మెరుగైన వైద్య సేవలు అందించాలి
ధన్వాడ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌ఓ సౌభాగ్యలక్ష్మి అన్నారు. గురువారం ధన్వాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్స్‌ను పరిశీలించి రోగుల వివరాలను పూర్తిగా నమోదు చేయాలని ఆదేశించారు. వార్డులు, స్టోర్‌రూం, డెలివరీ, ల్యాబ్ రూంలను పరిశీలించారు. ఈడీడీ క్యాలెండర్‌ను ప్రదర్శించేలా బ్యానర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డాక్టర్ అనూష, సాయి సిందుజా, సిబ్బంది కతలప్ప, ఆశోక్, నరేష్, కృష్ణ తదితరులు ఉన్నారు.
ఊట్కూర్‌లో..
ఊట్కూరు: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం జిల్లా ఉప వైద్యాధికారి శైలజ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు. గర్భిణులు నమోదు వంద శాతం చెయ్యాలని, గర్భిణులకు, బాలింతలకు విధిగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వ్యాధి నిరోధక టీకాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చెయ్యాలని ఆరోగ్య కార్యకర్తలకు ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్ సంతోషి, డాక్టర్ భవాని, వైద్య సిబ్బంది విజయ్‌కుమార్, నర్సింహులు, నాగమ్మ, గోవిందమ్మ, సుజాత తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment