పోలీసులపై గ్రామ పెద్ద
సహాయకుడి ఫిర్యాదు.. యూపీ రాయ్‌బరేలీ ఠాణాలో ఘటన
రాయ్‌బరేలీ: అధికారుల అనుమతి తీసుకోకుండా వీధి నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు గాను తనను నేలపై ఉమ్మి వేసి నాకాలంటూ పోలీసులు బలవంతపెట్టారని ఓ గ్రామ పెద్ద ఆరోపించారు. ఘటనపై జిల్లా ఎస్‌పీ దర్యాప్తునకు ఆదేశించారు. రాయ్‌బరేలీ జిల్లా నసీరాబాద్ ప్రాంతంలోని కపూర్‌పూర్ గ్రామ పెద్ద ప్రతినిధి సుశీల్ శర్మ అక్టోబర్ 30వ తేదీన గ్రామంలో వీధి నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు.
స్థానికులతోపాటు, అక్కడికి వెళ్లిన తమతో మద్యం మత్తులో ఉన్న సుశీల్ శర్మ తదితరులు అభ్యంతరకరంగా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు. వీధి నాటక ప్రదర్శనకు అనుమతులు లేవని చెప్పారు. దీంతో, సుశీల్ శర్మ సహా ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు.
అయితే, ఠాణాలో తమపై పోలీసులు చేయిచేసుకున్నారని, తనతో ఉమ్మి వేయించి, నాకాలంటూ పోలీసులు బలవంతం చేశారని సుశీల్ శర్మ ఆరోపించారు. నసీరాబాద్ ఎస్‌హెచ్‌వో శివకాంత్ పాండే 2 లక్షల లంచం డిమాండ్ చేశారన్నారు. ఈ మేరకు రా్రïÙ్టయ పంచాయతీ రాజ్ గ్రామ ప్రధాన్ సంఘటన్ జిల్లా ఎస్‌పీకి ఫిర్యాదు చేసింది. ఘటనపై ఏఎస్‌పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి, తగు చర్యలు తీసుకుంటామని ఎస్‌పీ యశ్‌వీర్ సింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment