అడవుల జిల్లా.. అందాలివిగో..!
పుణ్యక్షేత్రాల ‘గూడెం’
రాబందుల స్థావరం..
ఆకట్టుకుంటున్న ‘గొల్లవాగు’
‘అడ’ ప్రాజెక్టు అందాలు
భీమారంలోని గొల్లవాగు ప్రాజెక్ట్
భీమారం: మండల కేంద్రానికి సమీపంలో దట్టమైన అడవిలో నిర్మించిన గొల్లవాగు ప్రాజెక్ట్‌లో ఏడాదిలో 12 నెలలపాటు జలకళ సంతరించుకుంటుంది. ఇటీవల అటవీశాఖ ఏర్పాటు చేసిన బర్డ్‌వాచ్ కార్యక్రమంతో మరింత ప్రాచూర్యం పొందింది. గతంలో ప్రభుత్వ విప్‌గా పనిచేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్ బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు.
కుమురం భీం ప్రాజెక్టు పరిసరాలు
ఆసిఫాబాద్‌రూరల్: కుమురంభీం జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల సమీపంలో అడ (కుమురంభీం) ప్రాజెక్టు ఉంది. పచ్చని అడవి మధ్యలో నిండుకుండను తలపించే ప్రాజెక్టు చూడముచ్చటగా ఉంటుంది. ఇటీవల బోటింగ్‌సైతం ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల నుంచి పర్యాటకులు వచ్చి బోటింగ్ చేస్తూ సరదాగా గడుపుతారు. ఆసిఫాబాద్ నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.
గుట్టపైన సత్యదేవుని ఆలయం
దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం గుట్టలు పుణ్యక్షేత్రాలకు నిలయంగా మారాయి. గుట్టపై వెలసిన శ్రీసత్యనారాయణస్వామి ఆలయం తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచింది. ఆలయ సమీపంలో ఉన్న మరో ఎత్తయిన కొండపై అయ్యప్ప, పంచముఖ ఆంజనేయస్వామి, గుట్ట కింద షిర్డీ సాయినాథుని ఆలయం ఉన్నాయి. ఒకేచోట నాలుగు ఆలయాలు ఉండడంతో పుణ్యక్షేత్రాలకు నిలయంగా మారింది.
పాలరాపు గుట్ట
పెంచికల్‌పేట్: కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట్ మండలంలోని నందిగామ వద్ద పెద్దవాగు, ప్రాణాహిత సంగమ ప్రాంతంలో ఉన్న పాలరాపు గుట్ట వద్ద గల రాబందుల స్థావరం పర్యాటకులను కనువిందు చేస్తోంది. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు గూళ్లు కూలిపోవడంతో మహారాష్ట్రలోని కమలాపూర్ వలస వెళ్లి ఏటా రాకపోకలు సాగిస్తున్నాయి. మండల కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ప్రకృతి ఒడిలో ‘పొచ్చర’
పాలధారలతో ‘గాయత్రి’
● పచ్చని అడవులు.. జాలువారే జలపాతాలు ● ఆకర్షిస్తున్న పురాతన ఆలయాలు ● తీర్చిదిద్దితే మరింత శోభ ● నేడు జాతీయ పర్యాటక దినోత్సవం
అడవుల జిల్లా ఆదిలాబాద్. ప్రకృతి అందాలకు కొదువ లేదు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అందాలు. జాలువారే జలపాతాలు.. అభయారణ్యంలో పచ్చదనం.. పక్షుల కిలకిలా రావాలు.. అడవులకు వచ్చే అతిథులు.. ఇలా అనేక అందాలు జిల్లాలో ఉన్నాయి. పురాతన, చారిత్రక ఆలయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు దక్షిణ కశ్మీర్‌గా గుర్తింపు ఉంది. శీతాకాలంలో, వర్షాకాలం ప్రారంభంలో అడవుల అందాలు చూసి తీరాల్సిందే. నేడు జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని కొన్ని పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతపై ప్రత్యేక కథనం..
వన్యప్రాణుల
ఆవాసం ‘కవ్వాల్’
పొచ్చర జలపాతం వద్ద పర్యాటకులు (ఫైల్)
బోథ్: అదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర జలపాతం అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. బండరాళ్లపై పడుతున్న నీరు, వచ్చే నీటి తుంపర్లు వీక్షకులను ఆనంద పరవశంలో ముంచెత్తుతాయి. జాలువారే జలధారలు పొచ్చెర జలపాతం అందాలను రెట్టింపు చేస్తాయి. పచ్చని చెట్లు, అక్కడక్కడా ఏర్పాటు చేసిన పచ్చిక మైదానాలు, స్వచ్ఛమైన గాలి పొచ్చర జలపాతం సొంతం. ివీకెండ్‌ను ఎంజాయ్ చేసేందుకు చాలా మంది ఇక్కడికి వస్తుండడంతో పిక్నిక్ స్పాట్‌గా మారింది.
జలపాతానికి ఇలా చేరుకోవాలి..
నిర్మల్ నుండి వచ్చే వారు జాతీయ రహదారి 44పై నేరడిగొండ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎడమ వైపు బోథ్ ఎక్స్ రోడ్డు ఉంటుంది. ఎడమ వైపు తిరిగి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కుడివైపు జలపాతానికి దారి వస్తుంది. అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో జలపాతం చేరుకోవచ్చు.
ఆదిలాబాద్ నుండి వచ్చే వారు ...
అదిలాబాద్ నుండి వచ్చే వారు 44వ జాతీయ రహదారిపై ఆదిలాబాద్ నుంచి 45 కిలోమీటర్లు ప్రయాణించి బోథ్ ఎక్స్‌రోడ్డు వద్ద కుడివైపు తిరిగి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కుడివైపు జలపాతానికి దారి వస్తుంది. అక్కడి నుంచి కిలో మీటరు దూరంలో జలపాతానికి చేరుకోవచ్చు.
జన్నారం: దట్టమైన అడవులు, పచ్చదనం పంచుకున్న చెట్లు, పక్షుల కిలకిలలు, వన్యప్రాణుల పరుగులు, వాగుల గలగలలు వీటికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన కవ్వాల్ టైగర్‌జోన్ మంచిర్యాల జిల్లా జన్నారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, రాష్ట్రాలతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. రాత్రి రిసార్ట్‌లో బస చేసిన పర్యటకులు ఉదయం 6 గంటలకే అడవిలోకి వెళ్లేందుకు వీలుగా సఫారీ ఏర్పాటు చేశారు. అడవిలో సుమారు 15 కిలోమీటర్లు తీసుకెళ్తారు. ఆ సమయంలో చుక్కల దుప్పులు, సాంబర్లు, ఇతర వన్యప్రాణులు కనిపిస్తాయి.
సఫారీ చార్జీల వివరాలు
సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ఆరుగురికి రూ.3500, శుక్ర, శని, ఆదివారాల్లో రూ.4వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఆరుగురి కన్న ఎక్కువైతే ఒక్కొక్కరికి రూ.500 అదనంగా చెల్లించాలి.
కాటేజీల వివరాలు
జన్నారం హరిత రిసార్ట్స్‌లో పర్యాటకుల కోసం కాటే జీలను ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి గురువారం వరకు నాన్‌ఏసీ గదికి రూ.1,064, ఏసీ గదికి రూ.1,624, డార్మెంటరీకి రూ.1,600, శుక్ర, శని, ఆదివారాల్లో నాన్‌ఏసీ గదికి రూ.1,176, ఏసీ గదికి రూ.1,792, డార్మెంటరీకి రూ.1800 చార్జీ ఉంటుంది. పూర్తి వివరాలకు 9346392358 నంబర్‌లో సంప్రదించవచ్చు.
ఇలా వెళ్లవచ్చు
హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల నుంచి బస్సు సౌకర్యం, హైదరాబాద్ నుంచి రైలు సౌకర్యం ఉన్నాయి. హైదరబాద్ నుంచి నేరుగా ఆదిలాబాద్‌కు వెళ్లే బస్సు ద్వారా జన్నారం చేరుకోవచ్చు. రైలులో వస్తే మంచిర్యాల నుంచి బస్సులో వెళ్లవచ్చు.
మైసమ్మకుంట వద్ద వెదురు బొంగుల వంతెన
ఇచ్చోడ: రెండు ఎత్తయిన కొండల మధ్య హోరుమనే శబ్ధంతో జాలువారే జలధారలతో గాయత్రి జలపాతం చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండివాగు సమీపంలో ఈ జలపాతం ఉంది. ఇచ్చోడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
పాపికొండలను తలపించే మొసళ్ల మడుగు
మొసళ్ల మడుగు
జైపూర్: ఎటుచూసినా ఎత్తయిన గుట్టల మధ్య సహజసిద్ధంగా గోదావరినదిలో ఏర్పడిన మొసళ్ల మడుగు పాపికొండలను తలపిస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని శివ్వారం గ్రామ సమీపంలో మొసళ్ల మడుగు ఉంది. పార్వతి బ్యారేజీ–అన్నారం బ్యారేజీ మధ్యలో సుమారు 15 కిలోమీటర్ల దూరంలో సుమారు 3 కిలోమీటర్ల వెడల్పులో విస్తరించింది. తాటిచెట్టంత లోతులో సుమారు 20 మీటర్ల మేరకు నీళ్లు ఉండే మడుగు అనేక రకాల ఉభయచర జీవులకు ఆవా సంగా మారింది. ఇందులో 30కి పైగా మొసళ్లు, 100కు పైగా నీటి కుక్కలు, నక్షత్ర తాబేళ్లు, స్టార్‌ఫిష్‌లతో పాటు నీటి జంతువులు ఉన్నాయి.
జలపాతం వద్ద పర్యాటకులు (ఫైల్)
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం నుండి 12 కిలో మీటర్ల దూరంలో కుంటాల వద్ద జలపాతం ఉంది. రెండు పాయలుగా ఏర్పడి 147 మీటర్ల ఎత్తు నుండి పరవళ్లు తొ క్కుతూ నీళ్లు కిందికి వస్తాయి. పూర్వం శకుంతల, దుశ్యంతులు ప్రణయ విహారయాత్రకు వచ్చి మంత్రముగ్థులై ఇక్కడే ఉండిపోయారని, దీంతో జలపాతాన్ని శకుంతల జలపాతంగా పిలుస్తుండేవారని ప్రాచీన శాస్త్రం చెబుతోంది. కాల క్రమేణా కుంటాల జలపాతంగా పిలువబడుతోంది. ఆదిలాబాద్ నుంచి 47 కిలోమీటర్లు, నిర్మల్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో నేరడిగొండ, అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో కుంటాల ఉంటుంది.
ప్రకృతి అందాలకు నెలవు ‘కడెం’
బోటులో విహరిస్తున్న పర్యాటకులు
కడెం: చుట్టూ సహ్యాద్రి కొండలు, వాటిపై పచ్చని తివాచీ పర్చినట్లు చెట్లు, కొండలను ఆనుకుని ఉన్న కడెం జలాశయం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఈ ప్రాజెక్టు ఉంది. ఇందులో ఏర్పాటు చేసిన బోట్లలో విహరిస్తూ పర్యాటకులు సందడి చేస్తుంటారు. పిక్నిక్ స్పాట్‌తో పాటుగా, షూటింగ్ స్పాట్‌గా మంచి ఆదరణ పొందుతోంది.
ఇలా వెళ్లాలి
నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారి గుండా కడెం వెళ్లవచ్చు. హైదరాబాద్ నుండి 300, నిర్మల్, జగిత్యాల నుంచి 50, మంచిర్యాల నుంచి 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
గిరిజనుల ఆరాధ్యుడు ‘చిన్నయ్య’
గుట్టపైన చిన్నయ్య దేవుని గుడి
లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం చందారం గ్రామ పంచాయతీ పరిధిలోని చల్లంపేట శివారు అటవీప్రాంతంలో సుమారు 150 ఏళ్ల క్రితం కొలువు దీరాడు గిరిజనుల ఆరాధ్య దైవమైన చిన్నయ్య. ప్రాచీన కాలంలో పాండవులు ఇక్కడ వ్యవసాయం చేసేవారని పూర్వీకులు చెబుతుంటారు. రైతులు దుక్కి దున్నేముందు దేవుడి దర్శనం చేసుకుని బండారు(పసుపు) తెచ్చుకుని ధాన్యం వేసేటప్పుడు అందులో కలిపి సాగు చేస్తారు. పంట చేతికి వచ్చిన తర్వాత దినుసును దేవుడికి అప్పజెప్పి మొక్కు చెల్లించుకుంటారు. గుడిలో అల్లుబండకు ప్రత్యేకత ఉంది. భక్తులు మనసులో కోరుకుని అల్లుబండ లేపితే సులభంగా లేచినట్లయితే కోరిక నెరవేరుతుందని, బరువుగా ఉంటే నెరవేరదని నమ్మకం.
Comments
Please login to add a commentAdd a comment