8న విరాట్ విష్ణు సహస్ర పారాయణం
భద్రాచలం: భద్రాచలంలో వచ్చేనెల 8వ తేదీన శ్రీ విష్ణు సహస్రనామ సామూహిక పారాయణం ఏర్పాటుచేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈసందర్భంగా శుక్రవారం జీయర్ మఠంలో జరిగిన సమావేశంలో శ్రీ జీయర్ మఠం, వికాస తరంగిణి, భగవదాద్రమానుజా సేవాసమితి బాధ్యులు వివరాలను వెల్లడించారు. వచ్చేనెల 8న భీష్మ ఏకాదశి సందర్భంగా భద్రాచలం జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో 20వేల మంది భక్తులతో పారాయణం నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలాది మంది ఏకకాలంలో చేసే ఈ పారాయణాన్ని విరాట్ పారాయణంగా పిలుస్తారని, శ్రీరాముడు కొలువైన భద్రాచలంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని చినజీయర్ స్వామి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని వెల్లడించారు. కాగా, 8వ తేదీ మధ్యాహ్నం జీయర్ మఠం నుంచి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో శోభాయాత్ర మొదలై కళాశాల మైదానానికి చేరుకుంటుందని తెలిపారు. సాయంత్రం 4గంటలకు శ్రీరామచంద్రుడి ఆరాధన, మంగళాశాసనంతో పాటు విరాట్ పారాయణం జరుగుతాయని, భక్తులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీయర్ మఠం, వికాస తరంగిణి బాధ్యులు ఎన్‌సీహెచ్.చక్రవర్తులు, గట్టు వెంకటాచార్య, రాము, నాగేశ్వరరావు, కమలా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
20వేల మంది భక్తులతో
నిర్వహించేలా ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment