● ఎంపీ గోడం నగేశ్
కై లాస్‌నగర్: సమగ్ర శిక్ష ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్న మొండివైఖరి సరికాదని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. కలెక్టరేట్ ఎదుట గల సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన లో ఉద్యోగులను నిర్లక్ష్యం చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణి అవలంబిస్తుండటం విచారకరమన్నారు. విద్య అనేది ఉమ్మడి జాబితా అయినా రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్‌కు సంబంధించిన అంశాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే తప్పకుండా స్పందిస్తుందన్నారు. రెండు రోజుల్లో ఉద్యోగుల సమస్యలపై కేంద్ర విద్యాశాఖ మంత్రికి మెయి ల్ చేస్తానని భరోసానిచ్చారు. శిబిరం నుంచే రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడిన ఎంపీ వారి సమస్యలపై ఆరా తీశారు. ఆయన వెంట బీజేపీ నాయకులు, సంఘం ప్రతినిధులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment