పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం చేశారు. పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు.
పలువురు మావోయిస్టుల లొంగుబాటు
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం 14 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్‌స్టేషన్ పరిధి గ్రామాలకు చెందిన వీరు మావోయిస్టు పార్టీలో వివిధ కేడర్లలో పనిచేస్తుండగా ఇటీవల పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యాన లొంగిపోయేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎస్పీ జితేంద్రకుమార్‌యాదవ్ ఎదుట శుక్రవారం లొంగిపోగా వీరి పేర్లపై ఉన్న రూ.36 లక్షల రివార్డులు అందజేసినట్లు తెలిపారు. అలాగే, నారాయణపూర్ జిల్లాలోనూ 9 మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ ప్రభాత్‌కుమార్ ఎదుట లొంగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment