ఉద్యోగుల పక్షపాతి కేసీఆర్
● బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి
ఏటూరునాగారం: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ అన్ని వర్గాల ఉద్యోగుల పక్షపాతిగా నిలబడి వారికి కావాల్సిన సౌకర్యాలు, వేతనాలను పెంచాడని పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్, రెసిడెన్షియల్ ఉపాధ్యాయుల నిరవధిక సమ్మె సోమవారం 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన వారికి సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. గత ప్రభుత్వం చిరు ఉద్యోగులకు సైతం వేతనాలు భారీగా పెంచిందన్నారు. అవేకాకుండా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత అనేక వర్గాల ప్రజలకు మేలు చేసినది కేసీఆర్ ప్రభుత్వమేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులు, సర్వ శిక్ష ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు, ఇతర కార్మికులు సైతం సమ్మెలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు భూక్య జంపయ్య, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఖాజాపాషా చిన్నకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
సమగ్రశిక్ష ఉద్యోగుల దీక్షకు సంఘీభావం
ములుగు: సమగ్రశిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావం ప్రకటించి సమ్మెలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment