పట్టభద్రులు 14,586.. ఉపాధ్యాయులు 1,561 | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రులు 14,586.. ఉపాధ్యాయులు 1,561

Published Tue, Dec 31 2024 12:18 AM | Last Updated on Tue, Dec 31 2024 12:18 AM

పట్టభద్రులు 14,586.. ఉపాధ్యాయులు 1,561

పట్టభద్రులు 14,586.. ఉపాధ్యాయులు 1,561

● ‘మండలి’ ఓటర్ల తుది జాబితా విడుదల ● రెవెన్యూ కార్యాలయాల్లో ప్రదర్శన ● భారీగా దరఖాస్తుల తిరస్కరణ

కై లాస్‌నగర్‌: మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఓటరు తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజర్షి షా సోమవారం ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా గ్రాడ్యూయేట్‌ ఓటర్లు 14,586 మంది ఉండగా, ఉపాధ్యాయ ఓటర్లు 1561 మంది నమోదైనట్లుగా వెల్లడించారు. ఈ ఓటర్ల జాబితాలను కలెక్టర్‌ కార్యాలయంతో పాటు ఉట్నూర్‌ సబ్‌ కలెక్టర్‌, ఆదిలాబాద్‌ ఆర్డీవో కార్యాలయాలు, జిల్లాలోని అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అలాగే అన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని బీఎల్‌వోల వద్ద కూడా అందుబాటులో ఉంచనున్నట్లుగా వెల్లడించారు.

పెరిగిన పట్టభద్రుల ఓటర్లు..

2019లో జరిగిన శాసనమండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఓటరు నమోదుపై అధికారులు విస్తృత ప్రచారం కల్పించడం, ఓటు నమోదు చేసుకునేందుకు ఈసీ పలుమార్లు అవకాశం కల్పించడం కలిసొచ్చింది. గతంతో పోల్చితే పట్టభద్రుల ఓటర్లు రెట్టింపుగా నమోదు చేసుకున్నారు. నాటి ఎన్నికల్లో పట్టభద్రుల ఓటర్లు 7,268 మంది ఉండగా ప్రస్తుతం 14,586 మంది ఉన్నారు. గతంతో పోల్చితే 7,318 మంది ఓటర్లు పెరిగారు. ఇందులో 10,104 మంది పురుష ఓటర్లు, 4,482 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్యలో పెద్దగా మార్పేమి కనిపించ లేదు. నాటి ఎన్నికల్లో 1,554 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 1,561 మంది ఉన్నారు. కేవలం ఏడుగురు మాత్రమే ఈ సారి పెరిగారు. మొత్తంగా 1,073 మంది పురుష ఓటర్లు, 488మంది మహిళా ఓటర్లు ఉన్నారు. సాధారణ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండగా మండలి ఎన్నికలకు వచ్చేసరికి పురుషులదే అధిక్యం కనిపిస్తోంది.

1,982 దరఖాస్తుల తిరస్కరణ

శాసన మండలి ఎన్నికలకు ఓటర్లుగా నమోదు చేసుకునే వారంతా విద్యావంతులే. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులతో పాటు డిగ్రీ పూర్తి చేసిన వారంతా ఇందుకు అర్హులే. అలాంటి విద్యావంతుల దరఖాస్తులు జిల్లాలో భారీగా తిరస్కరణకు గురవడం విస్మయానికి గురిచేస్తోంది.పట్టభద్రుల ఓటర్లకోసం 16,197 మొత్తం దర ఖాస్తులు అందగా, 14,586 దరఖాస్తులను అధికారులు ఆ మోదించారు. మరో 1,611 దరఖాస్తులను తిరస్కరించారు. అలాగే టీచర్స్‌ ఓటర్లకోసం 1,932దరఖాస్తులురాగా 1,561 ఆమోదం పొందాయి. 371 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అయితే దరఖాస్తు విధానంపై అవగాహన లేకపోవడం, దరఖాస్తు సమయంలో పూర్తి వివరాలు నింపకపోవడం, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జత చేయకపోవడం, సెల్‌ఫోన్‌ నంబర్లు, అడ్రస్‌ వంటి వివరాలు తప్పుగా నమోదు చేయడం వంటి కారణాలతోనే ఈ దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లుగా అధికారులు చెబుతున్నారు.

రెవెన్యూ పట్టభద్రుల ఓటర్లు ఉపాధ్యాయ ఓటర్లు

డివిజన్‌ పురుషులు మహిళలు మొత్తం పురుషులు మహిళలు మొత్తం

ఉట్నూర్‌ 1,441 608 2,049 169 76 245

ఆదిలాబాద్‌ 8,663 3,874 12,537 904 412 1,316

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement