ఉత్తమ ఫలితాలు సాధించాలి: ఆర్డీఓ
తూప్రాన్: వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్త మ ఫలితాలు సాధించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. చదువులో పోటీతత్వం అలవర్చుకొని మంచి మార్కులు సాధించాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. అనంతరం విద్యార్థుల హాజరు, పాఠశాల నిర్వహణ, తరగతి గదుల పరిస్థితి, విద్యా బోధన ప్రమాణాలు, పరిసరాల పరిశుభ్రతను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment