పైరవీలేని సేవలకే ప్రజావాణి
భైంసాటౌన్: పైరవీలు లేకుండా పోలీస్ సేవల ను చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపా రు. బుధవారం పట్టణంలోని పాత రూరల్ పో లీస్‌స్టేషన్ ఆవరణలోగల తన క్యాంప్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత ఎస్సైలు, సీఐలకు ఫోన్‌లో సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతీ బుధవారం భైంసాలో తాను అందుబాటులో ఉంటానని, ప్రజలు నేరుగా తనను కలిసి ఫిర్యాదులు అందించవచ్చని తెలిపారు. అనంతరం సబ్ డివిజన్ పరిధిలోని కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులు, పరిష్కారంపై సూచనలు చేశారు. ఏఎస్పీ అవినాష్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment