Nagarkurnool
-
ఉపాధ్యాయులకు చెబితే..
మేం రోజు మాదిరిగానే పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశాం. అయితే ఒంటిగంటకు భోజనం చేసి తరగతి గదులకు వెళ్లి కూర్చున్నాం. కొంత సమయానికి కడుపు నొప్పి మొదలైంది. ఈ విషయం మొదట ఉపాధ్యాయులకు చెబితే లైట్‌గా తీసుకుని..పట్టించుకోలేదు. – మహేష్, 7వ తరగతి నాణ్యతగా ఉండదు.. మధ్యాహ్న భోజనం నాణ్యత లేకపోవడం వల్లనే అనారోగ్యానికి గురయ్యాం. ప్రతిరోజు కూడా మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించడం లేదు. ఈ విషయమై ఉపాధ్యాయులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా వంట ఏజెన్సీని మార్చి నాణ్యమైన భోజనం అందించాలి. – జగదీశ్, 7వ తరగతి వెంటనే స్పందించాం.. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఉపాధ్యాయులు సమాచారం అందించడంతో వెంటనే స్పందించి చికిత్స అందేలా చూశాం. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణం మధ్యాహ్న భోజనమా అనేది ఇంకా తేలలేదు. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – మురళీధర్‌రెడ్డి, హెచ్ఎం ● -
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం
నాగర్‌కర్నూల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలను అమ లు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుక బాల్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్‌రెడ్డి మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చ, ట్రేడ్ యూనియన్, వ్యవసాయ కార్మిక సంఘాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామ ని పిలుపునిచ్చారు. ఈ నెల 25న జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, 26న జిల్లాకేంద్రంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలకు రైతుభరోసా, పంటలకు బోనస్ ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. సమావేశంలో నాయకులు శ్రీనివాసులు, లక్ష్మణ్, నాగరాజు పాల్గొన్నారు. -
భయపెట్టి.. పైపులతో కొట్టి
ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు దారుణంగా ప్రవర్తించినట్లు తెలిసింది. కడుపు నొప్పి మొదలైన వెంటనే విద్యార్థులు విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లగా.. తరగతి గదిలో ఉంచి ప్లాస్టిక్ పైపుతో కొట్టి బెదిరించినట్లు కొందరు విద్యార్థులు పేర్కొన్నారు. అయితే 3 గంటల తర్వాత విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో అప్పుడు వైద్యసిబ్బందికి సమాచారం చేరవేశారని ఆరోపించారు. అయితే పాఠశాలలో మొత్తం 598 మంది విద్యార్థులు ఉండగా.. బుధవారం 426 మంది హాజరయ్యారని హెచ్ఎం మురళీధర్‌రెడ్డి తెలిపారు. సాయంత్రం ఫుడ్ ఇన్ఫెక్షన్ అధికారులు నీలమ్మ, శ్రీనివాసులు పాఠశాలను సందర్శించి.. నమూనాలు సేకరించారు. మక్తల్/మాగనూర్: మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని ఫుడ్‌పాయిజన్‌కు గురైన వంద మంది విద్యార్థుల్లో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బుధవారం మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు పెట్టారు. ఇది తిన్న కొద్దిసేపటికి ఒక్కొక్కరుగా విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ విలవిలలాడారు. అయితే మొదట తేలికగా తీసుకున్న ఉపాధ్యాయులు.. బాధితులు పెరగడంతో ఏఎన్ఎం, ఆశాలను పాఠశాలకు పిలిపించి చికిత్స అందించారు. వారు విద్యార్థుల పరిస్థితిని గమనించి స్థానిక పీహెచ్సీ డాక్టర్‌ను సైతం పాఠశాలకు పిలిపించారు. ఆయన 17 మంది విద్యార్థులకు చికిత్స అందించి.. అందులో 15 మందిని మెరుగైన వైద్యం కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రి.. అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రియాంక, నందిని, అనిల్, నవ్య, మేఘన, శివ, జగదీశ్, మహేష్, విజయ్, భీమశంకర్, రాకేష్, విజయ్‌కుమార్, మధు, ప్రశాంతి, శివసాయి ఉన్నారు. వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. 15 మందికి సీరియస్ కడుపు నొప్పితో విలవిలలాడినబాలబాలికలు విషయం బయటకు రాకుండా ఉపాధ్యాయుల ప్రయత్నం పరిస్థితి విషమించడంతోమహబూబ్నగర్కు తరలింపు నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీహైస్కూల్లో ఘటన పాఠశాలలో లోపించిన పారిశుద్ధ్యం -
కేసీఆర్‌తోనే సస్యశ్యామలం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ మంజూరు చేసిన మొట్టమొదటి ప్రాజెక్ట్ పాలమూరు ఎత్తిపోతల. ఆ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేసి భూసేకరణ కాకుండా అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ. అయినా సరే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి కేసీఆర్ కృషి చేశారు.’ అని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌లోని కురుమూర్తిస్వామిని బుధవారం ఆయన దర్శించుకున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులతో కలిసి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. 50 ఏళ్లు కాంగ్రెస్, 16 ఏళ్లు టీడీపీ ఈ జిల్లాకు తాగు, సాగునీరు ఇవ్వలేదు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే పెండింగ్ ప్రాజెక్ట్‌లను రన్నింగ్ ప్రాజెక్ట్‌లుగా మార్చాం. కల్వకుర్తి, నెట్టెపాండు, భీమా, కోయిల్‌సాగర్ కింద రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లందించాం అని తెలిపారు. ఇంకా హరీశ్‌రావు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. కాంగ్రెస్, టీడీపీలు పాలమూరును వలసల జిల్లా గా మారిస్తే.. వలసలను వాపస్ తెచ్చిన చరిత్ర కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీదే.. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగుచేయడం, ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు కట్టడం వల్ల భూగర్భజలాలు పెరిగి ఈ రోజు వ్యవసాయం పండుగగా మారింది. రైతుల క్షేమం కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన నాయకుడు కేసీఆర్. పాలమూరు పేరును చెడగొడుతున్నారు.. రేవంత్‌రెడ్డికి వచ్చేది రెండే. ఒకటి దేవుళ్ల మీద ఒట్లు పెట్టడం. మరొకటి ప్రతిపక్షాన్ని తిట్టడం. రైతులకు రూ.15 వేల రైతుబంధు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. అన్ని రకాల పంటలకు బోనస్ అంటూ మోసం చేశారు. రైతు కూలీలకు రూ.12 వేలు అంటూ ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయలు. కానీ పాలమూరు పేరును రేవంత్‌రెడ్డి చెడగొడుతున్నారు. రేవంత్ సీఎం అయ్యారంటే కేసీఆర్ భిక్షనే.. రైతులకు రూ.41 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆ తర్వాత రూ.31వేల కోట్లు అని, అనంతరం బడ్జెట్లో రూ.26 వేల కోట్లు మాత్రమే పెట్టారు. చివరకు చేసింది ఎంత అంటే రూ.17 వేల కోట్లు. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి 20 లక్షల మందికి మాత్రమే చేశారు. సగం కంటే రుణ మాఫీ కాలేదు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. రైతులకు మేలు జరుగుతుందంటే నా ఎమ్మెల్యే పదవిని సైతం వదులు కోవడానికి సిద్ధపడ్డాను. కానీ పూర్తి రుణమాఫీ చేయడంలో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారు. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న వ్యత్యాసం ఉంది. ఈ రాష్ట్రానికి రేవంత్ సీఎం అయ్యావంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షనే. హైడ్రా మూసీ పేరుతో ఇళ్లను కూలగొట్టడమే తప్ప ఇల్లు కట్టడం తెలియదు రేవంత్‌రెడ్డికి. ప్రజలపై ఆగ్రహం చూపొద్దని మొక్కా.. కురుమూర్తి స్వామి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. పాలకుడే దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే దైవాగ్రహానికి గురవుతాం. రేవంత్‌రెడ్డి చేసిన పాపానికి ఆ స్వామిని దర్శించుకుని క్షమించమని, ప్రజలపై ఆగ్రహం చూపొద్దని మొక్కా. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రాన్ని పాలించే పాలకుడు ప్రజలను మోసం చేయకుండా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించా. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు రావాలని కోరుకోవడం లేదు.. ఎప్పుడు వస్తే అప్పుడు 100 సీట్లతో కేసీఆర్‌ను గెలిపిస్తారు. రూ.4వేల కోట్ల వ్యయంతో6.50 లక్షల ఎకరాలకు నీరిచ్చాం.. పెండింగ్ ప్రాజెక్ట్‌లను రన్నింగ్ ప్రాజెక్ట్‌లుగా మార్చాం.. ఈ ప్రభుత్వం ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాజీమంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డితో కలిసి కురుమూర్తిస్వామికి మొక్కులు.. మార్గమధ్యలో ధాన్యం కేంద్రాల్లో రైతులతో మాటామంతీ.. కొనుగోళ్ల తీరుపై ఆరా -
ఉపాధ్యాయులకు చెబితే..
మేం రోజు మాదిరిగానే పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశాం. అయితే ఒంటిగంటకు భోజనం చేసి తరగతి గదులకు వెళ్లి కూర్చున్నాం. కొంత సమయానికి కడుపు నొప్పి మొదలైంది. ఈ విషయం మొదట ఉపాధ్యాయులకు చెబితే లైట్‌గా తీసుకుని..పట్టించుకోలేదు. – మహేష్, 7వ తరగతి నాణ్యతగా ఉండదు.. మధ్యాహ్న భోజనం నాణ్యత లేకపోవడం వల్లనే అనారోగ్యానికి గురయ్యాం. ప్రతిరోజు కూడా మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించడం లేదు. ఈ విషయమై ఉపాధ్యాయులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా వంట ఏజెన్సీని మార్చి నాణ్యమైన భోజనం అందించాలి. – జగదీశ్, 7వ తరగతి వెంటనే స్పందించాం.. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఉపాధ్యాయులు సమాచారం అందించడంతో వెంటనే స్పందించి చికిత్స అందేలా చూశాం. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణం మధ్యాహ్న భోజనమా అనేది ఇంకా తేలలేదు. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – మురళీధర్‌రెడ్డి, హెచ్ఎం ● -
నాగర్‌కర్నూల్
గురువారం శ్రీ 21 శ్రీ నవంబర్ శ్రీ 2024అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే నత్తనడకన సాగుతుంది. ఈ సర్వేపై ప్రభుత్వం ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడం వల్లే సర్వేకు వచ్చిన వారికి వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే ఎందుకు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తే వారు కనీసం సమాధానం కూడా ఇవ్వకపోతుండటంతో.. సర్వేకు ఎక్కువ శాతం ప్రజలు సహకరించడం లేదు. అయితే జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ప్రజలు సర్వేకు కొంతమేర నిరాకరిస్తుండగా.. పల్లెల్లోనే పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా ఈ నెల 9న ప్రారంభమైన సర్వే జిల్లాలో ఇప్పటి వరకు 55 శాతం పూర్తయింది. అసలు సర్వే ఎందుకు.. ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో అనేక అపోహలు పెట్టుకుంటున్నారు. కులగణన, రేషన్ కార్డు కోసం ఇన్ని వివరాలు అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరో 15 రోజులు పట్టొచ్చు.. ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే ఈ నెల 25 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నిర్దేశించిన ప్రకారం సర్వే పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. వందశాతం పూర్తి కావడానికి ఇంకా 15 రోజులు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక కుటుంబం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి సిబ్బందికి అరగంట కంటే ఎక్కువ సమయం కావడంతో సర్వే వేగవంతం కాలేకపోతుంది. రోజుకు 8 నుంచి 12 కుటుంబాలను మాత్రమే సర్వే చేస్తున్నారు. అలాగే కొందరు ఉద్యోగులు సెలవు దినాల్లో పనిచేయడానికి ఇష్టపడటం లేదు. అంగన్వాడీలు సైతం పూర్తిస్థాయిలో సర్వేలో పాల్గొనడం లేదని తెలుస్తోంది. సర్వే చేసేందుకు ఏ మేరకు గౌరవ వేతనం ఇస్తారో కూడా స్పష్టంగా చెప్పకపోవడంతో ఎన్యుమరేటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇన్ని సమస్యలు మద్య సకాలంలో సర్వే, డాటా ఎంట్రీ పూర్తవుతుంది అనేది అంతులేని ప్రశ్నగా మారుతోంది. న్యూస్‌రీల్ అప్పులు చెబుతున్నా..ఆస్తుల వెల్లడికి నిరాకరణ వివరాలు చెప్పేందుకు అధిక శాతం మొగ్గుచూపని ప్రజలు కొన్నిచోట్లఎన్యుమరేటర్లను నిలదీస్తున్న వైనం జిల్లాలో నత్తనడకన సాగుతున్నకుటుంబ సమగ్ర సర్వే -
నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా
అచ్చంపేట రూరల్: రైతులు, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. బుధవారం అచ్చంపేటలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్స్టేషన్లు, ఫీడర్ చానళ్లను డీఈ, ఏఈలు తరుచూ పర్యవేక్షించాలన్నారు. వ్యవసాయం, గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరా జరిగేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం విద్యుత్ శాఖలోని అభివృద్ధి పనులు, నూతనంగా మంజూరైన సబ్స్టేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సబ్స్టేషన్ల నిర్మాణ పనులు, స్థల సేకరణ త్వరగా పూర్తిచేయాలన్నారు. విద్యుత్ సమస్యలేకున్నా.. ఉన్నట్లు సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. అంతకు ముందు విద్యుత్‌శాఖ అధికారులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఈ శ్రీధర్‌శెట్టి, ఏడీఈ శ్రీనివాస్, ఏఈలు ఆంజనేయులు, రమేష్, అప్పలనాయుడు, సుధాకర్‌రావు, కొండల్, మేఘనాథ్, జానకీరాం, లైన్మేన్లు పాల్గొన్నారు. -
అపరిశుభ్రంగా వంట గది..
విద్యార్థులకు వంట చేసేందుకు నిర్మించిన వంట గదితో పాటు పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి. చెత్తాచెదారం మొత్తం అక్కడే వేస్తున్న పరిస్థితులు కనిపించాయి. వంట చేసేందుకు వినియోగించిన కూరగాయలు, కారం పొడి తదితర సామగ్రి మొత్తం వంట ఏజెన్సీ వారు ఎప్పటికప్పుడు బయటి నుంచి తీసుకువస్తున్నారని, మెనూ పాటించడం లేదని విద్యార్థులు వాపోయారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి వీరే వంట చేస్తున్నారని, వీరిని మార్చాలని డిమాండ్ చేస్తున్నా.. ఉపాధ్యాయులు మాత్రం వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలో విద్యార్థులకు శుద్ధి నీరు అందించే ఫిల్టర్ వాటర్ మిషన్ సైతం మరమ్మతుకు గురైనా బాగు చేయకపోవడంతో.. నిత్యం మిషన్ భగీరథ నీరు తాగుతున్నారు. -
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
పెంట్లవెల్లి: వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ధాన్యం సేకరించాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని జటప్రోల్, గోప్లాపూర్, పెంట్లవెల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు, జటప్రోల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం స్థలాన్ని ఆర్డీఓ బన్సీలాల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచి వేగవంతంగా కొనుగోలు పూర్తి చేయాలన్నారు. అలాగే వడ్లలో ఎలాంటి దుమ్ము లేకుండా, తేమశాతం తగు మోతాదులో ఉండేలా ఆరబెట్టుకొని ధాన్యం తీసుకురావాలని సూచించారు. రైతులు ధాన్యం అమ్మిన తర్వాత ఆధార్ కార్డు, పాసు బుక్, బ్యాంక్ అకౌంట్ వంటివి వెంటనే ధాన్యం కొనుగోలుదారులకు అప్పగించాలని చెప్పారు. ఐకేపీ వారు కూడా తేమ శాతం చూసుకొని ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయంతి, వైస్ ఎంపీపీ భీంరెడ్డి, నాగిరెడ్డి, ఏపీఎం గౌసుద్దీన్, నరేష్‌యాదవ్, శోభ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు నిర్మించుకోవాలి
పథకాలపై అవగాహనకే ప్రచార కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రజా పాలన కళాయాత్ర సమాచార, జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్లతో సిద్ధం చేయగా.. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బృందం ప్రజాపాలన– ప్రజా విజయోత్సవాలపై అవగాహన కల్పిస్తారన్నారు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిగా అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకునేందుకు ఇది ఒక మంచి సదవకాశం అని చెప్పారు. ప్రతిరోజు ప్రతి మండలం నుంచి ఎంపిక చేసిన మూడు గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఆర్డీఓ చిన్న ఓబులేసు, డీపీఆర్ఓ కిరణ్‌కుమార్, డీఈఓ గోవిందరాజులు, డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు శ్రీధర్‌రావు, సుధాకర్‌సింగ్, డీడబ్ల్యూఓ రాజేశ్వరి, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, సాంస్కృతిక శాఖ కళాజాత బృందం సభ్యులు భాస్కర్, శివ, కృష్ణ, పార్వతమ్మ, శైలజ పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్: మరుగుదొడ్లు మన ఆత్మగౌరవం కోసమని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం–2024 సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో మన ‘మరుగుదొడ్డి– మన ఆత్మగౌరవం’ అంశంపై నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంగళవారం నుంచి వచ్చే నెల 10 వరకు జిల్లాలోని అన్ని గ్రామాలను ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ (ఓడీఎఫ్) ప్లస్ మోడల్ గ్రామాలుగా మార్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నామన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తించి వాటి నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు సిటిజన్ రిజిస్ట్రేషన్ ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం 1,643 దరఖాస్తులు చేసుకున్నారని, 485 మరుగుదొడ్లు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉత్తమ మరుగుదొడ్లను గుర్తించి ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలు, పీహెచ్‌సీల్లో ఇది వరకే నిర్మించిన మరుగుదొడ్లు వినియోగంలో లేకుంటే వాటిని వెంటనే అందుబాటులోకి తేవాలని చెప్పారు. గ్రామాల్లో మరుగుదొడ్ల వినియోగంపై ముగ్గుల పోటీలు నిర్వహించి, అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం అవగాహన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. -
ఊపందుకోని కొనుగోళ్లు
ఉమ్మడి జిల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు● చాలాచోట్ల తేమశాతం పేరుతో ముందుకు సాగని కొనుగోళ్లు ● సింహభాగం ప్రైవేటు వ్యాపారులకే తరలుతున్న సన్నాలు ● ప్రభుత్వం ఇచ్చే బోనస్ కోల్పోతున్న రైతులు సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ఇంకా ఊపందుకోలేదు. ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్ల కేంద్రాలను ప్రారంభించామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. చాలాచోట్ల ఇప్పటివరకు ధాన్యం సేకరణ మొదలుపెట్టలేదు. తేమశాతం పేరుతో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకే ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఓ వైపు కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం, నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు ఆరబోసేందుకు వీలుకాక తక్కువ ధరకే ప్రైవేటుకు అమ్ముకుని నష్టపోతున్నారు. ఈసారి సన్నరకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్ ధరను ప్రకటించినప్పటికీ చాలామంది రైతులు ప్రైవేటుకు విక్రయిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ధరను లబ్ధిపొందలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్ల ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఆయా కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు మాత్రం మొదలుకాలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 8,360 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, మిగతా చోట్ల కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు కేవలం 564 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే అధికారులు సేకరించారు. వనపర్తి జిల్లాలో 3,266 మెట్రిక్ టన్నులు, నారాయణపేట జిల్లాలో 3,107 మెట్రిక్ టన్నులు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 750 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్ణీత తేమ శాతం 14 లోపు ఉంటేనే అధికారులు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల తేమశాతం ఉన్నా కొనుగోళ్లు మాత్రం ప్రారంభించడం లేదని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల వివరాలు జిల్లా కొనుగోలు ప్రా.వి ఇప్పటివరకు కొన్న కేంద్రాలు ధాన్యం (మెట్రిక్ టన్నుల్లో) మహబూబ్‌నగర్ 189 189 8,360.60 నాగర్‌కర్నూల్ 252 252 564 వనపర్తి 262 183 3,266 జోగుళాంబ గద్వాల 64 64 750 నారాయణపేట 101 101 3,107ప్రా.వి: ప్రారంభించినవినామమాత్రంగా కొనుగోళ్లు.. ప్రైవేట్‌లోనే అమ్ముకున్న.. నేను ఈసారి ఎకరాన్నరలో సన్నరకం వరిసాగు చేశాను. మా గ్రామంలో ఇప్పటి వరకు ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో 30 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,400 చొప్పున తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నాను. మా ఊరిలో కేంద్రం ప్రారంభం కాక చాలామంది రైతులు ప్రైవేటు వ్యక్తులకే అమ్ముకుంటున్నారు. – బాలయ్య, రైతు, రాయిపాకుల, తెలకపల్లి మండలం తేమశాతం ఉండట్లేదు.. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. నిర్ణీత తేమశాతం కలిగిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉండగా ఇందుకు సమయం పడుతోంది. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం ఇస్తున్న బోనస్ కేవలం రెండు రోజుల్లోనే వారి ఖాతాల్లో జమ అవుతోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. – రాజయ్య, జిల్లా పౌర సరఫరాశాఖ మేనేజర్, నాగర్‌కర్నూల్ -
అలరించిన బాలోత్సవం
బాలోత్సవం, పిల్లల జాతర కార్యక్రమం పట్టణవాసులను అలరించింది. మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం జాతీయ జెండాను, ఉత్సవ కమిటీ కన్వీనర్ చెన్నయ్య బాలోత్సవ జెండాను ఎగురవేశారు. మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 1,500 మంది విద్యార్థులు హాజరై ఉత్సవాలను విజయవంతం చేశారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ, కోలాట ప్రదర్శన, జానపద గేయాలు, నృత్యాలు, ఉపన్యాసం, చిత్రలేఖనం తదితర కార్యక్రమాల్లో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శాహెద్, మాజీ సర్పంచ్ అనంత్‌కుమార్, వీరాంజనేయులు, చిన్నయ్య, వెంకటయ్య, లక్ష్మణమూర్తి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, మల్లయ్య, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ ప్రపంచం అంటే చిన్నారులదే..
కల్వకుర్తి రూరల్: ఉత్తమ ప్రపంచం అంటే చిన్నారులదేనని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. మంగళవారం సాయంత్రం కల్వకుర్తిలో నిర్వహించిన బాలోత్సవ్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహనీయుల జీవిత చరిత్ర చిన్నప్పటి నుంచే బోధించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, నెల్సన్ మండేలా, మహాత్మగాంధీ, వివేకానంద లాంటి గొప్ప వ్యక్తులు, మేధావులు, సైంటిస్ట్‌లు, శాస్త్రవేత్తలు, స్వాతంత్య్ర పోరాటయోధుల జీవిత చరిత్ర విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. మంచి సమాజం.. ప్రజల కోసం ఎల్లప్పుడూ కృషిచేసిన గొప్ప వ్యక్తు ల జీవిత చరిత్ర విద్యార్థులకు బోధించాలన్నారు. -
యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు
నాగర్‌కర్నూల్ క్రైం: మత్తుకు బానిసై యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి ఎస్పీ తయారు చేయించిన వీడియో సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల నుంచి మన దేశ భవిష్యత్‌ను కాపాడే యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువత మత్తు పదార్థాలకు బానిసైతే కలిగే నష్టాల గురించి గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రామేశ్వర్, సింగర్ మీసాల రాము తదితరులు పాల్గొన్నారు. -
ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయండి
నాగర్‌కర్నూల్ క్రైం: విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైతే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని జిల్లా షీటీం ఇన్చార్జ్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం మండలంలోని వనపట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో షీటీంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షీటీంను సంప్రదించి ఫిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి ఆకతాయిల ఆట కట్టించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రత్యేకంగా ప్రధాన కూడలిలో, చౌరస్తాలో, జిల్లా కేంద్రాల్లో షీటీం పనిచేస్తుందని, బాధితులు డయల్ 100, సెల్ నం.87126 57676కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని కోరారు. సమాజంలో మహిళలు, బాలికలు తెలిసిన వారితోనే ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారని, జాగ్రత్తగా ఉండాలే తప్ప అధైర్యపడొద్దన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రమోహన్, షీటీం మెంబర్ వెంకటయ్య, భరోసా టీం శ్రీవిద్య, జ్యోతి పాల్గొన్నారు. -
ప్రైవేటుకు తరలుతున్న ధాన్యం..
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యం కన్నా ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోకే ఎక్కువ ధాన్యం తరలుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ఆలస్యంగా కొనసాగడం, రోజుల తరబడి రైతులు నిరీక్షించలేక ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ఈసారి ప్రభుత్వం సన్నరకం వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,300 ఇస్తుండగా, సన్న రకం ధాన్యానికి అదనంగా రూ.500 అందిస్తోంది. బోనస్ ధరతో కలుపుకుని సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,800 రైతులకు అందించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని కేవలం రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రైతు నుంచి ధాన్నాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోగా కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,300 రైతు ఖాతాలో జమ అవుతాయని, మరుసటి రోజున 24 గంటల్లోపు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ డబ్బులు రైతుఖాతాలో జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే చాలాచోట్ల రైతులు మాత్రం ప్రభుత్వం కొనుగోలు చేసేంత వరకు నిరీక్షించకుండా తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ధర కన్నా రూ.300 నుంచి రూ.500 వరకు తక్కువగా ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ముమ్మరం చేయాలని, సకాలంలో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో జమచేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ
ఎర్రవల్లి: ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఓ పంచాయతీరాజ్ ఏఈ సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. ఎర్రవల్లి మండలంలోని రాజశ్రీ గార్లపాడులో రూ.25 లక్షల వ్యయంతో ఓ కాంట్రాక్టర్ మైనారిటీ కమ్యూనిటీ భవనం (షాదీఖానా)ను నిర్మించి బిల్లు కోసం ఎంబీ రికార్డుల్లో నమోదు చేయాలని పంచాయతీరాజ్ ఏఈ పాండురంగారావును ఇటీవల సంప్రదించాడు. ఈ క్రమంలో తనకు కాంట్రాక్ట్ బడ్జెట్ ప్రకారం 2 శాతం కమీషన్‌గా రూ.లక్ష ఇస్తేనే ఎంబీలో బిల్లు ఎక్కిస్తానని తేల్చి చెప్పాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏఈతో చర్చలు జరిపి చివరికి రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొని.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు పథకం ప్రకారం సోమవారం ఉదయం బాధితుడు ఎర్రవల్లి కూడలిలోని జమ్జమ్ హోంనీడ్స్ దుకాణంలో ఏఈకి నగదు డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏఈ నుంచి వివరాలు సేకరించి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. ఏసీబీ దాడుల్లో సీఐలు లింగస్వామి, జిలానీ, సిబ్బంది పాల్గొన్నారు. ● ఎంబీ రికార్డు చేసేందుకు రూ.50 వేలు డిమాండ్ ● రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు -
వీడిన ఉత్కంఠ
జడ్చర్ల: మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్కు చెందిన కోనేటి పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్కు చెందిన చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మిపై సొంత పార్టీ సభ్యులే అవిశ్వాసం పెట్టి పదవి నుంచి దింపిన తర్వాత తదుపరి చైర్పర్సన్ ఎవరా అంటూ దాదాపు మూడు నెలల పాటు చర్చలు కొనసాగాయి. చివరికి చైర్‌పర్సన్‌గా పుష్పలత ఏకగ్రీవం కావడంతో ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. అయితే మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలుపుకోగలిగింది. ప్రశాంతంగా ఎన్నిక.. మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు. నిర్ణీత సమయానికి క్యాంపు నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కౌన్సిలర్లతోపాటు మాజీ చైర్పర్సన్ లక్ష్మి సైతం ఎన్నికకు హాజరయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ఆర్డీఓ నవీన్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి ఎన్నికను నిబంధనల మేరకు నిర్వహించారు. బీఆర్ఎస్కు చెందిన 14వ వార్డు కౌన్సిలర్ కోనేటి పుష్పలతను చైర్పర్సన్ అభ్యర్థిగా 26వ వార్డు కౌన్సిలర్ శశికిరణ్ ప్రతిపాదించగా 9వ వార్డు సభ్యురాలు చైతన్య బలపరిచారు. చైర్పర్సన్ అభ్యర్థిగా కోనేటీ పుష్పలతను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 26 మంది సభ్యులు ఆమోదించడంతో ఏకగ్రీవంగా ఎన్నికై న ట్లు రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ నవీన్‌కుమార్ ప్రక టించి ధ్రువీకరించారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ గంట వ్యవధిలో ముగిసింది. తదుపరి బీఆర్ఎస్ స భ్యులు విజయ సంకేతాన్ని చూపుతూ తమకు స హకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆశీస్సులతో తనకు అవకాశం లభించిందని నూతన చైర్పర్సన్ పుష్పలత పేర్కొన్నారు. సభ్యుల సహకారంతో ప్రజలకు మంచి చేసేందుకు కృషిచేస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే.. చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నీ తానై ముందుకు నడిపించారు. పదవికి పోటీ తీవ్రంగా ఉన్నా సభ్యులకు నచ్చజెప్పి చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేలా చూశారు. జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కోనేటి పుష్పలత ఏకగ్రీవమైన ఎన్నిక.. కాంగ్రెస్, బీజేపీ సంపూర్ణ మద్దుతు పుర పీఠాన్ని నిలుపుకొన్న బీఆర్ఎస్ పార్టీ -
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
కల్వకుర్తిరూరల్: నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మె ల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మార్చాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు గదులు, గౌడ సంఘం భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఉన్నత పాఠశా ల విద్యార్థుల కోసం కంప్యూటర్లను అందజేశారు. అ నంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రానికి రైతులు తీసుకువచ్చిన ధాన్యంలో తేమశాతాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రైతులు ని బంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గంలో ని అన్ని గ్రామాలు, తండాలకు బీటీరోడ్లు, సీసీరోడ్లు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ మెంబర్ సభ్యుడు బాలాజీ సింగ్, పీఏసీఎస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, విజయ్‌కుమార్‌రెడ్డి, సీఈఓ వెంకట్‌రెడ్డి, రవిగౌడ్, జంగయ్యగౌడ్ పాల్గొన్నారు. -
వాతావరణం
అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతం అవుతుంది. ఉదయం, రాత్రివేళ చలి విపరీతంగా ఉంటుంది. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి నాగర్‌కర్నూల్: ప్రజావాణి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మొత్తం 39 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. పోలీస్ ప్రజావాణికి తొమ్మిది అర్జీలు.. నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి తొమ్మిది అర్జీలు అందాయి. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకొని ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మూడు ఫిర్యాదులు తగున్యాయం కోసం రాగా.. ఐదు భూతగాదాలపై, ఒకటి భార్యాభర్తల గొడవపై వచ్చినట్లు తెలిపారు. తప్పులకు తావివ్వొద్దు అచ్చంపేట: సమగ్ర కుటుంబ సర్వే వివరాల నమోదులో తప్పులకు తావివ్వొద్దని మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ ఎన్యుమరేటర్లకు సూచించారు. సోమవారం పట్టణంలో చేపట్టిన ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రణాళికా బద్ధంగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికీ వెళ్లి సమగ్ర వివరాలు సేకరించాలని సూచించారు. సర్వేపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రజలు ఇచ్చే సమాధానాలను మాత్రమే నమోదు చేసుకోవాలని తెలిపారు. -
బస్సుల సంఖ్య పెంచాలి
కల్వకుర్తిరూరల్: ఆర్టీసీ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో రద్దీ విపరీతంగా పెరిగిందన్నారు. ఫలితంగా మహి ళలతో పాటు పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం కొత్త బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బంది సంఖ్య పెంచాలని, కార్మికులపై పనిభారం తగ్గించాలని కోరారు. -
ముస్లింలకు న్యాయం చేయాలి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 15 శాతం ఉన్న వెనకబడిన ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలి. ముస్లింలలో 50 వెనకబడిన కులాలు ఉండగా.. వీటిలో 30 దాకా సంచార తెగలు ఉన్నాయి. వీరిని ఎస్టీలుగా, మిగిలిన 20 కులాలను బీసీలుగా గుర్తించి వెనకబడిన ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు పెంచాలి. – షేక్ ఫరూక్ హుస్సేన్, ఆల్‌మేవా రాష్ట్ర అధ్యక్షుడు రజకులకు అన్యాయం రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల జనాభా ఉన్న రజకులకు రాజకీయ ప్రాధాన్యత లేకుండాపోయింది. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నామని, ఇంకా తమను అంటరానివాళ్లుగానే సమాజం చూస్తుంది. తమ జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలి. – పురుషోత్తం, రజక సంఘం అధ్యక్షుడు -
వరికొయ్యలను కాల్చొద్దు
నాగర్‌కర్నూల్ రూరల్: రైతులు వరికోతల అనంతరం కొయ్యలను కాల్చకుండా కుళ్లింపజేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరికొయ్యలను కుళ్లించడంతో భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. వరికొయ్యల అవశేషాలపై ఎకరాకు 50 సూపర్ సల్ఫేట్, 10 నుంచి 15 కిలోల యూరియా చల్లాలని సూచించారు. నీటి తడి ద్వారా డీకంపోజింగ్ చేసుకోవచ్చని.. లేదా రోటవేటర్‌తో దమ్ము చేసుకోవాలని తెలిపారు. భూమిలో పోషకాలను కాపాడుకోవడం కోసం రైతులు అవసరమైన ఎరువులను వినియోగించాలని సూచించారు. పంట అవశేషాల దహనాన్ని తగ్గించడంతో భూసారం పెంచుకోవడంతో పాటు వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు తెలకపల్లి: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్నట్లు ఐకేపీ డీపీఎం (ఫైనాన్స్) వెంకటేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సీ్త్రశక్తి భవనంలో మండల మహిళా సమాఖ్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళాశక్తి పథకంలో 14 యూనిట్లు ఉన్నాయని.. మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు వ్యాపార రంగంలో రాణించి, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. మహిళాశక్తి పథకంలో డ్వాక్రా బజార్, సూపర్ మార్కెట్లను కూడా నిర్వహించుకోవచ్చని తెలిపారు. బ్యాంక్ లింకేజీ టార్గెట్‌ను పూర్తిచేయాలన్నారు. రుణ బీమా, ప్రమాద బీమా, సీ్త్రనిధి సురక్ష రుణం, బీమా పథకంలో ఉండి, మరణించిన సభ్యుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఇందిరా మహిళాశక్తి సంబురాల్లో భాగంగా మహిళలను సంఘాల్లో చేర్పించాలని సూచించారు. సమావేశంలో ఏపీఎం నిరంజన్, సమాఖ్య కార్యదర్శి రేణుక, కోశాధికారి అమృత, గాయత్రి, మంజుల, చంద్రకళ, సరిత, భాగ్యలక్ష్మి, సీసీలు నర్సింహ, సుజాత, నిరంజన్ ఉన్నారు. ‘బకాయిలు చెల్లించండి’ నాగర్‌కర్నూల్ రూరల్: బెస్ట్ అవేలబుల్ స్కూల్ స్కీం బకాయిలను చెల్లించి, విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా చూడాలని కోరుతూ సోమవారం ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ సీతారామారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మూడావత్ శంకర్, ఎస్ఎఫ్ఐ నాయకులు తారాసింగ్, అంతటి కాశన్న మాట్లాడుతూ.. బెస్ట్ అవేలబుల్ స్కీం ద్వారా రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో 9 వేల మంది దళిత పిల్లలు, 6వేల మంది గిరిజన పిల్లలు చదువుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఏటా చెల్లించాల్సిన రూ. 175 కోట్లు బకాయి ఉండటంతో విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సుల్తాన్, అశోక్, భాస్కర్ పాల్గొన్నారు. -
రిజర్వేషన్ కల్పించాలి..
సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. తెలంగాణలో 129కి పైగా బీసీ తరగతులు ఉండగా.. ఇప్పటికీ అత్యధిక శాతం సంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. సంచార జాతులు, ఎంబీసీ కులాలలో సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం విపరీతంగా ఉంది. వీరిపై దాడులు, దౌర్జన్యాలు, కులవివక్ష, మహిళలపై అత్యాచారాలు అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి. 11 బీసీ ఎంబీసీ కార్పొరేషన్ల ఫెడరేషన్లకు పాలక వర్గాలను నియమించి తగిన బడ్జెట్ కేటాయించాలి. – మోహన్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు -
ప్రశాంతంగా ముగిసిన గ్రూప్–3
నాగర్‌కర్నూల్: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్–3 పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంతో పాటు తెలకపల్లి, పాలెం, బిజినేపల్లిలో 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన పేపర్–1, పేపర్–2 పరీక్ష నిర్వహించగా.. 9,478 మంది అభ్యర్థులకు గాను 5,086 మంది హాజరయ్యారు. సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగిన పేపర్–3 పరీక్షకు 5,046 మంది హాజరై రాశారు. జిల్లావ్యాప్తంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని సైన్స్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ బదావత్ సంతోష్ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులను బయటికి పంపవద్దన్నారు. కాగా, పరీక్ష కేంద్రాలకు వెళ్లిన కలెక్టర్ నిబంధనలను అనుసరిస్తూ సెల్‌ఫోన్ కారులోనే వదిలి వెళ్లారు.