RRR Special Interview: NTR Funny Imitation Of Rajamouli And His Family Goes Viral - Sakshi
Sakshi News home page

RRR Movie Special Interview: త్వరగా షూటింగ్‌ పూర్తి చేసుకుని వచ్చేయ్‌రా బండ అనేది

Published Wed, Mar 16 2022 9:09 PM | Last Updated on Thu, Mar 17 2022 10:39 AM

RRR Movie: Jr NTR Hilarious Imitation Of Rajamouli And His Family - Sakshi

దేశమంతా ఎదురు చూస్తున్న పాన్‌ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ ఎట్టకేలకు మార్చి 25న విడుదలవుతోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కించిన ఈ కళాఖండాన్ని వీక్షించేందుకు అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడిన తరుణంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రబృందం. ఈ ప్రమోషన్లలో దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా భాగమయ్యాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ను స్పెషల్‌ ఇంటర్వ్యూ చేయగా ఇప్పుడది వైరల్‌గా మారింది.

అలిసిపోయి ఉన్నా కూడా రాజమౌళి వదిలేవారు కాదంటూ ఎన్టీఆర్‌ ఓ ఆసక్తికర విషయాన్ని షేర్‌ చేసుకున్నాడు. 'రాజమౌళి చేతిలో నలిగిపోతుంటే ఆ బాధను ఆయన భార్య రమతో చెప్పుకునేవాళ్లం. ఆవిడేమో ఆయనకు పిచ్చి పెరిగిపోయింది నాన్నా, త్వరగా షూటింగ్‌ పూర్తి చేసుకుని వచ్చేయ్‌రా బంగారం, వెళ్లురా బండ.. ఆ పిచ్చోడి దగ్గరకు పో' అని చెప్పేదని గుర్తు చేసుకున్నాడు.

చదవండి: అలా అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో నటించకపోయేవాడిని : ఎన్టీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement