రుణాల రికవరీ కోసం ప్రత్యేక టీమ్‌లు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకులో పేరుకపోయిన బకాయిలను రికవరీ చేసేందుకు 4 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్, డీసీసీబీ అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ నవ్య ఆదేశాల మేరకు టీ ములు ఏర్పాటు చేస్తూ సీజీవో విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకులో రూ.250 కోట్ల బకాయిలు ఉన్నాయి. బకాయిలు ఎక్కువగా ఉన్న ఆదోని, పత్తికొండ, ఆలూరు బ్రాంచీలకు ఏజీఎం త్రీనాథరెడ్డి ఆధ్వర్యంలో టీమ్ ఏర్పాటు అయింది. డోన్, క్రిష్ణానగర్, కోడుమూరు తదితర బ్రాంచీలకు చీఫ్ మేనేజర్ జయప్రకాశ్‌బాబు నేతృత్వంలో టీమ్ ఏర్పాటైంది. ఒక్కో టీమ్‌లో ఆరుగురు అధికారులు ఉంటారు. మార్చి నెల చివరి వరకు ఈ టీమ్‌లు రికవరీలపైనే దృష్టి సారిస్తాయి. డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే మహిళ అధికారులు, ఉద్యోగులతో ప్రత్యేకంగా మరో రెండు టీమ్‌లు ఏర్పాటయ్యాయి. ఈ నెల 16 నుంచి ఈ టీమ్‌లు రికవరీలో చురుగ్గా పాల్గొంటాయి.
అన్నప్రసాదానికి విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి సోమవారం హైదరాబాద్‌కు చెందిన కె.శ్రీనివాసరావు రూ.1,00,116 విరాళాన్ని దేవస్థాన ఏఈవో జి.స్వాములకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరఫున సత్కరించారు.
అదిగదిగో సంగమేశ్వరుడి ఆలయ గోపురం
కొత్తపల్లి: శ్రీశైలం జలాశయంలో రోజురోజుకి నీటి మట్టం తగ్గుతుండటంతో సంగమేశ్వరుడు జలాధివాసం వీడుతున్నాడు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 885 అడుగుల నుంచి 857 అడుగులకు చేరుకుంది. దీంతో కృష్ణా జలాల నుంచి ప్రాచీన సంగమేశ్వర ఆలయ గోపురం పూర్తిగా బయటపడింది. ముక్కోటి సోమవారం సందర్భంగా ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ ఆలయ శిఖరానికి కృష్ణాజలాలతో అభిషేకం, పాలాభిషేకం, కుంకుమార్చన, పుష్పార్చన, విశేష పూజలు చేశారు.
శ్రీశైలంలో 99 టీఎంసీల నీరు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైల జలాశయంలో రోజురోజుకు నీటి నిల్వలు తగ్గుతున్నాయి. సోమవారం సాయంత్రం జలాశయంలో 98.9024 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 857.60 అడుగులకు చేరుకుంది.ఆదివారం నుంచి సోమవారం వరకు ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 0.879 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి 1,876 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు.అలాగే బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 2,500, హంద్రీనీవా సుజలస్రవంతికి 1,722, మల్యాల ఎత్తిపోతలకు 338, ముచ్చమర్రి ఎత్తిపోతలకు 490, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment