సబ్ జూనియర్స్ హాకీ జట్టు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలోని హాకీ కోర్టులో జిల్లా సబ్ జూనియర్స్ హాకీ జట్టు ఎంపిక బుధవారం జరిగింది. హాకీ కోచ్ రవిరాజు ఆధ్వర్యాన జరిగిన ఈ ఎంపికల్లో 25 మంది పాల్గొనగా 18 మంది ఎంపికయ్యారు. వీరు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకూ మదనపల్లిలో జరిగే సబ్ జూనియర్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని రవిరాజు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా హాకీ సంఘం అధ్యక్షుడు ఎ.బాబ్జీ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ హాకీ కోచ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
బీచ్‌లో డ్రోన్లతో నిఘా
కాకినాడ రూరల్: సంక్రాంతి పండగను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యాన పోలీసులు కాకినాడ బీచ్‌లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పండగ సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు బీచ్‌కు వస్తారనే అంచనాతో ఉప్పాడ కొత్తపల్లి నుంచి కాకినాడ సూర్యారావుపేట బీచ్ వరకూ డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. తిమ్మాపురం, యు.కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని బీచ్‌లలో ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధిక సంఖ్యలో సివిల్, మైరెన్ పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. అధిక సంఖ్యలో సందర్శకులు బీచ్‌కు రావడంతో సూర్యారావుపేట – ఉప్పాడ బీచ్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. ఎప్పటికప్పుడు పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
కిక్కిరిసిన అంతర్వేది
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని క్షేత్రం మంగళ, బుధవారాలలో సంక్రాంతి, కనుమ పర్వదినాలు పురస్కరించుకుని భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణం ఎటు చూసినా భక్తులతో రద్దీగా మారింది. ఆలయంలో నిత్యం నిర్వహించే నారసింహ సుదర్శన హోమంలోను, విశేష అభిషేకంలోను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల క్యూ లను, అన్నదాన పథకాన్ని అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment