సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: స్థానిక మున్సిపల్ పార్క్ దగ్గర ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు చేస్తున్న సమ్మె 22వ రోజుకు చేరుకుంది. గురువారం రోజు జిల్లా కేంద్రంలో మంత్రుల ముఖచిత్రాలు పట్టుకొని శాంతియుత మహార్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాక్ అధ్యక్షుడు ఎల్లాగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు చేపట్టామని ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మమ్మల్ని క్రమబద్ధీకరించి విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌రాంరెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బలరాం,టిఎస్‌యూటీఎఫ్ జిల్లా అద్యక్షుడు శివరాములు, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి పాల్గోని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో హర్షద్, సలీం, అనిల్, నరేష్, విజయలక్ష్మీ, శివలీల, రాధ తదితరులు పాల్గోన్నారు.
Comments
Please login to add a commentAdd a comment