రికార్డు స్థాయిలో..
మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలు, అల్ల ర్లను నివారించడంపై ఈసారి వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. డిసెంబర్ 31న ఒక్క రోజే 495 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఇందులో ట్రైసిటీ పరిధిలోని మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 253 కేసులు, కమిషనరేట్ వ్యాప్తంగా లా అండ్ అర్డర్ పోలీస్ స్టేషన్‌లలో 242 కేసులు నమోదయ్యాయి. జంక్షన్లలో పదుల సంఖ్యలో మోహరించిన పోలీసులను చూసి మందుబాబుల కిక్కు తుస్సు మంది.
డిసెంబర్ 31న రాత్రి వరంగల్ నగరంలో
డ్రంకెన్‌డ్రైవ్ పరీక్ష చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది
కాజీపేట అర్బన్:
‘వెల్‌కం టూ న్యూ ఇయర్. గుడ్ బై–2024. బట్ ఓల్డ్ ఫ్రెండ్స్.. ఓల్డ్ వైన్’ అంటూ మందుబాబులు చీర్స్ కొట్టారు. మద్యం కిక్కుతో రెచ్చిపోయారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారీ న్యూ ఇయర్ వేడుకల్లో అబ్కారీ శాఖకు ఆదాయ కిక్కు అందింది. హనుమకొండ (వరంగల్ అర్బన్) జిల్లా పరిధిలో డిసెంబర్ 31న ఒక్క రాత్రే రూ.14.7 కోట్ల విలువైన మద్యం తాగినట్లు ఎకై ్సజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈఏడాది మందుబాబుల కోసం ప్రత్యకంగా అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్.. ఒంటిగంట వరకు బార్లను బార్లా తెరిచి ఉంచారు. దీంతో అర్ధరాత్రి మందుబాబుల జోరు కొనసాగింది. న్యూ ఇయర్ వేడుకలను కొందరు ఇళ్లల్లో, అపార్ట్‌మెంట్లలో చేసుకోగా.. మరికొందరు ఫ్రెండ్స్ బృందాలుగా ఏర్పడి ఎలాంటి ఆటంకం ఉండకూడదని ఎకై ్సజ్‌శాఖ నుంచి ఈవెంట్ పర్మిషన్స్ తీసుకుని కిక్కుతో చిందేశారు. నగరంలోని డీ కన్వెన్షన్, హరిత కాకతీయ హోటల్, ఆఫీసర్స్ క్లబ్, రీసార్ట్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని ఈవెంట్ పర్మిషన్‌కు రూ.9 వేల నుంచి రూ.50 వేలు.. (పాల్గొన్నవారి సంఖ్యను బట్టి) చెల్లించారు. మందు, విందు, చిందుతో తెల్లవారేదాకా గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment