పతంగుల సందడి
జిల్లాలో పతంగుల సందడి మొదలైంది. మార్కెట్‌లో వివిధ రకాల పతంగులు పిల్లలు, పెద్దలను విశేషంగా ఆకర్షిస్తున్నా యి. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు చౌరస్తాతో పాటు రైల్వేస్టేషన్ ఏరియా దుకాణాల్లో విక్రయిస్తున్నారు. రకరకాల రంగులు, ఆకట్టుకునే డిజైన్లతో తయారు చేసిన ప్లాస్టిక్, ఫ్యాన్సీ పతంగులు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. హీరోలు, ఇతర బొమ్మలతో కూడిన పతంగులు మార్కెట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కాగా చైనా మాంజాతో ముప్పును వివరిస్తూ గుండ్లగడ్డ ఏరియాలో యువకులు సాధారణ దారాలతో పతంగులను ఎగుర వేసి ప్రజలకు అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment