● రూ.6కోట్లకు పైగా స్వాహా ● ఆలస్యంగా వెలుగులోకి..
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని జన్మభూమినగర్‌లో ఉన్న ఓ ప్రముఖ ఫైనాన్స్ కంపనీలో పనిచేస్తున్న మేనేజర్ అధికమొత్తంలో డబ్బు సంపాదించాలని అత్యాశకు పోయాడు. అందులో పనిచేసే సిబ్బందితో కలిసి పథకం వేశాడు. కొంతమంది చనిపోయిన వారి పేరుమీద ఆధార్‌కార్డులు తయారు చేయించారు. వ్యక్తిగత, హౌసింగ్ లోన్ పేరిట సుమారు రూ.6 కోట్లకు పైగా రుణం తీసుకున్నాడు. కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్స్ అధికారులు దృష్టి సారించడంతో బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం మేనేజర్‌తో పాటు మరో ఇద్దరిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలిసింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment