టర్లు.. తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో పాల్గొన్న జట్టునే యధాతథంగా కొనసాగించారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లు జట్టులోకి తిరిగి రాగా, గాయపడ్డ రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ జట్టులో కొనసాగనున్నాడు. ఈ మార్పులు మినహాంచి అందరూ ఊహించినట్లుగా జట్టు ఎంపిక జరిగింది. One more Snub.....And the management and Captian will come up with the same stories ...It's really tough to be Sanju Samson and a Sanju Samson fan as well....Hoping that he will get a 10% chance which Rishabh Pant is getting 😡#SanjuSamson pic.twitter.com/gFsNNfLvoQ — Snlkmr791 (@snlkmr791) September 12, 2022 కాగా, ప్రపంచకప్ జట్టులో సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంతో అతని అభిమానులు సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్‌కు మరోసారి మొండిచెయ్యి చూపడంతో భారత సెలెక్టర్లు, జట్టు కెప్టెన్, కోచ్‌లపై దుమ్మెత్తిపోస్తున్నారు. నువ్వేమి చేశావు నేరం.. నీ విషయంలోనే ఎందుకిలా అంటూ బాధను వ్యక్తపరుస్తున్నారు. టాలెంట్ ఉండి.. టీ20లకు సరిపడే దూకుడు కలిగి.. పోటీదారుల (పంత్, డీకేలను ఉద్దేశిస్తూ) కంటే మెరుగైన ట్రాక్ రికార్డు కలిగి ఉండి ప్రతిసారి ఇలా మొండిచెయ్యి చూపడం ఏంటని పెదవి విరుస్తున్నారు. #SanjuSamson fans after #BCCI announce team india squad for #T20wc2022 #t20worldcup2022 pic.twitter.com/XilMRz0VRf — Agyaat Balak (@Agyaat__Balak) September 12, 2022 శాంసన్‌ను మరోసారి జట్టుకు ఎంపిక చేయకపోవడంతో రకరకాల మీమ్స్‌తో ట్విటర్ వేదికగా అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. వికెట్‌కీపర్ కోటాలో జట్టుకు ఎంపికైన పంత్, డీకేలతో పోలిస్తే శాంసన్ ఎందులో తక్కువని ప్రశ్నిస్తున్నారు. శాంసన్‌ను కనీసం స్టాండ్ బై వికెట్ కీపర్‌గా కూడా ఎందుకు ఎంపిక చేయలేదని నిలదీస్తున్నారు. సెలెక్టర్లు, కెప్టెన్, కోచ్‌లు శాంసన్ విషయంలో డ్రామాలాడుతున్నారని, తమ వాళ్ల కోసం శాంసన్ కెరీర్‌ను నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. sanju fans assemble. #sanjusamson https://t.co/mcLQpaYClj — dark fellow // notmentallywelltointeract (@narfault) September 12, 2022 ఫిట్నెస్, టెక్నిక్, షాట్ సెలెక్షన్, హిట్టింగ్ సామర్ధ్యంలో పంత్, డీకేలతో పోలిస్తే శాంసన్ మెరుగ్గా ఉన్నప్పటికీ అతన్ని జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమని వాపోతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్లో శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌ను అద్భుతంగా ముందుండి నడిపించి రన్నరప్‌గా నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ రెగ్యులర్ వికెట్కీపర్లు కాగా.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాకప్ అప్షన్‌గా ఉన్నాడు. Fitness - 100% Technique and Shot Selection - 100% Hitting ability ✓ Dedication 100% Yet Sanju Samson is not even Considered as an Option in the team. India is failed to use One of the Best T20 player of the country.#sanjusamson #T20wc2022#T20WorldCup2022 pic.twitter.com/YDRKYblVb3 — Cric kid (@ritvik5_) September 12, 2022 🚨 NEWS: India’s squad for ICC Men’s T20 World Cup 2022. Rohit Sharma (C), KL Rahul (VC), Virat Kohli, Suryakumar Yadav, Deepak Hooda, R Pant (WK), Dinesh Karthik (WK), Hardik Pandya, R. Ashwin, Y Chahal, Axar Patel, Jasprit Bumrah, B Kumar, Harshal Patel, Arshdeep Singh — BCCI (@BCCI) September 12, 2022 #SanjuSamson fan's rn. pic.twitter.com/L1RvWkZ1GA — चौधरी (@Choudhary_ji123) September 12, 2022 -
అందుకే నేను వికెట్ కీపర్ అయ్యాను: రిషబ్ పంత్
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడానికి గల కారణాన్ని వెల్లడించాడు. తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని వికెట్ కీపర్ అయినట్లు పంత్ తెలిపాడు. పంత్ గత కొన్నేళ్లుగా భారత జట్టులో కీలక సభ్యడిగా ఉన్నాడు. 2019 ప్రపంచ కప్ తర్వాత భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో పంత్ వికెట్ కీపర్ బాధ్యతలు చేపట్టాడు. ఇక జూన్9న దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టీ 20 సిరీస్‌కు భారత జట్టులో పంత్ భాగమై ఉన్నాడు. అంతే కాకుండా ఈ సిరీస్‌కు టీమిండియా వైస్ కెప్టెన్‌గా పంత్ ఎంపికయ్యాడు. "నేను వికెట్ కీపింగ్ బాగా చేస్తున్నానో లేదో నాకు తెలియదు. కానీ నేను ఆడే ప్రతీ మ్యాచ్‌లోనే 100 శాతం ఎఫెక్ట్ పెడతాను. నేను ఎప్పుడూ వికెట్ కీపర్-బ్యాటర్‌నే. మా నాన్న కూడా వికెట్ కీపర్ కావడంతో నేను చిన్నప్పుడు నుంచే వికెట్ కీపింగ్ చేయడం మొదలు పెట్టాను. మా నాన్నను ఆదర్శంగా తీసుకునే ఈ రోజు నేను వికెట్ కీపర్ అయ్యాను. ఏ క్రికెటరైనా వికెట్ కీపర్ కావాలంటే చాలా యాక్టివ్‌గా ఉండాలి. చివరి వరకు బంతిపై దృష్టి పెట్టి అందుకునే ప్రయత్నం చేయాలి" అని పంత్ ఎస్జీ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ పేర్కొన్నాడు. చదవండి: ENG vs NZ: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. న్యూజిలాండ్‌కు భారీ షాక్..! -
జర్నలిస్ట్‌పై ఆరోపణలు.. సాహాకు దిమ్మతిరిగిపోయే కౌంటర్
ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్ట్ తనను బెదిరించాడంటూ సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాపై పరువు నష్టం దావా కేసు నమోదైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు జర్నలిస్ట్ సాహాపై పరువు నష్టం దావా వేశాడు. ఇంటర్వ్యూ కోసం సాహాతో చాట్ చేసింది వాస్తవమేనని, కానీ తన మెసేజ్‌లను సాహా టాంపర్ చేశాడని జర్నలిస్ట్ బోరియా మజుందార్ ప్రత్యారోపణలు చేశాడు. There are always two sides to a story. @Wriddhipops has doctored, tampered screenshots of my WhatsApp chats which have damaged my reputation and credibility. I have requested the @BCCI for a fair hearing. My lawyers are serving @Wriddhipops a defamation notice. Let truth prevail. pic.twitter.com/XBsiFVpskl — Boria Majumdar (@BoriaMajumdar) March 5, 2022 భారత టెస్ట్ జట్టులో చోటు దక్కదని తెలిసిన సాహా అభిమానుల సానుభూతి కోసమే తనపై ఆరోపణలు చేశాడని మజుందార్ పేర్కొన్నాడు. సాహా సోషల్ మీడియాలో షేర్ చేసిన చాట్స్ నకిలీవని, ఒరిజినల్ మెసేజ్‌లను కోర్టులో సమర్పిస్తానని తెలిపాడు. ఈ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు మజుందార్ ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశాడు. కాగా, సాహా జర్నలిస్ట్‌పై చేసిన ఆరోపణలను బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారణ కూడా చేపట్టింది. తొలుత జర్నలిస్ట్ పేరును వెల్లడించని సాహా విచారణలో భాగంగా సదరు జర్నలిస్ట్ పేరును కమిటీ ముందు వెల్లడించాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కకపోవడంతో సాహా.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై కూడా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జట్టులో చోటుపై బీసీసీఐ బాస్ గంగూలీ తనకు భరోసా కల్పించినా, ద్రవిడ్ తనను రిటైర్మెంట్ గురించి ఆలోచించమన్నాడంటూ సాహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చదవండి: బెదిరింపులు నిజమేనా?.. సాహాను వివరణ కోరనున్న బీసీసీఐ -
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ కన్నుమూత..
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రాడ్ మార్ష్(74) కన్నుమూశారు. క్వీన్స్‌లాండ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. గత గురువారం గుండెపోటుకు గురైన మార్ష్‌ను క్వీన్స్‌లాండ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ అతని పరిస్థితి మెరుగుపడలేదు. ఇక ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఒక బలమైన జట్టుగా ఆవిర్భవించడంలో మార్ష్ కీలక పాత్ర పోషించాడు. 1970-80లలో ఆస్ట్రేలియా జట్టులో కీలకమైన ఆటగాడిగా మార్ష్ ఉన్నారు. అతడు జట్టులో తన వికెట్ కీపింగ్‌తో పాటు, తన బ్యాటింగ్‌తో కూడా జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. టెస్టుల్లో సెంచరీ సాధించిన తొలి ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్‌గా మార్ష్ ఉన్నారు. అతను టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించారు.96 టెస్టులు,92 వన్డేల్లో ఆసీస్‌కు మార్ష్ ప్రాతినిధ్యం వహించాడు. 1970లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆయన 1984లో క్రికెట్ నుంచి తప్పుకున్నారు. అతను వికెట్ కీపర్‌గా 355 ఔట్లు చేశారు. క్రికెట్ నుంచి రీటైర్ అయ్యాక మార్ష్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఆస్ట్రేలియా క్రికెట్‌కు కూడా సేవలందించారు. అదే విధంగా 2014లో లెజెండరీ క్రికెటర్ ఆస్ట్రేలియా సెలెక్టర్ల ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఇక రాడ్ మార్ష్ మృతిపై పలువురు క్రికెటర్లు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. చదవండి: India Vs Sri Lanka 1st Test: ఇండియా వర్సస్ శ్రీలంక తొలి టెస్ట్ అప్డేట్స్ -
'సఫారీ గడ్డపై ధోనికి సాధ్యం కాలేదు.. పంత్ సాధించాడు'
సౌతాఫ్రికా గడ్డపై రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో 85 పరుగులతో ఆకట్టుకున్న పంత్.. ఆ గడ్డపై ఒక వన్డే మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా తొలి స్థానంలో నిలిచాడు. పంత్ తర్వాతి స్థానంలో రాహుల్ ద్రవిడ్(77 పరుగులు, 2001) రెండో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఎంఎస్ ధోని(65 పరుగులు, 2013), రాహుల్ ద్రవిడ్( 62, వర్సెస్ ఇంగ్లండ్, 2003 వన్డే ప్రపంచకప్), ఎంఎస్ ధోని(55 పరుగులు,2006), సబా కరీమ్(55 పరుగులు, 1997) ఉన్నారు. దీంతో ధోని, ద్రవిడ్‌లకు సాధ్యం కానిది పంత్ సాధించాడంటూ అభిమానులు పేర్కొన్నారు. చదవండి: Virat Kohli: డ్రెస్సింగ్‌రూమ్‌లో కోహ్లి చిందులు.. వీడియో వైరల్ ఇక గత వన్డే మ్యాచ్ ద్వారా బ్యాటింగ్‌లో నాలుగో స్థానానికి ప్రమోషన్ పొందిన పంత్ ఆ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈసారి మాత్రం పంత్ ఎలాంటి పొరపాటు చేయలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన పంత్ సౌతాఫ్రికా బౌలర్లపై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతనికి తోడూ కేఎల్ రాహుల్ కూడా రాణించడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా నడిచింది. సెంచరీకి చేరువవుతున్న క్రమంలో 85 పరుగుల వద్ద పంత్ షంసీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. చదవండి: అరె! పంత్.. కొంచమైతే కొంపమునిగేది -
ఏకకాలంలో ధోని, సాహా రికార్డు బద్దలుకొట్టిన పంత్
Rishabh Pant Completes 100th Test Dismissal: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టుల్లో మరో ఘనత సాధించాడు. తొలి టెస్టులో భాగంగా మహ్మద్ షమీ బౌలింగ్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ టెంబా బవుమా క్యాచ్ తీసుకోవడం ద్వారా పంత్ టెస్టుల్లో కీపర్‌గా 100వ క్యాచ్ అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో 100 క్యాచ్‌లు తీసుకున్న పంత్ ధోని, సాహా సరసన నిలిచాడు. అయితే పంత్‌కు 100 క్యాచ్‌లు అందుకోవడానికి కేవలం 26 టెస్టులు మాత్రమే అవసరమయ్యాయి. చదవండి: BBL 2021: ఆండ్రూ టైకి ఊహించని షాక్ ఇచ్చిన అంపైర్లు ఇక ధోని, సాహాలు సమానంగా 36 టెస్టుల్లో 100 క్యాచ్‌ల మార్క్‌ను అందుకున్నారు. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో టీమిండియా తరపున ఎంఎస్ ధోని 294 క్యాచ్‌లతో మొదటిస్థానంలో.. సయ్యద్ కిర్మాణి(198 డిస్మిసల్స్), కిరణ్ మోరే(130 డిస్మిసల్స్), నయన్ మోంగియా(107 డిస్మిసల్స్), వృద్ధిమాన్ సాహా(104 డిస్మిసల్స్) వరుసగా 2,3,4 స్థానాల్లో ఉన్నారు. Bavuma gone, 100th Catch for Pant #INDvsSA #SAvIND #testcricket #IndianCricketTeam @ESPNcricinfo pic.twitter.com/aPiDraQaWT — Inian Kumar Ganesan (@Inian14) December 28, 2021 -
ధోని ఈజ్ బెస్ట్, తర్వాత ఆ ఇద్దరు.. అశ్విన్ లిస్ట్‌లో పంత్కి దక్కని చోటు
Ravichandran Ashwin Picks Best Indian Wicketkeeper: ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యుడైన రవిచంద్రన్ అశ్విన్.. పర్యటనకు బయల్దేరే ముందు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ.. తన దృష్టిలో ధోని, వృద్ధిమాన్ సాహా, దినేశ్ కార్తీక్‌లు భారత అత్యుత్తమ వికెట్కీపర్లు అని, వికెట్ల వెనకాల వారు పాదరసంలా కదులుతారని పేర్కొన్నాడు. ఈ ముగ్గురు అద్భుతమైన కీపర్లు అని, వీరిలో ధోని అత్యుత్తమమని తెలిపాడు. క్లిష్టమైన స్పిన్ బంతులను ధోని ఎంతో సులువుగా అందుకుంటాడని, వికెట్లకు ఇరు వైపులా మెరుపులా కదులుతాడని అన్నాడు. మరోవైపు కార్తీక్‌పై కూడా ప్రశంసలు కురిపించిన అశ్విన్, సాహా.. ఇంచుమించు ధోనిలాగే కదులుతాడని కితాబునిచ్చాడు. సాహా వికెట్‌కీపింగ్ టాప్ క్లాస్‌గా ఉంటుందని కొనియాడాడు. అశ్విన్ పేర్కొన్న భారత అత్యుత్తమ వికెట్కీపర్ల జాబితాలో ప్రస్తుత భారత రెగ్యులర్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌కు చోటు ఇవ్వకపోవడం విశేషం. పంత్ గురించి ఇప్పుడే ఓ అభిప్రాయానికి రాలేమన్న యాష్.. అతనికి మరింత అనుభవం అవసరమని అభిప్రాయపడ్డాడు. కాగా, త్వరలో ప్రారంభంకానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌లో భారత్ మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. చదవండి: అమ్మాయిలు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు.. వైరలవుతోన్న గంగూలీ కామెంట్లు -
డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు.. పంత్ సహా ఐదుగురి రికార్డు బద్దలు
Alex Carey Suprass Rishab Pant And 5 Others Set New Test Record Debut.. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ డెబ్యూ టెస్టులోనే అదరగొట్టాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు ద్వారా క్యారీ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. బ్యాటర్‌గా 12 పరుగులు చేసిన క్యారీ పెద్దగా ఆకట్టుకోకున్నా వికెట్ కీపర్‌గా మాత్రం అదుర్స్ అనిపించాడు. ఆడుతున్న తొలి టెస్టులోనే కీపర్‌గా 8 క్యాచ్‌లు అందుకొని చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి టెస్టులోనే అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న తొలి వికెట్ కీపర్‌గా అలెక్స్ క్యారీ రికార్డు సాధించాడు. చదవండి: Nathon Lyon: వికెట్ కోసం ఏడాది ఎదురుచూపులు.. ఇప్పుడు చరిత్ర ఇంతకముందు రిషబ్ పంత్(టీమిండియా) సహా క్రిస్ రీడ్, బ్రియాన్ టేబర్, చమర దనుసింఘే, పీటర్ నెవిల్, అలన్ నాట్లు తమ డెబ్యూ టెస్టులో వికెట్ కీపర్‌గా ఏడు క్యాచ్‌లు అందుకున్నారు. అయితే దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్ ఒక టెస్టులో వికెట్ కీపర్‌గా తొమ్మిది క్యాచ్‌లు తీసుకున్నప్పటికీ అతనికి డెబ్యూ టెస్టు కాకపోవడం విశేషం. చదవండి: BBL 2021: సూపర్ క్యాచ్ పట్టాననే సంతోషం లేకుండా చేశారు ఇదే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్‌ను ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో 400వ వికెట్ల మార్కును చేరుకున్నాడు. టెస్టుల్లో 400 వికెట్లు తీసిన ఆసీస్ మూడో బౌలర్‌గా.. ఓవరాల్‌గా 17వ బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా తరపున లియోన్ కంటే ముందు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్(708 వికెట్లు), గ్లెన్ మెక్‌గ్రాత్(563 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది.ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టును నాలుగు రోజుల్లో ముగించింది. ఆసీస్ ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ విధించిన 20 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఒక వికెట్ కోల్పోయి 5.1 ఓవర్లలో చేధించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు డిసెంబర్ 16- 20 వరకు అడిలైడ్ వేదికగా జరగనుంది. చదవండి: వన్డే వరల్డ్‌కప్ 2019.. అంబటిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ సెలక్టర్లే Click Video For Here: Alex Carey Suprass Rishab Pant And 5 Others https://t.co/vMdRHsexqM — sakshi analytics (@AnalyticsSakshi) December 11, 2021 Alex Carey becomes the first player in men's Tests to take eight catches on debut! #Ashes https://t.co/H7QXaUzvGY — cricket.com.au (@cricketcomau) December 11, 2021 -
ఒక్క వికెట్ పడగొట్టు అక్షర్.. అశూ.. నువ్వు బాగా బౌలింగ్ చేస్తున్నావు!
KS Bharat makes a cheeky remark to Axar Patel during Kanpur Test: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ అద్బుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మూడో రోజు ఆటను న్యూజిలాండ్ ఓపెనర్లు దూకుడుగా ఆరంభించారు. అయితే ఆశ్విన్ బౌలింగ్‌లో విల్ యంగ్‌ను అద్బుతమైన క్యాచ్‌తో భరత్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో టీమిండియాకు తొలి వికెట్ దక్కింది. అంతేకాకుండా భరత్.. టామ్ లాథమ్‌ను స్టంప్ ఔట్ చేయగా, రాస్ టేలర్ క్యాచ్ కూడా అందుకున్నాడు. కాగా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతున్న న్యూజిలాండ్‌ను టామ్ బ్లండెల్, కైల్ జామీసన్ అదుకోనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్టంప్స్ వెనుక నుంచి భరత్.. బౌలింగ్ చేస్తున్న అక్షర్ పటేల్‌ను ఉత్సాహపరుస్తూ హిందీలో సరదాగా కామెంట్ చేశాడు. 'ఏక్ గిర్నే సే లైన్ లాగేగీ పీచే'( ఒకే ఒక వికెట్ తీయు అక్షర్, తరువాత లైన్ కడతారు) అంటూ ఉత్సాహపరిచాడు. ఆ తరువాత కొద్ది సేపటికే.. అక్షర్ బౌలింగ్‌లో బ్లండెల్ క్లీన్ బౌల్డయ్యాడు. అంతేకాకుండా ఆశ్విన్ బౌలింగ్‌లో కూడా నల్ల పోద్రియే( నువ్వు మంచిగా బౌలింగ్ చేస్తున్నావు) అంటూ భరత్ తమిళంలో వాఖ్యలు చేశాడు. మెడ నొప్పితో మూడో రోజు ఆటకు దూరమైన వృద్దిమాన్ సహా స్ధానంలో శ్రీకర్ భరత్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చాడు. చదవండి: Ind Vs Nz 1st Test Day 4: సౌథీ దెబ్బ.. ఐదో వికెట్ కోల్పోయిన భారత్ -
బౌండరీ కొట్టాలని చూశాడు.. దురదృష్టం వెంటాడింది
Batsman Bizzare Dismissal Became Viral In ECS T10 league.. క్రికెట్లో బ్యాట్స్‌మెన్ ఫన్నీవేలో ఔటవ్వడం చాలానే చూసుంటాం. కొన్నిసార్లు నవ్వొస్తో.. మరికొన్ని సార్లు జాలిపడ్డాం. తాజాగా యూరోపియన్ క్రికెట్ సిరీస్ టి10లీగ్‌లోనూ ఇలాంటిదే చోటుచేసుకుంది. మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ ఫైన్‌లెగ్ దిశగా బౌండరీ కొట్టాలని చూశాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. టైమ్‌లైన్ మిస్ కావడంతో బ్యాట్ ఎడ్జ్ తగిలిన బంతి కీపర్ హెల్మెట్‌కు తాకి థర్డ్‌మన్ దిశగా వెళ్లింది. అక్కడే ఉన్న ఫీల్డర్ క్యాచ్ పట్టడంతో బ్యాట్స్‌మన్ ఔటయ్యాడు. రూల్స్ ప్రకారం బంతి నేలను తాకక ముందు ఎక్కడ తగిలినప్పటికి ఫీల్డర్ క్యాచ్ పడితే అది ఔట్‌గా పరిగణిస్తారు. దీంతో చేసేదేంలేక బ్యాట్స్‌మన్ భారంగా వెనుదిరిగాడు. అయితే అంపైర్లు మాత్రం మొదట బ్యాటర్ ఔట్ కాదనుకున్నారు. కానీ రిప్లైలో చూస్తే ఔట్ అని స్పష్టంగా కనిపించింది. అయితే ఇలాంటి విచిత్రమైన ఔట్ ఎప్పుడు చూడలేదని మ్యాచ్ అనంతరం అంపైర్లు పేర్కొనడం ఫన్నీగా అనిపించంది. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The @EuropeanCricket League is the gift that just keeps on giving! 😂pic.twitter.com/XW70ldMMjS — That’s so Village (@ThatsSoVillage) November 25, 2021 -
కీపింగ్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టిన హర్భజన్ సింగ్.. వీడియో వైరల్..
