మన దేహం ఆలయం లాంటిది. అందుకే తమ దేహాన్నే ఒక పవిత్ర క్షేత్రంగా చేసుకుని సాధన చేసుకున్నారు చేసుకున్నారు యోగులు. శరీరమనే ఈ క్షేత్రంలో సుషుమ్న అనే ఏకైక దైవనాడి ఉంటుంది. శరీరంలో మొత్తం 72,000 నాడులు ఉంటే అందులో సుషుమ్న నాడి ఒక్కటే దైవనాడి. నాడులు అంటే శరీరమంతటికీ శక్తిని ప్రసారం చేసే వాహికలు. యోగ శాస్త్రం మూడు శరీరాలను గురించి వివరిస్తుంది. భౌతిక దేహం, శక్తి దేహం, కారణ దేహం.
ఈ మూడూ కలిసి పని చేస్తూ ఉంటాయి. భౌతిక శరీరానికి ఆహార అసమతౌల్యం కారణంగా అనేక రుగ్మతలు వచ్చినట్లు, శక్తి శరీరంలో లోపాల వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ప్రధానమైన అవయవాల పనితీరుకు, శక్తి శరీరానికి ప్రగాఢమైన సంబంధం ఉంటుంది. ఈ సకల సృష్టి విశ్వశక్తి పైనే ఆధారపడి ఉంటుంది. జీవులన్నీ నిద్రావస్థలో విశ్వం నుంచి శక్తిని గ్రహిస్తాయి. అయితే మానవులకు నిద్రలో స్వీకరించే శక్తి మాత్రమే సరిపోదు. ఇప్పటి వేగయుగంలో అదనపు శక్తి అవసరం. ఆ శక్తి కేవలం ధ్యాన సాధన ద్వారా మాత్రమే లభిస్తుంది.
వెన్ను పాము అడ్డంగా ఉన్న జీవులను తిర్యక్ జీవులని, వెన్నెముక నిలువుగా ఉన్న జీవులను మానవులనీ తెలియజేస్తుంది యోగ శాస్త్రం. జీవులన్నింటిలోకీ మానవుడు అగ్రగణ్యుడు. వజ్ర సమానమైన వెన్నెముక వల్లే మానవుడికి పరమోన్నతమైన స్థితికి చే రుకోగలిగే అద్భుతమైన శక్తిని, అవకాశాన్నీ ఈ సృష్టి ప్రసాదిస్తుంది. నిద్రాణంగా ఉన్న సుషుమ్న నాడి ఉత్తేజితమై, ఈ దివ్య నాడిలో కుండలిని జాగరణ జరిగి, మూలాధార చక్రం నుండి సహస్రారం చేరినప్పుడు మనిషికి దివ్యానంద స్థితి అనుభవంలోకి వస్తుంది.
ఈ విధంగా జరిగినప్పుడు మానవ శరీరమే ఒక మహాÔ¶ క్తి క్షేత్రంగా మారుతుంది. భగవత్ తత్త్వాన్ని బాహ్యంగా గాక అనుభవ పూర్తిగా అర్థం చేసుకునే ఏకైక మార్గమే ధ్యానసాధన. సుషుమ్నా క్రియా యోగసాధన ద్వారా తక్కువ సమయంలోనే అ΄ారమైన శక్తిని స్వీకరించవచ్చు. సుషుమ్నా క్రియ యోగధ్యానం నాలుగు ప్రక్రియల కలయిక. ఈ సాధనకు ఎటువంటి కఠిన నియమాలూ లేవు. ఈ ధ్యానం మానవులందరి కోసం సిద్ధ గురువులు ప్రసాదించిన గొప్ప వరం.
– ఆత్మానందమయి
Comments
Please login to add a commentAdd a comment