ఇండియా ఫస్ట్ సూపర్ హీరో శక్తిమాన్.. ఈ సూపర్ హీరో పాత్రలో నటుడు ముకేశ్ ఖన్నా నటించాడు. నటించాడు అనడం కన్నా జీవించాడనే చెప్పాలి. అయితే కొన్నాళ్లుగా శక్తిమాన్ మళ్లీ రాబోతున్నాడని ప్రచారం జోరందుకుంది. అయితే ఈసారి టీవీలో కాకుండా వెండితెరపై రానుందని, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
నోరు విప్పక తప్పట్లేదు
ఈ క్రమంలో సదరు వార్తలపై ముకేశ్ ఖన్నా స్పందించాడు. 'రణ్‌వీర్ సింగ్ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని కొన్ని నెలలుగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై చాలామంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. నేను మాత్రం సైలెంట్‌గానే ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఛానల్స్ కూడా రణ్‌వీర్ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని ప్రచారం మొదలుపెట్టాయో.. అప్పుడే ఇక నోరు విప్పక తప్పదని నిర్ణయించుకున్నాను. అయినా ఒంటిమీద నూలు పోగు లేకుండా ఫోటోషూట్లు చేసే వ్యక్తి శక్తిమాన్‌గా కనిపిస్తాడా? ఇదేమైనా బాగుందా అసలు?
ఎంత పెద్ద స్టార్ అయితే ఏంటి?
అతడు ఎంత పెద్ద స్టార్ అయితే ఏంటి? నేనైతే నా అభిప్రాయం చెప్పాను. ఇప్పుడేమవుతుందో చూద్దాం.. విచ్చలవిడితనం సర్వసాధారణమైన విదేశాల్లో రణ్‌వీర్ తనకు నచ్చిన పాత్రలు చేస్తే బాగుంటుంది. నేను నిర్మాతలతో కూడా మాట్లాడాను. శక్తిమాన్ అంటే సూపర్ హీరో మాత్రమే కాదు సూపర్ టీచర్ అని నొక్కి చెప్పాను! ఒక నటుడు ఆ పాత్ర చేస్తున్నాడంటే చక్కగా మాట్లాడగలగాలి, జనాలు అతడు చెప్తే వినగలిగేలా ఉండాలి. కొందరు హీరోలు పేరుకే పెద్ద.. కానీ వారి ఇమేజ్ ఎప్పుడూ చిన్నగానే ఉంటుంది' అని సెటైర్లు వేశాడు ముకేశ్.
చదవండి: లైసెన్స్ పొందా.. దుబాయ్‌లోనే ఉంచా.. అందులో తిరుగుతుంటే మజా..
Comments
Please login to add a commentAdd a comment