ఉదయం, సాయంత్రం ప్రజలు బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం 8 గంటలు దాటినా పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. ఈదురు గాలులు వీస్తున్నాయి. మళ్లీ సాయంత్రం నాలుగు, ఐదు గంటల నుంచే చలి మొదలవుతుంది. ముఖ్యంగా ఉదయం పూట పనులకు వెళ్లే ఆటో డ్రైవర్లు, చాయ్ హోటళ్ల నిర్వాహకులు, నైట్ వాచ్‌మెన్లు, సెక్యూరిటీ గార్డులు, కూరగాయలు, ఇతర చిరువ్యాపారులు అవస్థలు పడుతున్నారు. వాతావరణ మార్పులతో చిన్నారులు వైరల్ జ్వరాల పడుతున్నారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని వైద్యులు అంటున్నారు. ప్రతిరోజూ కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తీసుకుంటూ, శరీర ఉష్ణోగ్రతలు పడిపోకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment