ఎల్కతుర్తి ఎస్సై రాజ్‌కుమార్‌ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ఎల్కతుర్తి ఎస్సై రాజ్‌కుమార్‌ సస్పెన్షన్‌

Published Sat, Dec 21 2024 1:22 AM | Last Updated on Sat, Dec 21 2024 1:22 AM

ఎల్కత

ఎల్కతుర్తి ఎస్సై రాజ్‌కుమార్‌ సస్పెన్షన్‌

వరంగల్‌ క్రైం: ఎల్కతుర్తి పో లీస్‌స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కుమార్‌ను సస్పెండ్‌ చే స్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్‌కుమార్‌పై పలు రకాల అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. దీంతో వాస్తవాలు వెలుగు చూడడంతో సీపీ సస్పెన్షన్‌ వేటు వేశారు.

నేడు ఉమ్మడి వరంగల్‌ జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చ

హన్మకొండ: ఫోరం ఫర్‌ బెటర్‌ వరంగల్‌ ఆధ్వర్యంలో ఈనెల 21న ఉమ్మడి వరంగల్‌ జిల్లా, వరంగల్‌ నగర సమగ్రాభివృద్ధిపై మేథావులచే చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్‌ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నా రు. ఉమ్మడి వరంగల్‌లోని మేథావులు, సమస్యలపై అవగాహన ఉన్న ప్రతినిధులు పాల్గొ ని తమకు సమాచారమందించాలని కోరారు.

తల్లి మందలించిందని

తనయుడి ఆత్మహత్య

కురవి: తల్లి మందలించిందని తనయుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సీరోలు మండల కేంద్రం శివారు రేకులతండాలో శుక్రవారం చోటుచేసుకుంది. తేజావత్‌ చంద్రబాను(22), తల్లి బుల్లితో కలిసి మూడు ఎకరా ల వ్యవసాయభూమిని సాగుచేస్తున్నారు. కొ డుకును వ్యవసాయ భూమికి వెళ్లమని చెప్పే సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరి గింది. దీంతో మనస్తాపానికి గురైన చంద్రబా ను పురుగులమందు తాగడంతో మహబూ బాబాద్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.

వికటించిన నాటు వైద్యం

మహిళకు అస్వస్థత

నర్సంపేట రూరల్‌: ఇంటింటికీ తిరుగుతూ నాటు వైద్యం మందు గోలీలు అందిస్తూ చికి త్స చేస్తున్న ఓ వైద్యుడు మహిళకు వైద్య చికిత్సకోసం వైబ్రెటింగ్‌ మిషన్‌ అమర్చడంతో బీపీ తగ్గి పడిపోయిన ఘటన వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లిలో శు క్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూ రుకు చెందిన ఆయుర్వేదిక్‌ వైద్యుడు గుమ్మడి రమణ.. ద్విచక్రవాహనంపై సంతానం లేని వారికి మాత్రలు ఇస్తామని, పరీక్షలు చేస్తామని తిరుగుతూ నాగుర్లపల్లికి చెందిన జన్ను సంపూ ర్ణ ఇంటికి వెళ్లాడు. మొదట వైబ్రెటింగ్‌ మిషన్‌తో ఎల్లయ్యకు పరీక్షలు నిర్వహించగా.. కళ్లు తిరుగుతున్నాయని అన్నాడు. వెంటనే మీరు రూ.5వేలు ఇస్తే మందులు ఇస్తానని కూల్‌డ్రింక్‌(మజా)లో కలుపుకొని తాగాలని సూచించారు. మరో ఐదు వేలు ఇస్తే ఇద్దరికీ మందులు ఇస్తానని చెప్పడంతో సంపూర్ణ తమ వద్ద డబ్బులు లేవని చెప్పింది. కానీ, సదరు వ్యక్తి.. సంపూర్ణకు ఆ వైబ్రెటింగ్‌ మిషన్‌ అమర్చాడు. ఆ వెంటనే బీపీ తగ్గి కిందపడిపోవడంతో భర్త ఎల్లయ్య కేకలు వేశాడు. చుట్టు పక్కవారు వచ్చి సంపూర్ణను స్థానిక వైద్యుడి వద్దకు తరలించి చికిత్స అందించడంతో కోలుకుంది. అనంతరం నాటు వైద్యుడిని నర్సంపేట పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ఎస్సై రవికుమార్‌ను వివరణ కోరగా.. ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఎల్కతుర్తి ఎస్సై  రాజ్‌కుమార్‌ సస్పెన్షన్‌ 
1
1/1

ఎల్కతుర్తి ఎస్సై రాజ్‌కుమార్‌ సస్పెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement