గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎన్‌ఈసీ విద్యార్థులు
నరసరావుపేట రూరల్: రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్స్ ఎంపికయ్యారు. ఈ మేరకు కళాశాల ఎన్‌సీసీ అధికారి మేడికొండ రాజేష్ తెలిపారు. కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న కె.హరీష్, కె.కావేరి, ఏ.అర్తి, డి.అప్పలనాయుడు ఈనెల 26వ తేదీన నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అర్హత సాధించినట్టు వివరించారు. విద్యార్థులను కళాశాల చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, వైస్ చైర్మన్ మిట్టపల్లి చక్రవర్తి, ప్రిన్సిపాల్ ఎస్.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ డి.సునీల్, అధ్యాపకులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment