డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లో అపశ్రుతి
జనగామ: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వరంగల్ పర్యటన నేపథ్యంలో ఆదివారం జనగామ ప్రాంతంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వరంగల్–హైదరాబాద్ నేషనల్ హైవే జనగామ మండలం పెంబర్తి కాకతీయ కళాతోరణం ముఖద్వారం వద్ద ఎస్సై చెన్నకేశవులు ఆధ్వర్యాన ఎస్కార్టు నిర్వహించారు. ఎస్సై ఎస్కార్ట్ వాహనం ముందుగా వెళ్తోంది. ఈ క్రమంలో కాన్వాయ్‌లోని ఓ వాహనం ఓవర్ టేక్ చేసే సమయంలో ఎస్సై వాహనాన్ని వెనుక నుంచి తాకే ప్రయత్నంలో డ్రైవర్ పక్కకు తీసుకుంటుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదాన్ని గమనించిన డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న వాహన డ్రైవర్ ముందుకు వెళ్లిపోగా.. ఎస్సై, ఎస్కార్ట్ వాహనంలోని డ్రైవర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ దామోదర్‌రెడ్డి ఘటన స్థలికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఎస్కార్టు వాహనం మాత్రం పూర్తిగా డ్యామేజీ అయ్యింది.
అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఎస్కార్ట్ వెహికిల్
Comments
Please login to add a commentAdd a comment