పైడితల్లి హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి వనంగుడి, చదురుగుడి హుండీల ఆదాయాన్ని అమ్మవారి కళ్యాణ మండపం ఆవరణలో సోమవారం లెక్కించారు.
చదురుగుడి హుండీల నుంచి 73 రోజులకు రూ.46,98,625లు, 48 గ్రాముల 900 మిల్లీ గ్రాముల బంగారం, 671 గ్రాములు వెండి, వనంగుడి హుండీల నుంచి రూ.8,55,212లు, 1 గ్రాము 700 మిల్లీగ్రాములు బంగారం, 141 గ్రాముల వెండి లభించినట్టు ఆలయ ఇన్‌చార్జి ఈఓ, ఉప కమిషనర్ కేఎన్‌వీడీవీ ప్రసాద్ తెలిపారు. ప్రత్యేక అధికారిగా రామతీర్థం దేవస్థానం ఈఓ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment