అక్రమ కట్టడాలను సహించేది లేదు
రాయచోటి అర్బన్ : రాయచోటి పట్టణంలో అక్రమ కట్టడాలను నిర్మిస్తే సహించేది లేదని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖమంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎగువ అబ్బవరం దళితవాడలో అక్రమకట్టడాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాయచోటిలో గతంలో భూ ఆక్రమణలు, అక్రమ కట్డడాలు అధికంగా జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వంలో పార్టీలకతీతంగా ఆక్రమణలను తొలగించి పేదలకు న్యాయం చేస్తామని చెప్పారు. కొంతమంది ప్రభుత్వానికి నష్టం కలిగించే విదంగా అప్రూవల్ లేకుండా ఆరు అంతస్తుల అపార్టుమెంట్లు కడుతున్నారన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం మంచిది కాదన్నారు. అనంతరం ఆయన నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లను మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించి తగు సూచనలు చేశారు.
రాష్ట్ర మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment