నాగేశ్వరస్వామికి హైకోర్టు జడ్జి పూజలు
పగిడ్యాల: మండలంలోని తూర్పు ప్రాతకోట నాగేశ్వరస్వామికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి హరినాథ్‌రెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు ని ర్వహించారు. సంక్రాంతి పండగ నిమిత్తం స్వ గ్రామానికి చేరుకున్న జడ్జికి నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, ముచ్చుమర్రి ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి బొకేలు అందించి శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి నాగేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి నూతన రథాన్ని సందర్శించి పూజలు చేశారు.
మాజీ సైనికుడి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
బొమ్మలసత్రం: మాజీ సైనికుడు దౌలత్‌ఖాన్ మృతికి కారకులైన మున్సిపల్ ఉద్యోగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా డిమాండ్ చేశారు. బుధవారం ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా , 6వ వవార్డు కౌన్సిలర్ పురేంధర్ మాజీ సైనికుడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సేవలందించిన జవాన్‌కు ఇంటి పన్ను మినహాయింపునకు కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేస్తే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఆయనను అనేక మార్లు ఆఫీస్ చుట్టూ తిప్పుకోవటంతో మనోవేదనకు గురై ఆకస్మాత్తుగా మృతిచెందటం తనను కలచివేసిందన్నారు. మృతుడి కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రాభవన్‌లో దేవస్థాన ప్రసాదాల విక్రయ కేంద్రం
శ్రీశైలంటెంపుల్: సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవనంలో దేవస్థాన ప్రసాదాల విక్రయకేంద్రం ఏర్పాటు చేశారు. సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ విక్రయ కేంద్రంలో లడ్డూ ప్రసాదాలు, స్వామివారి దివ్య పరిమళ విభూతి, శ్రీచక్ర పూజాకుంకుమ, కై లాస కంకణాలు, దేవస్థానం ప్రచురించిన వివిధ రకాల క్యాలెండర్లు, డైరీలు, శ్రీశైలప్రభ మాసపత్రికలు ఉంచారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ విక్రయ కేంద్ర నిర్వహణకు శ్రీశైలం నుంచి ప్రత్యేకంగా సిబ్బంది ఢిల్లీ వెళ్లారు.
లడ్డూ ప్రసాద తయారీ
కేంద్రం పరిశీలన
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో తయారు చేస్తున్న లడ్డూ, పులిహోర ప్రసాద తయారీ కేంద్రాన్ని ఈఓ ఎం.శ్రీనివాసరావు పరిశీలించారు. బుధవారం రోజువారీ ప్రసాదాల తయారీ, విక్రయ కేంద్రాలకు పంప బడుతున్న స్టాక్ వివరాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. లడ్డూ, పులిహోర తయారీలో ఎప్పటికప్పుడు శుచీ శుభ్రత పాటిస్తుండాలని సంబంధికులను ఆదేశించారు. ప్రసాదాల్లో నాణ్యత తగ్గకుండా ఉండాలని ఆదేశించారు. రాబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అవసరమైన ప్రసాదాల తయారీకి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment