తూప్రాన్‌కు చేంజ్ మేకర్ అవార్డు
తూప్రాన్: 2021 నుంచి 2024 వరకు స్వచ్ఛత కార్యక్రమాలతో పాటు స్వచ్ఛ సర్వేక్షన్‌లో మెరుగైన ప్రదర్శన చేపట్టినందుకు గాను తూప్రాన్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం అందించే చేంజ్ మేకర్ అవార్డు దక్కిందని మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేశ్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్వచ్ఛ కార్యక్రమాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మున్సిపాలిటీలకు సీఎస్‌సీ, ఎంఓహెచ్‌యూఏ సంయుక్తంగా గురువారం ఢిల్లీలో అవార్డులు అందజేసింది. ఈ మేరకు డా.సునీత నరైన్ (సీఎస్‌సీ డైరెక్టర్) చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆయన వెంట స్థానిక ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ చింతల మధు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment