కల్యాణం.. కమనీయం..
మాంగల్యధారణ చేస్తున్న అర్చకులు
బాగులవాడ రామాలయంలో గోదారంగనాథుల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకుడు
దేవరకోట ఆలయంలో గోదారంగనాథుల కల్యాణం తిలకిస్తున్న భక్తులు
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ పట్టణంలోని బాగులవాడ రామాలయంలో, దేవరకోట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో , భైంసా పట్టణంలోని పద్మావతికాలనీలోని శ్రీవేంకటేశ్వరాలయంలో సోమవారం గోదా రంగనాథుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయాల ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైకి ఉత్సవమూర్తులను భాజాభజంత్రీలు, మేళతాళాలు, భక్తుల కోలాటాల నడుమ తీసుకువచ్చారు. దేవరకోట ఆలయంలో ఉత్సవమూర్తులను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం జరిపించారు. కల్యాణోత్సవంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. గంగోత్రిధామ్‌కు చెందిన శ్రీరామానుజదాస్, ఆలయ కమిటీ చైర్మన్, ధర్మకర్తలు, ఆలయ ఇన్‌చార్జి ఈవో రంగు రవికిషన్‌గౌడ్, అర్చకులు నవీన్, రామకన్నన్, తదితరులు పాల్గొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్/నిర్మల్‌టౌన్/భైంసాటౌన్
Comments
Please login to add a commentAdd a comment