Harbhajan Singh Celebrates After Taking Catch In Gully Cricket: భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పడు అభిమానుల కోసం ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటాడు. అయితే ఓ అసక్తికరమైన వీడియోను హర్భజన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. ఆ వీడియోలో అంత ఆసక్తికరం ఏముందంటే.. తన ఇంటికి సమీపంలో హర్భజన్ గల్లీ క్రికెట్ ఆడాడు. మీరు అనుకున్నట్టు బ్యాటర్‌గానో, బౌలర్‌గానో కాదు.. ఈ సారి టర్బోనేటర్ వికెట్ కీపర్ అవతారం ఎత్తాడు. వికెట్ కీపింగ్ చేయడమే కాకుండా ఒక క్యాచ్ కూడా పట్టాడు. అది ఇప్పడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా ఈవీడియోకు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కామెంట్రీ చెప్పడం గమనార్హం. ఈ వీడియోపై నెటజన్లు స్పందిస్తూ.. సింగ్ ఈజ్ కింగ్ అని, పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మాల్ కంటే బాగా కీపింగ్ చేస్తున్నావ్ అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: Mahela Jayawardene: శ్రీలంక కోచ్‌గా మహేల జయవర్ధనే! View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) -
ఐపీఎల్ చరిత్రలో తొలి వికెట్ కీపర్‌గా ధోని చరిత్ర
MS Dhoni Completes 100 Catches For CSK.. ఐపీఎల్లో సీఎస్కే వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని అరుదైన ఘనత అందుకున్నాడు. ఆరంభం నుంచి సీఎస్కేకు( మధ్యలో ఒక సీజన్ మినహా) ఆడుతున్న ఎంఎస్ ధోని సీఎస్కే వికెట్ కీపర్‌గా 100 క్యాచ్‌లు అందుకున్నాడు. ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో వృద్దిమాన్ సాహా క్యాచ్ అందుకోవడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. ధోని తర్వాత ఒకే జట్టుకు ఆడుతున్న జాబితాలో రైనా(సీఎస్కే) 98 క్యాచ్‌లతో రెండో స్థానంలో.. కీరన్ పొలార్డ్( ముంబై ఇండియన్స్) 94 క్యాచ్‌లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: ధోని కూతురు జీవా విజిల్ పోడు.. ఓవరాల్‌గా ధోని ఐపీఎల్లో వికెట్ కీపర్‌గా 215 మ్యాచ్‌ల్లో 158 డిస్‌మిసిల్స్(119 క్యాచ్‌లు, 39 స్టంప్స్ ) ఉన్నాయి. అంతేగాక ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ద్వారా ధోని మరో రికార్డును కూడా అందుకున్నాడు. ధోని వికెట్ కీపర్‌గా ఒకే మ్యాచ్‌లో ముగ్గురు అంతకంటే ఎక్కువ బ్యాటర్స్ క్యాచ్‌లు తీసుకోవడం ఇది 10వ సారి. ధోని తర్వాత ఏబీ డివిలియర్స్ 5 సార్లు ఒకే మ్యాచ్‌లో మూడు అంతకంటే ఎక్కువ బ్యాటర్స్ క్యాచ్‌లు తీసుకొని రెండో స్థానంలో ఉన్నాడు. Special cricketer, special milestone! 👏 👏@msdhoni completes 1⃣0⃣0⃣ IPL catches for @ChennaiIPL as a wicketkeeper. 🙌 🙌 #VIVOIPL #SRHvCSK Follow the match 👉 https://t.co/QPrhO4XNVr pic.twitter.com/OebX4cuJHq — IndianPremierLeague (@IPL) September 30, 2021 -
గాయాల వల్లే వెనుకబడ్డాను
కోల్‌కతా: తరచూ గాయాల వల్లే కెరీర్ సాఫీగా సాగడం లేదని టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. 2010లోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సాహా ఇన్నేళ్లయినా తన ముద్ర వేయలేకపోయాడు. అయితే వైఫల్యాలకంటే కంటే తనని గాయాలే ఇబ్బంది పెట్టాయన్నాడు. త్వరలో జరిగే ఇంగ్లండ్ పర్యటన కోసం సిద్ధమైన సాహా ముంబైలో జట్టుకు ఏర్పాటు చేసిన బయోబబుల్‌లో సోమవారం చేరతాడు. ‘సరిగ్గా ఆడకపోతే విమర్శలు తప్పవు. నాకూ తప్పలేదు. పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతున్నాను. ఇన్నేళ్లయినా నా బ్యాటింగ్ ఏమాత్రం మెరుగవలేదని చాలామంది విమర్శిస్తున్నారు. ఇది నిజమే కావొచ్చు కానీ... నా బ్యాటింగ్ శైలిని, టెక్నిక్‌ను మార్చుకునే ఉద్దేశం లేదు. ఎందుకంటే అందులో ఏ లోపం లేదనే నేను అనుకుంటున్నాను. నేనిపుడు పూర్తిగా ఆటమీదే దృష్టిపెట్టాను. మరింతగా శ్రమించాలనే పట్టుదలతో ఉన్నాను’ అని ఈ బెంగాలీ వికెట్ కీపర్ తెలిపాడు. ధోని రిటైర్మెంట్ తర్వాత ప్రధాన కీపర్‌గా ఎదగాల్సిన తనను గాయాలు పక్కనబెట్టాయని, 2018 సీజన్ అంతా ఇలాగే ముగిసిపోయిందన్నాడు. అయితే డాషింగ్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ అందివచ్చిన అవకాశాల్ని బాగా సద్వినియోగం చేసుకోగలిగాడని సాహా కితాబిచ్చాడు. ‘నేను గాయాల బారిన పడిన ప్రతీసారి పార్థివ్ పటేల్, దినేశ్ కార్తీక్, పంత్ ఇలా ఎవరో ఒకరు జట్టులోకి వచ్చారు. వీరిలో రిషభ్ మాత్రం సత్తా చాటుకున్నాడు. జట్టు అవసరాలకు తగినట్లుగా ఆడి పదిలంగా పాతుకుపోయాడు’ అని సాహా వివరించాడు. భారత జట్టుకు ఆడటమే ఓ వరమని, ఆ ప్రేరణే తనని ఆశావహంగా నడిపిస్తోందని చెప్పాడు. గాయాలు, వైఫల్యాలనేవి ప్రతి ఒక్కరి కెరీర్లో ఉంటాయని, అలాగే తనకూ అలాంటి సవాళ్లు ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు. ‘నేను ఎప్పుడైనా జట్టు గురించే ఆలోచించాను. నేను ఆడినా, ఆడకపోయినా టీమ్ గెలవడమే ముఖ్యమ ని భావించా. జట్టులో స్థానం లభిస్తుందా లేదా అనే అంశాల కారణంగా సహచరులతో నా సంబంధాలు ఎప్పుడూ చెడిపోలేదు’ అని సాహా స్పష్టం చేశాడు. సాహా 11 ఏళ్ల కెరీర్ ఇప్పటికీ గాయాలతో పడుతూ లేస్తూ సాగుతోంది. 38 టెస్టులాడిన ఈ బెంగాలీ క్రికెటర్ 1251 పరుగులు చేశాడు. 103 మంది ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడంలో భాగమయ్యాడు. కివీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ)తో పాటు ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పయనమవుతోంది. కరోనా, సుదీర్ఘ సిరీస్ నేపథ్యంలో భారత జట్టులో పంత్, సాహాలతో పాటు బ్యాకప్ కీపర్‌గా కేఎస్ భరత్‌కు కూడా చోటు దక్కింది. -
బంతిని అందుకునే తాపత్రయం.. బొక్కబోర్లా పడ్డాడు
లండన్: జెంటిల్మన్ గేమ్‌గా పిలుచుకునే క్రికెట్లో ఫన్నీ మూమెంట్స్ జరగడం సహజమే. ఒక్కోసారి ఎవరు ఊహించిన విధంగా జరిగితే నవ్వులు పూయడం ఖాయం. తాజాగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ చాంపియన్‌షిప్ క్రికెట్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శుక్రవారం కెంట్, గ్లామోర్గాన్ మధ్య మ్యాచ్ జరిగింది. కెంట్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 28వ ఓవర్‌ను ఆస్ట్రేలియన్ బౌలర్ మైకెల్ నెసెర్ వేశాడు. నెసెర్ వేసిన బంతిని ఇంగ్లండ్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్ ఫైన్‌లెగ్ దిశగా ఆడాడు. బ్యాట్స్‌మెన్ ఇద్దరు కూల్‌గా సింగిల్ కంప్లీట్ చేశారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ చోటుచేసుకుంది. డీప్‌లో ఉన్న ఫీల్డర్ కీపర్ కమ్ కెప్టెన్ క్రిస్ కూక్‌కు త్రో విసిరాడు. అయితే అతను బంతిని రాంగ్ సైడ్‌లో వేయగా... దానిని అందుకునే ప్రయత్నంలో క్రూక్ వికెట్ స్టంపింగ్స్‌ను పట్టించుకోలేదు. ఇంకేముంది.. బంతిని అందుకున్నాడు గానీ అప్పటికే వికెట్ల పై నుంచి దాటుతూ బొక్కబోర్లా పడ్డాడు. కూక్ ప్యాంట్‌కు చిక్కుకొని రెండు వికెట్లు మొత్తం బయటికి వచ్చాయి. కెప్టెన్ చేసిన పనికి అతని సహచర ఆటగాళ్లు నవ్వాపుకోలేకపోయారు. ఈ వీడియోనూ గ్లామోర్గాన్స్ తన ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఫన్నీ చర్యతో తన సహచరులకు నవ్వు తెప్పించిన కూక్ కెప్టెన్‌గా.. బ్యాట్స్‌మన్‌గా మాత్రం అదరగొట్టాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో గ్లామోర్గాన్స్ తరపున 365 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక కెంట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కూక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 45 ఓవర్ల ఆట ముగిసేసరికి కెంట్ 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. గ్లామోర్గాన్స్ బౌలర్ మైకెల్ నెసెర్(15-10-15-4) అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. చదవండి: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. సింపుల్‌గా కొట్టేశాడు 'పో.. వెళ్లి బౌలింగ్ చేయ్ బ్రో' 😂😂😂 @Cooky_24! His teammates enjoyed this one from the skipper!#GoGlam pic.twitter.com/fRGg7si1md — Glamorgan Cricket 🏏 (@GlamCricket) May 21, 2021 -
ధోని సలహాల వల్ల చాలా మెరుగయ్యాను..
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని సలహాలు తనను మెరుగైన వికెట్‌కీపర్‌గా మార్చాయని భారత మహిళా జట్టు వికెట్ కీపర్ ఇంద్రాణి రాయ్ తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో సభ్యురాలైన ఈ పశ్చిమ్ బెంగాల్ మహిళా క్రికెటర్.. ధోనిని ఆదర్శంగా తీసుకుని, అతని అడుగుజాడల్లో నడుస్తానంటోంది. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుండగా ఇంద్రాణి.. మూడు ఫార్మాట్లలో జట్టు సభ్యురాలిగా ఉంది. టెస్ట్ ఫార్మాట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన కల అని, ఇంగ్లండ్ పర్యటనతో అది నిజం కాబోతుందని ఆమె ఉబ్బితబ్బిబవుతోంది. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వంటి సీనియర్లతో డ్రస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చింది. అండర్-19, అండర్-23 బెంగాల్‌కు ఆడిన ఆమె.. అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో 2018లో ఝార్ఖండ్‌కు మారింది. రాంచీలో జరిగే ట్రైనింగ్ సెషెన్స్‌లో ఆమె ధోనిని చాలాసార్లు కలిసింది. వికెట్ కీపింగ్‌పై ఆమెకు మక్కువను చూసిన మహేంద్రుడు ఆమెకు ఎన్నో సలహాలు ఇచ్చాడు. ఆ సలహాల వల్లే తాను జాతీయ జట్టుకు ఎంపిక కాగలిగానని ఆమె పేర్కన్నారు.