అభిమానులంటే ఎవరు? హీరోను ఆరాధించేవాళ్లు. తమ బర్త్‌డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటారో లేదో కానీ ఇష్టమైన హీరో పుట్టినరోజుకు మాత్రం నానా రచ్చ చేస్తుంటారు. ఇది ప్రతి ఏడాదీ ఉండేదే.. ఈరోజు (ఏప్రిల్ 8న) అల్లు అర్జున్ బర్త్‌డే. ఈసారి కాస్త స్పెషల్. ఎందుకంటే బన్నీ పుష్ప మూవీతో బాలీవుడ్‌కు తన సత్తా ఏంటో చూపించాడు. అలాగే ఏ హీరోలకూ అందరిన జాతీయ అవార్డును తన కైవసం చేసుకున్నాడు. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత వచ్చిన తొలి బర్త్‌డే కావడంతో ఫ్యాన్స్ రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. పైగా మరికొద్ది నెలల్లో పుష్ప 2 రిలీజ్ కూడా ఉంది.
అభిమానుల ఆనందం
బన్నీ బర్త్‌డే సందర్భంగా అతడిని విష్ చేయాలని పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటి ముందు చేరారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పేందుకు బన్నీ ఇంటి నుంచి బయటకు రాగానే ఫ్యాన్స్ ఆనందంతో కేకలు వేశారు. తనకోసం వచ్చిన అందరికీ బన్నీ చిరునవ్వుతో అభివాదం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు పుష్ప 2 టీజర్‌లో బన్నీ అమ్మోరు తల్లిలా చీర కట్టుకుని కనిపించారు. కేవలం ఒక నిమిషం మాత్రమే నిడివి ఉన్న ఈ వీడియోలో ఎటువంటి డైలాగులు లేవు. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
Happy birthday to the Hero of massesssss 🔥🔥🔥 #aa #alluarjun #pushpa2 pic.twitter.com/KaYDNEocew
— Sahithi Dasari (@sahithidasari7) April 7, 2024
Comments
Please login to add a commentAdd a comment