రాధమ్మ
చైర్‌పర్సన్‌గా రాధమ్మ, వైస్‌చైర్మన్‌గా గణేష్‌కుమార్
హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
మక్తల్: మక్తల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా గవినోళ్ల రాధమ్మతోపాటు నూతన పాలకవర్గ సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి మక్తల్ నెహ్రూగంజ్ ముస్తాబైంది. దాదాపు 50 ఏళ్ల మక్తల్ మార్కెట్ యార్డు చరిత్రలో తొలిసారిగా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పదవి మహిళకు దక్కింది.
ఇదిలాఉండగా, బీఆర్‌ఎస్ హయాంలో రెండేళ్లు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది పాటు మార్కెట్ నూతన పాలకవర్గం కొలువుదీరలేదు. ఎట్టకేలకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చొరవత కొలువుదీరనుంది. రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 885 ప్రకారం మక్తల్ మార్కెట్‌యార్డు పాలకవర్గాన్ని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్‌పర్సన్‌గా గవినోళ్ల రాధమ్మ, వైస్ చైర్మన్‌గా మక్తల్‌కు చెందిన గణేష్‌కుమార్‌తోపాటు పాలకవర్గం డైరెక్టర్లుగా మహేష్, రంజిత్‌కుమార్‌రెడ్డి, బాస్రవి శాలమ్, బాలప్ప, టి.బాలప్ప, విష్ణువర్ధన్‌రెడ్డి, ఫయాజ్, మహేష్, శంకర్‌లింగం, శ్రీనివాసులు, ఆంజనేయులు, జనార్ధన్‌గుప్తా, నాగప్ప, మాగనూర్ పీఏసీ ఎస్ చైర్మన్, పేట మార్కెటింగ్ అధికారి, మున్సిపల్ చైర్మన్, అగ్రికల్చర్ ఏడీ డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. కార్యక్రమానికి రాష్ట్ర ఎకై ్స జ్‌శాఖ మంత్రి జూపల్లికృష్ణారావు, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, పేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
ఏర్పాట్లు పూర్తి..
మక్తల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణాస్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉదయం 11:15 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని, పెద్ద చెరువు సమీపంలో కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలకాలన్నారు. అక్కడి నుండి భూత్పూర్ గ్రామానికి మంత్రి వెళ్లి పునరావాస సమస్యలను తెలుసుకుంటారని, అనంతరం ప్రమాణ స్వీకారానికి హాజరవుతారన్నారు. బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, గోపాల్‌రెడ్డి, గణేష్‌కుమార్, భాస్కర్, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment