3 నుంచి బస్సు యాత్ర
సూపర్‌బజార్(కొత్తగూడెం): విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏసీ జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాల సర్కిల్ కార్యాలయాల ఎదుట ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఐదో రోజు దీక్షల్లో జిల్లా ఆర్టిజన్ కార్మికులు కూర్చున్నారు. జేఏసీ జిల్లా చైర్మన్ కోనరాజు శ్రీనివాస్, కోచైర్మన్ మోతీరాం శరత్, కోకన్వీనర్ గ్లోరీ, జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, పూర్ణిమ, రవి, చంద్రశేఖర్, సోషల్‌మీడియా కన్వీనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) జిల్లా గౌరవాధ్యక్షులు కోలగాని రమేష్, డివిజన్ సెక్రటరీ పులి గణేష్‌బాబు, జిల్లా మహిళా నాయకురాలు లీలావతి, సీఐటీయూ పట్టణ కార్యదర్శి డి వీరన్నలు దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ రిలే దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందిచండంలేదన్నారు. రిటైర్మెంట్ బెన్‌ఫిట్స్ లేకుండా ఇంటికి వెళ్లే దయనీయ పరిస్థితి ఉందని ఆవేదనవ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం, జెన్ కో యాజమాన్యం స్పందించి ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ చేయాలని కోరారు. లేనిపక్షంలో ఫిబ్రవరి 3 నుంచి 13వ తేదీ వరకు బస్సుయాత్ర చేపడతామని, 20వ తేదీ చలో విద్యుత్ సౌధ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.
ముగిసిన ఆర్టిజన్ కార్మికుల రిలే దీక్షలు
Comments
Please login to add a commentAdd a comment