దేవరకొండ అసిస్టెంట్ ఎస్పీగా మౌనిక
నల్లగొండ క్రైం: దేవరకొండ అసిస్టెంట్ ఎస్పీగా పి.మౌనికను నియమిస్తూ డీజీపీ కార్యాలయం నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ అ య్యాయి. ప్రస్తుతం దేవరకొండ డీఎస్పీగా విధులు నిర్వహించిన గిరిబాబును డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఐపీఎస్ కేడర్‌కు చెందిన మౌనిక గ్రేహౌండ్స్ ఏఎస్పీగా విధులు నిర్వహించారు.
డిప్యుటేషన్ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి
నల్లగొండ: సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చించకుండా కేజీబీవీల్లోని వారిస్థానాల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఇచ్చిన డిప్యుటేషన్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసాచారి, పెరుమాళ్ల వెంకటేశం సోమవారం ఒక ప్రకటనలో కోరారు. సీఎం హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వ్యర్థ రసాయనాలు వెదజల్లే పరిశ్రమలు వద్దు
మునుగోడు: గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థ రసాయనాలు వెదజల్లే పరిశ్రమలు ఏర్పాటు చేసి పేద ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం మునుగోడు మండలం కోతులారం గ్రామ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఫౌల్ట్రీఫామ్ విషయంపై నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఎంపీఓ విజయ భాస్క ర్, మాజీ సర్పంచ్‌లు జక్కలి లోకేష్, జాజుల పారిజాతసత్యనారాయణ, వట్టికోటి శేఖర్, గుర్జ నర్సింహ, జాల బుచ్చి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment