భైంసాటౌన్: అడవి పందులను అక్రమంగా రవా ణా చేస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు భైంసా ఎఫ్‌ఆర్వో వేణుగోపాల్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు గురువారం రాత్రి దాడులు చేసి దేగాంకు చెందిన కోనేరు పోశెట్టి, కోనేరు గజేందర్, కోనేరు ఈశ్వర్, భైంసాకు చెందిన చెర్ల మహేశ్, చెర్ల గణేశ్, రాసూర్ గోవింద్, ఈరేవార్ సోను, మహా రాష్ట్రలోని హిమాయత్‌నగర్‌కు చెందిన గంగాధర్‌ను అదుపులోకి తీ సుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం కోర్టులో హాజరు పర్చినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment