చైనా మాంజాతో వృద్ధుడి ముక్కుకు గాయం
ఏయూక్యాంపస్: బీచ్‌రోడ్డులో చైనా మాంజా తగిలి ఓ వృద్ధుడి ముక్కుపై కోసుకుపోయింది. త్రుటిలో ప్రమాదం తప్పింది. కోస్టల్ బ్యాటరీ నుంచి నోవెటెల్‌కి వెళ్లే మార్గంలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వెళుతున్న వృద్ధునికి గాలిపటం ఎగురవేయడానికి ఉపయోగించే దారం(చైనా మాంజా) తలిగింది. దీనిని హెల్మెట్ అద్దం కూడా ఆపలేకపోయింది. పదునైన చైనా మాంజా తగిలి వృద్ధుని ముక్కుప్రాంతంలో గాయమైంది. తీవ్రంగా రక్తస్రావమై వృద్ధుని దుస్తులు రక్తంతో తడిసిపోయాయి. వెంటనే స్థానికులు స్పందించి బాధితుడికి సపర్యలు చేసి, ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడు వాహనంపై నెమ్మదిగా వెళ్లడం, హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసుల వద్ద ఎటువంటి సమాచారం లేకపోవడం గమనార్హం.
ప్రమాదరకం...చైనా మాంజా...
ప్రమాదకరమైన చైనా మాంజాపై నిషేధం ఉంది. పతంగులు ఎగురవేసేందుకు ఉపయోగించే దారానికి సన్నని గాజు పొడిని పూస్తారు. గాలిపటాల పోటీలు జరిగే సమయంలో వేరొకరి గాలిపటం దారాన్ని కత్తిరించడానికి దీనిని వినియోగిస్తారు. గతంలో ఈ చైనా మాంజా కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. దీంతో ఈ చైనా మాంజాపై నిషేధం ఉంది. వీటిని విక్రయించవద్దని పోలీసులు వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. అయినప్పటికీ విక్రయాలు కొనసాగుతున్నాయి.
త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
బీచ్‌రోడ్డులో సంఘటన
నిషేధం ఉన్నా ఆగని చైనా మాంజాల విక్రయాలు
Comments
Please login to add a commentAdd a comment