ఈఎస్‌ఐ రీజినల్ డైరెక్టర్‌గా రామారావు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్మిక రాజ్యబీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) విజయవాడ ప్రాంతీయ కార్యాలయ రీజినల్ డైరెక్టర్‌గా ఎం.రామారావు, జాయింట్ డైరెక్టర్‌గా ప్రణవకుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈఎస్‌ఐ లబ్ధిదారుల కోసం ఆరోగ్య అవగాహన, ఆధార్ సీడింగ్ శిబిరాలను ఏర్పాటు చేసి, అవగాహన పెంచే లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్మికుల సామాజిక భద్రత అవసరాలను తీర్చిడం, మెరుగైన ఆరోగ్య సేవలను అందించడం, ప్రాథమిక ఆరోగ్య సేవలను పెంచడంపై దృష్టి పెడతామన్నారు. రాష్ట్రంలోని 54 లక్షల మంది చందాదారులకు ఈఎస్‌ఐ ఆస్పత్రులు, ఔషధ కేంద్రాల ద్వారా అధిక నాణ్యతతో వైద్య సేవలను అందించడంలో సహాయం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment