కోదాడరూరల్ : మండల పరిధిలోని కొమరబండ శివారు హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కారు పల్టీ కొట్టడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ఎన్.వీరేష్, రాజేశ్వరీ, ఎస్.మురళీకృష్ణా, పద్మావతిలతో పాటు ఓ చిన్నారి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలు దేరారు. మార్గమధ్యంలోని న్యూవిజన్ స్కూల్ సమీపంలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టి రోడ్డు కింద పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో పద్మావతి, రాజేశ్వరీకి తీవ్రగాయలు కాగా వీరేష్, మురళీకృష్ణాలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పద్మావతి, రాజేశ్వరిల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. కాగా.. సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని రూరల్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment