కవ్వాల్‌లో విద్యార్థుల పర్యటన
జన్నారం: ఫారెస్ట్ కళాశాల రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌సీఆర్‌ఐ) ములుగుకు చెందిన బీఎస్సీ ఫారెస్టీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 54 మంది గురువారం కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌లో పర్యటించారు. జన్నారం అటవీ బీట్, బైసన్‌కుంట ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడి విషయాలు తెలుసుకున్నారు. గడ్డి క్షేత్రాలు, నీటికుంటలు పరిశీలించారు. వన్యప్రాణుల కోసం చేపడుతున్న సౌకర్యాలను అధికారి సుష్మారావు, డీఆర్వో తిరుపతి వివరించారు. అనంతరం టింబర్ డిపోలో పట్టుకున్న కలప, వేలం వివరాలు తెలియజేశారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చినట్లు వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment