‘సూపర్ స్పెషాలిటీ’ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
● ఆస్పత్రి అపరిశుభ్రతపై ఆగ్రహం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆదిలాబాద్‌కు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కేటాయించిందని తెలిపారు. ఆస్పత్రితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత కాంట్రాక్ట్ సిబ్బందికి సూచించారు. నిరుపేద రోగులు ఎంతో నమ్మకంతో ఇక్కడికి వస్తారని, వారికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌కు సూచించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు దయాకర్, మయూర్‌చంద్ర, నిఖిల్, లింగన్న నారాయణ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment