భూమిక, శరత్ (ఫైల్)
బాలికను హతమార్చి, యువకుడు ఆత్మహత్య
యశవంతపుర: తన ప్రేమను నిరాకరించిందని ఆక్రోశానికి గురైన యువకుడు ఉన్మాదిగా మారాడు. 10వ తరగతి చదివే బాలిక గొంతుకోసి హత్య చేసి, తరువాత తను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరం హాసన్ జిల్లా అరసికెరె తాలూకా బెళగుంబ గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. బడిని ముగించుకొని ఇంటికి వెళుతున్న విద్యార్థిని భూమిక (15)ని శరత్ (23) అనే యువకుడు అడ్డగించాడు.
నన్ను ప్రేమిస్తావా, లేదా అని గొడవకు దిగాడు, ఆమె లేదని చెప్పడంతో చాకుతో గొంతుకోసి ప్రాణాలు తీశాడు. అక్కడి నుంచి పారిపోయిన శరత్, సమీపంలో రైలు పట్టాల మీద పడుకున్నాడు. రైలు వెళ్లడంతో మృత్యువాత పడ్డాడు. అరసికెరె గ్రామాంతర పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. శరత్ మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment