పూలకోసం వెళ్లి.. శవమై
● చెరువులో నీటమునిగి వ్యక్తి మృతి
చెన్నూర్: పూలకోసం వెళ్లిన వ్యక్తి శవమైన వచ్చిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బట్టిగూడెం కాలనీకి చెందిన పందుల రమేశ్ (40), జిట్టవేన రాజబాపు మంగళవారం తామరపూలకోసం పెద్ద చెరువుకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగిన రమేశ్ కాలికి తామరచెట్టు వేర్లు చుట్టుకుని అడుగుభాగంలో ఇరుక్కుపోయాడు. గమనించిన రాజబాపు కేకలు వేయగా పలువురు ఈతగాళ్లు చెరువులోకి బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. మృతుని భార్య సంధ్యారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. మృతునికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment