పుష్ప2 పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. కానీ, సంధ్య థియేటర్ ఘటన వల్ల అల్లు అర్జున్ ఆ సంతోషాన్ని సెలబ్రేషన్ చేసుకోలేకపోయాడు. ఆయనపై నమోదైన కేసుల వల్ల ఎలాంటి సక్సెస్ టూర్స్ ప్లాన్ చేయలేదు. టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌లో పుష్పరాజ్ దుమ్మురేపుతున్నాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1,7308 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. బాలీవుడ్‌లోనే సుమారుగా రూ. 800 కోట్లకు పైగా రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
పుష్ప2 సినిమా పనుల్లో మళ్లీ అర్జున్ బిజీ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఆయన డబ్బింగ్ చెబుతున్నారట. బన్నీ అయితే ప్రస్తుతానికి కొత్త సినిమా ప్రకటించలేదు.. కానీ, ఇప్పుడు డబ్బింగ్ చెప్పడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారా..? అయితే, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. పుష్ప2 సినిమాకు సంబంధించే ఇప్పుడు బన్నీ డబ్బింగ్ చెబుతున్నారు. సినిమా రన్‌టైమ్ సుమారు 3 గంటల 15 నిమిషాలు ఉండటం వల్ల కథలో చాలా ముఖ్యమైన కొన్ని సీన్లను ఎడిటింగ్‌లో తొలగించారు. దీంతో అక్కడక్కడ కథ కొనసాగింపులో కాస్త లోటుపాట్లు కనిపించాయని విమర్శలు వచ్చాయి.
సినిమా ప్రారంభంలోనే జపాన్ సీన్‌తో అల్లు అర్జున్ ఎంట్రీ ఇస్తాడు. అయితే, ఆ సీన్‌కు ఎలాంటి కొనసాగింపు ఉండదు. మళ్లీ ఎక్కడా కూడా ఆ సీన్‌కు సంబంధించిన కనెక్టివిటీ ఉండదు. కథలో హీరో జపాన్ ఎందుకు వెళ్లాడు అనేది ప్రేక్షకుడికి అర్థం అయ్యేలా చూపించలేదు. జపాన్ నుంచి ఇండియాకు హీరో ఎలా వచ్చాడో చూపించలేదు.
ఇలాంటి సీన్లు ఎడిటింగ్‌లో తీసేశారు. కానీ, అందుకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారట. అయితే, వాటికి బన్నీ వాయిస్ ఇవ్వలేదు. అందువల్ల వాటికి ఇప్పుడు డబ్బింగ్ చెప్పడానికి అన్నపూర్ణ స్టూడియోకు ఆయన వెళ్లారట. జనవరి 1 నుంచి కొత్త సీన్లు పుష్ప2 చిత్రంలో కలపనున్నారని తెలుస్తోంది. ప్రధానంగా ఓటీటీ వర్షన్ కోసమే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment