గతేడాది పూత బాగుండేది
నాకు రెండు ఎకరాల్లో మామిడి తోట ఉంది. గతంలో ఈ సమయానికి మామిడి చెట్లకు పూత బాగా ఉండేది. ఇప్పటి వరకు ఆశించిన మేర పూత లేదు. తేమశాతం ఎక్కువ కావడామో లేక వాతావరణ ప్రభావమో తెలియదు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాను. పంట రాకపోతే ప్రభుత్వం అదుకోవాలి. – కురువ శంకర్,
మామడి రైతు, పూడురు,కర్నూలు మండలం
దిగుబడిపై ప్రభావం
నేను బనగానపల్లె, పాణ్యం, బేతంచర్ల మండలాల్లో సుమారు 14 ఎకరాల తోటలను రూ.3 లక్షల కౌలు ఇచ్చి తీసుకున్నాను. దీనికితోడు మందుల పిచికారీ తదితర వాటి కోసం లక్షకు పైగా ఖర్చు చేశాను. సాధారణంగా ఈ సమయానికి పూత వచ్చి ఉండాలి. ఆలస్యం కావడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది.
– పాంషా, మామిడి తోటల కౌలు రైతు, బనగానపల్లె
మామిడిలో పూతరాకపోతే
ఇలా చేయాలి
పలు ప్రాంతాల్లో మామిడిలో పూత రావడం ఆలస్యమవుతోంది. పూత రాని పక్షంలో 13–0–45 రసాయన ఎరువు 10 గ్రాములు, 3 గ్రాముల సల్ఫర్, 1.6 ఎంఎల్ మోనోక్రోటోపాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు పూత రాని తోటల్లో పొగపెట్టాలి. ఇలా చేయడం ద్వారా పూత వచ్చే అవకాశం ఉంది. మరో 10–15 రోజుల్లో అన్ని ప్రాంతాల్లోని అన్ని తోటల్లో పూత వచ్చే అవకాశం ఉంది. పూత వచ్చిన తర్వాత చెట్లకు ఎరువులు వేసి తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. పూత వచ్చిన తోటల్లో చీడపీడల యాజమాన్యంలో భాగంగా సాఫ్–2 జిఎం, క్లోరోఫైరిఫాస్ 2 ఎంఎల్, బోరాన్ ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చి పూత ఉన్నట్లైతే ఇమిడాక్లోఫ్రిడ్ 0.3 గ్రాములు, హెక్షాకొనజోల్ 1 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంది. – పి.రామాంజనేయులు,
జిల్లా ఉద్యాన అధికారి, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment